deths
-
పెళ్లి పనుల కోసం అరటి గెల కోస్తుండగా..
-
ధర్మభిక్షానికి ఘననివాళి
చౌటుప్పల్ : దివంగత ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానికంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముప్పిడి సైదులుగౌడ్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఊడుగు మల్లేశం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఊడుగు శ్రీనివాస్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎరుకల మల్లేశ్, కొయ్యడ సైదులు, వీరమళ్ల సత్తయ్య, సందగళ్ల నాగరాజు, ఊడుగు రమే ష్, బొడిగె బాలకృష్ణ, వెంకటేశ్, పల్చం కిరణ్, తొర్పునూరి పరమేష్, రమేష్, వర్కాల రవి, శెవగోని మహేష్, తొ ర్పునూరి నర్సింహ, బాబు, సైదులు, శ్రీరాములు, ప్ర భాకర్ పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని తంగడపల్లిలో మాజీ ఎంపీ ధర్మభిక్షం వర్ధంతిని గౌడ సం ఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో కొండూరు వెంకన్న, బాలగోని వెంకటేశ్, బడే టి సత్యనారాయణ, చీకూరి ప్రభాకర్, ఈదయ్య, బొడ్డు ముత్యం, కొయ్యడ శేఖర్, బాలరాజు, లింగస్వామి, న ర్సింహ, నిమ్మల యాదగిరి, స్వామి, రాము ఉన్నారు. మోత్కూరు : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఎం పీ బొమ్మగాని ధర్మభిక్షం వర్ధంతి సందర్భంగా సో మవారం స్థానికంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి, సీ పీఐ ఆధ్వర్యంలో ఆయన పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన స మితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు పైళ్ల యాదిరెడ్డి, మండల కార్య దర్శి అన్నెపు వెంకట్, నాయకులు మల్లేష్, అరుణ, శ్రీ ను, జంగ నర్సయ్య, అంజయ్య, బుషిపాక నర్సింహ, సత్తయ్య, అంతయ్య, తిరుపయ్య, రాములు, బీసీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు సాయి కిరణ్, యా కు, సోమలింగం, మహేష్, దేవస్వామి ఉన్నారు. -
ప్రాణాలు తీస్తున్న వరదలు
ములుగు : మండలంలోని ములుగు–అన్నంపల్లి మధ్యలో ఉన్న దస్రుమాటు, సర్వాపురం–జగ్గన్నగూడెం నడుమ ఉన్న బొగ్గుల వాగులు ప్రాణాలను హరించే విధంగా మారాయి. 2006లో కురిసిన వర్షాలతో దస్రుమాటు ఉధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో గోవిందరావుపేట మండలంలోని దుంపెల్లిగూడెంకు చెందిన పోరిక ప్రతాప్– స్వప్న దంపతులు వాగు దాటుతూ ప్రమాదవశాత్తు అందులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం చాలా మంది వాగులో కొట్టుకుపోయినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా, వాగు ప్రవహించిన ప్రతిసారి అన్నంపల్లి, దేవగిరిపట్నం, కాశీందేవిపేట, పత్తిపల్లి, పొట్లాపురం, చింతలపల్లి, రామయ్యపల్లి, కొడిశలకుంట, చింతకుంట గ్రామాలకు చెందిన ప్రజల రాకపోకలు నిలిచిపోతాయి. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు నిత్యం విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గత వేసవిలో దస్రూమాటుపై హైలెవల్ కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. లెక్కలు తప్ప.. నిర్మాణం లేదు.. సర్వాపురంలోని బొగ్గుల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామని ఐటీడీఏ అధికారులు మూడేళ్లుగా చెబుతున్నారే తప్ప.. ఇప్పటి వరకు పనులు ప్రారంభించడంలేదు. గత ఏడాది పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కాజ్‌వేపై ఇరువైపులా పిల్లర్లు నిర్మించేందుకు ప్రయత్నించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. పనులకు మోక్షం కలుగలేదు. బొగ్గుల వాగు ఉధృతంగా ప్రవహించిన సమయం లో జగ్గన్నగూడెం, అంకన్నగూడెం గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి. 2012లో జగ్గన్న గూడెంకు చెందిన వల్లపు లక్ష్మి, మంగ పేట మండలానికి చెందిన పుష్పవతి వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. కాగా, వీరిద్దరు అక్కచెల్లెల్లు కావడం గమనార్హం. -
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
రెండేళ్ల క్రితం మధ్యప్రాచ్యం, దక్షిణ ఆసియాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ వజృంభిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్- మెర్స్)గా పిలిచే కరోనా వైరస్ బారిన పడి దక్షిణ కొరియాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 58 ఏళ్ల మహిళను ఆసుపత్రిలో చేర్చగా సోమవారం ఆమె మరణించింది. వైద్యపరీక్షల అనంతరం కరోనా వైరస్ వల్లే ఆమె చినిపోయిందని, మంగళవారం మృతిచెందిన 71 ఏళ్ల వృద్ధుడు కూడా ఆ మహమ్మారి వల్లే చనిపోయాడని దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 25 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించామని, ప్రస్తుతం రోగులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. 2012లో సౌదీ అరేబియాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ బారినపడి మధ్యప్రాచ్య దేశాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకారి కరోనా... కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన వారికీ, మహిళలకూ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమేనని వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి.. స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది వైరస్ సోకిన రెండ్రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, దగ్గు తీవ్రత పెరుగి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవుతాయి. విపరీతమైన ఆయాసంతో గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత న్యుమోనియాకు దారితీసే అవకాశమూ ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాలకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.