Derivative contract
-
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
జూలైలో పెరిగేది పరిమితమే: రోలోవర్ సంకేతాలు
నిఫ్టీ ఇండెక్స్ శుక్రవారం జూలై సీరీస్‌ను భారీ లాభంతో ప్రారంభించింది. ఇదే ఇండెక్స్ జూన్ సీరిస్‌లో 8శాతం ర్యాలీ చేసింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టుల రోలోవర్, బిల్డ్-అప్ పోజిషన్ల తీరును గమనిస్తే ఈ జూలై డెరివేటివ్స్ సీరీస్‌లో నిఫ్టీ ఇండెక్స్ ప్రస్తుత స్థాయిల నుంచి స్వల్ప అప్‌సైడ్ ట్రెండ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. జూన్ సీరిస్ ముగింపు తర్వాత ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తీసుకునేందుకు తక్కువ ఆసక్తి చూపారు. దీంతో అధిక స్థాయిల వద్ద బేరిష్ పోజిషన్లు బిల్డప్ కావచ్చనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నిఫ్టీ 10,500-10,600 స్థాయిలలో బలమైన నిరోధాన్ని ఎదుర్కోవలసి వస్తుందని వారంటున్నారు. ఎక్స్పైరీ తేదీన నిఫ్టీ రోలోవర్స్ 71.6శాతానికి జరిగాయి. ఇది 3నెలల యావరేజ్ స్థాయి 69.7శాతం కంటే ఎక్కువ. అయితే కిందట నెల నమోదైన 75.7శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ప్రోవిజన్ల గణాంకాలు చెబుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేత అనంతరం ఆర్థిక వ్యవస్థ ఎంత బలపడుతుందనే అనే అంశంపై స్పష్టత లేనందున మార్కెట్ల మరింత పెరగడానికి సంకోచిస్తాయి. ఈ క్రమంలో ప్రస్తు ర్యాలీ తరువాత సూచీలు అధిక స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ అధిక స్థాయిల వద్ద జాగ్రత్త వహించాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. కొన్ని అధిక వెయిటేజీ కలిగి స్టాక్ డిస్కౌంట్ వద్ద ట్రేడ్ అవుతుండటంతో నిఫ్టీ జూలై ఫ్యూచర్ కూడా డిస్కౌంట్లోనే ట్రేడ్ అవుతోంది. ఈ జూలై సీరస్‌లో నిప్టీ ఇండెక్స్ 9700-10700 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ డెరివేటివ్స్ విశ్లేషకుడు చందన్ తపారియో అభిప్రాయపడ్డారు. 10,500-10,600 శ్రేణి నిఫ్టీకి కీలకం: నిఫ్టీ ఇండెక్స్ అప్‌ట్రెండ్‌లో 10,500-10,600 శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవచ్చని ఎడెల్వీజ్ రీసెర్చ్ క్వాంటిటేటివ్ రిసెర్చ్పర్సన్ యోగేశ్ రాడ్కే తెలిపారు. ఇక డౌన్‌ట్రెండ్‌లో 10000 స్థాయికి నిఫ్టీ కీలకమని, ఈ స్థాయిని కోల్పోతే 9,700 - 9,400 పరిధికి దిగివచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రిస్క్-ఆన్ ట్రేడ్ మూమెంటం కొనసాగుతుందన్నారు. ప్రపంచ మార్కెట్ల కదలికలు ఈ జూలై సీరీస్‌కు మార్గనిర్దేశం కానున్నాయని రాడ్కే అభిప్రాయపడ్డారు. -
కీలక కంపెనీల ఫలితాల ప్రభావం..
• ఈ వారమే డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు • ఒడిదుడుకులు ఉంటాయ్ • మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: పలు ప్రధాన కంపెనీలు ఈ వారంలోనే తమ తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఫలితాలకు తోడు ఈ వారంలోనే అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు అంశం కూడా స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్మెంట్ సరళి, డాలర్‌తో రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్ గమనంపై తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. ఈ వారంలో పలు దిగ్గజ కంపెనీలు తమ తమ సెప్టెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయని, ఈ ప్రకటనల ఆధారంగా స్టాక్ మార్కెట్ పయనిస్తుందని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు క్యూ2 ఫలితాలను ఈ వారంలోనే వెల్లడించనున్నాయి.అక్టోబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ నెల 27న(గురువారం) ముగియనుండడం వల్ల స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులు అంటున్నారు. నేడు (సోమవారం) యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులర్, అదానీ పవర్, రిలయన్స్ క్యాపిటల్, భారతీ ఇన్ఫ్రాటెల్ కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక మంగళవారం(ఈ నెల25న) భారతీ ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు, బుధవారం(ఈ నెల26న) హెచ్డీఎఫ్సీ, హీరో మోటొకార్ప్, హిందుస్తాన్ యునిలివర్, ఐటీసీలు, గురువారం(ఈ నెల27న) మారుతీ సుజుకీ, ఐఓసీ, టెక్ మహీంద్రాలు, శుక్రవారం (ఈ నెల 28న) బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, వేదాంత, నెస్లే ఇండియా కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలు వెల్లడిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు రూ. 7,500 కోట్లు ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. చైనా గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోవలసి ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ వ్యాఖ్యానించడం దీనికి కారణాలని పుణులంటున్నారు.కాగా గత నెలలో భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.29,232 కోట్లుగా ఉన్నాయి.