Delhi Mayor election
-
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్‌దే.. స్వల్ప తేడాతో బీజేపీపై విజయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేశ్ కుమార్ ఖించి కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖించికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.కాగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు సభ్యలు వాకౌట్ చేయడంతో ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా.. మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేకి చెందిన కిషన్‌లాల్‌పై ఆప్ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తా, బీజేపీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. అయితే ఖించి కేవలం 5 నెలల మాత్రమే మేయర్ పీఠంపై కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఆప్, బీజేపీ మధ్య పోరుతో పదే పదే వాయిదా పడటమే ఇందుకు కారణం. -
బీజేపీ వెనకడుగు.. ఢిల్లీ మేయర్ పీఠం మళ్లీ ఆప్‌దే..
న్యూఢిల్లీ: చాలా రోజులుగా తీవ్ర గందరగోళం నెలకొన్న దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీ మేయర్ పీఠాన్ని వరుసగా రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో.. ఆప్‌కు చెందిన షెల్లీ ఒబెరాయ్ మరోసారి ఢిల్లీ మేయర్‌గా బుధవారం ఎన్నికయ్యారు. మేయర్‌గా గెలుపొందేందుకు తగినంత బలం లేకపోవడంతో ఓటమిని ముందే ఊహించిన బీజేపీ పోటీ నుంచి వెనక్కి తగ్గడంతో షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా ఇదే జరిగింది. పోటీ నుంచి కాషాయ పార్టీ వైదొలగడంతో ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభా కార్యకలాపాలను మే 2కు వాయిదా వేస్తున్నట్లు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రకటించారు. చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు ఇదిలా ఉండగా రెండు నెలలుగా వాయిదా పడిన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఆ ఎన్నికలో మేయర్‌గా విజయం సాధించారు కూడా. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. మార్చి 31వ తేదీతో ఎంసీడీ హౌజ్ కాలపరిమితి ముగియడంతో మరోసారి తాజాగా ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆప్ తరపున బరిలోకి దిగిన షెల్లీ ఒబెరాయ్‌నే తక్కువ కాలంలోనే మరోసారి ఢిల్లీ మేయర్ పదవిని దక్కించుకున్నారు. కాగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ మేయర్ ఒక సంవత్సరం పదవీకాలంలో ఉండనున్నారు. రొటేషన్ ప్రాతిపదికన అయిదు సంవత్సరాల పాటు ఒక్కో ఏడాది ఒక్కొకరు మేయర్‌గా ఉండనున్నారు. తొలి ఏడాది మహిళలకు, రెండో ఏడాది ఓపెన్ కేటగిరీకి, మూడో సంవత్సరం రిజర్వ్డ్ కేటగిరీకి, మిగిలిన రెండు మళ్లీ ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇక గతేడాది డిసెంబర్ 4న జరిగిన ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దీంతో ఎంసీడీలో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరపడింది. మొత్తం 250 వార్డులకు గాను ఆప్ 134 కైవసం చేసుకోగా, బీజేపీకి 104 వచ్చాయి. -
ఢిల్లీలో మరోసారి మేయర్ ఎన్నిక!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి ఈ నెలలోనే మరోసారి ఎన్నిక జరగనుంది. నాటకీయ పరిణామాలతో దాదాపు రెండు నెలల్లో మూడుసార్లు వాయిదా పడిన ఎన్నిక.. ఫిబ్రవరి చివరివారంలో జరిగిన సంగతి తెలిసిందే. ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఆ ఎన్నికలో మేయర్‌గా విజయం సాధించారు కూడా. అయితే.. ఏప్రిల్‌లో ఎంసీడీ(Municipal Corporation of Delhi)కి మరోసారి ఎన్నిక జరగాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కారణం ఏంటంటే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. మార్చి 31వ తేదీతో ఎంసీడీ హౌజ్ కాలపరిమితి ముగుస్తుంది. కాబట్టి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి కచ్చితంగా ఆ సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆప్ తరపున ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్‌నే మళ్లీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ మేయర్ పోస్ట్‌కు ఆప్ నుంచి మహమ్మద్ ఇక్బాల్ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ మళ్లీ మేయర్ పదవికి అభ్యర్థులను బరిలో దింపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఇంతకు ముందు నిలబెట్టిన రేఖా గుప్తా కాకుండా వేరే వ్యక్తిని నిలపాలని భావిస్తోందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులతో పాటు స్టాండింగ్ కమిటీ, వార్డ్ ఎన్నికలు.. ఇలా అన్నీ ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. ఈ మేరకు మేయర్ కార్యాలయం, ఎన్నికల ప్రతిపాదనను మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి