details enter
-
‘ఈ– పంట’ సాగేదెలా?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచి్చన మంచి కార్యక్రమాలన్నింటినీ చీల్చి ఛిద్రం చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలి్పంచే ‘ఈ–క్రాప్’ కార్యక్రమాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఐదేళ్లూ నిరాఘాటంగా సాగి, అన్నదాతలకు అండగా నిలిచింది.రెండు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దీని పేరును ‘ఈ–పంట’ అని మార్చి, దాని నమోదులోనూ మార్పులు తెచ్చింది. ఇప్పుడు ఈ మార్పులే రైతులపాలిట శాపంగా మారాయి. కొత్త ప్రభుత్వం ఫొన్ యాప్ ద్వారా పంటల వివరాల నమోదుకు అంగీకరించడంలేదు. అప్డేట్ చేసిన ఈ–పంట వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు రైతు సేవా కేంద్రం (ఆర్బీకే)లోని సిస్టమ్ ద్వారా మాత్రమే పంట వివరాలు నమోదు చేయాలన్న నిబంధన మరిన్ని సమస్యలు సృష్టిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ కాక ఇబ్బందులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి జాతీయ స్థాయిలో కేంద్రం శ్రీకారం చుట్టిన డిజిటల్ క్రాప్ సర్వేకు అనుసంధానం చేసి ఈ పంట నమోదు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31న మార్గదర్శకాలు జారీ చేసి, ఈ నెల 5 నుంచి పంటల నమోదు చేపట్టింది. ఈ పంట వెబ్సైట్ పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. యాప్‌లో కొత్త ఫీచర్స్పై క్షేత్ర స్థాయి సిబ్బందికి శిక్షణా ఇవ్వలేదు. గతంలో ఫోన్లోనే ఈ–క్రాప్ యాప్ ద్వారా పంట వివరాలు నమోదు చేసేవారు. ఆ తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలనలో ఫోటోలు అప్లోడ్ చేసేవారు. దీని వల్ల సమయం ఆదా అయ్యేది.ప్రస్తుతం ఈ పంట వివరాలు ఫోన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదు. కార్యాలయం కంప్యూటర్లోని వెబ్సైట్ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను కంప్యూటర్ నుంచి ఫోన్లోని యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలి. రైతు సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సరఫరా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు కంప్యూటర్లో ఈ పంట వెబ్సైట్ ఓపెన్ అవడమే చాలా కష్టం. అది ఓపెన్ అయిన తర్వాత పంట వివరాలు నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఒక్కో రైతు పంట వివరాల నమోదుకు చాలా సమయం పడుతోంది. పైగా పంట వివరాల నమోదుకే రోజంతా కార్యాలయంలోనే ఉండాల్సి వస్తోందని, క్షేత్ర స్థాయి పరిశీలన ఎప్పుడు పూర్తి చేస్తామని సిబ్బంది వాపోతున్నారు. కంప్యూటర్లో నుంచి మళ్లీ ఎలాగూ ఫోన్లోకి తీసుకోవాలని, అప్పుడు నేరుగా ఫోన్లోనే వివరాలు నమోదు చేసుకోవచ్చు కదా అన్న సూచనలూ వస్తున్నాయి. మరోపక్క కౌలుదారుల పంట వివరాల నమోదులోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సీసీఆర్సీ లేదా భూ యజమాని అంగీకారంతోనే నమోదుకు అవకాశం ఉంది. కానీ ఉన్నతాధికారులు వాస్తవ సాగు దారుల వివరాలు నమోదు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. అలా చేస్తే భూ యజమానుల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కౌలుదారులు వాపోతున్నారు. మరొక వైపు సిబ్బందికి ఇచి్చన ట్యాబ్‌లు కూడా సరిగా పనిచేయడంలేదు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గడువులోగా పూర్తయ్యేనా? రైతుల నుంచి పంట వివరాలు సేకరించాక పొలం వద్దకు వెళ్లి జియోఫెన్సింగ్‌తో సహా పంట ఫోటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయాలి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జియో కోఆర్డినేట్స్‌తో సహా ఎల్పీ నంబరు వివరాలు నమోదు చేయాలి. ఆర్బీకే సిబ్బంది, వీఆర్వోల ధ్రువీకరణ పూర్తి కాగానే రైతుల ఈ కేవైసీ నమోదు చేసి రైతులకు డిజిటల్, ఫిజికల్ రసీదులు ఇవ్వాలి. గతేడాది మాదిరిగానే సెపె్టంబర్ 15వ తేదీలోగా ఈ పంట నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 19 నుంచి 24వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద ఆర్ఎస్కేలలో ప్రదర్శిస్తారు.రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను 25 నుంచి 28వ తేదీ వరకు పరిష్కరిస్తారు. తుది జాబితాలను 30వ తేదీన ఆర్ఎస్కేలలో ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే, ఈ పంట నమోదులో ఉన్న గందరగోళ పరిస్థితుల మధ్య గడువులోగా పంటల నమోదు పూర్తవుతుందా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో ఈ–పంట నమోదు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ నుంచి ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కుపత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద పంట వివరాలు నమోదు చేసేవారు. ఏటా ఖరీఫ్‌లో జూలై మొదటి వారంలో మొదలు పెట్టి సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసేవారు.సోషల్ ఆడిట్ అనంతరం అక్టోబర్ రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుట్టి జనవరి నెలాఖరులోగా పూర్తి చేసేవారు. ఫిబ్రవరి రెండో వారంలోగా తుది జాబితాలు ప్రదర్శించేవారు. కానీ ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా, 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం పంటలు కూడా నమోదు కాని దుస్థితి. ఆలస్యమైతే జరిగే నష్టమిది..ఈ క్రాప్ నమోదు ఆలస్యమైతే రైతులకు అన్ని విధాలుగా నష్టం జరుగుతుంది. ప్రధానంగా పంట కొనుగోలులో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పంట కోనుగోలు పూర్తిగా ఈ–పంట నమోదు ఆధారంగానే జరుగుతుంది. దీంతో రైతులు దళారుల ద్వారా పంటలను అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఉచిత పంటల బీమాకు అర్హత కోల్పోతారు. తుపానులు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న పంట రైతులు ఈ–క్రాప్‌లో నమోదు కాకపోతే ఇన్పుట్ సబ్సిడీ పొందే అర్హత కోల్పోతారు. సున్నా వడ్డీ రాయితీకి అర్హత కోల్పోతారు. ఈ –క్రాప్‌తో ఐదేళ్లలో రైతులకు జరిగిన మేలు.. గడిచిన ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలు నమోదు కాగా, ఈ–క్రాప్ ప్రామాణికంగా వివిధ రకాల సంక్షేమ ఫలాలు అందించారు. 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు, 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు, 176.36 లక్షల టన్నుల ఎరువులు అందాయి. 5.13 కోట్ల మంది రైతులకు రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు లభించాయి. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందింది. 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం, 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ, 84.67 లక్షల మందికి రూ.2051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలు అందాయి. రైతులు పండించిన పంటల విక్రయం సాఫీగా సాగి, ప్రతి పంటకీ మద్దతు ధర లభించింది. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, కోరుట్ల (జగిత్యాల): పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అంగన్వాడీ సెంటర్లలో గ్రామాల్లోని చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు, కిషోర బాలికలకు అందించే పౌష్టికాహార వివరాలతో పాటు బాలింతలు, గర్భిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వివిధ రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పలు సందర్భాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేయడానికే కార్యకర్తలకు ఎక్కువ సమయం సరిపోతుంది. దీంతో కార్యకర్తల సమయం వృథా కాకుండా ఉండేందుకు వారు చేపట్టే ప్రతి పనిని త్వరగా పూర్తి చేసేందుకు ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడానికి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల వివరాలు స్మార్ట్‌ఫోన్‌లో ఆన్లైన్లో నమోదు చేసేందుకు, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను ఐటి అధికారులు కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. మండలంలోని వివరాలు మండలంలో అయిలాపూర్, మోహన్‌రావుపేట రెండు సెక్టార్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామపంచాయతీల్లో 41 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 36 మంది ఆయాలు పనిచేస్తున్నారు. ఇందులో 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు 1213 మంది పిల్లలు అర్హులు కాగా 1147 మంది పిల్లలు నమోదు చేసుకోగా 1130 మంది పిల్లలు హాజరవుతున్నారు. 