dgp rajendran
-
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్డీపీఓగా బదిలీ, కాశీబుగ్గలో ఎస్డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. బదిలీల ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి (చదవండి: బాబు చీకటికి.. జగన్ వెలుగులకు ప్రతినిధి) -
గుట్కా మాఫియాపై సీబీఐ పంజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో మూడేళ్లుగా రహస్యంగా సాగుతున్న గుట్కా అక్రమ అమ్మకాలపై సీబీఐ పంజా విసిరింది. గుట్కా తయారీదారుల నుంచి రూ.40 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇళ్లపై బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తమిళనాడులో మొత్తం 40 చోట్ల, బెంగళూరు, ముంబైలో రెండు చోట్ల దాడులు జరిగినట్లు తెలిసింది. రూ.250 కోట్ల ఆదాయ పన్నును ఎగవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ గుట్కా వ్యాపారి గిడ్డంగులపై అధికారులు సోదాలు నిర్వహించడంతో గతేడాది జూలై 8న ఈ స్కాం వెలుగుచూసింది. ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలపై విజయభాస్కర్ నివాసంలో గతంలో ఐటీ అధికారులు కూడా సోదాలు జరిపారు. పదవిలో ఉండగా సీబీఐ దాడులు ఎదుర్కొన్న తొలి డీజీపీ రాజేంద్రనే కావడం గమనార్హం. మాజీ మంత్రి, ఐఆర్ఎస్ నివాసాల్లోనూ గుట్కా మాఫియాపై ఆధారాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే అనుమాని తుల నివాసాలపై సీబీఐ దాడులు ప్రారంభమయ్యాయి. చెన్నై గ్రీన్‌వేస్‌రోడ్డులోని ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ నివాసంలో ఐదుగురు, ముగప్పేరీలోని డీజీపీ రాజేంద్రన్ ఇంట్లో పది మంది అధికారులు సోదాలు జరిపారు. నొళంబూరులో నివసిస్తున్న మాజీ పోలీస్ కమిషనర్ జార్జ్ ఇంట్లో ఐదుగురు అధికారులు తనిఖీలు చేశారు. వీరుగాక విజయభాస్కర్ అనుచరులు, సహాయకులు, తిరువళ్లూరులో నివసిస్తున్న మాజీ మంత్రి రమణ, 2009 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి గుల్జార్ బేగం తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అన్ని చోట్ల నుంచి కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయభాస్కర్, రాజేంద్రన్‌ను వారివారి పదవుల నుంచి తొలగించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. నిషేధాన్ని నీరుగార్చిన మంత్రి గుట్కా, పాన్ మసాలా తదితర మత్తుపదార్థాల అమ్మకాలపై 2013లో తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా గుట్కా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుట్కా హోల్‌సేల్ వ్యాపారి మాధవరావుకు చెందిన గిడ్డంగిపై ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ ఎత్తున సరుకును, ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.ఆ డైరీలో కార్పొరేషన్‌లోని కిందిస్థాయి అధికారి మొదలుకుని ఐపీఎస్ అధికారులు, ఒక మంత్రి వరకు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు, ఏయే తేదీల్లో ముట్టజెప్పిన వివరాలు ఉన్నాయి. గుట్కాపై నిషేధాన్ని మంత్రి, అధికారులే నీరుగార్చేశారని తెలుసుకుని ఐటీ అధికారులు విస్తుపోయారు. డైరీలో ఉన్న లెక్కల ప్రకారం మంత్రి, 23 మంది అధికారులకు సగటున రూ.60 లక్షల చొప్పున మొత్తం రూ.40 కోట్ల వరకు ముడుపులు చెల్లించినట్లు తేలింది. శశికళకూ సంబంధాలు? జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగానే గుట్కా అక్రమాలపై ఆదాయ పన్ను శాఖ రాసిన లేఖ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, డీజీపీ అశోక్‌కుమార్‌లకు చేరింది. అయితే వారు ఈ విషయాన్ని జయలలిత దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఆమె చనిపోయిన తరువాత గుట్కా కేసు దాదాపుగా అటకెక్కింది. ఆ తరువాత జయలలిత నివాసంలో సోదాలు జరిపినప్పుడు శశికళ గదిలో ఐటీ శాఖ రాసిన ఉత్తరం దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. గుట్కా అమ్మకాలు గుట్టుగా సాగడంలో శశికళ ప్రమేయం ఉందన్న అనుమానంతో, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధకశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎంకే ఎమ్మెల్యే, సీనియర్ నేత దురైమురుగన్ విజ్ఞప్తి మేరకు గత ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. చెన్నైలో రాజేంద్రన్ ఇల్లు -
విచారణకు పోలీస్‌బాస్ !
