Department of Youth Services
-
అచేతనంగా ‘యువచేతన’
సాక్షి, ఆదిలాబాద్: యువతలో సామాజిక మార్పు తీసుకువచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేలా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, వారు సమాజసేవకు పాటుపడేలా యూత్‌క్లబ్‌ల ఏర్పాటు లక్ష్యంతో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట యువచేతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా యువజనులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఇందుకోసం జిల్లా యువజన సర్వీసుల శాఖ ద్వారా 15 నుంచి 35 ఏళ్లలోపు యువతీ, యువకులతో యూత్ క్లబ్‌లు ఏర్పాటు చేసేలా నిర్ణయించింది. సామా జిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చే యువతకు చేయూతనిచ్చి వారిని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన యువచేతన కార్యక్రమం జిల్లాలో నీరుగారి పోతోంది. నాలుగేళ్లలో జిల్లా లో సుమారు 566 యూత్‌క్లబ్‌లు ఏర్పాటు కాగా వాటిలో దాదాపు 9వేలకుపైగా యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు, ప్రోత్సాహకాలు అందకుండా పోతున్నాయి. దీంతో పథక ఉద్దేశం నీరుగారిపోతోంది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు.. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే ఒక్కో యూత్ క్లబ్లో 10 నుంచి 15 మంది యువజనులు ఉండేలా గ్రామస్థాయిలో యువజన క్లబ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరు ఆర్గనైజర్ లేదా అధ్యక్షుడిగా, డిప్యూటీ ఆర్గనైజర్ లేదా సెక్రెటరీగా జిల్లాలో దాదాపు 566 యూ త్క్లబ్లను ఏర్పాటు చేశారు. యూ™Œత్క్లబ్లకు ప్రభుత్వం చేయూత ఇవ్వడంతోపాటు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలకు రుణ సదుపాయం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వాటిని ఏర్పాటు చేశారు. కానీ లక్ష్యం నెరవేరకపోవడంతో అవి కేవలం యూత్క్లబ్లుగానే మిగిలిపోయాయి. యువజన సంఘాల కార్యకలాపాలివే... యూత్‌క్లబ్‌లో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఏర్పాటైన యువత ప్రధానంగా వారి నివాస ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, వార్డు ప్రజలను ప్రోత్సహించడం చేయాలి. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లని చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి వెంటనే చిన్నారులను పాఠశాలలో చేర్పించాలి. పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ పండగ (ఆగస్టు15, జనవరి26)లను నిర్వహించి జాతీయ సమైక్యత చాటేలా పాలుపంచుకోవాలి. యువజనులంతా సేవాకార్యక్రమాలు చేపట్టాలి. క్రీడాపోటీల నిర్వహణ, అవయవదానం ప్రాధాన్యతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. మండల స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించాలి. జిల్లాలో 566 క్లబ్‌లు.. జిల్లాలో ఇదివరకే యువజన సర్వీసులశాఖ ద్వారా 13 మండలాల పరిధిలో మొత్తం 566 యూత్ క్లబ్‌లు ఏర్పాటయ్యాయి. కొత్తగా యూత్‌క్లబ్‌లు ఏర్పాటు చేయాలంటే మొదట గ్రామాల్లోని వార్డుల వారీగా ఆసక్తి గల యువత యూత్ క్లబ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను మొదట పంచాయతీ సెక్రెటరీకి అందజేయాలి. అక్కడి నుంచి ఆయా దరఖాస్తులు ఈఓపీఆర్డీ ద్వారా సంబంధిత మండలాల ఎంపీడీఓ జిల్లా యువజన క్రీడాశాఖకు అందజేయాల్సి ఉంటుంది. కొత్తగా యూత్‌క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి గడువు లేదు. ఎప్పుడైనా యువత యూత్‌క్లబ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. సమాజాసేవలో భాగస్వామ్యం చేసేందుకే.. యువతను సమాజసేవలో భాగస్వాములను చేసేందుకే ప్రభుత్వం యువచేతన కార్యక్రమం నిర్వహిస్తోంది. యువజన సంఘాలకు రుణాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. భవిష్యత్‌లో వస్తే వీరికే ప్రాధాన్యత కల్పిస్తాం. – ఎన్.వెంకటేశ్వర్లు, డీవైఎస్ఓ, ఆదిలాబాద్ రుణాలు అందజేయాలి డెబ్బై మంది యువత తో నాలుగేళ్ల కింద యూత్ క్లబ్ ఏర్పాటు చే శాం. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాం. యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఆదాయంలో నుంచి సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది. – ఎం.ప్రవీణ్, ప్రధానకార్యదర్శి, స్వయంకృషి యూత్‌క్లబ్, పల్లిబి, తలమడుగు -
యువత పై పట్టింపేది..
