deferred
-
ఉప ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉప ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఉప ఎన్నికల్లో తమను కూడా పోటీకి అనుమతించాలని కోరుతూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు అంగీకరించడం తెలిసిందే. ఈ అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు వేచి చూస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. -
వాయిదా వేయకండి..
నష్టపోవడమంటే ఎవరికి ఇష్టముంటుంది చెప్పండి. ఇన్వెస్టర్లు కూడా అందరిలాగే. అయితే వీరికెప్పుడూ అధిక రాబడులపైనే కన్నుంటుంది. అందుకే వీరు అక్కడ నష్టాలున్నాయని తెలిసినా కూడా లాభాల కోసం అందుబాటులోని అవకాశాలను వెతుక్కుంటారు. అయితే ఇక్కడ నష్టాలకు భయపడేవారూ కొందరుంటారు. వీరు నష్టాలకు భయపడి వారి పెట్టుబడులను వాయిదా వేసుకుంటుంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్లకు అనువైన అవకాశం కోసం వేచిచూడటం ఎలా ఉంటుందంటే.. పంట వేయడం కోసం రైతులు వర్షాల కోసం ఎదురుచూసినట్లు. మనం ఇన్వెస్ట్మెంట్లను వాయిదా వేసుకుంటున్నామంటే.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వదులుకుంటున్నామని అర్థం చేసుకోవాలి. కొందరు బస్సు కోసం చూస్తుంటారు. వస్తుంది. కానీ ఎక్కరు. అది కాస్తా ఖాళీగా లేదనకుంటూ వేరొక బస్సు కోసం ఉండిపోతారు. బస్సు ఎక్కితేనే కదా గమ్య స్థానానికి చేరేది? ఎక్కకుండా ఖాళీ బస్సు రావాలనుకుంటే కుదురుతుందా? అక్కడే ఉంటే ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాం కదా!! బస్సు ఎక్కిన తర్వాత అందులో కుదుపులు, స్టాప్‌లు ఉంటాయి. అయితేనేం చివరకు గమ్యాన్ని చేరతాం కదా? ఇన్వెస్ట్మెంట్లు కూడా బస్సులాగే. తర్వాత చేద్దాంలే.. తర్వాత చూద్దాంలే అని అనుకుంటే.. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ ఆర్థిక జీవితాన్ని ఆనందంగా గడపాలి. తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే అప్పు తీసుకునేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించాలి. సమస్యలు, నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి సంఘటన ఒక అనుభవాన్ని ఇస్తు్తంది. వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ పరిస్థితులకు అనువుగా ముందుకు సాగిపోవాలి. భయాన్ని అధిగమించాలి. అస్థిరతను జయించాలి. చేసే ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఇప్పటికిప్పుడు ఏం వస్తుందో చెప్పలేం. కానీ వృద్ధి అనేది ఒకటుంటుంది. దాన్ని గమనించాలి. దీనికి కొంత కాలాన్ని కేటాయించాలి. నీ వద్ద ఉన్న డబ్బులతో నీవేమీ చేయకపోవడమనేది చాలా పెద్ద తప్పు. ఇన్వెస్ట్మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనువుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీరే మీ భయాల్ని మెల్లగా అధిగమిస్తారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మనకేమీ దొరకదు కదా? -
మాల్యా అప్పగింత కేసు జూన్ 13కు వాయిదా
లండన్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత, బ్యాంకుల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ జూన్ 13కు వాయిదాపడింది. మాల్యా గతేడాది మార్చి నుంచి బ్రిటన్‌లో ఉంటుండటం తెలిసిందే. భారత్‌లోని వివిధ బ్యాంకుల వద్ద ఆయన రూ.9 వేల కోట్లకు పైగా అప్పులు చేసి తిరిగి చెల్లించలేదు. మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించే అంశంపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ న్యాయస్థానంలో మే 17న విచారణ జరగాల్సి ఉంది. విచారణ జూన్ 13కు వాయిదా పడినట్లు ఈ కేసులో భారత్ తరఫున వాదించే సీపీఎస్ (క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్) తాజాగా చెప్పింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు అందించేందుకు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది. -
జీఎస్టీ డెడ్‌లైన్ వాయిదా పడింది!
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జీఎస్టీ అమలును 2017 జూలై 1కు వాయిదా వేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పన్ను అధికారాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ అమలు తేదీని వాయిదా వేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై నేడు సమావేశమైన అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి మీటింగ్ ఫిబ్రవరి 18న జరుగనుంది. వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంపై కేంద్రం సుముఖంగా లేనప్పటికీ, ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10 శాతం కేంద్రానికి ఉంటాయని అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.1.5 కోట్లకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్ర, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు. అయితే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో వాదిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో తమ రెవెన్యూలు భారీగా కోల్పోతామని పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా తమ రెవెన్యూలకు గండికొడుతున్నాయని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. -
నోట్ల బ్యాన్‌తో సినిమా వాయిదా..?
500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినీరంగాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలకు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టగా ఈ వారం రిలీజ్ కావాల్సిన సినిమాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనం దగ్గర డబ్బులు లేకపోవటంతో ఎంత మంది థియేటర్ల వరకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో చేసేదేమి లేక తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు అల్లరి నరేష్. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను ముందుగా ఈ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఒక్క రోజు ఆలస్యంగా శనివారం విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారం పాటు వాయిదా వేసి వచ్చే శుక్రవారం (నవంబర్ 18న) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.