Delhi gangrape case
-
నిర్భయ అత్యాచారం కేసు ఉరిశిక్షపై స్టే కొనసాగింపు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన గత డిసెంబర్ 16 నాటి నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషుల్లోకి ఇద్దరికి ఉరిశిక్ష విధింపుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 14 వరకు పొడగించింది. ఈ కేసులో ముకేశ్, పవన్‌గుప్తాకు ఉరి విధించడంపై మార్చి 15న సుప్రీంకోర్టు స్టే విధించింది. అది 31 తేదీన ముగియగా, దానిని ఈ నెల ఏడు వరకు పొడగించింది. తాజాగా మరో వారం గడువు ఇచ్చింది. నిర్భయ చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను ఈలోపు సమర్పించాలని న్యాయమూర్తులు బీఎస్ చౌహాన్, జె.చలమేశ్వర్‌తో కూడిన బెంచ్ దోషుల న్యాయవాది శర్మను ఆదేశించింది. ఈ కేసులో దిగువకోర్టు తీర్పు ప్రతులను సమర్పించాలని మార్చి 31నే ఆదేశించింది. వీరితోపాటు ఈ కేసులో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. ఇది అత్యంత అరుదైన, క్రూరమైన నేరం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 2012 డిసెంబర్ 16న దక్షిణఢిల్లీలో కదులుతున్న బస్సులో మైనర్ సహా ఆరుగురు నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేయడం తెలిసిందే. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ 2012 మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆరో నిందితుడైన మైనర్ యువకుడికి బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. మైనరే అయినా, ఇతడికి కూడా ఉరిశిక్ష విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. -
నిర్భయ కేసును ఛేదించిందిలా
నిర్భయ కేసులో దోషులు నలుగురికీ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే.. ఈ కేసులో సాక్ష్యాలు సేకరించడానికి, నిందితులను ఐదు రోజుల్లోనే అరెస్టు చేయడానికి, వారిపై నేరాన్ని రుజువు చేసే తిరుగులేని ఆధారాలు సంపాదించడానికి పోలీసులు అహరహం శ్రమించారు. దాదాపు వంద మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినా.. ప్రధానంగా ఎనిమిది మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన కృషి అనిర్వచనీయం. వారి కష్టం ఫలితంగానే ఇప్పుడు అందరికీ ఉరిశిక్ష పడింది. ఈ బృందం నిద్రాహారాలు లేకుండా రోజుకు 24 గంటలూ కష్టపడి మరీ ఈ కేసులోని ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దాలతో గాలించింది. బాల నేరస్థుడు సహా అందరి దాష్టీకాన్ని బయటపెట్టింది. పోలీసులపై ఎంత విమర్శలొస్తున్నా పట్టించుకోకుండా ఐదే రోజుల్లో అందరినీ పట్టుకుని, కీలక సాక్ష్యాలు సేకరించింది. రెండు వారాల్లో వెయ్యిపేజీల చార్జిషీటును దాఖలు చేయడం వల్లే దోషులకు ఉరిశిక్ష పడింది. అదనపు డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కుష్వాహా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పడింది. నిందితులందరినీ అరెస్టు చేయడంతోనే తమ పని అయిపోలేదని కుష్వాహా అన్నారు. సిట్ రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందానికి చార్జిషీటు తయారీ బాధ్యత అప్పగించగా, మరో బృందం సాక్ష్యాల సేకరణలో మునిగిపోయింది. తమ సాక్ష్యాలన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు బలం చేకూర్చాయని కుష్వాహా చెప్పారు. నిందితుల దంతాల దగ్గర్నుంచి దుస్తుల వరకు అన్నీ ఉపయోగపడ్డాయి. బృందంలో మరో కీలక అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ చందర్. ప్రధానంగా ఈ బృందంలోని పోలీసులకు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటం, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతింపజేయడం ఈయన ప్రధాన విధులు. వసంత విహార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ దర్యాప్తు మొత్తానికి కీలకం. బాధితుల శరీరం మీద కొరికిన మచ్చల నుంచి డీఎన్ఏ సేకరించారు. అలాగే బస్సులో కొద్దిగా మిగిలిన రక్తపు మరకలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ నిందితులతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. నిందితులను గుర్తించి, వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం ఈయన బాధ్యత. రోజూ జరిగే వ్యవహారాలను సీనియర్లకు చెప్పాల్సింది కూడా ఈయనే. ఇన్స్పెక్టర్ అతుల్ కుమార్ ప్రధానంగా దర్యాప్తులో సాయం చేశారు. చార్జి షీటులో వెయ్యి పేజీలు ఈయనే రాశారు. నాటి డీసీపీ, ప్రస్తుతం మిజొరాం డీఐజీ ఛాయాశర్మ కూడా ఈ కేసు దర్యాప్తులో కీలక అధికారిణి. నిందితులను పట్టుకోడానికి ఆమె రాజస్థాన్, బీహార్.. ఇలా అనేక ప్రాంతాలు తిరిగారు. మీడియాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్పింది ఈమే. -
