Dharoor
-
యువకుడి దారుణ హత్య.. 70 రోజుల తర్వాత..
సాక్షి, మహబూబ్‌నగర్: అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడినే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ రంగస్వామి కథనం ప్రకారం.. ధరూరు మండలం చిన్నపాడుకు చెందిన సాయికుమార్(21) తన భార్యతో కలిసి గద్వాలలోని బీసీకాలనీలో నివాసం ఉంటున్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ తన అక్క, బావ ఇంటి వద్ద (అదే కాలనీలో) ఉంటుండగా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో మే 11న ర్యాలంపాడు రిజర్వాయర్ వద్దకు సాయికుమార్, శ్రీకాంత్ ఇద్దరు కలిసి విందు చేసుకునేందుకు సాయికుమార్ బైక్‌పై వెళ్లి రిజర్వాయర్ ప్రాంతంలో గుట్ట మద్యం తాగారు. ఆ తర్వాత తనకు ఇవ్వాల్సిన రూ.25 వేలు ఇవ్వాలని శ్రీకాంత్ అడగగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆగ్రహించిన శ్రీకాంత్ మద్యం బాటిల్‌ను పగులగొట్టి సాయికుమార్ గొంతులో పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై సాయికుమార్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత శ్రీకాంత్ పక్కనే ఉన్న గోతిలో శవాన్ని పూడ్చి బైక్‌పై తిరిగి వచ్చి బెంగళూరు వెళ్లిపోయాడు. సాయికుమార్ కుటుంబ సభ్యులు తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లేకపోయింది. ఈ నెల 3న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న రేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అప్పటి నుంచి అన్ని కోణాల్లో రేవులపల్లి ఎస్ఐ శేఖర్‌రెడ్డి, సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. బైక్ వివరాల ఆధారంగా.. హత్య జరిగిన తర్వాత శ్రీకాంత్ బైక్‌ను రేవులపల్లికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలకు కుదువ పెట్టారు. ద్విచక్రవాహనాన్ని కుదువ పెట్టుకున్న వ్యక్తి ఆర్సీ వివరాలను పరిశీలించగా చిన్నపాడుకు చెందిన సాయికుమార్ వివరాలు రావడంతో అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. క్లూస్ టీం సాయంతో విచారణ వేగవంతం చేసి శ్రీకాంత్, మరో వ్యక్తిని విచారించారు. సాయికుమార్‌ను తానే హత్య చేశానని శ్రీకాంత్ ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద పాతిపెట్టిన సాయికుమార్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దరాయప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. సీఐ చంద్రశేఖర్, గట్టు, మల్దకల్ ఎస్‌లు పవన్‌కుమార్, శే ఖర్, ధరూరు తహసీల్దార్, పోలీసులు పాల్గొన్నారు. -
లూనాను ఢీకొట్టిన కారు..∙ వాచ్మెన్ మృతి
ధారూరు: లూనా(ద్విచక్ర వాహనం)పై వెళుతు న్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో వ్యక్తి దుర్మరణం చెందాడు. కారుతో సహా పారిపోతున్న డ్రైవర్‌ను అక్కడే ఉన్న యువకులు వెంబడించి పట్టు కుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ధారూరు మండలంలోని రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... పెద్దేముల్ మండలం రేగొండి గ్రామానికి చెందిన మొయినుద్దీన్(55) వికారాబాద్ పట్టణ సమీప శేఖర్‌రెడ్డి క్రషర్ మిషన్ వద్ద నైట్ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజూ సాయంత్రం ఇంటి నుంచి క్రషర్ మిషన్ వద్దకు వెళ్లి తిరిగి ఉదయం పూట ఇంటికి చేరుకుంటాడు. ఆదివారం రాత్రి విధులు నిర్వహించి ఉదయం తన లూనాపై ఇంటికి వస్తున్నాడు. ధారూరు మండలం రాంపూర్‌తండా బస్‌స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న కారు లూనాను బలంగా ఢీకొట్టింది. లూనాపై నుంచి మోయినుద్దీన్ కారుపై ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. లూనాను కారు కొద్దిదూరం అలాగే లాక్కెళ్లింది. ఇది గమనిస్తున్న ఇద్దరు యువకులు కారును పట్టుకునే ప్రయత్నం చేయగా వారి నుంచి తప్పించుకునేందుకు వేగంగా తాండూర్ వైపు పరుగు తీసింది. ఓ యువకుడు వెంటనే తన సెల్ ద్వారా ముందు స్టేజీ వద్ద మిత్రునికి సమాచారం ఇవ్యగా అతను గ్రామస్తులతో కలిసి కారును రోడ్డుపై నిలిపివేశారు. కారులో ఉన్న ఓ మహిళ, డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. బైక్‌లపై కారును వెంబడించిన యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చి కారును అప్పగించారు. కుటుంబానికి పెద్ద దిక్కు మృత్యువాత పడటంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి శవ పంచానామ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసును దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం మోయినుద్దీన్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు భార్యలు మృతి చెందగా.. కొడుకులు కూలీ పనులు చేస్తున్నారు. ఇతర ఆదాయ వనరులు లేకపోవడంతో కుటుంబం అంతా తండ్రి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. -
ధారూరుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్
ధారూరు: మండల కేంద్రానికి ఫారెస్టు రేంజ్ ఆఫీస్ మంజూరైంది. మూడు సెక్షన్లను కలిపి ఇక్కడ రేంజ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ధారూరు ఫారెస్టు సెక్షన్ ఆఫీసు మాత్రమే ఉంది. అయితే వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో.. రేంజ్ ఆఫీస్ ఏర్పాటు కోసం అటవీశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ ఫారెస్ట్ అధికారి తెలిపారు. దీని పరిధిలోకి అడాల్‌పూర్, ధారూరు, జుంటుపల్లి సెక్షన్లు రానున్నాయి. ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మన్సాన్పల్లి, రుద్రారం, ధారూరు, రాస్నం, దోర్నాల్, జుంటుపల్లి, కొప్పన్‌కోట్ ఫారెస్ట్ బీట్లను చేర్చారు. ఇంతవరకు జుంటుపల్లి సెక్షన్ తాండూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో, ధారూరు సెక్షన్ వికారాబాద్ రేంజ్లో ఉన్నాయి. అడాల్‌పూర్ మాత్రం ఇప్పటివరకూ బీట్‌గానే కొనసాగింది. ప్రస్తుతం దీన్ని సెక్షన్ ఆఫీస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ధారూరులో ముగ్గురు, అడాల్‌పూర్‌లో ఇద్దరు, జుంటుపల్లిలో ఇద్దరు చొప్పున బీట్ ఆఫీసర్లు ఉన్నారు. ధారూరు, రాస్నం బీట్లలో ఇద్దరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ధారూరులో కొత్తగా రేంజ్ ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు కావడంతో నాలుగు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అదనంగా కేటాయించారు. రుద్రారం, రాస్నం, దోర్నాల్, కోపన్‌కోట ఫారెస్టు బీట్లలో.. బీట్ ఆఫీసర్లకు తోడుగా వీరిని నియమించనున్నారు. జిల్లాలోని ధారూరు ఫారెస్టు పరిధిలోనే అధికంగా అడవులు ఉండటమే రేంజ్ ఆఫీసు ఏర్పాటుకు కారణం. -
పూణే నుంచి అజ్మీర్‌కు సైకిల్ యాత్ర
మానవాళి క్షేమంగా ఉండాలి: కౌసర్‌షాహ ధారూరు : ప్రపంచంలోని మానవులు, పశుపక్షాదులు, ఇతర జీవకోటి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూణెకు చెందిన కౌసర్‌షాహ (75) సైకిల్ యాత్ర చేపట్టాడు. మహారాష్ట్రలోని పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ధారూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 20 ఏళ్లుగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సైకిల్ యాత్ర చేస్తున్నానని, అందులో భాగంగానే 13 రోజుల క్రితం పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు బయలుదేరినట్లు తెలిపారు. 20 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకోవాలన్నది తనలక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు (13 రోజులు) 450 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. మరో 7 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకుంటానని దీమా వ్యక్తం చేశారు. నేడు ప్రపంచంలోని దేశాలన్నీ ఆదిపత్యం కోసం అలజడులు, హింసలు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతితో పాటు, భారతదేశంలోని ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలన్నది తన యాత్ర ఉద్దేశమన్నారు. -
కపిలేశ్వరుడికి లక్ష బిల్వార్చన
ధారూరు వీరభద్రేశ్వర దేవాలయంలోని కపిలేశ్వర ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకం, అనంతరం వీరభద్రేశ్వరస్వామి, పార్వతీ మాతకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులు కపిలేశ్వరుడికి మారేడు దళాలతో లక్ష బిల్వార్చన చేశారు. సాయంత్రం స్వామివారిని పల్లకిలో గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. - ధారూరు