delhi cs
-
కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)పై ఆప్ ఎమ్మెల్యేల దాడి కేసులో ఆధారాలను సేకరించేందుకు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ నివాసంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎం ఇంట్లో సీఎస్‌పై దాడి జరిగినట్లుగా చెబుతున్న గదిలో సీసీటీవీ కెమెరా లేదు. సోదాలకు వస్తున్నట్లు సీఎం ఇంట్లోని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారమిచ్చామన్నారు. కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశముందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా సంకేతాలిచ్చారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు.. ఢిల్లీ పోలీసులు కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారారనీ, సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి రౌడీల్లా వ్యవహరించారని ఆప్ ఆరోపించింది. సీఎంను అవమానించడానికే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారంది. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదేశం లేకుంటే పోలీసులు అలాంటి దాదాగిరి చేసి ఉండేవారు కాదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేస్తూ ‘పెద్ద పోలీసు బలగాన్ని మా ఇంటికి పంపారు. మరి న్యాయమూర్తి లోయా మృతి కేసులో అమిత్ షాను ఎప్పుడు ప్రశ్నిస్తారు?’ అని అన్నారు. ఆప్ ప్రభుత్వంతో కలసి పనిచేసేలా ఉద్యోగులను ఆదేశించాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను కేజ్రీవాల్ కోరారు. కాగా, అరెస్టైన ఎమ్మెల్యేల బెయిల్ అభ్యర్థనలను స్థానిక కోర్టు కొట్టివేసింది. కాగా, ప్రజోపయోగ పనులకు అడ్డొచ్చే అధికారులను కొట్టాల్సిందేనని ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేశ్ బాల్యన్ వ్యాఖ్యానించారు. -
ఆప్ ఎమ్మెల్యేల అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్టయ్యారు. ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్‌ను గతరాత్రి బాగా పొద్దుపోయాక, మరో ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. అరెస్టైన ఎమ్మెల్యేల్లో ఒకరు దళితుడు, మరొకరు ముస్లిం కాబట్టే వారినే బీజేపీ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది. ఆప్ ఎమ్మెల్యేలు సీఎం సమక్షంలోనే తనను కొట్టారని అన్షు ప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తమ పార్టీ ప్రతిష్టను మసకబార్చేందుకే బీజేపీ సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ పౌర సరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆయన సహాయకుడిపై సచివాలయంలో ఉద్యోగులు దాడిచేయగా ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం విదితమే. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఆధారం ఉన్నా పోలీసులు ఇంకా ఏ చర్యలూ తీసుకోలేదనీ, కానీ సీఎస్ ఆరోపణలకు ఆధారాల్లేకుండానే తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ విమర్శించారు. మరోవైపు సీఎస్ తలపై స్పల్ప గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. -
గవర్నర్ ఆదేశాలను పాటించకండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రగిలిన వివాదం చివరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ ఇవాళ ప్రణబ్‌ను కలవనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజేంద్ర కుమార్‌ను నియమిస్తూ జారీ చేసిన కేజ్రీవాల్ ఆదేశాలను నజీబ్ జంగ్ తిరస్కరిస్తూ లేఖ రాశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి గవర్నర్ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ప్రభుత్వ అధికారులను సోమవారం సాయంత్రం ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఆయన కార్యాలయం నుంచి గానీ మౌఖికంగా గానీ, రాతపూర్వకంగా గానీ ఇచ్చే ఆదేశాలను, ముందు సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, సంబంధింత ఇంచార్జ్ మంత్రులు, ముఖ్యమంత్రికి సమర్పించాలన్నారు. దీంతో అగ్గి మరింత రాజుకుంది. మరోవైపు తమ ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా ఎన్నికైందనీ, గత ప్రభుత్వాలు లొంగిపోయినట్టుగా తాము లొంగమని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసొడియా స్పష్టం చేస్తున్నారు. కాగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్‌ను రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారుతూ వచ్చాయి. శకుంతల నియామకాన్ని నిరసిస్తూ సీనియర్ ఆఫీసర్ అనిందో మజుందార్ (ప్రిన్సిపల్ సెక్రటరీ సర్వీసెస్)ఆఫీసుకు , ఆప్ ప్రభుత్వం సోమవారం ఉదయం తాళాలు వేసింది. ఈ ఆఫీసు నుంచే శకుంతల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయనీ, ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో సీఎస్ నియామకం జరగాలని ఆప్ వాదిస్తోంది. మరోవైపు విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శకుంతలా గామ్లిన్ ను , ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా సీఎస్ గా నియమించారని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్‌ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు ఆరోపిస్తోంది. -
సీఎం.. సీఎస్.. ముదురుతున్న వివాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రగిలిన వివాదం మరింత ముదురుతోంది. శకుంతలా గామ్లిన్ స్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జారీచేసిన ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్‌ను రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారుతున్నాయి. శకుంతల నియామకాన్ని నిరసిస్తూ సీనియర్ ఆఫీసర్ అనిందో మజుందార్ (ప్రిన్సిపల్ సెక్రటరీ సర్వీసెస్)ఆఫీసుకు , ఆప్ ప్రభుత్వం సోమవారం ఉదయం తాళాలు వేసింది. ఈ ఆఫీసు నుంచే శకుంతల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకే ఆయన ఆఫీసుకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో సీఎస్ నియామకం జరగాలని ఆప్ వాదిస్తోంది. మరోవైపు విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శకుంతలా గామ్లిన్ ను , ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా సీఎస్ గా నియమించారని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్‌ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు ఆరోపిస్తోంది. -
సీఎం వద్దన్నా...
-
సీఎం వద్దన్నా.. బాధ్యతలు స్వీకరించిన సీఎస్!
దేశ రాజధానిలో మళ్లీ రాజకీయ వేడి రగులుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దాదాపు జుట్టు జట్టు పట్టుకున్నంత పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్‌ను ఆయన రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా.. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించేశారు. అయితే ఇలా లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్‌ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు వర్గాలు అంటున్నాయి. ఆమె విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కూడా ఆరోపణలున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా ఎవరి వాదనలో వాళ్లు ఉండగానే శకుంతలా గామ్లిన్ మాత్రం.. తన కొత్త పదవిలో పని ప్రారంభించేశారు.