denduluru MLA
-
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో " స్ట్రెయిట్ టాక్ "
-
దెందులూరును అభివృద్ధి చేయాలనే నేను లండన్ నుంచి వచ్చా : అబ్బయ్య చౌదరి
-
రైతులకు అండగా భరోసా కేంద్రాలు
సాక్షి, పశ్చిమగోదావరి: దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గం సత్యనారాయణపురంలో ఎరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులతో కలిసి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు పుష్కలంగా కురిసి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. (రాజధాని భూ కుంభకోణం.. సిట్ దూకుడు) పంట వేసే సమయంలో రైతుకు అండగా ఉండేందుకు రైతు భరోసా ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విత్తనాలు,ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు,ఎరువులను నేరుగా రైతులకు అందిస్తున్నామన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. (తిరుమల శ్రీవారి ఆలయంలో ట్రయల్ రన్..) -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు..
సాక్షి, దెందులూరు: రాష్ట్రంలో తెలుగు డ్రామా పార్టీ మరోసారి డ్రామా మొదలు పెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. కుల, మతాలను అడ్డంపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని కుల,మతాల మద్దతు ఉండబట్టే వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలిచిందన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తన కులాన్ని పేటేంట్ కులంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే దెందులూరులో వైస్సార్సీపీ ఘన సాధించిందని పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి వెనుక ఉన్న రఘురాం ఏ కులమో తెలియదా.. తాను లండన్‌లో ఉద్యోగం చేసుకునేవాడిని.. తనకు రాజకీయాల్లో అవకాశం కల్పించారు. తాన కులం ఏమిటో తెలియదా’ అంటూ టీడీపీ నేతలను అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. (అంపశయ్యపై ఉన్నా ఆరాటమేనా?) మద్యం రేట్లపై బాపిరాజు మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. మద్యం రేట్లను ‘అమ్మ ఒడి’తో పోల్చుతున్నారని దుయ్యబట్టారు. గొప్ప ఆశయంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని తాగుబోతులతో పోల్చడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఎంతసేపు టీడీపీ మద్యం బాబుల గురించి మాట్లాడుతుందని.. తాము చిన్నారుల భవిషత్తు గురించి ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2,250 రూపాయల పింఛన్ ఇస్తున్నామని.. పింఛన్లపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. అధిక శాతం కమ్మ సామాజిక వర్గం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉన్నారన్నారు. 2024లో టీడీపీకి కెప్టెన్ ఎవరో టీడీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పదేపదే మీడియాకు ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్‌పై చేస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని.. త్వరలోనే జిల్లా ప్రజల కలను సాకారం చేస్తామని పేర్కొన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేసేది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. -
‘నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైంది’
సాక్షి, పెదపాడు/పెదవేగి: జైలు నుంచి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల్లో విజయం సాధించిన చందంగా ప్రెస్‌మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నా రు. పెదవేగి మండలంలోని జానంపేట ఇసుక డంపింగ్‌యార్డు వద్ద ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చింతమనేని న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాల వల్లించినట్లుందన్నారు. అతను మీడియా సోదరులను ఏవిధంగా గౌరవించారో తెలియదా? ఆనాడు మీడియా గుర్తుకురాలేదా అంటూ ప్రశ్నించారు. ‘దమ్ముంటే జగన్, పవన్ తనపై గెలవాలని చింతమనేని సవాల్ విసిరాడు.. నేను ఆనాడే చెప్పాను.. నా రాకతో నీ రాజకీయ పతనం ప్రారంభమైందని.. చెప్పినట్లే ఓడించి అత్యధిక మెజార్టీతో గెలిచాను’ అని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. ఈవీఎంలలో మోసాలతో ఓడిపోయానని చింతమనేని చెప్పడం చూస్తుంటే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోందన్నారు. ఆయన వెనుక ఎస్సీ సోదరులే ఉంటారని చెబుతున్న చింతమనేని కూచింపూడి గ్రామంలో ఎస్సీ సోదరులపై దాడి చేయలేదా? వారిపై కేసులు పెట్టించలేదా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. 66 రోజులు జైలులో ఉన్నా చింతమనేనిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని, ఆయన చేసిన తప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరా రు. ఆయనపై కేసులు పెట్టింది, రౌడీషీట్ ఓపెన్ చేయించింది టీడీపీలోనే కదా.. తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి ఏం సంబంధం, దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు అని చింతమనేనికి సలహా ఇచ్చారు. తోక బ్యాచ్‌ను వేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దెందులూరుకు అభివృద్ధిలో ప్రత్యేక స్థానం తీసుకువస్తామని ఎమ్మెల్యే కొఠారు అన్నారు. చేసిన మంచి పనులను అభినందించు చేతకాకపోతే ఏ ఫామ్‌హౌస్‌లోనో, ఇంట్లోనో ప్రశాంతంగా కూర్చో.. తోక జాడిస్తే కట్ చేస్తామని హెచ్చరించారు. దెందులూరు నియోజకవర్గంలో ఉన్నది జగనన్న మిత్రుడు, సైనికుడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన గేదెలు 500లో 600లో ఉన్నాయి కదా? అవి కాసుకుంటూ జీవనం సాగించు.. పుణ్యమైనా కాస్త దక్కుతుందన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే సహించం కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ చింతమనేని తన స్థాయిని మరిచి సీఎం జగన్మోహన్రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదన్నారు. టీడీపీ హయాంలో అనుకూలురైన పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో మంది మహిళలను చింతమనేని పోలీస్‌స్టేషన్‌లో పెట్టించలేదా? తహసీల్దార్ లీలాప్రసాద్‌ను సీఈఓ ముందు చెంప మీద కొట్టలేదా? మంత్రి వట్టి వసంతకుమార్‌పై దాడిచేయలేదా? అంటూ ప్రశ్నించారు. అక్రమాస్తులు లేవని సెంట్ కూడా ఆక్రమించలేదని చింతమనేని చెబుతున్నారని, 3.50 ఎకరాల ఉన్న చింతమనేని తండ్రికి వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చా యని ప్రశ్నించారు. మీ దగ్గరేమైనా మంత్రదండం ఉందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ, హైదరాబాదుతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను రుజువు చేస్తామని చెప్పారు. -
చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?
సాక్షి, పశ్చిమగోదావరి: జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని నిప్పులు చెరిగారు. ‘నియోజకవర్గంలో దళితులపై దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయావా.. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ సవాల్ విసిరారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడే అర్హత చింతమనేనికి లేదన్నారు. రాష్ట్రంలోనే దెందులూరును మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకున్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి చింతమనేనికి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ధ్వజమెత్తారు. నీ తండ్రికి మూడున్నర ఎకరాలు మాత్రమే ఉందని.. నేడు నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని చింతమనేనిని ప్రశ్నించారు. అధికారులు, మహిళలపై దాడులకు దిగడంతో పాటు, సమావేశంలో వట్టి వసంతకుమార్‌పై కూడా దాడి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాపై 13 తప్పుడు కేసులు పెట్టారన్నారు. -
దారి తప్పి లోకేష్ ఏలూరుకు: అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: పాదయాత్రలో పామాయిల్ రైతులు తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం జగన్ వ్యవసాయశాఖ మంత్రిని పంపించి.. దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. గురువారం అబ్బయ్య చౌదరిని దెందులూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో మీడియాతో మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ రైతులే ఫ్యాక్టరీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. నిరక్షరాస్యతలో ఆంద్రప్రదేశ్ చివరి స్థానంలో ఉందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసేందుకు ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని చేపట్టామని అబ్బయ్య తెలిపారు. దారి తప్పి టీడీపీ నేత లోకేష్ ఏలూరు వచ్చి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు పెడుతున్నారంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని మండ్డిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనిపై కేసులు నమోదయ్యాయి అని తెలిపారు. అప్పుడు అధికారంలో ఉండటంతో చింతమనేనిపై చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు. అమరావతి అవకతవకలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 35 వేల కోట్ల రుపాయలను ఎన్నికల ముందు లూటీ చేశారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు ఇక్కడి ఆస్తులను కట్టబెట్టాలనుకున్నారని మండిపడ్డారు. చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో అనేక దాడులకు పాల్పడినప్పుడు లోకేష్ ఎందుకు మాట్లాడలేదపని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారని అన్నారు. ఐదు నెలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదంటూ లోకేష్ చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థతిలో లేరని అబ్బయ్య చౌదరి అన్నారు. -
చింతమనేనికి చుక్కెదురు..
