delhi rains
-
ఢిల్లీలో మారిన వాతావరణం... ఉన్నట్టుండి వర్షం
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నోయిడా-ఘజియాబాద్‌లో ఉన్నట్టుండి వర్షం కురిసింది. బలమైన గాలులతో పాటు ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల చినుకులు పడ్డాయి.గత కొన్నాళ్లుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో నేడు (గురువారం) పగటిపూట తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఇది ఉష్ణోగ్రతను తగ్గిస్తుందని పేర్కొంది. వర్షాలు కురవనున్న నేపధ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఢిల్లీ-ఎన్సీఆర్లో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన చినుకులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రాత్రి 12 గంటల తర్వాత ఎన్సీఆర్లో బలమైన గాలులు వీచాయి. హాపూర్‌లోని సింబావోలిలో ఎనిమిది గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. -
దేశంలోని 20 రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు
దేశంలోని 20కిపైగా రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. అలాగే చలి తీవ్రత కూడా మరింతగా పెరిగింది. జమ్మూకశ్మీర్, లడఖ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ మణిపూర్ సహా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. ఈ సీజన్లో ఢిల్లీలో సోమవారం అత్యంత చలి వాతావరణం ఏర్పడింది. కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా దేశవ్యాప్తంగా రైలు, విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. ఒక్క ఢిల్లీలోనే పొగమంచు కారణంగా 80 రైళ్ల రాకపోకల వేళలు దెబ్బతిన్నాయి. బెంగళూరు-నిజాముద్దీన్, భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, కాన్పూర్-న్యూఢిల్లీ శ్రమశక్తి, ప్రయాగ్‌రాజ్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-ముంబై ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లు గంట నుంచి ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు విమానాల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. టేకాఫ్ లాండింగ్‌లలో 15 నుంచి 30 నిమిషాలు ఆలస్యం జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ పర్యటన కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దయ్యింది. ఇదిలా ఉంటే ఢిల్లీ-ఎన్సీఆర్లలో మంగళవారం వర్షం కురిసే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. జనవరి 14 ఉదయం వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు పొగమంచు ఉండే అవకాశం ఉంది. అయితే జనవరి 11 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలకు, కనిష్ట ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీలకు పెరగవచ్చు. ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. జనవరి 14 నాటికి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. -
Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం
న్యూఢిల్లీ: ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న వర్షాల ప్రభావానికి యమునా నది మరోసారి పోటెత్తింది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఉత్తరాఖండ్ ఇటు హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ శాఖ తెలపడంతో అధికారులు ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గత నెలలో దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. యమునా నది ప్రవాహమైతే జులై 13న అత్యధికంగా 208.66 మీ. రికార్డు స్థాయికి చేరుకోగా తాజాగా మరోసారి అలాంటి పరిస్థితే నెలకొంది. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో యమునా నది ప్రవాహం పాత రైల్వే బ్రిడ్జి వద్ద 205.39 మీటర్లకు చేరినట్లు సెంట్రల్ వాటర్ కమీషన్(CWC) తెలిపింది. హర్యానాలోని యమునానగర్ హాత్నికుండ్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి నీటి ప్రవాహం ఉధృతి 30,153 క్యూసెక్కులకు చేరినట్లు చెబుతోంది సెంట్రల్ వాటర్ కమీషన్. హిణాచల్ ప్రదేశ్ లోనూ, ఉత్తరాఖండ్ లోనూ మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ఐఎండీ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు కొండతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండ చరియలు జారి పడటం, వరదలు, మేఘ విస్ఫోటనాలు సంభవించడంతో ప్రాణ నష్టం కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్క హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటివరకు 55 మంది మృతి చెందారు. #WATCH | Water level of River Yamuna rises in Delhi again. Drone visuals from this morning show the current situation around Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/PATydIBQXZ — ANI (@ANI) August 16, 2023 యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మొదలుపెట్టామని రహదారులపై చిక్కుకున్న వారిని విడిపించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు కృషి చేస్తున్నాయని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు. కల్క -షిమ్లా, కీరత్ పుర్-మనాలి, పఠాన్ కోట్ - మండి, ధర్మశాల - షిమ్లా రహదారులన్నీ మూసివేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఎర్రకోట వేడుకకు హాజరుకాని మల్లికార్జున ఖర్గే.. నెట్టింట వైరల్‌గా ఖాళీ కుర్చి -
సుప్రీంకోర్టుకు చేరిన వరద నీరు.. సైన్యం సహకారాన్ని కోరిన కేజ్రీవాల్..
