28 వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈనెల 28వరకూ పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల తర్వాత బీఏసీ సమావేశం కానుంది. మరోవైపు బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీలో డీఎల్ఎఫ్ భూ కేపటాయింపులపై చర్చ జరగనుంది. కాగా నిన్న సభలో డీఎల్ఎఫ్ భూములపై ఇచ్చిన సావధాన తీర్మానంపై సీఎం ప్రసంగం అనంతరం విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.