స్టేట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు, అటు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ఎన్నికల ప్రతిపాదిత ఫైల్ వెళ్తుంది. ఎల్జీ మేయర్ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిని నియమిస్తారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. మేయర్ ఎన్నిక పోలింగ్‌లో 34 ఓట్ల తేడాతో షెల్లీ ఒబెరాయ్ గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ హౌజ్‌లో జరిగిన పోలింగ్‌లో.. బీజేపీకి 116 ఓట్లు పోలవ్వగా.. ఆప్‌కు 150 ఓట్లు పడ్డాయి. ఇక ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్ ఓటింగ్: సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్.. ఏదైనా జరగొచ్చు! -
ఢిల్లీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారు
-
ఢిల్లీ మేయర్ ఎన్నిక: సస్పెన్స్‌కు తెర.. తేదీ ఖరారు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నిక తేదీపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడింది. ఎన్నిక తేదీ ఖరారు అయ్యింది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన ఎన్నికకు.. తాజా సుప్రీం కోర్టు తీర్పుతో మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు శనివారం మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎంసీడీ కార్యనిర్వాహక విభాగం. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజున మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే శుక్రవారం సుప్రీం కోర్టులో, ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి వ్యవహారంలో ఆప్ భారీ విజయం సొంతం చేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు ఓటేయడానికి వీల్లేదని, వాళ్లకు అర్హత లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్.. అదీ స్పష్టమైన తేదీతో వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఎంసీడీ హెడ్. ఫిబ్రవరి 22వ తేదీన(బుధవారం) ఉదయం 11 గంటలకు ఎంసీడీ సదన్‌లో ఈ ఎన్నిక జరగనుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత.. ఆరుగురు సభ్యులుండే స్టాండింగ్ కమిటీని అదేరోజు ఎన్నుకుంటారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా మేయర్ పదవికి ఎన్నిక జరగకపోవడం గమనార్హం. ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా.. బీజేపీ ఓటమి పాలైంది. అయితే మేయర్ పదవికి తొలుత పోటీ చేయమని ప్రకటించిన బీజేపీ.. అనూహ్యంగా చివరి నిమిషంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించింది. ఆపై మూడుసార్లు మేయర్ ఎన్నిక కోసం హౌజ్ సమావేశం కాగా.. ఆప్-బీజేపీ సభ్యుల పరస్సర ఆరోపణలు.. అభ్యర్థుల ఆందోళనతో ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సత్య శర్మను నియమించడం దగ్గరి నుంచి నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు కల్పించడం దాకా అంతా బీజేపీ అనుకూలంగా జరుతుతోందని, ఎల్జీ ఇదంతా బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది ఆప్. -
సుప్రీంకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయం
-
సుప్రీం కోర్టులో ఆప్‌కు భారీ విజయం
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల్లో గెలిచి కూడా మేయర్ ఎన్నికకు ఆటంకాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. ఆమ్ఆద్మీ పార్టీకి భారీ విజయం దక్కింది. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్ కోసం జరిగే ఓటింగ్‌కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) అనుమతించారు. ఈ తరుణంలో వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, సత్యశర్మ బీజేపీ గనుక సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆప్ మొదటి నుంచి వాదిస్తోంది. పైగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. నామినేటెడ్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత లేదని గుర్తు చేసింది. ఈ తరుణంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడగా.. ఆప్ సుప్రీంను ఆశ్రయించింది. ఆప్ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు.. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదని స్పష్టం చేసింది. అంతేకాదు 24 గంటల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఎన్నిక నిర్వహణ తేదీని కూడా స్పష్టంగా ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నికపై ప్రతిష్టంభన తొలిగిపోయే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో, ఫిబ్రవరి 6వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఢిల్లీ చరిత్రలోనే మేయర్ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. -