ఢిల్లీ: యమునా నది ఉప్పొంగడంతో దేశ రాజధాని తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. డ్రెయిన్ రెగ్యులేటర్ పాడవడంతో ఐటీఓ క్రాసింగ్ ఏరియా, నిత్య రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి యమునా నది వరద నీరు పారుతోంది. దీంతో అప్రమత్తమైన సీఎం కేజ్రీవాల్.. ఆర్మీ సహాయం కోరాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ సహాయం తీసుకుని రెగ్యులేటర్‌ను సరిచేయాలని కోరారు. ఇందుకోసం ఇంజినీరు బృందాలు రాత్రంతా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇంద్రప్రస్తా బస్ డిపో నుంచి డబ్ల్యూహెచ్ఓ బిల్డింగ్ మధ్య ఉండే డ్రెయిన్ రెగ్యులేటర్ పాడయిపోయిన కారణంగా వరద ఉద్దృతి ఈ ప్రాంతానికి చేరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా.. ఐటీఓ క్రాసింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌కు షాక్ వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. This breach is causing flooding of ITO and surroundings. Engineers have been working whole nite. I have directed the Chief Secretary to seek help of Army/NDRF but this shud be fixed urgently https://t.co/O8R1lLAWXX — Arvind Kejriwal (@ArvindKejriwal) July 14, 2023 సుప్రీంకోర్టుకు వరద నీరు.. ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో ఉప్పొంగిన యమునా నది ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. నిన్న యమునా నది 208.46 మీటర్ల మేర ప్రవహించింది. కానీ ఈ రోజు మధ్యాహ్నానానికి 208.30కు తగ్గుతుందని కేంద్ర వాటర్ కమిషన్ అంచనా వేసింది. అయితే.. ఇప్పటికే వరద నీరు ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న తిలక్ మార్గ్‌లోని సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఢిల్లీలో వరద నేపథ్యంలో ఫ్రాన్స్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. పరిస్థితి తీవ్రతను సమీక్షించారు. దేశ రాజధాని ఢిల్లీలో రహదారులు నదులయ్యాయి. ఇళ్లు నీట మునిగిపోయాయి. శ్మశాన వాటికలు సైతం జలమయంగా మారాయి. రోడ్లపైకి వచ్చే వీలు లేకుండాపోయింది. మొత్తంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో యమునా నదిలో నీటమట్టం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఏకంగా 208.62 మీటర్లకు చేరుకుంది. దీంతో నగరంలో మరిన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పాఠశాలలకు, ఆఫీసులకు సెలువులు ప్రకటించారు. ఇదీ చదవండి: Delhi Rainfall Floods: యమున విశ్వరూపం.. ముంపులో ఢిల్లీ.. జల దిగ్బంధంలో జనజీవనం -
మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
తాను ఎన్నడూ చూడనంత అతి భారీ వర్షాన్ని చూసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా, తన పర్యటనలను చాలావరకు రద్దుచేసుకున్నారు. ఒక్క ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మాత్రం కష్టమ్మీద ఆయన వెళ్లగలిగారు. మామూలుగా అయితే అందరినీ ఎలా ఉన్నారనో.. మిమ్మల్నందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందనో పలకరిస్తారు. కానీ ఆయన మాత్రం.. ''మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. బోట్లలో వచ్చారా'' అని అడిగారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో రోడ్ల మీద పరిస్థితి చూసిన ఆయనకు ఈ అనుమానం వచ్చింది. జాన్ కెర్రీ ఆ ప్రశ్న అడగ్గానే ఒక్కసారిగా సమావేశం హాల్లో నవ్వులు విరబూశాయి. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయడం భారత్, అమెరికా దేశాలకు మాత్రమే తెలిసిన విద్య అని జాన్ కెర్రీ చెప్పారు. ఆ తర్వాత ఆయన భారత - అమెరికా సంబంధాలు, ఉగ్రవాదాన్ని అణిచేయడం, వాణిజ్య సంబంధాలు.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. పలు దేశాలు బలప్రయోగంతోనే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాయని... కానీ అమెరికా, భారత దేశాలు మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వాటి ద్వారానే ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఉగ్రవాదానికి మూలాలు ఏంటో వెలికితీయాలని, వేర్వేరు కారణాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో దేశానికి, ప్రాంతానికి మధ్య కారణాలు వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే అవినీతిపై కూడా పోరాడి దాన్ని అరికట్టాలని ఐఐటీ విద్యార్థులకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో ఏ ఒక్క దేశం విజయం సాధించలేదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ బిల్లుతో పాటు కొత్త దివాలా చట్టాలను ఆమోదించిందని, విదేశీ పెట్టుబడుల నియంత్రణలలో మార్పులు చేసిందని.. వచ్చే సంవత్సరం భారతదేశం సంయుక్తంగా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తుందని, దీనివల్ల భారతీయ వ్యాపారుల సత్తా అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు.