Devarakonda Balagangadhara Tilak
-
అచ్చమైన భావకవుల్లో చిట్టచివరివాడు
తిలక్ పద్యం గురించి ఎక్కువగా మాట్లాడు కోలేదు సాహిత్య లోకం. కుందుర్తి, సినారె వంటి అప్పటి కొంతమంది కవుల లాగా కాక వచన కవితకు సమాంతరంగా చివరి వరకూ పద్యకవిత కూడా రాస్తూనే ఉన్నాడు. 1966 అంటే తిలక్ చనిపోయిన సంవత్సరం మార్చి నెల భారతిలోకూడా ‘అమృత భావము’(!) అని ఒక పద్యకవితా ఖండిక వచ్చింది. ఆయన పద్యకవిత్వం ‘ప్రభాతము సంధ్య,’ ‘గోరువంకలు’ అని రెండు సంపుటాలుగా అచ్చయింది. ఇవికాక ‘మండోదరి’ అని మూడువందల పద్యాల రచన ఒకటి చేశాడనీ, దాన్ని పోగొట్టుకున్నాడనీ, అందులో 3 పద్యాలు మాత్రం మిగిలాయనీ ఆయన యువమిత్రులు చెబుతున్నారు. తిలక్‌కి సాహిత్యోహ వచ్చేనాటికి అంటే సుమారుగా 1933 ప్రాంతాలలో తెలుగునాట బలంగా ఉన్న కవిత్వం భావకవిత్వం. ‘ప్రభాతము సంధ్య’ భావకవిత్వం కన్నబిడ్డ. ‘‘ఇప్పుడు దాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ప్రతిపంక్తిలోనూ కృష్ణశాస్త్రి ప్రభావం కనిపిస్తుంది’’ అని మిత్రులతో అన్నాడట తిలక్ ఆ పుస్తకాన్ని ఉద్దేశించి. కానీ ఒక పదహారు పదిహేడేళ్ళ కుర్రాడు భావకవిత్వంలో ఆ స్థాయిని అందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇందులో పద్యఖండికలు 24. వీటిలో వస్తువు ఏమిటి అంటే ఆర్తి, దుఃఖం, దిగులు, పట్టరాని ఆనందం, ప్రేమ, ఆరాధన... యువ తిలక్ చేసిన కొన్ని ఊహలు, ఆలోచనలు ఆశ్చర్యాన్ని కలగ జేస్తాయి. గృహలక్ష్మి అనే ఖండికలో ఒక పద్యం చూడండి. బాలింతరాలు అయిన భార్యతో అంటు న్నాడు యువభర్త. పసుపు మోమున నగవు నివాళులెత్త కక్షమందున పసికందు కలకలమ్ము మహిత మాతృరాగోజ్వల మండితోరు ఫాలసీమ నీవు తొలిచూలుకే జగజ్జనని వైతి వమ్మ బిడ్డతో ఉన్న భార్యను చూసి, ‘నువ్వు తొలి చూలుకే జగజ్జనని వయ్యావు’ అనడం విశాలోదా త్తమైన ఊహ. భార్యని, ఒకానొక బాలింతను మించి చూస్తున్నాడు కవి. ‘ఆహుతి’ ఖండికలో ‘‘స్వామి! అవ్యయ బాష్ప స్రవంతి బతుకు నుప్పగిలచేసె’’ అంటాడు. జీవితం కన్నీళ్ళ వల్ల ఉప్పగా ఉందట. ‘ప్రభాతము సంధ్య’ సంపుటిలో ఉన్నవన్నీ పద్యాలు మాత్రమే కాదు. గేయాలూ, ‘అపద్యాలూ’ కూడా ఉన్నాయి. పై రెండూ అపద్యాలే. భావం పూర్తికాగానే పద్యాన్ని పాదం మధ్యలోనే ఆపేసిన సందర్భాలూ, యతి ప్రాసలు విడిచి పెట్టి రాసిన పద్యాలూ కూడా ఉన్నాయి కానీ అపద్యాలు అని అంటున్నవి వాటిని కాదు. ఇవి పద్యాలలాగా కని పించే పద్యేతర రచనలు. వీటిలో యతి, ప్రాస, గణం ఏమీ లేవు. కానీ రచనా మర్యాద మాత్రం పూర్తిగా పద్యరచనా మర్యాదే. కవి అపరిణతి కారణం అనడానికి వీలులేదు. చక్కగా రాసిన పద్యాలు అనేకం ఉన్నాయి కనక. 1940 తర్వాత రాసిన పద్యాలు తిలక్ మరణానంతరం ‘గోరువంకలు’ అనే సంపుటిగా వచ్చాయి. ఇందులో వృత్త పద్యాలెక్కువ. తిలక్ పద్యం ప్రాచీన పద్యం కాదు. ప్రాచీన పద్యంలాగా భావకవిత్వ పద్యం ప్రతిపదార్థ తాత్ప ర్యాలకు లొంగదన్న విషయం తెలిసిందే. ప్రాచీన పద్యం కవి వ్యక్త చేతనలో పుడుతుంది. బహిఃప్రపంచాన్ని ఆవి ష్కరిస్తుంది. ఎన్ని కల్పనలు, ఊహలు చేసినా ప్రాచీ నకవి ఒక సరళతర్కం పరిధిలో చేస్తాడు. భావ కవిత్వంలో అలాకాదు. దృశ్యానికి శబ్దంతో పోలిక, శబ్దానికి పరిమళంతో, పరిమళానికి స్పర్శతో పోలిక ఇలా. అందుకు కారణం భావకవిత్వంలో అవ్యక్త చేతన జోక్యం హెచ్చు. జాలి, వేదన, స్వప్నం వంటి కొన్ని మాటలు తిలక్‌కి ఇష్టం. మాటలు ఎప్పుడూ మాటలు కావు. కాన్సెప్ట్స్. ‘‘ఒక్క జాలిమాట ఒక్క నిడుద యూర్పు, విడువడేల నరుడు వింత లోభి, కరకు గుండెకన్న ఇరుకు గుండె అవని, దుఃఖ కారణమ్ము దుర్భరమ్ము ’’అన్నాడు. ఆరుద్ర అన్నట్టు తిలక్ ఉత్త దయామయుడు. తిలక్ పద్యం అతని వచన కవితా శైలిని ప్రభా వితం చేసింది. తిలక్ వచనకవిత్వం నోటికి రావడానికి ముఖ్యమైన కారణా లలో ఇదొకటి. ‘ఏకాంత కుంతని హతమ్ము రసైక మద్భావనా శకుంతమ్ము.’ ‘హేమంత సమీర పోతమేమింతగా క్రొవ్వి నన్న లయించును.’ ఇటువంటి పంక్తులు వచన కవి రాయడు. అయితే తిలక్ పద్యం మీద వచన కవిత ప్రభావం కన బడదు. దశాబ్దాల తర్వాత కూడా కవుల్ని ప్రభావితం చెయ్యగలి గిన వచనకవిత్వం రాసిన తిలక్, తన పద్య కవిత్వం మీద దాని ముద్ర పడకుండా రాయడం విచిత్రం. వస్తు సంవిధానంలో తిలక్ వచన కవితలు కొన్ని ఆ ప్రక్రియకు ఒక కొత్త మెలకువను మప్పాయి. ప్రకటన, సీఐడీ రిపోర్టు, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నిన్న రాత్రి, సైనికుడి ఉత్తరం... ఇలాంటి కవితలు స్థల, కాల, పాత్ర సంఘటనల్ని కూడా నింపుకుని కథాచ్ఛాయతో విశిష్టంగా నడు స్తాయి. ఆలోచనలుగా, సందేశాలుగా, ఊహలుగా నడుస్తున్న వచన కవిత్వానికి కథాస్పర్శ ఇవ్వగలిగిన తిలక్ పద్యాన్ని అబ్స్ట్రాక్ట్గా వదిలివెయ్యడం విచిత్రం. వచన కవిత్వంలో యుద్ధం ‘ఒక అనాగరకత’ అన్న తిలక్, ‘ఏ దేశ సంస్కృతి అయినా కాదొక స్థిర బిందువు నైక నదీ నదాలు కలిసిన అంతస్సింధువు’ అన్న తిలక్, పావెల్ శవాన్ని చూపి ‘ప్రతి ఒక్కడూ దీనికి బాధ్యుడు’ అన్న తిలక్, ‘దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుంచి, పతివ్రతల నుంచి’ అన్న తిలక్... ఇలాంటి సారవంతాలయిన కొత్త ఆలోచ నల్ని పద్యంలో చూపించలేదు. పద్యానికి కొత్త రక్తాన్ని ఎక్కించగల సమర్థత ఉండికూడా ఆ పని చెయ్యలేదనిపిస్తుంది. వచన కవిత్వాన్ని ప్రపం చంతో పంచుకుని పద్యకవిత్వాన్ని తనకోసం ఒక ప్రత్యేక ప్రపంచంగా మలుచుకున్నట్టు కనిపిస్తుంది. ‘తనలో తానొక ఏకాంతం రచించుకున్న స్వాప్ని కుడు’ అన్న రాచమల్లు రామచంద్రారెడ్డి వాక్యం తిలక్ పద్యకవిత్వానికి నిస్సందిగ్ధంగా వర్తిస్తుంది. తిలక్ వచన కవిత్వం రాయకుండా