సాక్షి, ఏలూరు (టూటౌన్) : అసెంబ్లీ ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ సుడిగాలికి ప్రభుత్వ విప్ చింతమేని ప్రభాకర్ కొట్టుకుపోయారు. ఇంతకాలం ఒక నియంతలా తనకు ఎదురులేదని విర్రవీగిన చింతమనేనికి నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుథంతో గట్టిగా బుద్ధి చెప్పారు. రాజకీయాలకు కొత్త అయిన సాఫ్ట్వేర్ ఇంజినీరు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని ఆదరించారు. రాజకీయాలకు కొత్త అయినా విద్యావంతుడు కావడం, ఆయన మాట తీరు, వ్యవహార శైలి నచ్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పట్ల ప్రజలు చూపిన ఆదరణ వెరసి ఈ ఎన్నికల్లో విప్ చింతమనేని ప్రభాకర్‌కు తగిన గుణపాఠం చెప్పాయంటూ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తిట్ల దండకం అందుకోవడం, చేయి చేసుకోవడం, అధికారులను వేధింపులకు గురిచేయడం వంటి అనేక కారణాలతో చింతమనేనిని ప్రజలు వ్యతిరేకించారు. గత పదేళ్లుగా చింతమనేని వ్యవహార శైలితో విసుగు చెందిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గంలోని ఓట్లను 18 రౌండ్లలో లెక్కించగా 9, 18వ రౌండ్లలో మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టమైన మెజార్టీ సాధించారు. 9వ రౌండులో టీడీపీకి 5,834, వైసీపీకి 4,779 ఓట్లు రావడంతో ఈ రౌండులో టీడీపీ 1,055 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండు అయిన 18వ రౌండ్లో టీడీపీ 2,140 ఓట్లు సాధించగా వైసీపీ 1,928 ఓట్లు సాధించింది. దీంతో ఆఖరి రౌండులో టీడీపీకి 212 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఈ రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్ల వరకూ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరకు మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ౖవైసీపీ అభ్యర్థి కొఠారు అబ్యయ్య చౌదరి 17,559 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో దెందులూరులో చింతమనేని అడ్డాలో కొఠారు అబ్బయ్య చౌదరి పాగా వేశారు. -
పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు..
సాక్షి, ఏలూరు : ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల మనోభావాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయటానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని కత్తుల రవికుమార్ జైన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ కేవలం ఒక దళితుడిగా స్పందిస్తూ చింతమనేని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలో దళితుల మనోభాలను కించపరిచే వ్యాఖ్యలను మాత్రమే కట్ చేసి పోస్టు చేశానని విలేకరులకు చెప్పారు. దళితులను అవమానపరుస్తూ చింతమనేని మాట్లాడితే దానిపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం, పోలీసులు తనపై కేసులు పెట్టడం అన్యాయ మన్నారు. చింతమనేనిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తానేమీ చదువురాని వ్యక్తిని కాదని, ఉన్నతభావాలు కలిగిన వ్యక్తిగా, దళితుల మనోభావాలను దెబ్బ తీశారనే కారణంతో ఇది సమాజానికి తెలి యజేసేందుకు పోస్టు చేశానని చెప్పారు. మరోవైపు వీడియో షేర్ చేసిన రవికుమార్ జైన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు...దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పోలీసుల వైఖరిపై దళితులు మండిపడుతున్నారు. -
చింతమనేనిపై భగ్గుమన్న దళితులు
సాక్షి, విజయవాడ: 'మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు' అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విచక్షణ కోల్పోయి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దళితుల్ని ఎమ్మెల్యే అసభ్యపదజాలంతో దూషించిన వీడియాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. టీడీపీ హయాంలో దళితులను అడుగడుగునా కించపరుస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ, దళిత సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పలు చోట్ల చింతమనేని దిష్టి బొమ్మలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. చింతమనేని వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు) టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కాలే పుల్లారావు, పల్లి విజయ రాజు, చందా కిరణ్ తేజ, లెలపుడి లాజరు, పోలిమెట్ల శరత్, పార్టీ కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. (‘సాక్షి’ కథనంపై చింతమనేని ఆగ్రహం) ఇక మరో కార్యక్రమంలో దళితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను అధ్వర్యంలో దళితసంఘాల నాయకులు అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, తుమ్మల ప్రభాకర్, మర్కపుడి గాంధీ, మాతంగి వెంకటేశ్వర్లు, పగిదిపల్లి సునీల్, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే అరెస్టు చేయాలని జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. -
చింతమనేనికి చుక్కెదురు
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరులోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దు లేదా తొలగి౦చాలనే అభ్యర్థనను అ౦గీకరి౦చబోమని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టేందుకు చింతమనేని సిద్ధమవుతున్నారు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. -
చింతమనేనీ.. ఇదేం పని?
'ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా... ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి' ఎవరో వీధిరౌడీ నోటి నుంచి వచ్చిన కూతలు కావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ ఓటర్లను బెదిరించిన క్రమం ఇది. రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అవుతాడేనేది వర్తమాన సామెత. చింతమనేని లాంటి ఎమ్మెల్యేలు ఈ సామెతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. 'దాదాగిరి'ని తన దారిగా మార్చుకున్న ఈ 'పచ్చ' నాయకుడు మహిళా అధికారిపై దౌర్జన్యంతో మరోసారి తన వార్తలకెక్కారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ హోదా వెలగబెడుతున్నా పాత పనులు మానలేదు. ఆయనపై నమోదైన కేసులే ఇందుకు నిలువెత్తు రుజువు. ఇసుక మాఫియాను అడ్డుకున్నారన్న అక్కసుతో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని, ఆయన వందిమాగధులు విరుచుకుపడ్డారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఇసుకలో ఈడ్చిపడేశారు. తనకెవరైనా ఎదురు చెబితే ఎవరికైనా ఇదే గతి పడుతుందన్న తరహాలో ఆయన చెలరేగిపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని 'పచ్చ'బాబుల గూండాగిరి గురైన మహిళా అధికారి వాపోయారంటే అధికార పార్టీ ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మండల మేజిస్ట్రేట్ పైనే దౌర్జన్యం చేస్తే ఇక సామాన్యుల గతి ఏంటి? తన నియోజకవర్గంలో యూపీ తరహా 'గుండారాజ్' నడిపిస్తున్న చింతమనేనికి దౌర్జన్యాలు కొత్తేంకాదు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్న తన చెంచాలను చెరసాలలో వేశారనే అక్కసుతో పెదవేగి ఎస్సైపై దాదాగిరి చెలాయించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తన అనుచరులను ఉసిగొలిపి కావూరి సాంబశివరావు ఇంటికిపై దాడి చేయించారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి సంక్రాంతి సమయంలో కోడిపందాలు నిర్వహించడం చింతమనేనికి సరదా. తనకెదురు చెప్పినవారిపై రౌడీయిజం చేయడం ఆయనకు అలవాటైన విద్య. 'రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా'నని సందు దొరికినప్పుడల్లా ఊదరగొట్టే సీఎం చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మౌనముద్ర దాలుస్తారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు తెగబడుతున్నా ఇప్పటివరకు ఒక్కరిపైనా చర్య తీసుకున్న పాపాన పోలేదు. ఆశ్రిత పక్షపాతానికి అతీతుడునని ప్రచారం చేసుకునే సైకిల్ పార్టీ అధినేత టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలపై మాత్రం అస్సలు స్పందించరు. ఏమన్నా అంటే ఎదురుదాడి చేస్తారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేదెవరో? -
సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి
* చంద్రబాబు ఫొటోకు దండం పెట్టుకోండి * ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరు రూరల్ : ‘టీడీపీకి ఓట్లు వేయని వారు సిగ్గు లేకుండా పింఛన్లు తీసుకోండి. కాకపోతే వాళ్లంతా చంద్రబాబునాయుడు ఫొటోకు దండం పెట్టుకోండి’ ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పింఛను లబ్ధిదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలివి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మల్కాపురంలో సోమవారం నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సభలో పాల్గొన్న ఆయన పింఛనుదారులను ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ‘మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశారు. మీరు నాకు నీళ్లు పోసినా, నేను పాలు పోస్తున్నా. అర్హులైన వారందరకీ పింఛన్లు ఇప్పిస్తా. అయితే మీకు నన్ను ప్రశ్నించే హక్కు లేదు’ అని వ్యాఖ్యానించారు. మాదేపల్లిలో జరిగిన సభలోనూ ఇదేవిధంగా మాట్లాడారు. ‘ఎంపీపీ మనవాడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులూ మన పార్టీయే. ఒక్క సర్పంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. నన్ను ఓటమి పాలు చేద్దామనుకున్న సర్పంచ్ కోసూరి సుబ్బారావుకు రెండు దండాలు’ అంటూ హేళన చేశారు. చింతమనేని ఇలా మాట్లాడటంపై గ్రామస్తులు విస్తుపోయారు. ప్రజాప్రతినిధిగా పార్టీలకు అతీతంగా పనిచేయాలన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరచి, ప్రజలను పార్టీల ప్రాతిపదికన విడదీయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రెడ్డి అనురాధ, జెడ్పీటీసీ సభ్యులు మట్టా రాజేశ్వరి, మండల ఉపాధ్యక్షులు మోరు హైమావతి పాల్గొన్నారు. -
ప్రభుత్వ విప్ ‘చింతమనేని’
సాక్షి, ఏలూరు : తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పేరు తెచ్చుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు మంచి అవకాశం దక్కింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌గా శుక్రవారం ఎంపికయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రభాకర్‌కు ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశించారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయనకు విప్ పదవి దక్కింది. ఇప్పటికే సొంత పార్టీకి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు, మిత్రపక్షమైన బీజేపీ నుంచి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాల రావుకు కేబినెట్లో చంద్రబాబు స్థానం కల్పించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవడంతో వారు కొంత అసంతృప్తితో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్‌ను విప్‌గా నియమించడంతో ఆ వర్గం వారిని కూడా శాంతింపజేసినట్టయ్యింది. నిత్యం వివాదాల్లో ఉంటారనే విమర్శలు ఉన్నప్పటికీ తనను నమ్ముకున్న వారి సమస్యలు తీర్చడంలో ముందుంటారనే పేరును చింతమనేని సంపాదించారు. ఆయనకు విప్ పదవి దక్కడంతో అనుచర గణం సంబరాల్లో మునిగింది. జిల్లాకు ఇప్పటివరకూ రెండు మంత్రి పదవులు, ఒక విప్ పదవి లభించడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.