the development
-
అభివృద్ధే లక్ష్యం
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల ద్వారా అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇదే పంథాలో మిషన్‌మోడ్‌లో ‘అనంత’ అభివృద్ధి కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళుతున్నాం. శాస్త్రీయ పరిపాలన విధానంతో, జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. దీనికి అందరి సహకారం కావాలి’ అని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. సోమవారం ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండ్స్‌లో 66వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్, రబీల్లో 11 లక్షల నుంచి 9 లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో 59 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పశువులకు గ్రాసం కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. 350 మెట్రిక్‌టన్నుల విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. కరువు నివారణకు వంద శాతం డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఏడాది 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అమలు చేస్తున్నాం. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు హంద్రీ-నీవా ద్వారా 13 టీఎంసీల నీటిని జిల్లాకు రప్పించాం. 49 చె రువులకు నీటిని విడుదల చేశాం. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 21 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాం. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు బహుళ రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించాం. సత్యసాయిసెంట్రల్ ట్రస్టు రూ.80 కోట్లు, రూ.28 కోట్ల ప్రభుత్వ నిధులతో దీన్ని పూర్తి చేశాం. ఎన్టీఆర్ సుజల ద్వారా జిల్లాలో 37 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 2 రూపాయలకు 20 లీటర్ల నీటిని అందిస్తున్నాం. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకించింది. హెచ్చెల్సీ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఎన్పీ కుంటలో అల్ట్రామెగా సోలార్ పవర్ప్రాజె క్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. జేఎన్టీయూలో చదివిన విద్యార్థులకు అమెరికాలో ఎంఎస్ చేసేందుకు చికాగో స్టేట్ యూనివర్శిటీలతో ఎంఓయూ కుదిరింది. జేఎన్టీయూలో 7.5 కోట్ల రూపాయలతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 4.12 లక్షల మంది కూలీలకు పని కల్పించి, 130 కోట్ల రూపాయలు చెల్లించాం. జిల్లాలో మూడు ఇసుకరీచ్‌ల ద్వారా 26 వేల క్యూబిల్ మీటర్ల ఇసుక తవ్వకం ద్వారా 2 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాకు 4.25 లక్షల మరుగుడొడ్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో తొలవిడతగా 780 కోట్ల రూపాయలను 6.62 లక్షల మంది రైతులకు మాఫీ చేశాం. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయలు, 80 శాతం వైకల్యం ఉన్నవారికి 1500 రూ పాయల పింఛన్ ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య, ఆరో గ్య సేవ ద్వారా రూ.32 కోట్లతో 11వేల శస్త్ర చికిత్సలు చేశాం. మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ద్వారా అమృతహస్తం, సబల పథకాల ద్వారా పోషకాహారం అందిస్తున్నాం. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తోన్న మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి నింతరం శ్రమిస్తూ, న్యాయసేవలు అందిస్తున్న జిల్లా జడ్జి, న్యాయమూర్తులకు, పోలీసులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకరిస్తారని ఆశిస్తున్నాను’ అని కలెక్టర్ ప్రసంగించారు. ప్రసంగం తర్వాత స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. పరేడ్ డ్రౌండ్స్లో అందరికీ అభివాదం చేశారు. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాళ్లను తిలకించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ గేయానంద్, జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, జేసీ లక్ష్మీకాంతం, ఏజేసీ సయ్యద్‌ఖాజా, డీఆర్వో హేమసాగర్, ఏఎస్పీలు మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు మల్లిఖార్జునవర్మ, నరసింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
పార్టీలకతీతంగా అభివృద్ధి
అనంతపురం రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పార్టీలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పరిటాల సునీత అన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా రూరల్ మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. తాటిచెర్ల గ్రామంలో తాగు నీటికి ఇబ్బంది లేదని, సాగు నీటి సమస్య ఉందన్నారు. చెరువుకు తప్పకుండా నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గ్రామంలో ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే గేట్ ద్వారా రాకపోకలకు అంతరాయం కల్గుతోందని, ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వం రూ 12వేలు మంజూరు చేస్తోందన్నారు. ఆడవారు కాలకృత్యాల కోసం ఆరుబయటకెళ్లడం సరైంది కాదన్నారు. సెల్‌ఫోన్ కన్నా మరుగుదొడ్డే ముఖ్యమన్నారు. అధైర్య పడాల్సిన పనిలేదు : రైతులు, డ్వాక్రా మహిళలు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా రుణాల మాఫీ జరుగుతుందన్నారు. పింఛన్లు అందని వారికి ఈ నెల 25లోపు అందుతాయని భరోసా ఇచ్చారు. జెడ్పీచైర్మన్ చమన్ మాట్లాడుతూ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ప్రభావతి అనే వికలాంగురాలికి మంత్రి పింఛ న్ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప, జెడ్పీటీసీ వేణుగోపాల్, టీడీపీ నేతలు చంటి, పరిటాల మహేంద్ర, తాటిచెర్ల సర్పంచ్ రామాంజినేయులు, ఎంపీడీఓ లక్ష్మినరసింహశర్మ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నర్సనాయినకుంటలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాలి: మంత్రిని కోరిన సీపీఎం : 2013 ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, ఈ ఏడాది కరువు మండలంగా రూరల్ ప్రాంతాన్ని ప్రకటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ను మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి టీ రామాంజినేయులు మంత్రి పరిటాల సునీతను కోరారు. రూ 8 లక్షలతో గ్రామానికి బోరు: మన్నీల గ్రామంలో రూ 8 లక్షలతో బోరు వేయించామని ఎంపీ కన్నేగంటి మాధవి, వైస్ ఎంపీపీ శిల్ప అన్నారు. శుక్రవారం మన్నీలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెడ్పీటీసీ వేణుగోపాల్, మన్నీల సర్పంచ్ ఆదిశేషయ్య, టీడీపీ నేత చంటి, తహశీల్దార్ షేక్‌మహబూబ్ బాష, టెక్నికల్ ఇంజనీర్ లక్ష్మిదేవి, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ బ్యాంక్ నిధులతో రహదారుల అభివృద్ధి
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు యడ్యూరప్ప శివమొగ్గ : శివమొగ్గ-హానగల్, శికారిపుర-ఆనందపురం మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను రూ.425 కోట్ల ప్రపంచబ్యాంకు నిధులతో అభివృద్ధి చేయడానికి ఆమోదం లభించినట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఆదివారం శివమొగ్గలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివమొగ్గ నగర, గ్రామీణ, హొన్నాళి, శికారిపుర, సాగర, సొరబ, హనగల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, శివమొగ్గ, దావణగెరె, హవేరి లోకసభ నియోకవర్గ పరిధిలోని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా నివేదికను కూడా రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంక్ మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను, అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరణకు అవసరమైన భూస్వాధీన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నిధుల కోసం ప్రపంచ బ్యాంక్‌కు నివేదిక సమర్పించడం జరిగిందని చెప్పారు. ఇటీవలె ఈ పనులకు ప్రపంచబ్యాంక్ ఆమోదం లభించిందని, రెండు ప్యాకేజీల్లో నిధులు విడుదల చేసేందుకు బ్యాంక్ అంగీకరించిందని తెలిపారు. వారంలోపు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి మూడు నెలల్లోపు పనులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని అన్నారు. బైందూరు, హొసనగర, బట్టేమల్లప్ప, ఆనందపుర, శికారిపుర, మాసూరు రోడ్డు, శిరసి, బనవాసి, శిరాళకొప్ప, హొన్నాళి, హరిహర రోడ్డు, శివమొగ్గ, హనగల్ రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొన్నారు. -
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
ఏలూరు : జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయి మెజార్టీ అందించిన జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా తొలుత జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో స్పష్టం చేశారని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో ఆక్వాకల్చర్ అభివృద్ధికి, హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు, నేషనల్ ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. చింతలపూడి ప్రాంతంలో బొగ్గు నిల్వలు వెలికితీతను పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. వ్యవసాయం, చేపల చెరువుల రైతుల జీవనవిధానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొల్లేరును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అదేక్రమంలో కొల్లేరు ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టం లేనివిధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు బడేటి కోట రామారావు, గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివరామరాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో మంత్రి మొక్కలు నాటారు. -
‘రియల్’ మాయ!