ఢిల్లీ చరిత్రలోనే తొలిసారి.. ముచ్చటగా మూడోసా‘రీ’!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి భంగపాటు తప్పడం లేదు. ఎన్నికల్లో గెలిచినా మేయర్ పదవి ఊరిస్తూనే వస్తోంది. తాజాగా.. మేయర్ ఎన్నిక జరగకుండానే ఎంసీడీ హౌజ్‌ను సోమవారం వాయిదా వేస్తునట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) ప్రకటించారు . దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్నిక వాయిదా పడినట్లయ్యింది. ఢిల్లీ చరిత్రలోనే మేయర్ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ) యాక్ట్ 1957 ప్రకారం.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్ ఓటింగ్‌కు ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ అనుమతించారు. దీంతో సోమవారం హౌజ్ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం చెలరేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం.. నామినేట్ సభ్యులుగానీ, పెద్దల కోటాలో ఎన్నికైన సభ్యులు గానీ మేయర్ ఎన్నికలో ఓటేయడానికి వీల్లేదు. కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ మాత్రం ఎల్జీ నామినేట్ చేసిన పది మందిని ఓటింగ్‌కు అనుమతించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్ సభ్యులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను వాయిదా(తదుపరి తేదీ చెప్పకుండానే) వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు. #WATCH | MCD mayor election called off for the third time after ruckus in the Delhi Civic Centre. pic.twitter.com/irCfHIoycP — ANI (@ANI) February 6, 2023 ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రెండుసార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మూడోసారి కూడా వాయిదా పడింది. పదిహేనేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఓడిపోగా.. విజయం సాధించిన ఆప్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై గంపెడాశలు పెట్టుకుంది. ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్ పీఠం కట్టబెడుతారు.ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు. -
ఢిల్లీ మేయర్ ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) మేయర్ క్యాండిడేట్‌ను ప్రకటించింది ఆ పార్టీ. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆప్ మేయర్ అభ్యర్థిగా మహిళ అభ్యర్థి పేరును ప్రతిపాదించింది. షెల్లీ ఒబెరాయ్(39) పేరును మేయర్ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఆలే మొహమ్మద్ ఇక్బాల్ పేరిటి నామినేషన్ దాఖలు చేసింది. షెల్లీ ఒబెరాయ్.. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్‌గా నెగ్గారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి ఆమె నెగ్గారు. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్‌లో లైఫ్‌టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు ఆయన. మేయర్ పోస్ట్ నామినేషన్లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది.ఢిల్లీ మేయర్‌ను మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోటీలో మరొ అభ్యర్థి గనుక నిలబడకపోతే.. షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. పదిహేనేళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొడుతూ.. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. ఆప్ విజయంతో మేయర్ పదవికి పోటీ పడే ఆలోచనలో లేనట్లు బీజేపీ ఇదివరకే ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది. -
నెలాఖరున మేయర్ల ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెలాఖరువరకు నగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు కొత్త మేయర్లను, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటాయి. మున్సిపల్ కార్పొరేషన్ల కార్యదర్శులు ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సంవత్సరం మేయర్ పదవులను షెడ్యూల్డు కులాలకు (ఎస్సీలు) రిజర్వు చేశారు. నగరంలో లోక్‌సభ ఎన్నికల సందడి ముగిసిందో లేదో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఆరంభం కావడం విశేషం. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 28న, దక్షిణ, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏప్రిల్ 29న జరుగనుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీజేపీ ఆధిక్యతలో ఉండడం వల్ల ఈ పార్టీకి చెందిన వారే మేయర్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని యోగేంద్ర చందోలియా, రామ్‌కిషన్ భన్సీవాల్ ఆశిస్తున్నారు. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్రదీప్ కుమార్, ఖుషీరామ్ భారీ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ డిల్లో, సుదేష్ణ తూర్పు ఢిల్లీ మేయర్ పదవికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.