ఆ కీచకులందరూ దోషులే
* నిర్భయ కేసులో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు * సంప్రదాయ, శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా నిర్ధారణ * ముఖేష్, వినయ్, పవన్, అక్షయ్లను దోషులుగా తేల్చిన కోర్టు * మరణించిన రాంసింగ్ కూడా దోషే అని నిర్ధారణ * 237 పేజీల తీర్పును వెలువరించిన న్యాయమూర్తి * బుధవారం శిక్షలు ఖారారు చేసే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిసెంబర్ 16 ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులు దోషులే అని ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. నిస్సహాయురాలైన బాధితురాలిపై అత్యాచారం, హత్య అభియోగాల్లో ముఖేష్‌కుమార్(26), వినయ్‌శర్మ(20), అక్షయ్ ఠాకూర్(28), పవన్‌గుప్తా(19)లను దోషులుగా ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. సంప్రదాయ ఆధారల ప్రకారమే కాక, శాస్త్రీయమైన డీఎన్ఏ నమూనాల ఆధారంగా వీరిని దోషులుగా నిర్ధారించింది. విచారణ సమయంలో మరణించిన నిందితుడు రాంసింగ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, ఆధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు తదితర 13 అభియోగాల్లో నిందితులను దోషులుగా నిర్దారించింది. ఈ మేరకు సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యోగేష్ ఖన్నా మంగళవారం 237 పేజీల తీర్పును వెలువరించారు. నిందితులందరూ కలిసి నిస్సహాయురాలైన బాధితురాలిని హత్య చేసినట్టు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని, ఐపీసీ సెక్షన్ 302(హత్య), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర), 376(2)(జీ)(సామూహిక అత్యాచారం) ప్రకారం నిందితులను దోషులుగా నిర్ధారిస్తున్నామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి ప్రకటించారు. వీటితో పాటు సామూహిక అత్యాచారం, అసహజ నేరాలు, సాక్ష్యాలను మాయం చేయడం, హత్యాయత్నం తదితర నేరాలకు నిందితులు పాల్పడినట్టు నిర్ధారించారు. వైద్య సహాయం అందడంలో ఆలస్యం, చికిత్స సమయంలో ఇన్ఫెక్షన్ సోకడం వల్లే బాధితురాలు చనిపోయిందన్న డిఫెన్స్ లాయర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. నిర్భయ కేసులో తీర్పు సందర్భంగా కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో కోర్టు ప్రాంగణం నిండిపోయింది. బుధవారం నిందితులకు శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నలుగురికి విధించే శిక్షపై న్యాయస్థానంలో బుధవారం ఉదయం 11 గంటలకు వాదప్రతివాదనలు జరుగనున్నాయి. ప్రణాళిక ప్రకారమే అత్యాచారం మునిర్కా బస్టాండ్ వద్ద బాధితురాలు, ఆమె స్నేహితుడు బస్సులోకి ఎక్కిన తర్వాత వేరెవరినీ నిందితులు బస్సులోకి ఎక్కనివ్వలేదని, పరుషమైన బాష ఉపయోగిస్తూ, లైట్లు ఆపేసి యువతిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని న్యాయమూర్తి చెప్పారు. ప్రణాళిక ప్రకారమే నిందితులు బాధితురాలిపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. నిందితులు ఇనుప రాడ్లను వాడిన తీరు, శరీరాన్ని గాయపరిచిన తీరు యువతిని అదుపులోకి తీసుకోవడానికి చేసినది మాత్రమే కాదని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సామూహిక అత్యాచారం కోసమే ఇనుపరాడ్లను బాధితురాలి శరీరంలోనికి చొప్పించారని భావించడానికి లేదని, ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే లోపలి భాగాలను బయటకు లాగారని అభిప్రాయపడ్డారు. బాధితురాలి శరీరంపై తీవ్రంగా గాయపరచడమే కాక ఇనుప రాడ్‌ను పదేపదే శరీరంలోనికి జొప్పించి బయటకు తీశారని, చేతితో కూడా కీలకమైన అవయవ భాగాలను బయటకు లాగారని, ఆమెను చంపే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. ఇనుప రాడ్లను వాడటంవల్ల బాధితురాలి శరీరం లోపలి అవయవాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆ తర్వాతే ఆమెను, ఆమె మిత్రుడిని బస్సు నుంచి బయటకు తోసేశారని, నగ్నంగా, రక్తమోడుతూ వారు రోడ్డుపై పడ్డారని, చీకటి కారణంగా వారిని ఎవరూ గుర్తించలేకపోయారని వివరించారు. బాధితురాలి శరీరం లోపల 18 గాయాలనున్నాయని, ఇవన్నీ ఆమెను చంపడానికి చేసినవే అని న్యాయమూర్తి చెప్పారు. దర్యాప్తు సంస్థలు సమర్పించిన డీఎన్ఏ విశ్లేషణలు కూడా బాధితురాలితో పాటు నిందితుల గుర్తింపును నిర్ధారించాయని స్పష్టం చేశారు. వారంతా ఆ సమయంలో బస్సులోనే ఉన్నారని వేలిముద్రల నివేదిక కూడా స్పష్టం చేసిందని చెప్పారు. తాను బస్సును మాత్రమే నడిపానని, అత్యాచారంలో పాల్గొనలేదన్న ముఖేష్ విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. సామూహిక అత్యాచారం, హత్య కేసుల సందర్భంలో పాత్ర ఉన్నవారందరినీ సమానంగానే చూడటం జరుగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి వాంగ్మూలం, ఫోరెన్సిక్ ఆధారాలు, వేలిముద్రల నివేదిక, డెంటల్ మోడల్స్, డీఎన్ఏ శాంపిల్స్, నిందితుల వైద్య నివేదికలు, ఎలక్ట్రానిక్ ఆధారలు, ఆరెస్ట్ అయిన తర్వాత నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను పరిశీలించినట్టు న్యాయమూర్తి చెప్పారు. నిందితులు చేసిన గాయాల కారణంగానే బాధితురాలు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. కేసు విచారణ వేగంగా సాగేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ఢిల్లీ పోలీసులు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడాన్ని స్వాగతించిన న్యాయస్థానం.. మిగతా అత్యాచారం కేసుల్లోను ఇదే పద్ధతి అనుసరించాలని సూచించింది. కన్నీటి పర్యంతమైన పవన్ న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే నిందితులందరూ దిగ్భ్రాం తికి గురయ్యారు. పవన్ కోర్టు హాలులోనే కన్నీటిపర్యంతమవగా, వినయ్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఇక ముఖేష్ స్పందిస్తూ చేసిన దానికి పర్యవసానాలు అనుభవించాల్సిందే అని వ్యాఖ్యానించి నట్టు తెలిసింది. మరో నిందితుడు అక్షయ్ ఎటువంటి భావం లేకుండా ఉండిపోయాడు. వారిని సజీవ దహనం చేయాలి: మరణవాంగ్మూలంలో నిర్భయ తనపై క్రూరమైన దాడి జరిగిన ఐదురోజులకు ఓ మేజిస్ట్రేట్ ఎదుట హిందీలో నిర్భయ వాంగ్మూలం ఇచ్చింది. కదులుతున్న బస్సులో గంటసేపు తనను కిరాతకంగా ఎలా హింసించారో ఆమె వివరించింది. రెండుసార్లు తాను స్పృహ కోల్పోయినప్పటికీ తనను తిరిగి స్పృహలోకి తెచ్చి చెప్పలేని రీతిలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. నిందితులకు ఎటువంటి శిక్ష విధించాలి అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా, ‘‘మరో మహిళపై ఇటువంటి అఘాయిత్యం చోటుచేసుకోకుండా ఉండాలంటే వారిని ఉరి తీయాలి. వారిని సజీవంగా దహనం చేయాలి’’ అని చెప్పింది. ఉరితీయాల్సిందే: రాజకీయ నాయకులు ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసులో దోషులుగా తేలిన నలుగురు కీచకులకూ మరణశిక్ష విధించాలని పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. ఇంకెవరూ ఇలాంటి దురాగతాలకు దిగే ఆలోచనైనా చేయకుండా ఉండేలా నలుగురు దోషులనూ ఉరితీయాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. ఇదే కేసులో ఇటీవల దోషిగా తేలిన బాల నేరస్తుడికి జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల శిక్ష మాత్రమే విధించడంపై సుష్మా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా దోషులకు విధించే శిక్ష ఉండాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ అన్నారు. రేప్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని సీపీఎం నాయకురాలు బృందా కారత్ సూచించారు. దోషులకు మరణశిక్ష విధిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుందని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌బేడీ అభిప్రాయపడ్డారు. -
నిర్భయ కేసును పోలీసులు ఛేదించిందెలా?
దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై జరిగిన సామూహిక అత్యచారం కేసును విచారించేందుకు 100 మంది పోలీసులతో బృందం ఏర్పాటైంది. కానీ, ప్రధానంగా 8 మందితో కూడిన కోర్ బృందమే నిద్రాహారాలు లేకుండా రోజుకు 24 గంటలూ కష్టపడి మరీ ఈ కేసులోని ప్రతి చిన్న అంశాన్నీ భూతద్దాలతో గాలించింది. బాల నేరస్థుడు సహా అందరి దాష్టీకాన్ని బయటపెట్టింది. పోలీసులపై ఎంత విమర్శలొస్తున్నా పట్టించుకోకుండా ఐదే రోజుల్లో అందరినీ పట్టుకుని, కీలక సాక్ష్యాలు సేకరించింది. రెండు వారాల్లో వెయ్యిపేజీల చార్జిషీటును దాఖలు చేయడం వల్లే నిందితులు దోషులుగా తేలారు. అదనపు డిప్యూటీ కమిషనర్ పి.ఎస్. కుష్వాహా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పడింది. నిందితులందరినీ అరెస్టు చేయడంతోనే తమ పని అయిపోలేదని కుష్వాహా అన్నారు. కేసును నిరూపించడమే తమకు అతిపెద్ద సవాలని ఆయన చెప్పారు. నిందితులపై పక్కా సాక్ష్యాలు సేకరించాలి. నిందితుల విచారణ, వాళ్ల ప్రకటనలను రికార్డుచ ఏయడం కూడా చాలా ముఖ్యం. దాంతో సిట్ రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందానికి చార్జిషీటు తయారీ బాధ్యత అప్పగించగా, మరో బృందం సాక్ష్యాల సేకరణలో మునిగిపోయింది. తమ సాక్ష్యాలన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు బలం చేకూర్చాయని కుష్వాహా చెప్పారు. నిందితుల దంతాల దగ్గర్నుంచి దుస్తుల వరకు అన్నీ ఉపయోగపడ్డాయి. నిందితులు బాధితురాలు, ఆమె స్నేహితుడి దుస్తులు కాల్చేశారు. పాక్షికంగా కాలిన దుస్తులు పోలీసులకు దొరికాయి. అవి బాధితులవేనని డీఎన్ఏ పరీక్షలో తేలింది. నిందితులు బస్సును కడిగేసినా, కొన్ని రక్తపు మరకలు దొరికాయి. చార్జిషీటు ఎంత పక్కాగా తయారైందంటే, ఒకవేళ మొత్తం 88 మంది సాక్షులూ ఎదురు తిరిగినా, కేసు మాత్రం నిరూపితం అయ్యేంత బలమైన సాక్ష్యాలు దొరికాయి. బృందంలో మరో కీలక అధికారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమేష్ చందర్. ప్రధానంగా ఈ బృందంలోని పోలీసులకు ప్రజల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటం, ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంతింపజేయడం ఈయన ప్రధాన విధులు. దాంతోపాటు బృంద సభ్యుల మధ్య సమన్వయం కూడా ఈయన బాధ్యతే. వసంత విహార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ సింగ్ దర్యాప్తు మొత్తానికి కీలకం. డిసెంబర్ 21న చిట్టచివరి అరెస్టు జరిగాక, సాక్ష్యాల సేకరణలో ఈయనే కీలకంగా వ్యవహరించారు. బాధితుల శరీరం మీద కొరికిన మచ్చల నుంచి డీఎన్ఏ సేకరించారు. అలాగే బస్సులో కొద్దిగా మిగిలిన రక్తపు మరకలు తీసుకున్నారు. సీఎఫ్ఎస్ఎల్ నుంచి వీటి నివేదికలు తెప్పించారు. మొత్తం విషయం తెలిసేవరకు సిట్ బృందంలో ఏ ఒక్కరూ నిద్రపోలేదు. ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోడానికి స్టేషన్ ముందు తలుపులు వేసేసి, వెనక తలుపుల గుండా వెళ్లి వచ్చేవారు. ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ నిందితులతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహించారు. నిందితులను గుర్తించి, వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం ఈయన బాధ్యత. రోజూ జరిగే వ్యవహారాలను సీనియర్లకు చెప్పాల్సింది కూడా ఈయనే. ఇన్స్పెక్టర్ అతుల్ కుమార్ ప్రధానంగా దర్యాప్తులో సాయం చేశారు. చార్జి షీటులో వెయ్యి పేజీలు ఈయనే రాశారు. నాటి డీసీపీ, ప్రస్తుతం మిజొరాం డీఐజీ ఛాయాశర్మ కూడా ఈ కేసు దర్యాప్తులో కీలక అధికారిణి. కేసు విచారణ మొదలుపెట్టేటప్పుడు అంతా గుడ్డిగానే వెళ్లామని, కానీ త్వరగానే నిందితులను పట్టుకోగలిగామని చెప్పారు. వాళ్లను పట్టుకోడానికి ఛాయాశర్మ రాజస్థాన్, బీహార్.. ఇలా అనేక ప్రాంతాలు తిరిగారు. మీడియాకు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చెప్పింది ఈమే. వీళ్లతో పాటు.. వందమంది అధికారులు కూడా ఈ కేసులో చురుగ్గా వ్యవహరించారు. -
ఈ నెల 10న 'నిర్భయ' కేసులో తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో విచారణ ముగిసింది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్ లపై సాకేత్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 10న న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జునైనల్ కోర్టు ఇప్పటికే తొలి తీర్పు వెలువరించింది. నిర్భయ చట్ట ప్రకారం బాలనేరస్థుడికి మూడేళ్ల శిక్ష విధించింది. గత డిసెంబర్ 16 నాటి రాత్రి ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపైనా (ఈ యావత్ ఉదంతానికి ఇతనొక్కడే ప్రత్యక్ష సాక్షి) దాడి చేశారు. తీవ్రగాయాలతో సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 29న నిర్భయ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితులు ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లను కోర్టు విచారించింది. మరో నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్లో గత మార్చి 11న విగతజీవుడై కన్పించాడు. -
నిర్భయ కేసులో మైనర్‌పై తీర్పు వాయిదా
దేశ రాజధానిలో గత సంవత్సరం డిసెంబర్ 16న జరిగిన సామూహిక అత్యాచారం కేసు (నిర్భయ కేసు)లో మైనర్ నిందితుడిపై తీర్పును జువెనైల్ జస్టిస్ బోర్డు ఈనెలాఖరుకు వాయిదా వేసింది.'బాల నేరస్థుడు' అనే పదాన్ని ఎలా అన్వయించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు కావడం, అక్కడ తీర్పు త్వరలో వెలువడనుండటంతో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ గీతాంజలి గోయల్ నేతృత్వంలోని బోర్డు తన తీర్పును ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది. జూలై 11వ తేదీ నుంచి ఇప్పటికి వరుసగా నాలుగోసారి ఈ కేసులో తీర్పు వాయిదా పడింది. 'బాల నేరస్థులు' అనే పదానికి అన్వయం ఎలా తీసుకోవాలంటూ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 14న తన తీర్పును వాయిదా వేసింది. బాల నేరస్థుల చట్టం ఏమాత్రం సరిగా లేదని, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సదస్సు తీర్మానాలను అది ఉల్లంఘిస్తోందని స్వామి వాదించారు. బాల నేరస్థుల నేరాన్ని నిర్ధారించేటప్పుడు కేవలం వారి వయస్సు 18 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన మాత్రమే కాక, వారి మానసిక స్థితి, తెలివితేటలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. నిర్భయ కేసులో బాల నేరస్థుడు కూడా మిగిలినవారితో పాటు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కీలక నిందితుడు రామ్ సింగ్ మార్చి 11న తీహార్ జైల్లో మరణించడంతో అతడిపై విచారణ నిలిపివేశారు. బాల నేరస్థుడిపై మాత్రం జూలై 11, జూలై 25, ఆగస్టు 5, ఆగస్టు 19 తేదీల్లో.. అంటే నాలుగుసార్లు తీర్పు వాయిదా పడింది. నిందితులందరిలోకీ బాల నేరస్థుడే అందరికంటే క్రూరంగా ప్రవర్తించినట్లు పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. అయితే.. జువైనల్ బోర్డు వద్ద విచిరణలో మాత్రం తాను నిర్దోషినని బాలనేరస్థుడు పేర్కొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇతడు 11 ఏళ్ల వయసులో ఢిల్లీ వెళ్లాడు. ఇంతకుముందు ఓ కార్పెంటర్‌ను దోచుకున్న కేసులో ఇతడిపై నేరం రుజువైంది.