dhathraya
-
ట్యాంపరింగ్ చేసే గెలిచావా బాబూ?
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ట్యాంపరింగ్ చేసే అధికారంలోకి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. అదే నిజమైతే కాంగ్రెస్‌తో కలిసి ఆరోపణలు చేస్తున్న బాబు ఒక్క క్షణం కూడా సీఎం పదవిలో ఉండటానికి వీల్లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, 11 మందిని కాల్చి చంపించినట్లు చేసిన సయ్యద్ షుజా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చేసిన ఆరోపణలపై బుధవారం కిషన్‌రెడ్డి స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్, సయ్యద్ షుజాలపై డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కపిల్ సిబల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని.. ఈవీఎంలలో లోపాలుంటే రుజువు చేయాలని సవాల్ చేశారు. అక్కడ కూడా ట్యాంపరింగేనా?: దత్తాత్రేయ ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రజలంతా మోడీవైపే చూస్తున్నారన్నారు. 10% రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఆ అంశం లేకపోవడం భాధాకారమన్నారు. ఏపీలో చంద్రబాబు కాపులకు ఇస్తానన్న 5% రిజర్వేషన్లు బీజేపీ పుణ్యమేనన్నారు. -
బిల్ట్ పునరుద్ధరణ బాధ్యత రాష్ట్రానికి లేదా?
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ములుగు : బీజేపీ ములుగు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం మండలకేంద్రానికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వచ్చారు. ఈసందర్భంగా ఆయనను బిల్ట్ కార్మికులు, బీఎంఎస్ కార్యకర్తలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. గత 17 నెల లు గా పెండింగ్‌లో ఉన్న వేతనాలను అందించాలన్నారు. బిల్ట్ పునరుద్ధరణకు సహకరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి దత్తాత్రేయ రాష్ట్రంలోని పరిశ్రమను పునరుద్ధరించే బా ధ్యత రాష్ట్రానికి లేదా అని ప్రశ్నించారు. బిల్ట్, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్ర భుత్వానికి సూచించారు. కార్మికుల వేతనాలు అందేలా తాను సహకరిస్తానన్నారు. బీఎంఎస్ కార్యకర్తలు లిం గంపల్లి శ్రీనివాస్, పాకాల యాదవరెడ్డి, బాలసాని కొ మురయ్య, చుంచు శ్రీరంజన్, చిర్ర వెంకటేశ్వర్లు, రామి డి సురేశ్, కార్మికులు సుభాష్, బండారి వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, భిక్షపతి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.