♦ గుట్కా కేసులో మదురై హైకోర్టు స్పష్టీకరణ ♦ విచారణ కమిషన్‌కు పూర్తి అధికారాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, నేరాలను అదుపుచేయాల్సిన డీజీపీ రాజేంద్రనే నిందితుడుగా మారిపోయాడు. నిషేధిత గుట్కా అమ్మకాలను గుట్టుగా కానిచ్చేశారనే ఆరోపణలపై విచారణ జరిపేందుకు మదురై హైకోర్టు అనుమతించింది. అవినీతి నిరోధకశాఖకు పూర్తి అధికారాలు కల్పిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. రాజేంద్రన్ చెన్నై నగర్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో 2015లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత డీజీపీగా పదోన్నతి కల్పించారు. డీజీపీ రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీకాలాన్ని సీఎం ఎడపాడి మరో రెండేళ్లు పొడిగించారు. నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ కూడా ఒక నిందితుడని, నగర కమిషనర్‌గా ఉన్న కాలంలో సైతం గుట్కా అమ్మకాలు సాగాయని ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టింది. గుట్కా గోల్మాల్ నుంచి రాజేంద్రన్‌ను రక్షించేందుకే ఆయన పదవీకాలాన్ని పొడిగించారని తప్పుపడుతూ మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ ఈనెల 7వ తేదీన హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక శాఖ నుంచి విచారణ ఎదుర్కొంటున్న డీజీపీకి కల్పించిన పదవీకాల పొడిగింపుపై స్టే విధించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ కోరాడు. తనకు బెదిరింపులు వస్తున్నందున సాయుధ పోలీసును బందోబస్తుకు కేటాయించాలని కోరుతో మరో అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌ల ముందుకు ఈనెల 6వ తేదీన విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు వాదనపై వివరాలు అందజేయాల్సిందిగా న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని ఆనాడు ఆదేశించారు. ఈనెల 17వ తేదీ వాయిదా నాటికి ప్రభుత్వ అధికారులు పత్రాలను దాఖలు చేసి తమ వాదనను వినిపించారు. అత్యున్నత స్థానంలోని అధికారులపై చేసే ఫిర్యాదులకు ఆధారాలు కూడా సమర్పించాలని న్యాయమూర్తులు పిటిషనర్‌ను ఆదేశించారు. శుక్రవారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్ మాట్లాడుతూ డీజీపీ పదవీకాలం పొడిగింపుపై తాము స్టే మంజూరు చేయలేం, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలపై 20 రోజుల్లోగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అవినీతి నిరోధకశాఖ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరగాలని వారు తీర్పు చెప్పారు. డీజీపీ, ప్రభుత్వం, రాజకీయ జోక్యం లేకుండా ఈ విచారణ కమిషన్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌పై సాహసోపేతంగా విచారణ జరపాలని వారు సూచించారు. విచారణ సమయంలో రాష్ట్ర హోంమంత్రిత్వశాఖ, మరే ఇతర శాఖల నుంచి అనుమతి పొందాల్సిన అవసరం కూడా లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
చిక్కుల్లో పోలీస్ బాస్
పోలీస్ బాస్ చిక్కుల్లో పడ్డారు. గుట్కా అక్రమ అమ్మకాల్లో అవినీతి ఆరోపణలు, తన నియామకం, అవినీతి ఆరోపణలపై వివరణలు కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ చీఫ్ కమిషనర్‌కు మదురై కోర్టు జారీ చేసిన ఆదేశాలు తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ⇒ పొడిగింపును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ ⇒ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖకు కోర్టు ఆదేశాలు ⇒ డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశం నిందితులు తప్పించుకోలేరు: పొన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: డీజీపీగా రాజేంద్రన్ గత నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. సర్వీసులో ఉన్న ఎందరో సీనియర్ ఐపీఎస్‌లు డీజీపీగా పదోన్నతి లభించక వెంపర్లాడుతుండగా ఉద్యోగ విరమణ వయస్సు దాటిపోయిన రాజేంద్రన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడంపై ఆక్షేపణలు మొదలయ్యాయి. అలాగే నిషేధిత గుట్కా, పాన్ మసాలా అక్రమ అమ్మకాల కేసులో డీజీపీ రాజేంద్రన్ సైతం ఒక నిందితుడని ఒక ఇంగ్లిషు టీవీ చానల్ ఆధారాలు సహా బైటపెట్టి కలకలం రేపింది. గుట్కా వ్యవహారం నుంచి రాజేంద్రన్‌ను తప్పించేందుకే పదవీకాలాన్ని పొడిగించినట్లుగా మదురై మీనాంబాళపురానికి చెందిన కే కదిరేశన్ హైకోర్టు మదురై శాఖలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు కేకే శశిధరన్, జీఆర్ స్వామినాథన్‌ల ముందుకు గురువారం విచారణకు వచ్చింది. పిటిషన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ గుట్కా స్థావరాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని, అందులో రాష్ట్ర మంత్రులు, సీనీయర్ ఐపీఎస్ అధికారులు లంచం పుచ్చుకున్నట్లు పేర్కొని ఉన్నారని చెప్పారు. గుట్కా స్థావరాలపై దాడులు జరిగినప్పుడు చెన్నై పోలీస్ కమిషనర్‌గా రాజేంద్రనే ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. గుట్కా అక్రమ అమ్మకాల్లో భాగస్వామ్యులైన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఐటీ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి లేఖరాశారని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. ఎన్నో ఆధారాలతో ఐటీ సమర్పించిన ఉత్తరాన్ని ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అయితే అప్పటి డీజీపీ ఐటీ ఇచ్చిన ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధకశాఖ సిఫారసు చేశారని అన్నారు. ఈ కారణంగానే సదరు డీజీపీ చేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆయన కోర్టుకు తెలిపారు. డీజీపీగా నియామకం ముందు రాజేంద్రన్‌పై ఉన్న ఆరోపణలను యూపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లకుండా కప్పిపెట్టారని విమర్శించారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ సాగుతోందని ముఖ్యమంత్రి ఎడపాడి అసెంబ్లీలో అంగీకరించినందున నిందితుడిగా ఉన్న రాజేంద్రన్ డీజీపీగా కొనసాగేందుకు వీలులేదని ఆయన వాదించారు. డాక్యుమెంట్లు సమర్పించండి: న్యాయమూర్తులు పిటిషన్‌దారు వాదన విన్న అనంతరం న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. డీజీపీ నియామకం సమయంలో యూపీఎస్సీ సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు సమర్పించాలి. ఐటీ తనిఖీలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతిని«ధులపై అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేసిన పత్రాలను ఐటీ చీఫ్ కమిషనర్ కోర్టుకు సమర్పించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు వెంటనే చేపట్టిన చర్యలు, విచారణకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ కోర్టుకు సమర్పించాలి. ఈ డాక్యుమెంట్లను సీల్ చేసిన కవరులో కోర్టుకు అందజేయాలి. ఈ డాక్యుమెంట్లను కోరినందున డీజీపీ నియామకంపై కోర్టు ఏదో నిర్ణయం తీసుకుందని భావించరాదని న్యాయమూర్తులు పేర్కొంటూ ఈనెల 10వ తేదీకి వాయిదా వేశారు. నిందితులు తప్పించుకోలేరు: కేంద్ర మంత్రి పొన్ గుట్కా వ్యవహారంలో భాగస్వాములైన నిందితులను ఎవరూ తప్పించకూడదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ మదురై తిరుప్పరగున్రంలో శుక్రవారం మీడియాతో అన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసి దోషులను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసు దాడి?
తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని భావిస్తున్న శశికళ... ఎమ్మెల్యేలను దాచిపెట్టారని భావిస్తున్న క్యాంపుపై దాడికి పోలీసులు బయల్దేరారు. స్వయంగా రాష్ట్ర పోలీసు అత్యున్నతాధికారి అయిన డీజీపీ టీకే రామచంద్రన్ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం గోల్డెన్ బే రిసార్టుల వద్దకు బయల్దేరింది. కాంచీపురం జిల్లాలోని మహాబలిపురం సమీపంలో సముద్రంలో గల ఒక దీవిలో ఉన్న ఈ రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరినీ దాచిపెట్టారని భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అటు నుంచి అటే మొత్తం ఎమ్మెల్యేలందరినీ మూడు ఏసీ బస్సుల్లో ఈ రిసార్టులకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పోలీసు బృందం బయల్దేరిన విషయం తెలిసి ఎమ్మెల్యేలను అక్కడినుంచి తరలించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ముందుగా పడవల్లో సముద్ర తీరానికి తీసుకొచ్చి, అక్కడినుంచి మొత్తం ఎమ్మెల్యేలను వేర్వేరు బృందాలుగా చేసి వేర్వేరు చోట్ల ఉంచాలని శశి వర్గం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు డీజీపీ బృందం అక్కడకు వెళ్లిన తర్వాత ఎంతమంది అక్కడ ఉంటారు, ఉన్నవాళ్లు ఏమని చెబుతారన్న విషయాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఆధారపడి ఉంటాయి.