పద్యకవిత్వం మాత్రమే రాసి ఉంటే తిలక్ పద్యం గురించి ఇంత కంటే ఎక్కువగా మాట్లాడుకుని ఉండేది సాహిత్య లోకం. బహుశా అచ్చమైన భావకవుల్లో చిట్టచివరి వాడుగా లెక్కవేసి ఉండేది చరిత్ర. -రెంటాల శ్రీవెంకటేశ్వరరావు వ్యాసకర్త సాహిత్య విమర్శకుడు మొబైల్: 77991 11456 (సాహిత్య అకాడెమీ; తిలక్ వేదిక, తణుకు సంయుక్త నిర్వహణలో బాలగంగాధర తిలక్ శతజయంతి సభ నేడు తణుకు ఐఎంఏ హాల్లో) -
నాగరిక కాటు
ఏలూరులో చూసుకోవాల్సిన పని అయిపోయింది. ప్లీడరు గారు పక్కలు ఏర్పాటు చేయిస్తానన్నా వినక కారు స్టార్టు చేశాడు రామచంద్రం. రాత్రి పది దాటింది. సరిగ్గా తొక్కితే గంటన్నరలో తణుకులో ఉండొచ్చు. కలెక్టరు గారింట్లో పెళ్లి సరీగా ఉదయం ఏడు గంటలకి. నాగభూషణం మీదా, రామచంద్రం మీదా భరోసా వేసుకుని కూర్చున్నారు కలెక్టరు గారు. కలెక్టరు గారింట్లో శుభకార్యమంటే వేరే చెప్పాలా! రామచంద్రం పెద్ద టెన్నీస్ చాంపియన్. కాలవ ఒడ్డున పెద్ద మేడవుంది. నాగభూషణం కలప వ్యాపారం నడుపుతున్నాడు. కట్టడం ఎప్పుడూ ఖద్దరే. భూషణం అల్లుడు అవధాని కూడా వాళ్లెంబడి వున్నాడు. ఇంకా కుర్రాడు. ఆరుమైళ్లు వచ్చేప్పటికి కారు ఆగిపోయింది. రామచంద్రం దిగి బానెట్ తీసి చూశాడు. ‘వెధవ కారులా ఉంది. నడచి వెనక్కి పోదాం పద’ అన్నాడు నాగభూషణం. ‘అర్జునుడు గాండీవాన్ని తిట్టినా సహిస్తాడేమోగానీ యీ కారుని తిడితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు రామచంద్రం. కారు కిందా మీదా ఏవో పరీక్ష చేశాడు. చివరికి ఆల్రైట్ అంటూ కారులో కూర్చున్నాడు. ఎర్రని పొడుగాటి రోడ్డు మీద కారు వెళుతూంటే చల్లని గాలి మొహానికి కొడుతోంది. నల్లని ఆకాశం మీద జ్వాలా పుష్పాల లాగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. మళ్లీ కారు సడెన్‌గా ఆగిపోయింది. రామచంద్రం విసుగ్గా దిగాడు. బానెట్ తీసి పరీక్షించాడు. ‘సరిగ్గా కనపడడం లేదు యీ గుడ్డి వెన్నెలలో’ అన్నాడు. అంతవరకూ వెన్నెల ఉన్నట్టు అవధానికి అనిపించలేదు. ఆకాశం కేసి చూశాడు. జేగురు రంగుగా ఉన్న చంద్రుడి మీద పల్చని మబ్బులు తారాడుతున్నాయి. దారి వెంట వెళ్తున్న ఆసామీలు గీసిన అగ్గిపుల్లల వెలుగులో ఏదో మరమ్మత్తు చేశాడు రామచంద్రం. బయలుదేరుతుండగా, ఆసాములు ‘జాగ్రత్త బాబూ. అడవిలో ఏదో చిరుతపులి’ ఉందన్న కబురును చెవిన వేశారు. దాన్ని కొట్టేస్తూ, ఏక్సిలేటర్ మీద కాలు నొక్కాడు రామచంద్రం. కారు రయ్యిమని దూసుకుపోయింది. ‘అడవి వచ్చేసింది. ఇది దాటితే యింక పదిహేను మైళ్లు తణుకు’ అన్నాడు రామచంద్రం. నాగభూషణం వెనక్కి జేర్లబడి నిద్దరోతున్నాడు. అవధాని దట్టంగా అలుముకుపోయిన అడవిని చూస్తున్నాడు. అంతా కటిక చీకటి. ఇంజన్లో ఏదో ఠప్‌మని పేలినట్టయింది. నాగభూషణం ఉలిక్కిపడ్డాడు. కారు ఒక గంతు వేసి