ఆదిలాబాద్‌అర్బన్: యువజన సర్వీసుల శాఖ(స్టెప్)పై సర్కారు చిన్నచూపు చూస్తోంది. గత నాలుగేళ్లుగా ఎలాంటి సంక్షేమ యూనిట్లు గానీ వాటికి సంబంధించి రుణాలూ విడుదల చేయడం లేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యువజన సంఘాలను పట్టించుకోకపోవడంతో గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను పక్కాగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి ప్రాముఖ్యతను వివరించడంతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న యువతకు ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో ముందుకు వెళ్లలేకపోతున్నారు. నేటి సమాజానికి చేదోడువాదోడుగా ఉంటూ సామాజిక సేవ చేస్తున్న యువతను గుర్తించి గ్రూపులుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెండేళ్ల క్రితం జిల్లా అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే యువతను గుర్తించిన అధికారులు వారిని గ్రూపులుగా ఏర్పాటు చేశారు. వీరికే ఆర్థిక సాయం అందించే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నా.. యూనిట్ల మంజూరు, రుణాల విడుదలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కాగా, ప్రతి యేడాది యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా.. ఈ నాలుగేళ్లలో ఇంతవరకు ఏ ఒక్క సారి కూడా రుణాలు మంజూరు కాలేదంటే సర్కారుకు యువతపై ఉన్న శ్రద్ధ ఇట్టే అర్థమవుతోంది. 300 యూనిట్లు.. 566 యూత్ గ్రూపులు.. జిల్లాలోని యూత్ గ్రూపుల సభ్యులకు ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లకు ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి ప్రతిపాదనలు పంపినా ప్ర భుత్వం పక్కన పెడుతూ వచ్చింది. 2016–17లో జిల్లాకు 700 యూనిట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినా.. ఏ ఒక్కటి మంజూరు చేయలేదు. 2017–18 సంవత్సరంలో జిల్లాకు 400 యూని ట్లు కేటాయించాలని నివేదించినా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తాజాగా 2018–19 ఆర్థి క సంవత్సరానికిగాను జిల్లాకు 300 యూనిట్లు కేటాయించాలని నివేదించగా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్లపై యువత ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వరుసగా నాలుగేళ్ల నుంచి ఎలాంటి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకపోవడంతో యూత్ గ్రూపులలోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో మొ త్తం 566 యూత్ గ్రూపులు రిజష్టరై ఉన్నాయి. ఈ గ్రూపుల్లో సుమారు 5 వేల మందికిపైగా యువత సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని పాత 13 మండలాల్లో యూత్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. అత్యధికంగా ఇచ్చోడ మండలంలో 92 యూత్ గ్రూపులు ఉండగా, గుడిహత్నూర్ మండలంలో అతి తక్కువగా 16 గ్రూపులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. యువజన సర్వీసుల శాఖ ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లు ఈ గ్రూపుల సభ్యులకే వర్తింపజేస్తారు. గతంలో ‘స్వయం ఉపాధి’ ఇలా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువజన సర్వీసుల శాఖకు ప్రతియేడాది స్వయం ఉపాధి రుణాల యూనిట్లు ఆయా ప్రభుత్వాలు కేటాయిస్తూ వచ్చాయి. అప్పట్లో ప్రభుత్వం ప్రతి యేటా యూనిట్ల కేటాయింపుకు ప్రతిపాదనలు కోరడం, అందుకు తగిన రుణాలు విడుదల చేయడం వంటివి జరిగేది. దరఖాస్తులు చేసుకున్న యువతకు ఆటోట్రాలీ, ప్యాసింజర్ ఆటో, డెస్క్‌టాప్ ప్రింటింగ్(డీటీపీ), జిరాక్స్ సెంటర్, ఇతర యూనిట్లు ఇచ్చి యువతను ప్రోత్సహించే వారు. దీంతో జిల్లాలోని యువతకు స్వయం ఉపాధి దొరకడంతోపాటు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం సాయం అందించేది. కాలానుగుణంగా వచ్చిన ప్రభుత్వాలు పూర్తి భిన్నంగా మార్చేశాయి. నాలుగేళ్లుగా యూనిట్ల మంజూరుపై ఎలాంటి స్పందన రాకపోవడంతో యువత సంవత్సరాల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ప్రతిపాదనలు పంపుతున్నాం.. ప్రతి యేడాది స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. కానీ ఈ నాలుగేళ్లలో ఇంత వరకు మంజూరు కాలేదు. యూనిట్ల కేటాయింపు ప్రభుత్వ స్థాయిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ యేడాది కూడా యూనిట్ల ప్రతిపాదనలు పంపించాం. రాబోయే ఎన్నికల అనంతరం మంజూరు కేటాయించవచ్చు. – వెంకటేశ్వర్లు, సీఈవో,యువజన సర్వీసుల శాఖ -
యువశక్తి.. తగ్గిన ఆసక్తి
