Defence contract
-
‘ఆత్మనిర్భర్ భారత్‌కు డిఫెన్స్, ఏరోస్పేస్ కీలక పిల్లర్స్’
గాంధీనగర్: ఆత్మనిర్భర్ భారత్‌కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ముఖ్యమైన పిల్లర్స్ అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌ను ఆత్మనిర్భర్‌గా తీర్చిదిద్దటంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలు ముఖ్యమైన రెండు పిల్లర్స్‌గా మారనున్నాయి. 2025 నాటికి దేశ రక్షణ రంగ తయారీ 25బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేసిన డిఫెన్స్ కారిడార్లు అందుకు దోహదపడుతాయి. భారత రక్షణ ఏరోస్పేస్ రంగంలో ఇంతపెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. బీజేపీ అధికారంలోకి వచ్చాక కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. దానివల్లే తయారీ రంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. విమానయాన రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మూడు దేశాల్లో త్వరలోనే భారత్ చోటు సంపాదిస్తుంది.’అని మోదీ వెల్లడించారు. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్ సంస్థ ఇతర దేశాల్లో సీ-295 విమానాలను తయారు చేయడం ఇదే తొలిసారి. భారత వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 రవాణా విమానాల స్థానంలో, ఎయిర్‌బస్‌కు చెందిన సీ-295 రవాణా విమానాలను ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 56 విమానాలు అందించేందుకు ఎయిర్‌బస్‌తో రూ.21,935 కోట్లతో ఒప్పందం కుదిరింది. 2023 సెప్టెంబరు నుంచి 2025 ఆగస్టు మధ్య 16 విమానాలను ఫ్లై-అవే కండీషన్లో ఎయిర్‌బస్ భారత్‌కు అందజేస్తుంది. మిగిలిన 40 విమానాల తయారీ, అసెంబ్లింగ్‌ను టాటా గ్రూప్‌నకు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దేశీయంగా చేపడుతుంది. తొలి దేశీయ తయారీ రవాణా విమానం 2026 సెప్టెంబరులో అందుబాటులోకి రావొచ్చని సమాచారం. ఇదీ చదవండి: గుజరాత్లో రూ.22వేల కోట్ల మెగా ప్రాజెక్ట్.. ఎయిర్‌బస్ సీ-295 తయారీ -
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు
భారత్-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ రక్షణ అవసరాలకు సంబంధించి రష్యాపై ఆధారపడటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్ రక్షణ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది. భారత్ రక్షణ అవసరాల విషయంలో రష్యాలపై అధికారపడటం మానుకోవాలని పేర్కొంది. భారత్‌తో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఎటువంటి ఉద్దేశంలేదని తెలుపుతునే.. ఆ అంశాన్నిఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించమని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపారు. భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని అదేవిధంగా అమెరికా-ఇండియా మధ్య ఉన్న బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్ అని ఆ విషయాన్ని తాము ఎల్లప్పుడు గుర్తిస్తామని తెలిపారు. 2018లో ట్రంప్ ప్రభుత్వం నిరాకరించినా భారత్ మాత్రం రష్యా నుంచి ఎస్-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్-400 మిస్సైళ్లు కొనుగోలు చేసిన టర్కీపైన అమెరికా నిషేధం విధించిన విషయం విదితమే. -
ఆత్మనిర్భర్ - డిఫెన్స్ షేర్లు కొనొచ్చా?
కేంద్ర రక్షణ శాఖ వారాంతాన 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధాన్ని విధించేందుకు వీలుగా ముసాయిదాను సిద్ధం చేయడంతో డిఫెన్స్ పరికరాల తయారీ కంపెనీలు వెలుగులో నిలుస్తున్నాయి. 2020-24 మధ్య కాలంలో దశలవారీగా పలు డిఫెన్స్ పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధాన్ని విధించాలని రక్షణ శాఖ భావిస్తోంది. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి ప్రోత్సాహాన్నివ్వాలని చూస్తోంది. ఇప్పటికే నిషేధిత జాబితాలోని కొన్ని ప్రొడక్డులను దేశీ కంపెనీలు రూపొందిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న 5-7 ఏళ్ల కాలంలో డిఫెన్స్ ఉత్పత్తులను సొంతంగానే రూపొందించుకునే సామర్థ్యాలను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్రణాళికలకు అనుగుణంగా దేశీయంగా డిఫెన్స్ ప్రొడక్టుల తయారీలో స్వయంసమృద్ధిని సాధించాలని రక్షణ శాఖ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు డిఫెన్స్ సంబంధ కంపెనీల షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఈ విభాగంపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు చూద్దాం.. రూ. 4 లక్షల కోట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రూపొందించిన తాజా నిషేధ జాబితాలో ఆర్టిలరీ గన్స్, ఎసాల్ట్ రైఫిల్స్, కార్వెటీస్, ఎల్సీహెచ్, రవాణా విమానాలు, రాడార్లు తదితర పలు ప్రొడక్టులు చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గత 5ఏళ్ల కాలంలో వీటి దిగుమతులపై రూ. 3.5 ట్రిలియన్లను వెచ్చించినట్లు యస్ సెక్యూరిటీస్‌కు చెందిన ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నిపుణులు ఉమేష్ రౌట్ చెబుతున్నారు. వచ్చే 5ఏళ్ల కాలంలో డిఫెన్స్ తయారీలో రూ. 4 లక్షల కోట్లమేర అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. పెట్టుబడులకు ఊతం రక్షణ రంగ ఆయుధాలు, పరికరాలు, సాఫ్ట్వేర్ తదితర పలు విభాగాలలో దేశీ కంపెనీలకు ఇకపై భారీ అవకాశాలు లభించనున్నట్లు ఐసీఐసీఐ డైరెక్ట్ ఒక నివేదికలో అభిప్రాయపడింది. విదేశీ ప్రొడక్టులకు చెక్ పెట్టడం ద్వారా దేశీయంగా మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేందుకే తాజా పాలసీని రూపొందించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక విధానం 2020 ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ప్రమోషన్, ఎస్ఎంఈలకు దన్ను, పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యం వంటి అంశాలకు బూస్ట్ లభించనున్నట్లు వివరించారు. రానున్న ఐదేళ్లలో దేశీయంగా డిఫెన్స్ రంగ ఉత్పాదకతను రెట్టింపునకు పెంచే యోచనలో ప్రభుత్వమున్నట్లు పేర్కొంటున్నారు. బీఈఎల్, సోలార్.. తాజా డిఫెన్స్ పాలసీల ద్వారా పలు పీఎస్‌యూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు లబ్డి చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. పీఎస్‌యూలు.. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు ఎయిర్‌ఫోర్స్, మిలటరీ విభాగాల నుంచి ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు ఆషికా ఇంటర్నేషనల్ డెస్క్ నిపుణులు సంతోష్ యెల్లపు పేర్కొన్నారు. గ్రెనేడ్స్, మైన్స్ తదితర విభాగాలలో సోలార్ ఇండస్ట్రీస్‌కు పలు అవకాశాలు లభించనున్నట్లు అంచనా వేశారు. ఇదేవిధంగా సిమ్యులేటర్స్ విభాగంలో జెన్ టెక్నాలజీస్ లబ్ది పొందే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. సెంట్రమ్, ఆస్ట్రా.. పలు పరికరాలు, ఆయుధాల దిగుమతులపై నిషేధం కారణంగా దేశీయంగా సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్ తదితర చిన్న కంపెనీలకు అవకాశాలు మెరుగుపడనున్నట్లు యస్ సెక్యూరిటీస్ నిపుణులు ఉమేష్ పేర్కొన్నారు. బీఈఎల్, హెచ్ఏఎల్, భారత్ డైమిక్స్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ వంటి భారీ కంపెనీలతో పోలిస్తే చిన్న సంస్థలు ఆర్ అండ్ డీపై అధికంగా దృష్టి పెట్టగలుగుతాయని అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారీకి ఊతం లభిస్తే ఈ కంపెనీలన్నిటికీ ప్రొక్యూర్మెంట్ వంటి వ్యయాలు తగ్గేందుకు వీలుంటుందని తెలియజేశారు. డిఫెన్స్ రంగంలో వివిధ విభాగాలు, విభిన్న కంపెనీలు కార్యకలాపాలను విస్తరించాయని ఇన్వెస్టర్లు పెట్టుబడి విషయంలో యాజమాన్యం, బ్యాలన్స్‌షీట్, ప్రొడక్టులపై పట్టు తదితర పలు అంశాలను పరిగణించవలసి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల బీఈఎల్, హెచ్ఏఎల్, సోలార్ ఇండస్ట్రీస్ తదితర పలు కంపెనీల షేర్లు ర్యాలీ చేసినట్లు తెలియజేశారు. ఎల్అండ్టీ, భారత్ ఫోర్జ్ వంటి దిగ్గజాలతోపాటు.. వాల్చంద్నగర్ తదితర విభిన్న కంపెనీలకు అవకాశాలు పెరిగే వీలున్నదని తెలియజేశారు. అయితే షేర్ల ధరలు దిద్దుబాటుకు లోనైనప్పుడు.. నిపుణుల సలహాలమేరకు దీర్ఘకాలిక ధృక్పథంతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సూచిస్తున్నారు. -
దిగుమతులపై నిషేధం- డిఫెన్స్ షేర్ల హవా
ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది. తద్వారా 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధానికి తెరతీసింది. 2020 ముసాయిదా విధానం కింద వారాంతాన 101 ప్రొడక్టులతో కూడిన జాబితాను రూపొందించింది. ఆయుధాలు, విభిన్న పరికరాలు తదితర 101 ప్రొడక్టులపై రక్షణ శాఖ దశలవారీగా నిషేధాన్ని విధించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీటిలో చాల ప్రొడక్టులను దేశీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2020-2024 మధ్యకాలంలో దశలవారీగా పలు ప్రొడక్టుల దిగుమతులను నిషేధించే యోచనలో ప్రభుత్వమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీ కంపెనీలు సొంత డిజైన్, తయారీ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకునే వీలు చిక్కనున్నట్లు వివరించాయి. కాగా.. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల తయారీకి వీలుగా రానున్న 6-7ఏళ్లలో రూ. 4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అవకాశమున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంబంధిత కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ఏఎల్ దూకుడు రక్షణ రంగ పరికరాల దిగుమతులపై నిషేధ వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 1058ను తాకింది. డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ 5.2 శాతం పెరిగి రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో డైనమాటిక్ టెక్నాలజీస్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 596 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదేవిధంగా వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ 5 శాతం ఎగసి రూ. 55 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 108 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఫోర్జ్ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 423ను తాకగా.. మిశ్రధాతు నిగమ్(మిధానీ) 4 శాతం పెరిగి రూ. 213కు చేరింది. ఇక ఆస్ట్రా మైక్రోవేవ్ 5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద, భారత్ డైనమిక్స్ 5.2 శాతం పురోగమించి రూ. 441 వద్ద ట్రేడవుతున్నాయి. -
మిత్రుడికి కాంట్రాక్టు ఎలా దక్కింది?