ఆగిపోయింది. రామచంద్రం దిగి పనిముట్లు టిక్‌టిక్‌మనిపించాడు. ‘వద్దురా యీ కార్లో ప్రయాణం అంటే విన్నావు కాదు’ అన్నాడు భూషణం. ‘అబ్బ చంపకు, వెధవ గోలా నువ్వూ’ రామచంద్రం సహనం కోల్పోయాడు. ‘ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఒక లావుపాటి కర్రవుంటే చూడాలి. కారును పైకి ఎత్తి పట్టుకోవాలి’ అంటూ రోడ్డు వారకు పోయి కర్ర కోసం వెదుకుతున్నాడు. రోడ్డు వారనే చింతచెట్లూ రావిచెట్లూ ఉన్నాయి. ఒక పెద్ద మర్రిచెట్టు ఊడలతో భయంకరంగా వుంది. చెట్టుచెట్టుకీ మధ్య యీత ముళ్ల పొదలు, బ్రహ్మచెముడు డొంకలు, రకరకాల తీగలూ అల్లిబిల్లిగా చుట్టుకున్నాయి. హఠాత్తుగా ‘భూషణం పాము పాము’ అన్న కేక నిశ్శబ్దాన్ని చీలుస్తూ వినపడింది. ‘రామచంద్రం’ అంటూ భూషణం పరుగెత్తుకెళ్లాడు. పెద్ద పాము మెలికలు తిరుగుతూ గుడ్డి వెన్నెలలో మెరుస్తూ వెళ్లిపోయింది. అవధాని ప్రాణాలు బిగుసుకుపోయాయి. రామచంద్రం వణికిపోతున్నాడు. రెండు చేతులతోనూ పొదివి పట్టుకుని రామచంద్రాన్ని తీసుకువచ్చాడు భూషణం. అవధాని కారు తలుపు తీశాడు. వెనుక సీటులో పడుకోబెట్టారు. కండువా తీసి కాలిమీద గట్టిగా బిగించి కట్టారు. రామచంద్రం కళ్లల్లో విపరీతమైన భయం సుళ్లు తిరిగింది. పెదవుల చివరి నుండి నురగ కక్కుతున్నాడు. ‘మనకెంత గతి పట్టిందిరా’ ఏడుస్తున్నాడు భూషణం. ఇంతలో ఏదో మువ్వల చప్పుడు. ఒక ముసలివాడు రోడ్డు మీద నున్న పొదలను తప్పించుకుని వస్తున్నాడు. నల్లని వంగిపోయిన ఒళ్లు. భూషణం తడబడుతూ అన్నాడు: ‘ఎ ఎ ఎవరది?’ ‘సిద్దయ్యని బాబూ పాములవాణ్ణి’ అన్నాడు ముసలాయన. ‘పాములవాడివా?’ దైవసంకల్పం వుంటే కానీ యీ అడవిలో యిటువంటి వేళ ఒక మనిషి, అందులో పాములవాడు కనిపించడు. భూషణం కారులోంచి దూకి సిద్దయ్య రెండు చేతులూ పట్టుకున్నాడు. రామచంద్రాన్ని సిద్దయ్య పరీక్షగా చూశాడు. ‘ఇంకా బతికే వున్నారు బాబయ్యా’ అన్నాడు బాధతో తోక తెగిన బల్లిలా గిజగిజలాడుతూన్న ప్రాణిని చూసి. ‘మంత్రం వేసి బతికించావా సగం ఆస్తి నీకు రాయిస్తాను’ అన్నాడు భూషణం. ‘అదృష్టం వుంటే బతకొచ్చును బాబయ్యా, అక్కడ పాకలోకి తీసుకురండి. వేరు ముక్కతో మంత్రం వెయ్యాలి’. రామచంద్రాన్ని గుడిసెలోకి మోసుకెళ్లారు. నులకమంచంలో పడుకున్న యువతిని ‘సూరీడు లే లే’ అంటూ ముసలాయన తట్టి లేపాడు. దానిమీద రామచంద్రాన్ని పడుకోబెట్టారు. సిద్దయ్య రెండు మూడు సంచీలలో చెయ్యి పెట్టి వెదికాడు. పూసలూ పెంకులూ వేర్ల ముక్కలూ రాళ్లూ ఏవేవో ఉన్నాయి. కావాల్సిన వేరు ముక్కలేదు. దూరంగా వెలగచెట్టు అవతల పొదల కాడ ఆ వేరుగల మొక్కలున్నాయి. అక్కడ పాముపుట్టలూ ముళ్లపొదలూ జాస్తి. ముసలాయనకు చీకటిపడితే చూపు సరీగా ఆనదు. భూషణం పర్సులోంచి డబ్బు తీయబోయాడు. ‘నీ డబ్బుకి ఆశపడ్డానా మంత్రం పనిచెయ్యదు’ కఠినంగా