3ఏళ్ల నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 644 మందికి 564 మంది హాజరవుతున్నారు. గర్భిణులు 327కు 286, బాలింతలు 324కు 282 మంది హాజరవుతున్నారు. వీరికి సంబందించిన సమాచారం రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. దీంతో వారికి సమయం వృథా కావడంతో వేరే పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసినట్లయితే ప్రతి రోజు లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి ఆన్లైన్లోనే వారి వివరాలు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రికార్డులు తిరగేసే పనిలేకుండా ఒక్క క్లిక్‌తో పని సులభంగా అయిపోవడం, సమయంతో పాటు ఇతర పనులు చేసుకోవచ్చు. ఇంటర్నెట్తో సమస్యలు అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం తగ్గించి వివరాల నమోదు ప్రక్రియ వేగవంతం అయ్యేందుకు ప్రభుత్వం అందించే స్మార్ట్ఫోన్లకు గ్రామాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి పనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసేందుకు నెట్ వినియోగం అత్యవసరం. కాగా గ్రామాల్లో వివిధ సెల్ఫోన్ల కంపనీల ఇంటర్నెట్ సేవలు ఒక్కోరకంగా ఉంటాయి. సిగ్నల్ లేనిచోట మాత్రం స్మార్ట్ఫోన్ల వినియోగం సమస్యగా మారే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పనులు సులభతరం కానున్నాయి. స్మార్ట్ఫోన్లతో సమయం ఆదా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలు రికార్డుల్లో రాసే బదులు స్మార్ట్ఫోన్ల వినియోగంతో సమయం ఆదా అవడమే కాకా పని ఒత్తిడి తగ్గి పనులు వేగవంతం అవుతాయి. ఆన్లైన్ సేవలు కొనసాగడం వల్ల ప్రతి అంగన్వాడీ సెంటర్ పనితీరు పరిశీలించే వీలుంది. – సమీమ్ సుల్తానా, సూపర్వైజర్ సద్వినియోగం చేసుకుంటాం చిన్నారులు, బాలింతలు, గర్భిణుల వివరాలను 14 రికార్డుల్లో నమోదు చేయాలంటే ఇబ్బందులు పడేవాళ్లం. ప్రభుత్వం అందించే స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకుంటాం. దీంతో పనులు వేగవంతం కావడమే కాకా సమయం ఆదా అవుతుంది. – ఎన్. భాగ్యలక్ష్మీ, అంగన్వాడీ టీచర్ పనిభారం తగ్గుతుంది ప్రభుత్వం సూచించిన పనులు చేయడానికి కార్యకర్తలకు సమయం దొరకడం లేదు. దీంతో చిన్నారులకు విద్యాబోధన, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడంతో అంగన్వాడీ కార్యకర్తలకు పనిభారం పెరిగింది. ఆన్లైన్ నమోదుతో పనులు వేగవంతం అవుతాయి. – జి. సుజాత,అంగన్వాడీ టీచర్ -
ఇక పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు
సాక్షి, పెదవాల్తేరు(విశాఖతూర్పు) : పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గత నెల 15వ తేదీన సీతమ్మధార దరి పీఅండ్‌టీ కాలనీలో గల పోస్టాఫీసులో ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. దఫదఫాలుగా విశాఖ డివిజన్ పరిధిలోని 36 పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు. ఇక ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా, వయసు తదితర వివరాల్లో సవరణలకు మాత్రం రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌కార్డు సాధారణ పోస్టు ద్వారా 15 రోజులలో ఇంటికొస్తుందని విశాఖ డివిజన్ తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ హరిప్రసాద్‌శర్మ మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఆధార్ నమోదు ఇలా... ఇప్పటివరకు ఎక్కడా ఆధార్ కార్డు లేనివారు తమకు సమీపంలో గల పోస్టాఫీసులో చిరునామా ధృవీకరణపత్రంతో వెళ్లాల్సి ఉంటుంది. గ్యాస్‌బుక్, బ్యాంక్ పాస్‌బుక్, పాసుపోర్టు, డ్రైవింగ్లైసెన్సు, ఓటర్‌గుర్తింపు కార్డు, విద్యుత్‌బిల్లు, వంటి ఏదో ఒక ధృవీకరణపత్రం సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు అక్కడే బయోమెట్రిక్ విధానంలో ఫొటో తీసి, ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. ఇక సవరణల కోసం అవసరమైన ధృవీకరణపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నమోదు చేసే పోస్టాఫీసులివే... వెలంపేట, రైల్వేస్టేషన్ వద్ద గల ప్రధాన పోస్టాఫీసులు, అక్కయ్యపాలెం (శ్రీనగర్), ఆంధ్రా యూనివర్సిటీ, డాబాగార్డెన్స్, ద్వారకానగర్ (డైమండ్‌పార్కు), డెయిరీఫారం, హెచ్‌బీకాలనీ, మధురవాడ, మహారాణిపేట (కలెక్టరేట్), ఎంవీపీకాలనీ, సాలిగ్రామపురం, ద్వారకాబస్‌స్టేషన్, పోర్టు, బీహెచ్‌పీవీ, భీమునిపట్నం, చిట్టివలస, గాజువాక, గాంధీగ్రాం, గోపాలపట్నం, ఇండస్ట్రియల్ఎస్టేట్, కంచరపాలెం, మల్కాపురం, మర్రిపాలెం, ఎన్ఏడికొత్తరోడ్డు, పెదగంట్యాడ, సింహాచలం, ఉక్కునగరం, విశాఖ నేవల్‌బేస్, విశాఖస్టీల్‌ప్లాంట్, విశాలాక్షినగర్ ప్రాంతాలలోని పోస్టాఫీసుల్లో ఆధార్ నమోదు కేంద్రాలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. -
పుట్టు పూర్వోత్తరాలు చెప్పాల్సిందే..
