Deoband
-
కరోనా కేసుల్లో మరో ట్విస్ట్
-
కరోనా కేసుల్లో ‘దియోబంద్’ ట్విస్ట్..
సాక్షి, ఆదిలాబాద్ : తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి మరో ట్విస్ట్ బయటపడింది. ఇప్పటికే ఢిల్లీలోని మర్కజ్ ఘటనతో దేశంలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మర్కజ్ తరహాలోనే ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినవారిలో కొందరికి కూడా కరోనా సోకినట్టుగా తేలింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన రెండు కేసులకు దియోబంద్‌కు లింక్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మర్కజ్ వెళ్లినవారిలో కొందరు దియోబంద్, ఆజ్మీర్ దర్గాను కూడా సందర్శించినట్టుగా తెలుస్తోంది. దీంతో యూపీలోని దియోబంద్‌కు హాజరైన వారందరీ ఆచూకీ తెలుసుకునే పనిలో పడ్డారు. మొన్నటివరకు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించే శ్రమించిన అధికారులు.. ప్రస్తుతం దియోబంద్‌కు వెళ్లినవారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చదవండి : వైద్యుడిపై ఉమ్మివేసిన కరోనా బాధితుడు వైరల్: డ్రోన్‌తో పాన్ మసాలా డోర్ డెలివరీ -
దీపావళికి బంగారం కాదు, కత్తులు కొనండి..
లక్నో : అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు త్వరలో రానున్న నేపథ్యంలో బీజేపీ నేత గజరాజ్ రానా ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దంతెరాస్, దీపావళి పండుగలకు బంగారం, వెండి పాత్రలకు బదులు దేశంలోని హిందువులంతా ఇనుముతో చేసిన కత్తులు కొనాలని ఆయన సూచించారు. కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందంటూనే, తీర్పు ఎలాంటిదైనా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తీవ్ర మార్పులొస్తాయని, ముందు జాగ్రత్తగా ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు అవసరమని గజరాజ్ అభిప్రాయపడ్డారు. హిందూ పురాణాల్లో దేవుళ్లు, దేవతలు కూడా తగిన సందర్భాల్లో అనువైన ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పాటుపడ్డారని, ఆకోవలోనే తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి తప్ప వేరే అభిప్రాయాలను ఆపాదించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ స్పందించారు. గజరాజ్ రానా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, దాంతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు వివిధ విషయాలపై చట్టానికి లోబడి స్పందించేలా మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. కాగా, రానా గతంలోనూ ... ముస్లింల పవిత్ర ప్రదేశమైన మక్కాలో శివలింగం ఉందని, ఒకప్పుడు హిందువులు అక్కడ నివాసముండేవారంటూ వ్యాఖ్యలు చేశారు. -
ఉగ్రవాదులున్నారు.. అందుకే..!
ముజఫర్‌నగర్ : బంగ్లాదేశ్, పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకాలాపాలు నిర్వహించే వారికి భారత పాస్‌పోర్టులు ఉన్నట్లు అనుమానాలు రావడంతో.. పాస్‌పోర్టులు పరిశీలనకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దియోబంద్, ముజఫర్‌నగర్, సహరన్పూర్ జిల్లాల్లోని వేల పాస్‌పోర్టులను ధృవీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. బంగ్లాదేశ్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఇద్దరివద్ద భారత పాస్‌పోర్టులు.. దియోబంద్ అడ్రస్‌తో లభించడంతో.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు కేంద్రంగా పనిచేసే ఉగ్రవాదులు.. పదుల సంఖ్యలో దియోబంద్‌లో దాక్కున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దియోబంద్లోనే.. ప్రముఖ ముస్లిం మత సంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఉండడం గమనార్హం. బంగ్లాదేశీ అనుమానాస్పద ఉగ్రవాదులు అరెస్టయిన నేపథ్యంలో.. అక్రమంగా దియోబంద్‌లో నివసిస్తున్న బంగ్లా జాతీయులపై తక్షణం చర్యలు తీసుకోవాలని యూపీ సర్కార్ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక బంగ్లాజాతీయులకు తప్పుడు ధృవీకరణ పత్రాలు జారీ చేసిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ అనేది.. దియోబంద్ లేదా మరో వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్న అంశం కాదని షమారాన్పూర్ డీఐజీ ఎమ్మాన్యువల్ తెలిపారు. పాస్‌పోర్టులు ఉన్నవారంతా.. దియోబంద్, ముజఫర్‌నగర్, సహారాన్పూర్లలో తప్పకుండా వెరిఫికేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్, సహారాన్పూర్, దియోబంద్ జిల్లాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు స్పష్టమైన సమాచారం ఉండడంతోనే విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు. గతంలోనూ సహారాన్పూర్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలతో ఉన్నవ్యక్తులను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అరెస్టయిన బంగ్లాదేశీ ఉగ్రవాదుల వద్దనున్న భారతీయ పాస్‌పోర్టులను చూపించారు. ఇదిలా ఉండగా 20 మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ యూపీలో అదృశ్యమైన విషయంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. -
‘భారత్ మాతా కీ జై’ అనొద్దు
దారుల్ ఉలూమ్ ఫత్వా సహరాన్పూర్: ముస్లింలు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసింది. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆ నినాదాన్ని ఉచ్చరించబోమని వర్సిటీ పీఆర్ఓ అష్రాం ఉస్మానీ పేర్కొన్నారు. తామంతా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నామని, ‘హిందుస్తాన్ జిందాబాద్’, ‘మద్రే వతన్’ అంటూ నినదిస్తామన్నారు. మనుషులు మాత్రమే మనుషులకు జన్మనివ్వగలరని, అలాంటప్పుడు దేశాన్ని తల్లిగా పేర్కొంటూ ఎలా నినాదాలిస్తారని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని సమర్థించినట్లే: వీహెచ్‌పీ ఫత్వాని వీహెచ్‌పీ తీవ్రంగా తప్పుపట్టింది. దారుల్ ఉలూమ్ బహిరంగంగా ఉగ్రవాదాన్ని సమర్ధించినట్లేనని అభిప్రాయపడింది. ఉగ్రవాదాన్ని ఏ మతంతోనూ లింకుపెట్టకూడదన్న ప్రధానిమోదీ విధానానికిఈ ఫత్వాతో తక్షణం బదులిచ్చారని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. భారత్ మాతా కీ జై ఉచ్చారణ మాతృభూమిపై ప్రేమావేశానికి నిదర్శనమని, అది ఫ్యాషన్ కాదని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినప్పుడు ఎందుకు ఫత్వాలు జారీచేయలేదని ఆయన కోల్‌కతాలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.