అన్నాడు సిద్దయ్య. ‘ఈ అయ్యకి పెదవులు నల్లపడి పోతున్నాయి’ అంది సూరీడు. భూషణం అదిరిపడ్డాడు. ఇంతకుముందు రేగిన ఆశ గప్పున ఆరిపోయినట్టయింది. ‘పోనీ నేను వెళ్లి తీసుకురానా’ అంటూ సూరీడు పరుగెత్తింది. రామచంద్రం చివరి ఘడియల్లో ఉన్నాడు. ఒక్కొక్క నిమిషమే బలవంతంగా గడుస్తోంది. ఇంతలో సూరీడు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. చేతిలో అయిదారు మొక్కలున్నాయి. సిద్దయ్య సంజ్ఞతో గబగబా వేరు అరగదీసి రామచంద్రం కంట్లోనూ నోట్లోనూ పెట్టింది. అరిపాదాల్ని ఒళ్లో పెట్టుకుని రాసింది. అరగంట తర్వాత, రామచంద్రం మొహంలో చావునీడలు తప్పుకున్నాయి. శ్వాస యథాస్థితికి వస్తోంది. ‘ఇదంతా నీ చలవ సూరీడు’ అంటూ ఆమె కాళ్లమీద పడ్డాడు భూషణం. ‘తప్పండి బాబూ’ అంటూ సూరీడు సిగ్గు పడింది. ఆమె నవలావణ్యంతో ఆకర్షణీయంగా వుంది. అప్పుడు సమయం మూడు గంటలవుతోంది. అందరూ నడుం వాల్చారు. సుమారు వో గంటకు భూషణం లేచి సూరీడు వొంటి మీద చెయ్యి వేసి లేపాడు. జేబులోంచి డబ్బు ఇస్తూ, ‘నా మనసు తీర్చు’ అన్నాడు. ‘అందుకు డబ్బెందుకు బాబూ’ అంది సూరీడు. మరి? ‘నేనలాంటిదాన్ని కాను. పోయి పడుకో అయ్యా’ అంటూ మరోవైపు తిరిగి పడుకుంది. అవధాని నవ్వాపుకున్నాడు. తెల్లారి అంతా నిద్రలేచారు. ఆరు గంటల బస్సు వచ్చే వేళయింది. కలెక్టర్ గారింట్లో పెళ్లికి సమయానికి వెళ్లొచ్చు! రోడ్డు వైపు నడుస్తున్నారు. రామచంద్రం ఉత్సాహంగా ఉన్నాడు. మళ్లీ శ్రీమంతుడూ టెన్నీస్ చాంపియనూ అయిపోయాడు. ‘ఎపుడైనా మా ఊరు వస్తే కనిపించు సిద్దయ్యా’ అన్నాడు కృతజ్ఞతగా. ‘చిత్తం’ అని ముసలాయనా, సూరీడూ వెనక్కి వెళ్లిపోయారు. కారు తడిసిపోయింది మంచులో. తణుకు వెళ్లగానే దీన్ని తీసుకువచ్చే ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇంతలో ‘బాబయ్యా’ అని కీచుగా కేక వినపడింది. సూరీడు పరుగెత్తుకొస్తోంది. ‘బాబూ, మా అయ్యని పాము కరిచింది. ఒక్కసారి రండి బాబూ’. అరెరెరె! ‘సగం దూరం వెళ్లగానే వేరు ముక్క కోసం పొదలో చెయ్యిపెట్టి మొక్క పీకబోయాడు. బుస్సున లేచి కాటు వేసింది బాబూ తాచుపాము’. అయ్యో! ఈ బస్సు దాటితే ఎలాగ? ‘మీరుంటే ధైర్యం బాబూ’ సూరీడు ఏడుస్తోంది. ‘కలెక్టర్ గారింట్లో పని అంతా నేను చూసుకుంటానని మాట ఇచ్చానే’ రామచంద్రానికి సమస్య వచ్చి పడింది. అదిగో బస్సు వచ్చేస్తోంది. అవధాని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. బస్సు ఆగింది. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు సూరీడు చేతిలో పెట్టి బస్సు ఎక్కేశాడు. అవధానిని బస్సులోకి తోసి, భూషణం కూడా ఎక్కాడు. బస్సు బర్రున సాగింది. సూరీడు గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు గాలిలో పల్టీలు కొట్టుతున్నాయి. బాలగంగాధర తిలక్ (1921–66) ‘నల్లజర్ల రోడ్డు’ కథ సారాంశం ఇది. ఈ కథ ఆంధ్రపత్రిక ప్లవ సంవత్సరాది సంచిక (1961)లో ప్రచురితం. కథకుడు కూడా అయిన తిలక్ కవిగా మరింత ప్రసిద్ధుడు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు. ‘అమృతం కురిసిన రాత్రి’ ఆయన కవితల సంకలనం. బాలగంగాధర తిలక్ -