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? అయితే మీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ చెప్పాల్సిం దే.. ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉందా..? ఉంటే ఏ కంపెనీ..? బ్యాంకు ఖాతా ఉందా..? అయితే ఏ బ్రాంచ్..? మీకు వాహనం ఉందా..? ఉంటే బై కా? కారా.? అలాగే భూములున్నాయా..? ఎన్ని ఎకరాలు..? ఇలా ఒకటేంటి చివరి ఇంటికి వచ్చే కరెంట్ బిల్లుతో సహా 24 రకాల వివరాలను ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేదంటే రేషన్ కార్డు రాదు. ఇప్పటినుంచి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సంబంధిత ఫార్మెట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే కొ త్త రేషన్ కార్డుల్లో బోగస్ లేకుండా అర్హులైన పేదలకే అందించడానికి సివిల్ సప్లయ్ శాఖ అధికారులు నిబంధనలతో కూడిన మూడు పేజీలు ఉ న్న దరఖాస్తు ఫారాన్ని రూపొందించారు. ఈ కొ త్త ఫార్మాట్‌ను రాష్ట్ర అధికారులు జిల్లా సివిల్ స ప్లయ్ అధికారులకు పంపించారు. ఇకపై కొత్త గా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఇదే ఫారం ద్వారానే దరఖాస్తులు చేసు కోవాల్సి ఉంటుందని, అయితే దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్ కార్యాలయం లో అందజేయాలని అధికారులు వెల్లడించారు. తెల్ల కాగితానికి స్వస్తి.. రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలనుకునే వారు ఇది వరకు మీసేవా కేంద్రాల్లోనో లే దా తహసీల్దార్ కార్యాలయాల్లోనో తెల్ల కాగి తంపై దరఖాస్తు చేసుకుని ఆధార్ జిరాక్స్ పెడి తే పరిపోయేది. కానీ తాజా మార్గదర్శకాల ప్ర కారం ఇకపై తెల్ల కాగితాలపై దరఖాస్తులు చేసుకునే విధానానికి స్వస్తి పలికారు. కొత్తగా రూ పొందించిన మూడు పేజీలు గల దరఖాస్తు ఫా రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లో పొందాల్సి ఉంటుంది. ఇందులో పేరు, ఇంటి పేరు, తండ్రి లేదా తల్లి పేరు, పుట్టిన తేదీ, వయసు, వీధి, కాలనీ, కుటుంబ వార్షిక ఆదాయం, గ్యాస్ కనెక్షన్, వాహనాల వివరాలు, భూ ములు, అద్దె, సొంత ఇంటి వివరాలతో పాటు అందులో ఉన్న మరిన్ని అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దరఖాస్తుచ చేసుకునే వా రికి ఇంటి పక్కన గల ఎవరైనా సాక్షి సంతకం కూడా పెట్టించాలి. అన్ని వివరాలతో తహసీల్దా ర్ కార్యాలయంలో అందజేస్తే వారు విచారణ జరిపి జిల్లా సివిల్ సప్లయ్ కార్యాలయానికి పం పిస్తారు. జిల్లా కార్యాలయం అధికారులు సివిల్ సప్లయ్ కమిషనర్ కార్యాలయం హైదరాబాద్ కు రేషన్ కార్డు మంజూరుకై పంపిస్తారు. ఈ ప్రా సెస్ అంతా పూర్తయి కార్డు మంజూరు కావాలం టే సుమారు పక్షం రోజుల నుంచి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పెండింగ్ దరఖాస్తులుదారులు కూడా.. కొత్త రేషన్ కార్డు కోసం జిల్లాలో గత కొన్ని నెలలుగా దరఖాస్తులు చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇలా దాదాపు 6వేల దరఖాస్తులు మంజూరు కాక పెండింగ్‌లోనే ఉన్నాయి. వీరంతా మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. కానీ కొత్త దరఖాస్తు విధానం వచ్చిన నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తు దారులు కూ డా కొత్త ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కాని సాధారణ ప్రజలకు ఈ పద్ధతి ఎంతవరకు అర్థమవుతుందో చూడాలి. కొత్త విధానంలో దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర శాఖ అధికారులు రూపొందించిన దరఖా స్తు ఫారం ద్వారానే కొత్త రేషన్ కార్డుల కోసం ద రఖాస్తులు చేసుకోవాలి. తెల్ల కాగితాలపై రాసి ఇస్తే చెల్లదు. అందులో అడిగిన వివరాలతో త హశీల్ధా కార్యాలయాల్లో అందజేయాలి. కొత్త ద రఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయాల కు పంపిస్తున్నాం. – కృష్ణప్రసాద్, డీఎస్వో -
అన్నీ ఉంటేనే అనుమతి
