Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Serious Comments On CM Chandrababu1
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్‌ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025

Will Strike Any Structure Built To Divert Indus Water: Pak Minister2
మరింత అగ్గి రాజేసేలా.. పాక్‌ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

తీరుమార్చుకోని పాకిస్థాన్‌ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్‌ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్‌ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్‌ ఓడలపై భారత్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్‌, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్‌ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్‌, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్‌ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

Robert Kiyosaki Explains How Employment is Closely Linked to the Market Crash3
'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తన 'ఎక్స్' ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ చేస్తూ.. నిరుద్యోగ భయం ప్రపంచవ్యాప్తంగా వైరస్ మాదిరిగా ఎలా వ్యాపిస్తుందో వివరించారు. జాగ్రత్తగా ఉండండి, అని చెబుతూనే.. నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని వాస్తవికతను వెల్లడించారు. అంతే కాకుండా తన పుస్తకాన్ని గురించి ప్రస్తావిస్తూ.. పుస్తకంలో తాను పేర్కొన్నట్లు జరగకపోతే మంచిదని అన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, మార్కెట్ క్రాష్‌ అవుతాయి. గుర్తుంచుకోండి. అయితే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉండండి. దీన్ని కూడా ఒక అవకాశంగా తీసుకోండని రాబర్ట్ కియోసాకి అన్నారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తిప్పికొట్టడానికి, అభ్యాసంగా మార్చుకోవడానికి.. ఒక మార్గాన్ని కనుగొన్నానని ఆయన తెలిపారు.మార్కెట్ పతనమయ్యే సమయంలో.. చాలా తెలివిగా పెట్టుబడులు పెట్టాలనే తన ఆదర్శాన్ని రాబర్ట్ కియోసాకి పంచుకున్నారు. ఆ సమయంలోనే నిజమైన ఆస్తులు అమ్మకానికి వస్తాయంటూ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల మార్కెట్లలో అల్లకల్లోలం సంభవిస్తుంది. అలాంటి స్థితిలో కూడా వారెన్ బఫెట్ మాదిరిగా ఆలోచించి.. పెట్టుబడులు పెట్టాలని అన్నారు.ఇదీ చదవండి: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..బిట్‌కాయిన్ విలువ 300 డాలర్లకు పడిపోతే.. బాధపడతారా?, సంతోషిస్తారా? అని రాబర్ట్ కియోసాకి ప్రశ్నించారు. ఇదే జరిగితే (బిట్‌కాయిన్ విలువ తగ్గితే) పెట్టుబడి పెట్టేందుకు ఒక చక్కటి అవకాశం అవుతుంది. ఆర్థిక మాంద్యం గురించి ప్రజలను సిద్ధంగా ఉంచాలని తాను ఈ పోస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితిపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తూ.. ఆందోళన చెందుతున్న పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఓప్రా విన్‌ఫ్రే, అబ్రహం లింకన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, జార్జ్ పటేర్నోల కోటేషన్స్‌ను కూడా రాబర్ట్‌ పోస్ట్‌కు జోడించారు.FEAR of UNPLOYMENT spreads like a virus across the world.Obviously, this fear is not good for the global economy.As warned in an earlier book, Rich Dads Prophecy, the biggest market crash, a crash that is leading to the recession we are in…. and possible New Great…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 30, 2025

IPL 2025: How SRH Can Qualify For Playoffs After Defeat Against GT4
IPL 2025: సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే..?