సాగర్ (మధ్యప్రదేశ్) / భదోహి (యూపీ): ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్, యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన యూకే సంస్థ బ్యాకాప్స్తో రాహుల్ సంబంధాలను ప్రస్తావించారు. మీ మిత్రుడికి జలాంతర్గాముల కాంట్రాక్టు ఎలా దక్కిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడి కుంభకోణాలన్నీ భూమి, గాలి, నీటిలోంచి వెలుగులోకి వస్తున్నాయని మోదీ చెప్పారు. ఆయన మాజీ వ్యాపార భాగస్వామి యూపీఏ హయాంలో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లుగా బయటపడిందన్నారు. ఆ సంస్థ పేరు ‘బ్యాకాప్స్’ కూడా.. ముందు నుంచి కాకుండా తెరవెనుక (బ్యాక్ ఆఫీస్) జరిగే కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటి కాంగ్రెస్ నేత (రాహుల్) చర్యలకు తగ్గట్టుగానే ఉందని అన్నారు. రాహుల్ బహిరంగంగా ఎప్పుడూ ఆ కంపెనీలో పనిచేయలేదని, అంతా తెరవెనుకే ఉండి నడిపించారని మోదీ ఆరోపించారు. ఈ తెరవెనుక సంస్థ 2009లో మూతపడినా.. కంపెనీలో ఆయన భాగస్వామి 2011లో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లు వెలుగుచూసిందన్నారు. ఆ కంపెనీ యజమాని రాహుల్ స్నేహితుడే అన్నారు. కేవలంలో లైజనింగ్‌లో (రెండు కంపెనీల మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలో) అనుభవం కలిగిన మీ భాగస్వామికి జలాంతర్గాముల రంగంలోకి వచ్చే అవకాశం ఎలా దక్కిందంటూ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు. బోఫోర్స్ తుపాకులు, హెలికాప్టర్లు (అగస్టా వెస్ట్‌ల్యాండ్).. తాజాగా జలాంతర్గాములు.. ఎంత లోతుగా తవ్వితే అంతగా.. అది గాలైనా (నభ్), నీరైనా (జల్), భూమైనా (తల్) కానివ్వండి.. వారి కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే అసత్యం, దుష్ప్రచారం, మోసం అని అన్నారు. రాహుల్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ‘నేను ఒంటరిని కాదు..దేవుడు నాతో ఉన్నాడు. నాపై మీరెంత బురద వేస్తే అంతగా మరిన్ని కమలాలు వికసిస్తాయి..’ అని చెప్పారు. దేశం ఓ దశాబ్దం కోల్పోయింది ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలో పదేళ్ల పాటు సాగిన యూపీఏ పాలనపై మోదీ ధ్వజమెత్తారు. 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ భావించలేదు. ఊహించని విధంగా అవకాశం వచ్చింది. అయితే అప్పటికి ‘యువరాజు’ రెడీ కాకపోవడం, ఆయనకు ‘శిక్షణ’ ఇచ్చేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో కాంగ్రెస్ ఒక ‘కుటుంబ విశ్వాసపాత్రుడు’, ఒక కాపలాదారుని ప్రధానిని చేసిందన్నారు. దీంతో 21వ శతాబ్దిలో మొత్తం ఒక దశాబ్దాన్ని దేశం కోల్పోయిందని విమర్శించారు. అమరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ప్రతిన బూనానన్నారు. సంక్షేమమే వికాస్పంతి లక్ష్యం ఉత్తరప్రదేశ్ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై ఆయన ధ్వజమెత్తారు. కులం పేరిట ప్రజలు ఎప్పుడూ కొట్లాడుకునేలా ఈ పార్టీలు చేశాయన్నారు. స్వాతంత్య్రానంతరం నాలుగు రకాలైన పరిపాలన, పార్టీలు, రాజకీయ సంస్కృతి (నామ్పంతి, వామ్పంతి, దామ్ అవుర్ దామన్పతి, వికాస్పంతి) ఉండేవని చెప్పారు. ఓ కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు జపించడంలో నామ్పంతి నిమగ్నమై ఉండేదని, వామ్పంతి విదేశీ విధానాలు దేశంపై రుద్దే ప్రయత్నం చేసేదని, దామ్, దామన్పంతి డబ్బు, కండబలం ఉపయోగించి పరిపాలన సాగించేందని ప్రధాని వివరించారు. ఇక నాలుగోదైన వికాస్పంతిని తాము తెచ్చామంటూ.. దీనికి దేశంలోని 130 కోట్ల మంది ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధానమని చెప్పారు. తమ సంపద రెట్టింపు చేసుకోవడానికే అధికారం అన్నట్టుగా మహాకల్తీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
రాహుల్ మిత్రుడికి రక్షణ కాంట్రాక్టు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వ అంశంపై కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిపై మరొకటి విమర్శలు ఎక్కుపెట్టుకుంటున్న సమయంలో.. రాహుల్ గతంలో బ్రిటన్‌లో ఉల్రిక్ మెక్నైట్ అనే వ్యక్తి భాగస్వామిగా బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు మెక్నైట్ యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశీ భాగస్వామిగా రక్షణ పరికరాల కాంట్రాక్టులు పొందిన విషయం కూడా బయటపడింది. కంపెనీ మూతపడటానికి ముందు 2005 జూన్ 5 నాటికి బ్యాకాప్స్ కంపెనీలో రాహుల్‌కు 65 శాతం, మెక్‌నైట్‌కు 35 శాతం వాటా ఉంది. ఆ తర్వాత 2011లో కూడా ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ నుంచి (స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధించి) మెక్నైట్ కాంట్రాక్టులు పొందారు. యూపీఏ హయాంలో నావల్ గ్రూప్ విదేశీ భాగస్వామిగా.. రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామికి చెందిన అనుబంధ సంస్థలు డిఫెన్సు కాంట్రాక్టులు పొందినట్లు ‘ఇండియా టుడే’కి లభించిన పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బ్యాకాప్స్ కంపెనీ పేర్కొంటున్న దాని ప్రకారం.. రాహుల్, మెక్‌నైట్‌లు ఇద్దరూ ఆ కంపెనీ వ్యవస్థాపక డైరెక్టర్లు. కాగా 2004లో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో బ్యాకాప్స్ కంపెనీకి చెందిన మూడు ఖాతాల్లోని నగదుతో పాటు దాని చరాస్తుల వివరాలను కూడా రాహుల్ పొందుపరిచారు. కాగా ఈ కంపెనీ 2009లో మూతపడింది. కాగా దాదాపు ఇదేవిధమైన పేరుకలిగిన బ్యాకాప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కూడా రాహుల్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ భారతీయ కంపెనీలో తనకు 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ 2004 ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. రూ.2.5 లక్షల మూలధన పెట్టుబడి కూడా ఉందన్నారు. 2002లో మొదలైన ఈ కంపెనీ కూడా తర్వాత మూతపడింది. చివరిసారిగా 2010 జూన్‌లో ఈ సంస్థ రిటర్న్స్ దాఖలు చేసింది. అయితే రాహుల్ మాజీ వ్యాపార భాగస్వామి, అతని కంపెనీలు ఫ్రెంచి కంపెనీ ఇచ్చిన ఆఫ్సెట్ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందుతూ వచ్చాయి. విశాఖ సంస్థల్లో డైరెక్టర్‌గా మెక్నైట్ ముంబయిలోని మాజగాంవ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్) వద్ద తయారయ్యే స్కార్పీన్ జలాంతర్గాములకు అవసరమైన కీలక విడిభాగాలు సప్లై చేసేందుకు ఫ్రెంచి సంస్థ నావల్ గ్రూప్ 2011లో విశాఖపట్నంకు చెందిన ఫ్లాష్ ఫోర్జ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి సంబంధించిన రూ.20 వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఎండీఎల్‌తో నావల్ గ్రూప్ కలసి పనిచేయాల్సి ఉంది. కాగా అదే ఆర్థిక సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ యూకేకి చెందిన ఆప్టికల్ ఆర్మోవర్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. 2012 నవంబర్‌లో ఇద్దరు ఫ్లాష్ ఫోర్జ్ డైరెక్టర్లను ఆ సంస్థలో డైరెక్టర్లుగా చేశారు. వీరు ఆ సంస్థ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన 2012 నవంబర్ 8నే ఉల్రిక్ మెక్‌నైట్‌ను కూడా ఆ సంస్థ డైరెక్టర్‌గా చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో మెక్‌నైట్‌కు సంస్థ 4.9 శాతం వాటా కేటాయించినట్లు ఆప్టికల్ ఆర్మోవర్ 2014లో దాఖలు చేసిన పత్రాలను బట్టి తెలుస్తోంది. కాగా ఫ్లాష్ ఫోర్జ్ 2013లో యూకేకి చెందిన మరో కంపెనీ కాంపోజిట్ రెసిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీని కూడా కొనుగోలు చేసింది. అదే సంవత్సరంలో ఫ్లాష్ ఫోర్జ్ ఇద్దరు డైరెక్టర్లతో పాటు మెక్నైట్ కూడా ఆ సంస్థలో డైరెక్టర్‌గా చేరారు. నావల్ గ్రూపు వెబ్సైట్లు పేర్కొంటున్నదాని ప్రకారం..దాని భారతీయ భాగస్వాముల్లో ఫ్లాష్ ఫోర్జ్, సీఎఫ్ఎఫ్ ఫ్లూయిడ్ కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లాష్ ఫోర్జ్, మరో ఫ్రెంచి గ్రూప్ కోయార్డ్ల జాయింట్ వెంచర్) ఉన్నాయి. దీనిపై ఇండియా టుడే మెక్‌నైట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. నావల్ గ్రూపుతో ఫ్లాష్ ఫోర్జ్ ఒప్పందం కుదుర్చుకోక ముందే రాహుల్ గాంధీకి చెందిన భారత, యూకే కంపెనీలు మూతపడినా.. యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాలతో ఆయన మాజీ వ్యాపార భాగస్వామి.. భారత విదేశీ భాగస్వామిగా యూరప్ సంస్థల ద్వారా లబ్ధి పొందినట్లు స్పష్టమవుతోంది. రాహుల్ రక్షణ డీలర్‌గా బెటర్! కాంగ్రెస్ స్పందించాలన్న కేంద్రమంత్రి జైట్లీ రాహుల్æ గాంధీ సన్నిహితుడికి యూపీఏ హయాంలో రక్షణ శాఖ కాంట్రాక్టు కట్టబెట్టారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘బాకాప్స్ నుంచి రాహుల్ 2009లో బయటకు రాగా, భారత్‌లోని బాకాప్స్ 2010లో మూతబడింది. అయితే, మెక్నైట్, రాహుల్ సంబంధాలు కొనసాగాయి. యూపీఏ హయాంలో ఫ్రాన్సు సహకారంతో జలాంతర్గాములను నిర్మించే రక్షణ శాఖ కాంట్రాక్టు మెక్‌నైట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెట్టింది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని కావాలనుకుంటున్న వ్యక్తి అసలు కథ ఇది అని పేర్కొన్నారు. ‘ఇందులో రాహుల్ పాత్ర ఏమిటి? రక్షణ సామగ్రి డీలర్ అవుదామనుకున్నారా? కాంగ్రెస్ దీనిపై సత్వరం స్పందించాలి. రాజకీయాల్లో రావడం కంటే కూడా ఆయన రక్షణ రంగంలో డీలర్ అయితే బాగుండేది’ అని అన్నారు. -
అగస్టా కంటే పెద్ద కుంభకోణం!
న్యూఢిల్లీ: దేశంలో దుమారం రేపుతోన్న అగస్టా కుంభకోణంకు సంబంధించి విచారణ జరుగుతుండగా.. యూపీఏ హయాంలో జరిగిన మరో భారీ కుంభకోణం బయటపడింది. దేశ రక్షణకు ఉపయోగపడే యుద్ధ నౌకల తయారీలో ఈ స్కామ్ జరగడంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ అంతర్గత విచారణకు ఆదేశించారు. 2009లో రెండు కొత్త నావల్ ట్యాంకర్ల కోసం యూపీఏ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ట్యాంకర్లను తయారుచేసి ఇచ్చేందుకు రష్యా, కొరియా, ఇటలీలు బిడ్ లు దాఖలు చేశాయి. వీటిలో రష్యా మిలటరీ గ్రేడ్ స్టీల్ తో తయారుచేసి అందిస్తామని తెలపగా.. తమకు ఆ రకం స్టీల్ అవసరం లేదని ప్రభుత్వం చెప్పడంతో రష్యా డీల్ నుంచి పక్కకు తప్పుకుంది. దీంతో పోటీలో నిలిచిన రెండింటిలో ఇటాలియన్ కంపెనీ ' ఫిన్కాంటైరీ ' డీల్ ను చేజిక్కించుకుంది. 2010లో 'కాగ్' ట్యాంకర్ల డీల్ లో లోపాలు ఉన్నట్లు, కంపెనీకి లాభం చేకూరేట్లు డీల్ ను ఇచ్చినట్లు పేర్కొంది. అక్కడితో ఆగిపోయిన ఈ విషయం తాజాగా ఓ రిటైర్డ్ నావల్ అధికారి వేసిన పిటిషన్ తో మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొత్త ట్యాంకర్లు ఎందుకోసం? దేశ అతిపెద్ద విమాన రవాణా నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకురావాల్సి ఉండగా.. నౌక రక్షణ కోసం ఈ రెండు ట్యాంకర్లను 2009, 2011లలో భారతీయ స్ఫెసికేషన్స్ తో అత్యంత వేగంగా భారతీయ నావికాదళంలోకి తీసుకున్నారు. విక్రమాదిత్యను రష్యా నుంచి తీసుకువస్తున్న తరుణంలో రెండింటిలో ఒక ట్యాంకర్ బీటలు వారింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇటాలియన్ కంపెనీకే ఆ డీల్ ను ఇవ్వడానికి గల కారణాలను, డీల్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగ్ ఆరోపణలు, నేవీ అధికారి ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే యూపీఏ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.