–పాఠశాలకు యూడైస్ కోడ్ తప్పనిసరి – చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి –ఆధార్ కూడా ఉండాలి –ఇవి లేకపోతే పది పరీక్షలకు నో ఎంట్రీ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేశారా? మీ పాఠశాలకు యూడైస్ కోడ్ ఉందా? విద్యార్థికి సంబంధించి ఆధార్‌కార్డు వచ్చిందా? స్కూల్లో అనుమతి ఉన్న సెక్షన్లకు మించి విద్యార్థులు ఉన్నారా?.. ఈ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం తప్పదు. దేశ వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలకు యూనిక్ నంబర్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో యూనిఫైడ్ yì స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో పాఠశాల పేరు ఉంటేనే అది ప్రభుత్వ లెక్కలో ఉన్నట్టు. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు ఉండి.. యూడైస్ కోడ్ లేకపోయినా ఆ పాఠశాలను పరిగణనలోకి తీసుకోరు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఒక నంబరు కేటాయిస్తారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక స్కూల్‌కు ఇవ్వరు. వాస్తవానికి 2008లోనే యూడైస్ కోడ్ అమలులోకి వచ్చింది. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకుల్లో చాలామందికి అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా యూడైస్ కోడ్‌కు దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో నిర్వాహకులు హడావుడిగా యూడైస్ కోడ్ తీసుకుంటున్నారు. చైల్డ్ఇన్ఫోలో వివరాల నమోదు విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలను ఆన్లైన్ చేయడంలో భాగంగా ‘చైల్డ్ఇన్ఫో’ నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. యూడైస్ జాబితాలో ఉన్న 1–10 తరగతుల విద్యార్థులకు సంబంధించి పూర్తి వివరాలు చైల్డ్ఇన్ఫోలో నమోదు చేయాలి. విద్యార్థిపేరు, తరగతి, ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్‌నంబరు ..ఇలా 24 అంశాలను పొందుపర్చాలి. ఒక విద్యార్థ వివరాలు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంది. అయితే.. జిల్లాలో ఇంకా 26 వేల మంది వివరాలను నమోదు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 5,54,543 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా 5,28,543 మంది వివరాలను నమోదు చేశారు. తక్కిన విద్యార్థుల్లో ఎక్కువమంది ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. యూడైస్, చైల్డ్ఇన్ఫో వివరాలుంటేనే ఎన్ఆర్లు తీసుకుంటాం – గోవిందునాయక్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు కచ్చితంగా చైల్డ్ఇన్ఫోలో నమోదు చేసి ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కల్గివుండాలి. చదువుతున్న స్కూల్‌కు యూడైస్ కోడ్ తప్పనిసరి. ఇవి లేకపోతే ఆయా విద్యార్థుల నామినల్ రోల్స్ తీసుకోము. అలాగే ఎన్ని సెక్షన్లకు అనుమతి తీసుకున్నారో అంతేమంది విద్యార్థులుండాలి. ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్‌కు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఆ విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోం. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచి ‘వితౌట్ స్కూల్ స్టడీ’ ఉండదు. అలాంటి వారికి ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్ష ఫీజు కట్టించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తీవ్ర నష్టం – దశరథరామయ్య (ఎస్ఎస్ఏ పీఓ), అంజయ్య (డీఈఓ) విద్యార్థుల వివరాలు చైల్డ్ఇన్ఫోలో నమోదు చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలూ అందవు. నమోదు కాని విద్యార్థులు నష్టపోతారు. ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చొరవ చూపి ఛిజ్చిజీlఛీజీnజౌ.్చp.nజీఛి.జీn వెబ్సైట్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి.