Development authority
-
అరుదైన అవకాశం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో అరుదుగా కనిపించే వ్యక్తులు మహిళా అంపైర్లు. మహిళలు జాతీయ స్థాయి మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించడమే గగనంగా కనిపించే ఈ రోజుల్లో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానెల్లో భారత మహిళా అంపైర్లు తమ సంఖ్య పెంచుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి మ్యాచ్ ఐసీసీ రిఫరీస్ ప్యానల్లో చోటు దక్కించుకోగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు. చెన్నైకి చెందిన జననీ నారాయణ్, నవీ ముంబైకి చెందిన వృందా రాఠి ‘ఐసీసీ డెవలప్మెంట్ అంపైర్స్’ అంతర్జాతీయ ప్యానల్‌కు ఎంపికైనట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ప్యానల్లో భారత మహిళా అధికారుల సంఖ్య మూడుకు చేరింది. ఈ డెవలప్మెంట్ అంపైర్స్ ప్యానల్ అనేది పలు రీజియన్లకు చెందిన అత్యుత్తమ అంపైర్లు, రిఫరీలను ఎంపిక చేసి అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు ఉపయోగపడుతుంది. అత్యంత కఠినంగా ఉండే బీసీసీఐ లెవల్–2 అంపైరింగ్ పరీక్షను పాసైన మహిళా అధికారులుగా గతంలోనే గుర్తింపు తెచ్చుకొని.... ప్రస్తుతం అత్యున్నత స్థాయి అంపైరింగ్ ప్యానల్లో చోటు దక్కించుకున్న జనని, వృందా గురించి చూస్తే... జననీ నారాయణ్: 34 ఏళ్ల జనని 2018 నుంచి దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్ వీరాభిమాని అయిన జనని ఇంగ్లండ్ అంపైర్ డేవిడ్ షెఫర్డ్, ఎస్. వెంకటరాఘవన్ (భారత్)లను ఆదర్శంగా తీసుకుంది. 2015లోనే తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి లోకల్ డివిజన్ మ్యాచ్‌లకు అధికారిగా వ్యవహరించింది. ఎంసీసీ నిబంధనలపై మంచి పట్టు ఉన్న ఆమె... ఎంతో కష్టపడి బీసీసీఐ లెవల్–1 కోర్సును కూడా పూర్తిచేసింది. తర్వాత థియరీ, ప్రాక్టికల్స్‌తో కూడిన కఠినమైన లెవల్–2 పరీక్షలోనూ మెరుగ్గా రాణించి.. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. వృందా రాఠీ: మాజీ క్రికెటర్, స్కోరర్ అయిన వృందాకు క్రికెట్‌తో మంచి అనుబంధముంది. స్వతహగా మీడియం పేసర్ అయిన వృందా కాలేజీ స్థాయిలో 2007 నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ముంబై యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించింది. 2008–09 ఆలిండియా చాంపియన్‌గా నిలిచిన ముంబై యూనివర్సిటీ జట్టులో ఆమె సభ్యురాలు కూడా. అదే ఏడాది నుంచి బీసీసీఐ స్కోరర్‌గా కెరీర్ ప్రారంభించిన వృందా... 2013 మహిళల ప్రపంచ కప్‌లోనూ ఆమె స్కోరర్‌గా పనిచేసింది. న్యూజిలాండ్ అంపైర్ క్యాతీ క్రాస్‌ను చూసి స్ఫూర్తి పొంది అంపైరింగ్ వైపు మొగ్గు చూపింది. 2014లో రాష్ట్ర స్థాయిలో అంపైరింగ్ పరీక్ష పాసైన వృందా వివిధ స్థాయి టోర్నీల్లో 150 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించింది. తర్వాత 2016లో బీసీసీఐ లెవల్–1 పరీక్షలో 94 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి 2017లో లెవల్–1 కోర్సును పూర్తిచేసింది. 2018లో లెవల్–2ను ముగించి ‘బీసీసీఐ దేశవాళీ అంపైర్ల ప్యానల్’లో చోటు దక్కించుకుంది. -
గలీజు
నిబంధనలకు విరుద్ధంగా సబ్ లీజులు ఎన్టీఆర్ పార్కులో యథేచ్ఛగా దోపిడీ హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండి సిటీబ్యూరో: మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు లీజుల వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది సబ్ లీజులతో సంస్థ ఆదాయానికి భారీ స్థాయిలో గండి కొడుతున్నారు. తాము మాత్రం హాయిగా జేబులు నింపుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ ఈ అక్రమాలకు కేంద్రంగా మారింది. నగరంలో సందర్శకుల రద్దీ అధికంగా ఉన్న పార్కుల్లో ఎన్టీఆర్ గార్డెన్ ఒకటి. నిత్యం వేలాదిమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఇంత రద్దీ ఉన్న పార్కుపై అధికారుల పర్యవేక్షణ కరువవుతోంది. ప్రవేశ టిక్కెట్లు, షాపుల కేటాయింపు, ఇతర మార్గాల్లో ఈ పార్కు ద్వారా హెచ్ఎండీఏకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో సగంలీజుల ద్వారానే వ స్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే... షాపుల