ఇదిగిదిగో ఇక్కడే ఐఐటీ ఏర్పాటుచేస్తారు.. అదిగదిగో అక్కడే సెంట్రల్ వర్సిటీ నెలకొల్పేది.. అల్లదిగో అక్కడే ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుచేసేది.. రేణిగుంట విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేయడానికి అక్కడ భూమి లేదట.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇక్కడే నెలకొల్పుతారు.. భూమిని కొనుగోలు చేయండి.. రెండు నెలల్లో రెండింతల లాభం పొందండి. ఇదీ రియల్టర్ల ప్రచారం..! ఇంతకూ రియల్టర్ల ప్రచారంలో వాస్తవముందా..? నివృత్తి చేసుకోవాలంటే ఈ కథనం చదవండి..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని రియల్టర్లు ఒంటబట్టించుకున్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రచారంలో ఉండగానే ‘రియల్’బూమ్‌కు సిద్ధమయ్యారు. ఆ ప్రతిపాదన లు కార్యరూపం దాల్చుతాయా లేదా అన్నది దేవుడెరుగు, తమ జేబులు నిండితే చాలన్నదే రియల్టర్ల ఎత్తుగడ. రియల్‘భూ’మ్ లేకున్నా ఉన్నట్లు కనికట్టు చేసి.. భూముల ధరలను కృత్రిమంగా పెంచేశారు. మాయమాటలు చెప్పి, ప్లాట్లను భారీ ధరలకు అంటగట్టి అమాయకులను నట్టేటముంచుతున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ యూనివర్సిటీ (కేంద్రీయ విశ్వవిద్యాలయం), ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదన్నది బహిరంగ రహస్యమే. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్‌ల ఏర్పాటుపై కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా తిరుపతిలో మూడు విద్యా సంస్థల ఏర్పాటుపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటన చేశారన్నది విశదమవుతోంది. మూడు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ రాంగోపాల్‌కు గంటా సూచించారు. రెవెన్యూ అధికారుల అన్వేషణ.. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు లేవు. ఈ నేపథ్యంలో ఏర్పేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వడమాలపేట మండలాల్లోనూ ప్రభుత్వ భూముల కోసం రెవెన్యూ అధికారులు అన్వేషిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. డీకేటీ, అసైన్డు భూములు ఏర్పేడు మండలంలో భారీగా ఉన్నాయి. చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, వడమాలపేట మండలాల్లోనూ అసైన్డు భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని సేకరించాలన్నా ఆ భూముల లబ్ధిదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కడ ఏర్పాటుచేయాలన్నది ఆ సంస్థల యాజమాన్యం నిర్ణయిస్తుంది. ప్రొఫెసర్ల రాకపోకలకు వీలుగా ఫోర్‌లేన్ రోడ్డు, ఎయిర్‌పోర్టు అందుబాటులో ఉన్న ప్రాంతాలే జాతీయస్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు అనుకూలం. రాష్ట్ర ప్రభుత్వం భూములను గుర్తించి.. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ యాజమాన్యాలకు సమాచారం అందిస్తే, ఆ సంస్థల ప్రతినిధి బృందం ఆ భూములను పరిశీలిస్తుంది. రవాణా, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంస్థల ఏర్పాటుకు ఆ ప్రతినిధి బృందాలు అంగీకరిస్తాయి. ఇవన్నీ ఇప్పటి దాకా ఏ ఒక్కటీ జరగలేదు. కానీ, రియల్టర్లు ఐఐటీని ఏర్పేడు మండల పరిధిలోనూ.. ఐఐఎస్ఈఆర్నూ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోనూ.. సెంట్రల్ వర్సిటీ తిరుపతిరూరల్-రేణిగుంట మండల పరిధిలోనూ ఏర్పాటుచేస్తారనే ప్రచారం జోరుగా చేస్తున్నారు. నమ్మించి నట్టేట ముంచుతున్న వైనం.. ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీలు ఇక్కడే ఏర్పాటుచేస్తారు.. ఆ సంస్థలు ఏర్పాటుచేస్తే అక్కడ ప్లాట్లను కొనుగోలు చేయలేరు.. ఇప్పుడే కొనుక్కోండి.. తక్కువ ధరకు ఇస్తామంటూ రియల్టర్లు అమాయకులను నమ్మిస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఇదే అదునుగా భూముల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. భూముల ధరలను కృత్రిమంగా పెంచేసి, దొరికినంత దోచుకుంటున్నారు. తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు సమీపంలో ఉన్న ప్లాట్లు అంకణం గరిష్టంగా రూ.12 వేల వరకూ పలికేది. కానీ.. ఇప్పుడు అంకణం ధర రూ.20 వేలకు పెంచారు. మంగళం, తిరుపతి-చంద్రగిరి రోడ్డు, తిరుపతి-రేణిగుంట రోడ్డు, విమానాశ్రయం నుంచి ఏర్పేడు మండల పరిసర ప్రాంతాల వరకూ రియల్టర్లు ఇబ్బముబ్బడిగా వెంచర్లు వేసేశారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చక ముందే.. వెంచర్లకు డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) ఆమోదం తెలపక ముందే రియల్టర్లు ప్లాట్లను అధికధరలకు అమాయకులకు అంటగడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. -
‘గోవాడ’ను బాబు అమ్మజూశారు
వైఎస్ జీవం పోశారు వడ్డాదిలో వైఎస్ విజయమ్మ చోడవరం, న్యూస్‌లైన్: గోవాడ సుగర్ ప్యాక్టరీని చంద్రబాబు అమ్మేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది శనివారం జరిగిన ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను పూర్తిగా విస్మరించారని, ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. సహకార సుగర్ ఫ్యాక్టరీలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. రాజశేఖరరెడ్డి వచ్చి ఫ్యాక్టరీలకు జీవం పోశారని చెప్పారు. జగన్‌బాబు కూడా తండ్రి ఆశయ సాధనలో రైతులకు అండగా ఉంటారన్నారు. ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్ మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండే జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నాయకులు ఇప్పుడు జిల్లాను ముక్కలు చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని పరోక్షంగా అవంతి శ్రీనివాస్‌పై ధ్వజమెత్తారు. చోడవరం అభ్యర్థి ధర్మశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా సొంత ప్రయోజనాల కోసమే పాకులాడిన టీడీపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ మహానేత తనయుడ్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడమే బాబు ధ్యేయమన్నారు. అనంతరం విజయమ్మ సమక్షంలో చోడవరం మండలం శ్రీరాంపట్నం సర్పంచ్ పండూరి సత్యవతి వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి దేవరాపల్లి సభలో విజయమ్మ మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ను, మాడుగుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బూడి ముత్యాలునాయుడును గెలిపించి రాజ న్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు. -
మోడీ అభివృద్ధి మేడిపండు
= చిరు వ్యంగ్యాస్త్రం .. = మొయిలీ వల్లే ‘ఎత్తినహోళె’ = మళ్లీ గెలిస్తే కరువు నుంచి జిల్లా విముక్తి = కేంద్ర మంత్రిగా ఆయన సేవలు ఘనం = పేలవంగా చిరు ప్రచారం = ఆనేకల్ రోడ్డు షో రద్దు గౌరిబిదనూరు/యలహంక/చిక్కబళ్లాపురం/బాగేపల్లి, న్యూస్‌లైన్ : గుజరాత్లో నరేంద్ర మోడీ అభివృద్ధి మేడిపండు లాంటిదని కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి వ్యంగ్యమాడారు. చిక్కబళ్లాపుర లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ తరఫున సోమవారం ఆయన గౌరిబిదనూరు, యలహంక, చిక్కబళ్లాపురం, బాగేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ హయంలో గుజరాత్ అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వందలాది చిన్న పరిశ్రమలు మూతపడి వేలాది కుటుంబాలు వీధిపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ అవినీతిని తాళలేకే ఇక్కడ కాంగ్రెస్‌కు పట్టంగట్టారని పేర్కొన్నారు. ఈ కరువు జిల్లాలో సాగునీటి కోసం ఎత్తినహోళె పథకాన్ని అమలు చేయడానికి సుమారు రూ. 13 వేల కోట్ల నిధులను కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తీసుకొచ్చారని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాష్ట్రానికి తీసుకురావడం ఆయన వల్లే సాధ్యమని అన్నారు. ఆయన్ను గెలిపిస్తే ఈ జిల్లా కరువు నుంచి విముక్తి పొందుతుందని అన్నారు. కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి పలు సేవలు చేశారని, ఆయన చాలా దూర దృష్టి కల వ్యక్తి అని కొనియాడారు. సీఈటీ పరీక్ష విధానాన్ని అమలు చేసి పేద విద్యార్థులకూ ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. ‘చిరు’ స్పందన ... హైదరాబాద్ నుంచి ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు వచ్చిన చిరంజీవి, చిక్కజాలలోని తన సొంత గెస్ట్ హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత యలహంకలోని కొండప్ప లేఔట్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడ స్కూలు విద్యార్థులే పెద్ద సంఖ్యలో కనిపించారు. తర్వాత చిక్కబళ్లాపురం, బాగేపల్లి, గౌరిబిదనూరులలో జరిగిన రోడ్డు షోలలో పాల్గొన్నారు. చిక్కబళ్లాపురంలో ఓ మోస్తరుగా అభిమానులు కనిపించినా, వారిలోనూ కళాశాల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. బాగేపల్లిలో కూడా అభిమానులు ఫర్వాలేదనిపించారు. గౌరిబిదనూరులో రోడ్డు షో పేలవంగా సాగింది. చివరగా చిరంజీవి బెంగళూరు గ్రామీణ నియోజక వర్గం ఆనేకల్‌లో రోడ్డు షో నిర్వహించాల్సి ఉన్నా రద్దు చేసుకుని సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఏడాది తరువాత ఒకటిన డీఆర్సీ అధికారులను పరుగులు పెట్టిస్తున్న మంత్రులు ఆగమేఘాలమీద 15 అంశాలతో అజెండా రూపకల్పన విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అమాత్యులకు ఏడాది కాలానికి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం(డీఆర్సీ) గుర్తుకొచ్చింది. అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తుంటే.. వాటిపై చర్చించేందుకు ఇప్పటికి వారికి తీరిక కుదిరింది. ఇప్పుడు కూడా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికే ప్రయత్నిస్తున్నారు తప్పా.. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. డీఆర్సీ నిర్వహణపై ఎవరికివారే ప్రకటనలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సుమారు 11 నెలల తరువాత డీఆర్సీని ఫిబ్రవరి ఒకటిన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. 11 నెలల తరువాత సమీక్ష తుపాన్లు, వరదలు జిల్లాను ముంచెత్తాయి. పంటలు నీట మునగడంతో వేలాది మంది రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కీలకమైన డీఆర్సీని నిర్వహించి, సమస్యలపై చర్చించి బాధితులను ఆదుకోవాల్సిన మంత్రులు రాజకీయాలు, పరస్పర ఆరోపణల్లో బిజీ అయిపోయారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకోసారి డీఆర్సీ నిర్వహించాల్సి ఉంది. గతేడాది మార్చి 3న జరిగింది. మళ్లీ ఇప్పుడు ఈ సమీక్షను ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఉరుకులూ పరుగులు... సాధారణంగా ఎప్పుడు డీఆర్సీ నిర్వహించినా.. కనీసం మూడు వారాలు ముందుగా జిల్లా ఇన్చార్జిమంత్రి నుంచి జిల్లా అధికారులకు సమాచారం ఉంటుంది. ఆమేరకు జిల్లా కలెక్టర్ అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి అజెండా రూపొందిస్తారు. కానీ ఈసారి కేవలం 10 రోజుల వ్యవధిలోనే డీఆర్సీకి ఏర్పాట్లు చేయాలని అమాత్యులు అధికారులను ఆదేశించారు. తొలుత ఈ నెల 19న ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు గుర్తుకొచ్చి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ వచ్చేనెల ఒకటిన డీఆర్సీ ఉంటుం దని అయిదు రోజుల క్రితం సమాచారమిచ్చారు. దీంతో అజెండా తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు.