మాల్యా అప్పగింత కేసు జూన్ 13కు వాయిదా
లండన్: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత, బ్యాంకుల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసు విచారణ జూన్ 13కు వాయిదాపడింది. మాల్యా గతేడాది మార్చి నుంచి బ్రిటన్‌లో ఉంటుండటం తెలిసిందే. భారత్‌లోని వివిధ బ్యాంకుల వద్ద ఆయన రూ.9 వేల కోట్లకు పైగా అప్పులు చేసి తిరిగి చెల్లించలేదు.
మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించే అంశంపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్స్ న్యాయస్థానంలో మే 17న విచారణ జరగాల్సి ఉంది. విచారణ జూన్ 13కు వాయిదా పడినట్లు ఈ కేసులో భారత్ తరఫున వాదించే సీపీఎస్ (క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్) తాజాగా చెప్పింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలు అందించేందుకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఇప్పటికే లండన్ చేరుకుంది.