కేటాయింపులో లోపాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని లీజుకు తీసుకున్న వ్యక్తులు అధిక ఆదాయం కోసం విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. తమకు కేటాయించిన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నా... అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తూన్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. పక్కాగా మస్కా ఎన్టీఆర్ గార్డెన్‌లోని అధిక షాపులు లీజుపై కేటాయించినవే. కొన్నిటి లీజుల్లో యథేచ్ఛగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రెండు ప్రాంతాల్లో షాపులను లీజుకు తీసుకున్న వ్యక్తి ఏకంగా మరో అయిదు ప్రాంతాలను తన అధీనంలో పెట్టుకున్నాడు. వాటిని సబ్ లీజుకిచ్చి హెచ్ఎండీఏకు మస్కా కొడుతున్నాడు. రికార్డుల ప్రకారం ఎన్టీఆర్ గార్డెన్లో ఒక క్యాంటీన్ నిర్వహించుకునేందుకు ఓ సంస్థకు అనుమతిచ్చినట్లు ఉంది. మచన్ ట్రీ వద్ద ఒకటి, అక్కడి రైల్వే స్టేషన్లో మరో క్యాంటీన్ అనధికారికంగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. ఈ రెండు క్యాంటీన్లు ఒకటిగానే చూపించి సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నా పట్టించుకొనే నాథుడే లేడని బీపీపీ సిబ్బందే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. పార్కులోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 5 షాపులను సబ్లీజుదారులే నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇక్కడి ‘బంగీ జంప్’ క్రీడా స్థలం కూడా సబ్ లీజుదారు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సందర్శకుల జేబులకు కన్నం అక్రమ లీజులతో సంస్థకు టోకరా వేస్తున్న నిర్వాహకులు సందర్శకులనూ వదలడం లేదు. పార్కుల్లో ఆహారం, పానీయాలు, ఇతర వస్తువుల విక్రయాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలను పక్కనపెట్టి... అధిక ధరలకు విక్రయిస్తూ జనం నుంచి దోచుకుంటున్నారు. ఈ అక్రమాలు అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై సంబంధిత అధికారిని వివరణ కోరగా... అలాంటి అక్రమాలు తమ దృష్టికి రాలేదన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకొంటామని చెప్పారు. లీజుకు కేటాయించిన షాపులను సబ్ లీజ్‌కు ఇచ్చినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకొని... వాటిని రద్దు చేస్తామని ఆయన తెలిపారు. -
మంచి ‘రోజ్’లెప్పుడో!
ప్రారంభం కాని రోజ్‌గార్డెన్ సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్ తీరాన అందమైన ‘రోజా పూల’ లోకాన్ని సృష్టించింది మహా నగరాభివృద్ధి సంస్థ. అయితే.. ఆ సుందర ప్రపంచాన్ని వీక్షించే అవకాశం జనానికి దొరకడం లేదు. నెక్లెస్ రోడ్‌లోని దామోదర సంజీవయ్య పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.2.5 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ గులాబీ నందన వనాన్ని (రోజ్ గార్డెన్) అద్భుతంగా తీర్చిదిద్దింది. వివిధ రంగుల్లో 612 రకాల ‘రోజా’లకు ఇక్కడ చోటు కల్పించారు. దేశవాళీ, హైబ్రీడ్‌లో దాదాపు అన్ని రకాల గులాబీలు ఈ గార్డెన్లో కొలువుదీరాయి. ప్రధానంగా హైబ్రీడ్ టీన్, ఫ్లోరిబండాస్, రాంబ్లర్స్, క్రిపర్స్, స్క్రాబ్రోజ్స్, మినేజర్స్, గ్రౌండ్ కవర్ రోజెస్, మినీ ఫ్లోరిబండాస్ రకాలుకనువిందు చేస్తున్నాయి. సుమారు 12వేల మొక్కలతో అలరారుతోన్న రోజ్‌గార్డెన్‌లో ఇంజినీరింగ్ అధికారులు అందమైన ల్యాండ్ స్కేప్‌ను తీర్చిదిద్దడం అదనపు హంగుగా మారింది. దీని నిర్మాణం పూర్తయి 6 నెలలు గడుస్తున్నా అధికారికంగా ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాయంత్ర వేళల్లో సేదదీరేందుకు సంజీవ య్య పార్కుకు వచ్చే సందర్శకులు రోజ్ గార్డెన్ ఎంట్రీ ప్లాజా వరకు వెళ్లి... లోనికి అనుమతించకపోవడంతో ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ప్రశంసలు... రాజధాని నగరంలో అద్భుతమైన రోజ్గార్డెన్ను ఆవిష్కరించిందన్న కీర్తిని హెచ్ఎండీఏ దక్కించుకొంది. ‘ఇంటర్నేషనల్ రోజ్ గార్డెన్ సొసైటీ’ ప్రతినిధులు ఇటీవల ఈ గార్డెన్‌ను సందర్శించి హెచ్ఎండీఏపై ప్రశంసల జల్లు కురిపించారు. భారతదేశంలోనే ఇదో ‘బెస్ట్ గార్డెన్’గా ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ల్యాండ్ స్కేప్ పార్కుకు అదనపు హంగును అద్దిందని కొనియాడారు. ఈ గార్డెన్లో అందమైన గులాబీలతో పాటు వాటర్ ఫాల్స్, ఫౌంటెన్లు, శిల్పాలు, వాక్ వేలు వంటివి మరింత శోభను తీసుకొస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధం ‘రోజ్ గార్డెన్ ప్రాంభించేందుకు అన్ని ఏర్పాటు చేశాం. మొక్కదశలో పూలు రానందున ఎలా ప్రారంభించాలన్న మీమాంస తలెత్తింది. దీంతో ప్రారంభోత్సవాన్ని కొద్దికాలం వాయిదా వేశాం. ఇప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి పూర్తిస్థాయిలో పూలు ఉన్నాయి.త్వరలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నాం. అధికారికంగా ప్రారంభించాకే సందర్శకులను అనుమతిస్తాం. - వి.కృష్ణ, బుద్ధపూర్ణిమ ఓఎస్డీ భవితవ్యం ఏమిటి? ఆకాశహర్మ్యాలతో హుస్సేన్‌సాగర్ ప్రాంతాన్ని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి. నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్కులో గల 96 ఎకరాల విస్తీర్ణంలోనూ అద్భుతమైన నిర్మాణాలకు అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే... ఇప్పటికే రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన రోజ్‌గార్డెన్ (గులాబీ తోట) భవితవ్యం ఏమిటన్నది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. నిర్మాణం పూర్తయి 6నెలలు గడిచినా ఇంతవరకు అధికారికంగా ప్రారంభించకపోవడం సందేహాలకు తావిస్తోంది. -
సమరానికి సన్నాహం
సాక్షి, కడప : రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. పోలీస్‌శాఖ ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించింది. సమస్యలు తలెత్తే పోలింగ్ కేంద్రాలను కేటగిరి వారిగా వర్గీకరించినట్టు తెలుస్తోంది. ఈ జాబితా ఉన్నతాధికారులకు చేరినట్టు సమాచారం. ఈనెల 31లోగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని రెవెన్యూ శాఖకు గడువు విధించారు. అయితే ఆ శాఖాధికారులు ఇంకా పోలింగ్ స్టేషన్లను గుర్తించే పనిలో ఉండటంతో ఈ జాబితా తయారు చేయలేదు. ఇప్పటికే పలు మండలాల్లో తహశీల్దార్లు, పోలీసులు సమావేశమై శాంతి భద్రతల గురించి సంయుక్తంగా చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత, సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించేవారు. తాజాగా ఈసారి రెండు కేటగిరిల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను కేటగిరి వారిగా జాబితాను రూపొందించారు. దీంతో పాటు కులాలవారీగా ఓటర్లను భయభ్రాంతులు చేయడం, పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే వారిని రాకుండా అడ్డుకోవడం వంటి సమస్యలపై దృష్టిసారించారు. జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాలు జిల్లాలో ముఖ్యంగా జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించారు. వీటిపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి పోలీస్, రెవెన్యూ శాఖలు వేరువేరుగా పంపిన జాబితాలను ఎన్నికల సంఘం క్రోడీకరించుకొని తుది జాబితాను రూపొందించనుంది. ప్రస్తుతం పోలీసు శాఖ రూపొందించిన అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక జాబితా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేనాటికి అప్పుడున్న తాజా రాజకీయాల ఆధారంగా వీటి సంఖ్య పెరగడం, తగ్గడం వంటి మార్పులు చోటుచేసుకోవచ్చు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ గ్రామాల్లో పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జీవీజీ ఆశోక్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉండే రౌడీషీటర్లను, సమస్యలు సృష్టించేవారిని పిలిపించి డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మీ కదలికలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ప్రవర్తనలో మార్పు వస్తే రౌడీషీట్లు ఎత్తివేస్తామని వారిలో మార్పుతెచ్చే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాజకీయంగా అల్లర్లకు పాల్పడే వారిపై కన్నేసి జాబితాను రూపొందిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లాగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.