⇒ ప్రభుత్వ ఆదరణలేదు...రుణాలు రావు ⇒ నిర్వీర్యమైన రాజీవ్ యువశక్తి పథకం ⇒ సీఎంఈవైగా పేరుమార్చినా నిధులివ్వని వైనం కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఒక్క యూనిట్‌ను ప్రారంభించకుండా యువత భవితతో ఆటలాడుకుంటోంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వారి గురించి ఆలోచించడం మానేసింది. రాజీవ్ యువశక్తి పథకం కింద ప్రభుత్వం కేవలం జిల్లాలో ఆరు నుంచి 7 యూనిట్లకు సరిపోయే మొత్తానికి మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. సీఎంఈవైగా పేరు మార్చినా యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌యువశక్తి పథకం పేరును సీఎంఈవై (ముఖ్యమంత్రి యువజన సాధికారత పథకం)గా మారుస్తూ సెప్టెంబర్ 25న ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో జారీ అయి రెండు నెలలు పూర్తయినా సీఎంఈవై నియమ నిబంధనలు విడుదల చేయలేదు. ఈ పథకం కింద ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తానికి రూ.1.26కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తానికి 126 యూనిట్లు రాగా, మన జిల్లాలో 7 నుంచి 8 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు మాత్రమే ఈ నిధులు సరిపోతాయి. రాష్ట్రం మొత్తానికి ఎస్టీ వర్గాలకు రూ.5కోట్లతో 500 యూనిట్లు కేటాయించినా అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. ప్రతిపాదనలు బుట్టదాఖలు సేవా రంగంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రూ.2లక్షల సబ్సిడీతో రూ.5లక్షల రుణాన్ని వంద యూనిట్లను, వ్యాపార సంబంధంగా రూ.2లక్షల యూనిట్ కాస్ట్‌తో 200 యూనిట్లను, చిన్న యూనిట్లకు రూ.1లక్షతో 600 యూనిట్లను జిల్లాకు కేటాయించాలని గతంలో అధికారులు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. జాడలేని యువజనోత్సవాలు గతేడాది నియోజకవర్గ, జిల్లా స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిఆంచారు. కానీ ఈ సారి నియోజకవర్గ స్థాయి పోటీలకు స్వస్తి పలికి కేవలం జిల్లా స్థాయిలో నిర్వహించాలని రూ.30వేలను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గూడూరు మండలం జులేకల్ గ్రామానికి చెందిన శ్రీరాములు 2010లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం రెండేళ్ల పాటు వెతికినా లాభం లేకపోయింది. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబ సమస్యలు వెంటాడటంతో ఏదైనా వ్యాపారం చేద్దామని భావించాడు. రెండేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీల ద్వారా అందించే రుణాల కోసం ఎదురుచూడసాగాడు. గతేడాది మళ్లీ దరఖాస్తు చేసినా ఫలితం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా రుణాల ఊసేలేకుండా పోయింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన రాము స్థానికంగా ఆడియో దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతను తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు గతేడాది రాజీవ్ యువశక్తి పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా రాకపోవడంతో మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. ఈ సారి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వడం లేదని తెలుసుకుని అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. -
ఉత్తమ సేవకులకు అవార్డులు
ఆదిలాబాద్ కల్చరల్ : జిల్లాలో కళాప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి, ఉత్తమ సేవ కార్యక్రమాలు, సామాజిక రంగాల్లో సేవలందించిన వారికి, సంఘాలకు అవార్డులు లభిస్తాయని యువజన సర్వీసుల శాఖ జిల్లా సీఈవో వెంకటేశ్వర్లు అ న్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా యువజన సర్వీసుల శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని యువతీ, యువకులు, కళాకారులు, ఉద్యోగుల నుంచి ఉత్తమ అవార్డులు, పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. జాతీయ యూత్ అవార్డు కోసం 11 దరఖాస్తులు రాగా ఐ దింటిని ఎంపిక చేశామని వివరించారు. సంఘా ల విభాగంలో తాండూర్‌కు చెందిన అభినవ యూత్ ఆర్గనైజేషన్, మంచిర్యాలకు చెందిన కేజీఎన్ వాలంటీర్ల ఆర్గనైజేషన్, వ్యక్తిగత విభాగంలో తాండూర్‌కు చెందిన కె.సంతోష్, ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన ఎర్రం న ర్సింగ్‌రావు, ఆదిలాబాద్‌కు చెందిన మిట్టు రవి ఎంపికయ్యారని తెలిపారు. పద్మ అవార్డుల కోసం 27 దరఖాస్తులు రాగా.. 13 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. సాహితీ, విద్యారంగం లో నిర్మల్‌కు చెందిన మడిపెల్లి భద్రయ్య, సా మాజిక సేవారంగంలో లక్సెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన తగరపు సత్తయ్య, తాండూర్ మండలం రేచూరి గ్రామానికి చెందిన కె.సంతోష్, కళారంగంలో నిర్మల్‌కు చెందిన జోసప్ బాపూరావు, సామాజిక సేవారంగంలో బెల్లంపల్లికి చెందిన దాసరి విజయ, నిర్మల్ చెందిన చిత్ర కళాకారుడు భాస్కర్రాజులను ఉత్తమ పద్మ అవార్డులకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు తెలిపారు. సామాజిక సేవారంగంలో ఆదిలాబాద్ మండలం దిమ్మ గ్రామానికి చెందిన పసుపుల రాజు, చెన్నూర్ మండలానికి చెందిన గర్మిళ్ల శ్రీనివాస్‌రెడ్డి, లోకేశ్వరం మండ లం ధర్మోర గ్రామానికి చెందిన మదిరి ఆంజనేయులు, ఆదిలాబాద్‌కు చెందిన అల్లొల సంతోష్‌కుమార్, గుడిహత్నూర్ మండలం తోషం గ్రా మానికి చెందిన ఎండి.షాహిద్, కళారంగంలో కడెంకు చెందిన నల్ల రాంరెడ్డి, ఆదిలాబాద్‌కు చెందిన ఫహీమ్ సర్కార్లను పద్మ అవార్డుల కోసం ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన వారిని జాతీయస్థాయికి పంపిస్తారని, రాష్ట్రస్థాయిలో అవార్డులను ప్రకటిస్తారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎం.జగన్మోహన్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, యువజన సర్వీసుల శాఖ సీఈవో, డీపీఆర్వోతో కూడిన కమిటీ వీరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ కో ఆర్డినేటర్ ఖాన్ అరీఫ్ అహ్మద్, యూత్ కో ఆర్టినేటర్ మసూద్ పాల్గొన్నారు. -
మోక్షమెప్పుడో..?
ఖమ్మం హవేలి: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సెట్‌కం(యువజన సర్వీసుల శాఖ) ద్వారా అందించే రుణాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు రాలేదు. దీంతో జిల్లాలోని నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతి ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌లో ప్రతి జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో లక్ష్యం నిర్దేశించి అందుకు సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లోని సెట్‌కం కార్యాలయాలకు పంపిస్తారు. దీని ప్రకారం జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందిస్తారు. ఆయా మండలాలకు నిర్ణయించిన బ్యాంకు శాఖల వారీగా స్వయం ఉపాధి రుణాల ప్రక్రియ ఎలా నిర్వహించాలో ఇందులో పొందుపరుస్తారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత కార్యాచరణ ప్రణాళిక వివరాలను జూన్‌లో నిర్వహించే డీఆర్సీ సమావేశంలో ప్రవేశపెడతారు. కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా స్థాయి కమిటీ అప్రూవల్ తరువాత జూలైలో అన్ని మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. స్వయం ఉపాధి పొందగోరు నిరుద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తుల ప్రకారం మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారు లోన్ ఖాతా, లబ్ధిదారు ఖాతాలను ప్రారంభించాలి. బ్యాంక్ కాన్సెంట్ ఇచ్చిన తరువాత లబ్ధిదారు ఖాతాలో సబ్సిడీ, లోన్ ఖాతాలో బ్యాంక్ రుణం వేస్తారు. అనంతరం యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంపై ప్రభావం.. క్రమపద్ధతి ప్రకారం ప్రక్రియ కొనసాగితే యూనిట్లు గ్రౌండ్ అయ్యేవరకు సంవత్సర కాలం పడుతుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ జిల్లాలో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు రాకపోవడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఇంకా విధివిధానాలు ఎప్పుడో వస్తాయో కూడా తెలియడం లేదు. ఇంకా ఆలస్యం అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సబ్సిడీ పెంచితే మేలు.. సెట్‌కం ద్వారా ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు రూ.30 వేలకు మించి సబ్సిడీ ఇవ్వడంలేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లో మొత్తం 50 శాతం సబ్సిడీగా ఇస్తున్నారు. సెట్‌కం ద్వారా కూడా 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గత ఏడాది 365 యూనిట్లు గ్రౌండింగ్.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో సెట్‌కం ద్వారా పరిశ్రమలు, సేవల రంగానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 365 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఈ యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టుల విలువ రూ.3.26 కోట్లు కాగా వీటికి సంబంధించి రూ.1.10 కోట్ల మేర నిరుద్యోగులకు సబ్సిడీ అందింది.