కాంగ్రెస్ తో తప్పా..ఏ పార్టీతోనైనా కలుస్తా :పవన్ కల్యాణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో తప్పా..ఏ పార్టీతోనైనా చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నానని నటుడు పవన్ కల్యాణ్ స్ఫష్టం చేశారు. ప్రస్తుతం తన పార్టీ నిర్మాణ దశలోనే ఉందని, పార్టీగా రూపాంతరం చెందడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా?లేదా?అని అంశంపై ఇంకా స్ఫష్టత లేదన్నారు. ఒకవేళ తాను పోరుకు సిద్ధమైతే కాంగ్రెస్ మాత్రం జతకట్టనని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులకు కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు. నగరంలోని నోవాటెల్ లో జరిగిన 'జన సేన'పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రసంగించారు. తాను తెలంగాణ పోరటాన్ని గౌరవిస్తున్నాని పేర్కొంటూ.. కాంగ్రెస్ కుయుక్త రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కుట్ర రాజకీయాలకు పాల్పడిందనే విషయాన్ని తాను నమ్ముతాన్నానన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసే తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు. ప్రాంతాలను విడగొట్టే క్రమంలో ప్రజల మధ్య విద్వేషాలు పెరగడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఆ పార్టీపై పోరాటం ఆగదని తెలిపారు. 'నేను రాజకీయాల్లోకి వస్తున్నానని అనగానే చాలా మంది విమర్శించారు. నా తెలంగాణకు క్షమాపణ అడగడానికి మీరెవరు. పార్టీ పెట్టు ముందు క్షమాపణ చెప్పు అనడానికి మీరెవరు. నేనెవరికీ భయపడను. ఎవరికీ వెన్నుచూపను. పిరికితనం అంటే నాకు చిరాకు. నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అనేది నా వ్యక్తిగత విషయం. నేను తెలంగాణకు అనుకూలం. అదే సమయంలో సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించను' అని పవన్ తెలిపారు. దేశంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యతోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను మాత్రం కాదంటూనే అన్నయ్య చిరంజీవిపై కోపం లేదన్నారు. ఆయనను ఎదుర్కొవడానికి పార్టీ పెట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదని, పదవులు తనకు చాలా తుచ్ఛమైనవని పవన్ పేర్కొన్నారు. -
నా తెలంగాణ పోరు తెలంగాణ: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. తన పార్టీ పేరు 'జనసేన'గా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దేవరకొండ బాల గంగాధర్ తిలక్ వాక్యాలతో ఆయన ప్రసంగం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆయన మాటల్లోనే... 'ఇల్లేమే దూరం.. అసలే చీకటి.. చేతిలో దీపం లేదు.. చేతిలో కర్ర లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పోరాడాలన్న ఆత్మవిశాసం ఉంది. ఎలాంటి అవినీతినైనా తరిమి కొడతాం. గొప్పగా బతకాలని ప్రయత్నం చేయలేదు. సామాన్యుడిలా బతకాలనుకున్నా. దేశంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యతో రాజకీయాల్లోకి వచ్చా. ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకునే బానిసను కాదు. అన్నయ్య చిరంజీవిపై నాకు కోపం ఉండదు. ఆయనను ఎదుర్కొవడానికి పార్టీ పెట్టడం లేదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యకు ఎదురెళ్లను. ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. పదవులు నాకు చాలా తుచ్ఛమైనవి. నా తెలంగాణ పోరు తెలంగాణ. రాష్ట్రాన్ని ఎలా విడగొట్టారో, ఎలాంటి పరిస్థితుల్లో చూశాను. అందరూ కలిసి రాష్ట్రాన్ని విభజించిన తీరు నాకు నచ్చలేదు. రాజకీయ నాయకులపై అసహ్యం వేసింది. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని అనగానే చాలా మంది విమర్శించారు. నా తెలంగాణకు క్షమాపణ అడగడానికి మీరెవరు. పార్టీ పెట్టు ముందు క్షమాపణ చెప్పు అనడానికి మీరెవరు. నేనెవరికీ భయపడను. ఎవరికీ వెన్నుచూపను. పిరికితనం అంటే నాకు చిరాకు. నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా వద్దా అనేది నా వ్యక్తిగత విషయం. నేను తెలంగాణకు అనుకూలం. అదే సమయంలో సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించను. చిన్నప్పుడు నాకు చిన్నప్పుడే సామాజిక స్పృహ కలిగింది. చిన్నప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం పుస్తకం చదివాను. నా గుండెల్లో ఉన్న కామన్‌మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ జనసేన మారింది. రాజకీయ వ్యవస్థ ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కారించడానికే, జటిలం చేయడానికి కాదు. చాలా మంది నాయకులు డబ్బు సంపాదనలో బిజీగా ఉన్నారు. నా వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే సహించను. ఒక్క పెళ్లి చేసుకుని 30 మందితో తిరిగితే ఆమోదిస్తారా. నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే రాహుల్ గాంధీ నుంచి ప్రతి నాయకుడి వ్యక్తిగత జీవితాలను బయటకు తీస్తాను. నాకూ అభిమానులున్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహారాలు యూట్యూబ్‌లో పెట్టెస్తా. సిన్మాలు వదులుకోవాలని, అభిమానులను దూరం చేసుకోవాలని లేదు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.