భారీ అంచనాలతో ఐపీఎల్‌-2025 (IPL 2025) బరిలో దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టు తుస్సుమనిపించింది. ఈసారి 300 స్కోరు పక్కా అనుకుంటే.. నామమాత్రపు లక్ష్యాలనూ ఛేదించలేక చతికిలపడింది. ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ (రైజర్స్‌- 286)పై దంచికొట్టడం మినహా ఈసారి రైజర్స్‌ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనబడలేదు.తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌ (GT vs SRH)తో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ పూర్తిగా విఫలమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది.ఆకాశమే హద్దుగా చెలరేగి..ఈ క్రమంలో టైటాన్స్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి.. రైజర్స్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఓపెనర్లు సాయి సుదర్శన్‌ (23 బంతుల్లో 48), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 76).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ (37 బంతుల్లో 64) ధనాధన్‌ దంచికొట్టారు. ఈ ముగ్గురి అద్భుత ఇన్నింగ్స్‌ నేపథ్యంలో టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది.సన్‌రైజర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌ దారుణంగా విఫలమయ్యారు. వీరిద్దరి బౌలింగ్‌ (షమీ 48, పటేల్‌ 41)లో టైటాన్స్‌ 89 పరుగులు పిండుకుంది. మిగతావాళ్లలో కెప్టెన్‌ కమిన్స్‌, జీషన్‌ అన్సారీ ఒక్కో వికెట్‌ తీయగా.. జయదేవ్‌ ఉనాద్కట్‌ మూడు వికెట్ల (3/35)తో రాణించాడు.అభిషేక్‌ శర్మ ఒక్కడేఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 20) మరోసారి విఫలమయ్యాడు. అతడి స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్‌ (17 బంతుల్లో 13) జిడ్డు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దుకునే బాధ్యత తీసుకున్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ 41 బంతుల్లో 74 పరుగులతో ఆకట్టుకున్నాడు.అయితే, మిగతా వాళ్ల నుంచి అతడికి పెద్దగా సహకారం అందలేదు. హెన్రిచ్‌ క్లాసెన్‌ (18 బంతుల్లో 23), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (10 బంతుల్లో 21 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌ 186 పరుగుల వద్ద నిలిచి.. 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసినట్లే.. కానీఇక ఇప్పటికి ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న సన్‌రైజర్స్‌కు ఇది ఏడో ఓటమి. తద్వారా మూడు విజయాలతో కేవలం ఆరు పాయింట్లలో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.అయితే, ఇంకా దింపుడు కళ్లెం ఆశలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే.. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ భారీ తేడాలతో విజయాలు సాధించాలి. అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా వస్తేనే ఇది జరుగుతుంది.ఇతర జట్ల పరిస్థితి ఇలాప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ (11 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), ఆర్సీబీ (10 మ్యాచ్‌లు, ఏడు విజయాలు, 14 పాయింట్లు), పంజాబ్‌ కింగ్స్‌ (10 మ్యాచ్‌లు, 6 విజయాలు, 13 పాయింట్లు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (10 మ్యాచ్‌లు, ఐదు విజయాలు, 10 పాయింట్లు) టాప్‌-5లో ఉన్నాయి.ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌ (10 మ్యాచ్‌లు, 5 విజయాలు 10 పాయింట్లు), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (10 మ్యాచ్‌లు, 4 విజయాలు,9 పాయింట్లు)లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్తాన్‌ రాయల్స్‌ (11 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో ఎనిమిదో స్థానంలో ఉండడగా.. సన్‌రైజర్స్‌ (10 మ్యాచ్‌లు, మూడు విజయాలు, ఆరు పాయింట్లు)లతో రన్‌రేటు పరంగా వెనుకబడి తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌(10 మ్యాచ్‌లు, రెండు విజయాలు, నాలుగు పాయింట్లు)ఆఖర్లో పదో స్థానంలో ఉంది.ఢిల్లీ, కేకేఆర్‌, ఆర్సీబీ, లక్నోలపై గెలిచిరాజస్తాన్‌, చెన్నైలను మినహాయిస్తే సాంకేతికంగా మిగిలిన ఎనిమిది జట్లకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్‌ గనుక మిగిలిన అన్ని మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాలి. ఢిల్లీ, కేకేఆర్‌, ఆర్సీబీ, లక్నోలపై ఘన విజయం సాధిస్తే.. పద్నాలుగు పాయింట్లతో పాటు నెట్‌ రన్‌రేటు (ప్రస్తుతం- -1.192) కూడా మెరుగుపడుతుంది.అదే విధంగా.. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌, ఆర్సీబీ తమ మిగిలిన మ్యాచ్‌లలో మెజారిటీ శాతం ఓడిపోవాలి. ఇక పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ కూడా రేసులో ఉన్నాయి. ఈ రెండు జట్లు కూడా తదుపరి మ్యాచ్‌లో ఎక్కువగా ఓడిపోవాలి. ఇంతా జరిగినా సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఇంకేదో అద్భుతం జరగాలి. అయితే, తదుపరి ఢిల్లీ (మే 5)తో మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం ఓడిందా.. ఇక అంతే సంగతులు! టోర్నీ నుంచి అవుట్‌.. సోషల్‌ మీడియా మీమర్ల భాషల్లో చెప్పాలంటే చెన్నై, రాజస్తాన్‌లతో పాటు అసోం రైలుకు టికెట్‌ కన్‌ఫామ్‌ చేసుకున్నట్లే!!చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

YSRCP Ambati Rambabu Questioned Chandrababu Over Amaravati5
‘5000 కోట్లు.. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?’

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్‌ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్‌ క్లాస్‌ క్యాపిటల్‌ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్‌ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

KSR Comments On Yellow Media And Chandrababu6
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!

రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Authorities Open Salal Dam Gates To Regulate Water Flow After Heavy Rains In jammu and kashmir7
సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్‌ గగ్గోలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ చినాబ్‌ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్‌ అయ్యారు. సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్‌ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్‌ డ్యామ్‌ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్‌ అధికారులు. దీంతో పాకిస్తాన్‌లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్‌ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్‌ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌ బస్టర్‌ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్‌ డ్యామ్‌ గేట్లు ఎత్తారు.

Vijay Devarakonda Clarifies Tribes Remarks8
‘గిరిజన’ వివాదంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కిషన్‌ రాజ్‌ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో హీరో విజయ్‌ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్‌ రాజ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్‌ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు.ఇంతకీ ఏం జరిగింది?తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా ఉద్దేశం అది కాదు: విజయ్‌అయితే విజయ్‌ మాత్రం ట్రైబ్స్‌ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్‌ తన ఎక్స్‌ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎ‌వరైనా To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025

Czech Republic Hikers Find Crores Worth Treasure9
అదృష్టమంటే ఇదే.. విహార యాత్ర వెళ్తే 2.87 కోట్ల నిధి సొంతం!

ఇంట్లో బోర్‌ కొడుతుంది బ్రో.. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?.. అంటూ సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు జాక్‌పాట్‌ తగిలింది. అనుకోకుండా నక్క తోక తొక్కవురా బాబు.. అని సామెత అంటారు కదా.. అలాంటి రేంజ్‌తో వారిద్దరీకి 2.87 కోట్ల నిధి దొరికింది. ఈ ఆసక్తికర ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశంలో చోటుచేసుకుంది. ఈ జాక్‌పాట్‌ నిధికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చెక్ రిపబ్లిక్‌లో ఇద్దరు వ్యక్తులు హైకింగ్ చేసుకుంటూ ఈశాన్య పోడ్‌క్ర్కోనోసి పర్వతాలలోని అడవిలోకి వెళ్లారు. ఇలా వారు కొంత దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత.. ఒకానొక ప్రదేశంలో తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. గట్టిగా అడుగులు వేయడంతో శబ్ధం వచ్చింది. దీంతో, అక్కడ కొంత భూమి పొరను తీసి చూడగానే వారిని నిధి కనిపించింది. దానిలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అనంతరం, వాటిని ఈస్ట్ బోహేమియా మ్యూజియం స్వాధీనం చేసుకుంది. ఈ నిధి ఫిబ్రవరిలోనే దొరికినా.. మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయం వెల్లడించారు.మ్యూజియం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిధిలో దొరికిన వాటి విలువ సుమారు రూ.2.87 కోట్లు($340,000) ఉంటుందని అంచనా వేశారు. తాజాగా వాటి బరువు సుమారు 15 పౌండ్లు ఉంటుందని పేర్కొంది. అయితే, నిధిలో దొరికిన బంగారు నాణేలు 100 సంవత్సరాల క్రితం 1808 నుంచి 19వ శతాబ్దం ప్రారంభం నాటివని తెలిపారు. ఈ నిధిని 1921 కాలంలో దాచిపెట్టి ఉంటారని అన్నారు. ఇక, ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా-హంగేరీ నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఈ నిధిలో ఉంది.Whoa, what a find! Hikers in the Czech Republic uncovered a $340K stash of gold coins & jewelry near Zvičina Hill! Hidden since WWII, this treasure’s now at the Museum of East Bohemia. Keep hunting, folks! pic.twitter.com/oie6TkDoRI— @_Treasure_Kings_ (@_Treasure_Kings) April 30, 2025ఇదిలా ఉండగా.. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 వరకు ఉన్న పూర్వ యుగోస్లేవియాలో ముద్రించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీలు రష్యన్ దళాలను బహిష్కరించినప్పుడు ముందుకు వస్తున్న రష్యన్ దళాల నుండి వెనక్కి తగ్గడం వల్ల ఈ నిధిని దాచి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే, పర్వతం వైపున నిధి ఎలా పాతిపెట్టబడిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ‘చెక్’ దేశ చట్టాన్ని అనుసరించి పర్యాటకులు ఇద్దరికీ మొత్తం విలువలో దాదాపు 10 శాతం పొందే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు.. విలువైన వస్తువులను భూమిలో నిధుల రూపంలో నిల్వ చేయడాన్ని పూర్వకాలంలో డిపోలు అని పిలిచే ఆచారం స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చెబుతున్నారు.

CIA plans to layoffs workforce by some 1,200 positions10
CIA: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్‌ కత్తి..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్‌ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్‌ఎస్‌) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement