Diesel trains
-
పొగ బండులు ఇక మాయం
సాక్షి, హైదరాబాద్: రైలుకు పర్యాయపదంగా వాడే పొగబండి ఇక మాయం కానుంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వేను పూర్తిస్థాయిలో విద్యుదీకరించి.. ఇక ఎలక్ట్రిక్ ఇంజన్లనే వాడాలన్న రైల్వే శాఖ నిర్ణయానికి తగ్గట్టుగా ఏర్పాట్లు వేగిరమయ్యాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు ఆ మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా ఎలక్ట్రిఫికేషన్ పనులను కూడా నిర్వహించాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయించింది.ఆ నిర్ణయాన్నే ఇప్పుడు అమలులోకి తెస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ (పూర్తి కొత్త) లైన్ పనుల్లో దీనిని అమలు చేయనున్నారు. దీనిలో భాగమైన మనోహరాబాద్ (మేడ్చల్ సమీపం), కొత్తపల్లి (కరీంనగర్ శివారు) ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటు ట్రాక్ పనులు నిర్వహిస్తూనే సమాంతరంగా విద్యుత్తు లైన్ కూడా ఏర్పాటు చేసే పని ప్రారంభించబోతున్నారు. మామూలుగా అయితే కనీసం ఓ దశాబ్దం తర్వాత జరగాల్సిన పనులు తాజా నిర్ణయం ప్రకారం ఇప్పుడే జరగనున్నాయి. ఈ మార్గంలో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం రైళ్లు నడుస్తున్నాయి. 76.65 కి.మీ. ఉన్న ఈ మార్గాన్ని ముందు విద్యుదీకరించాలని నిర్ణయించారు. ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు మరో రెండుమూడు నెలల్లో పనులు చేపట్టాలని తాజాగా నిర్ణయించారు.తెలంగాణలో జరగాల్సింది94 కి.మీ. మాత్రమే.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. వీటిల్లో 6,150 కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇందులో తెలంగాణ పరిధిలోని 2,015 రూట్ కి.మీ.లలో ట్రాక్ ఉండగా ఇప్పటికే 1,921 రూట్ కి.మీ. మేర విద్యుదీకరణ పూర్తయింది. ఇంకా కేవలం 94 కి.మీ.మేర మాత్రమే విద్యుదీకరణ పనులు జరగాల్సి ఉంది. ఏడాదిలో ఆ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న రైలు మార్గాల జాబితాలో మనోహరాబాద్–కొత్తపల్లి రూట్‌ను చేర్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండానే, విద్యుదీకరించనున్నందున దీనినీ ఎలక్ట్రిఫికేషన్ జాబితాలో చేరుస్తున్నారు. అకోలా మార్గంలో ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మధ్య పనులు జరగాల్సి ఉంది. అక్కన్నపేట–మెదక్ మధ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే తెలంగాణలో 100% విద్యుదీకరణ జరిగినట్టవుతుంది. రూ.105 కోట్లతో పనులు.. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ స్టేషన్ దాటాక ఈ కొత్త మార్గం మొదలవుతుంది. అక్కడి నుంచి 76.65 కి.మీ. దూరంలో ఉన్న సిద్దిపేట వరకు పనులు పూర్తి కావటంతో రైలు సరీ్వసులు ప్రారంభించారు. ప్రస్తుతం డీజిల్ లోకోతో కూడిన డెమూ రైళ్లు నడుస్తున్నాయి. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య ట్రాక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సమీపంలోని మానేరు మీద వంతెన నిర్మించి నది దాటాక కొత్తపల్లి వరకు ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 2027 నాటికి ఆ పనులు పూర్తవుతాయి. ఈలోపు సిద్దిపేట వరకు విద్యుదీకరించాలని నిర్ణయించి, అక్కడి వరకు రూ.105.05 కోట్లతో నిర్వహించే పనికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో నిర్మాణ సంస్థకు అవార్డు అందచేయటంతో పనులు మొదలుకానున్నాయి. గజ్వేల్ సమీపంలో 25 కేవీ సబ్‌స్టేషన్.. విద్యుత్ సరఫరా కోసం గజ్వేల్ సమీపంలో 25 కేవీ సామర్థ్యంతో ప్రత్యేక సబ్‌స్టేషన్‌ను నిర్మించనున్నారు. త్వరలో ఈ పనులు మొదలు కానున్నాయి. స్థానికంగా ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌తో దీనిని అనుసంధానిస్తారు. -
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
‘డీజిల్ కార్లు’ కొనసాగుతాయి: మారుతి
న్యూఢిల్లీ: సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తి ఇక మీదట కూడా కొనసాగుతుందని దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి బీఎస్–6 ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో ఈ తరహా కార్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనుందనే అనుమానాలకు సమాధానంగా సంస్థ చైర్మన్ ఆర్.సి భార్గవ ఈ మేరకు ప్రకటనచేశారు. ఉత్పత్తి నిలిపివేత అంశంపై బదులిచ్చిన ఆయన.. ‘డీజిల్ కార్ల ఉత్పత్తి ఆపేస్తామని ఎన్నడూ చెప్పలేదు. రానున్న రోజుల్లో చిన్నపాటి డీజిల్ ఇంజిన్ కార్ల ధరలు గణనీయంగా పెరుగుతాయి కనుక.. ఎంట్రీ లెవెల్ విభాగంలో వినియోగదారులు కొనుగోలు చేయదగిన వాటిని మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రణాళిక రూపొందించాం. ఈ క్యాటగిరీలో మార్కెట్ సీఎన్జీ వైపు మారుతోంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 51 శాతం వాటా ఉన్న మా సంస్థ.. ఉత్పత్తి పూర్తిగా ఆపివేస్తే వాటా తగ్గిపోతుంది. కేవలం మా సంస్థ కార్లు మాత్రమే కాకుండా.. అన్ని కంపెనీలకు ఇది వర్తిస్తుంది’ అని వివరించారు. -
బుల్లెట్ రైళ్ల యుగంలోనూ డీజిల్ ఇంజిన్ రైళ్లేనా?
దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరా లు, రైల్వేల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు. గత రెండు దశాబ్దాలుగా భారత రైల్వేల పరిస్థితి అధ్వా నంగా మారుతోంది. రైలు మార్గాల విస్తరణ, ఉన్న మార్గా ల పటిష్టత, ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన లాంటి అనేక ముఖ్య అంశాలను, భారత ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగుపర్చడంలో భారత ప్రభుత్వాలు, రైల్వే శాఖ పూర్తిగా విఫలమయ్యాయి. భారత రైల్వేలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని 2.5 కోట్ల రైలు ప్రయాణికులను నిత్యం అవస్థలపాలు చేస్తున్నాయి. కేంద్రంలో చాలా కాలం తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున ఏడు దశాబ్దాల తిరోగమన స్థితికి చరమగీతం పాడి భారత రైల్వేలను ప్రగతి వైపు నడిపించటంలో, ఈ నెల 26న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దోహదపడగలదని ఆశిద్దాం. భారత రైల్వేల వైఫల్యాలు: మనకు స్వాతంత్య్రానం తరం, దేశ జనాభా 85 కోట్ల్లు పెరిగి, మొత్తం జనాభా 120 కోట్లకు చేరింది. అయితే మన పాలకులు పెరిగిన 85 కోట్ల జనాభా అవసరాలకు, కేవలం 12వేల కి.మీ రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లను అవే మార్గాలలో ప్రవేశపెట్టడం వలన ట్రాక్‌పై ఒత్తిడి పెరిగి, తరచూ ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. మొత్తం 65 వేల కి.మీ రైలు మార్గం లో 20,884 కి.మీ (31.9 శాతం) విద్యుదీకరణ జరిగినా, ఇంకా 70 శాతం మార్గాన్ని విద్యుదీకరించవలసి ఉంది. దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరాల పట్ల ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు. రైల్వేల అవసరాలకు సరిపడా రైలు ఇంజిన్లు, రైలు పెట్టెల నిర్మాణం, రైలు బోగీల మరమ్మతులు, గూడ్స్ వ్యాగన్ల నిర్మాణం జరగడంలేదు. మనిషి కాపలాలేని వేల లెవెల్ క్రాసింగ్‌లు ఇంకా నడుస్తూ, ప్రతి ఏడాది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా ఒక్కో రైలు లో ఒక్కో ధరకు ఆహార పదార్థాలను విక్రయిస్తూ రోజూ లక్షలాది ప్రయాణికులను దోచుకుంటున్నారు. దేశంలో 12,500 ైరె ళ్లల్లో అత్యధిక శాతాన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లుగా పేరు మార్చి సర్‌చార్జి మొత్తం బెర్త్‌లలో 30 శాతం తత్కాల్ పేరుతో 100-200 ఎక్కువ వసూలు, ఇవి చాలక తత్కాల్‌కు కేటాయించిన బెర్త్‌లలో 50 శాతం ప్రీమియం తత్కాల్ పేరుతో టికెట్ ధరపై రెట్టింపు చార్జిని వసూలును 2014 అక్టోబర్ 1 నుండి అమలు చేస్తున్నారు. అధిక చార్జీల భారాన్ని మోయలేక సకు టుంబ సమేతంగా వెయ్యి కి.మీ లోపు దూర ప్రయా ణానికి కూడా స్వంత కార్లలో ప్రయాణాలు సాగిస్తుం డగా, కొందరు అదే ఖర్చుతో విమాన యానాన్ని ఆశ్రయిస్తున్నారు. పైగా, ఇప్పుడిస్తున్న అరకొర నిధులు ఇలానే ఇస్తే నిర్మాణ వ్యయం పెరగటమేగాక, కొత్త మార్గాలు పూర్తికాక, రైల్వేలకు అవి గుదిబండలుగా తయారవుతాయి. తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకత : పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గం నిర్మాణం గత 2 దశాబ్దాలుగా నడుస్తోంది. అలానే బీబీనగర్- సికిందరాబాద్ మధ్య 3వ లైన్ నిర్మాణ పనులు జరుగు తున్నా, సరిపడా నిధులు కేటాయించడం లేదు. బీబీనగర్-నడికుడి రెండవ లైన్‌కు, సికింద్రాబాద్- జహీరాబాద్‌కు, కాచిగూడ-చిట్యాలకు, జగ్గయ్యపేట- మిర్యాలగూడకు, డోర్నకల్-మణుగూరు, ఆర్మూరు- ఆదిలాబాద్, పటాన్చెరు-పెద్దపల్లి, సికిందరాబాద్- కరీంనగర్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణానికి, మనోహ రాబాద్-గద్వాల నిర్మాణానికి సర్వేలు జరిగి అరకొర నిధులు కొన్ని, అసలు నిధులు కేటాయించక మరికొన్ని నిద్రావస్థలో ఉన్నాయి. ఖాజీపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చినా పనులు ప్రారంభిం చలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ ఫారంల సంఖ్య పెంచి, రైళ్ల ఆలస్యాన్ని తగ్గించాలి. నడికుడి- బీబీనగర్ మార్గాన్ని విద్యుదీకరించాలి. హైదరాబాద్ ఎంఎంటిఎస్ 2వ దశ పనులను వేగవంతం చేయాలి. సికింద్రాబాద్ స్టేషన్లో సాధారణ టికెట్ కౌంటర్లను పెంచాలి. ఎస్కలేటర్ సౌకర్యాన్ని అన్ని ప్లాట్ఫారంలలో నిర్మిం చాలి. సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లు సకాలంలో గమ్య స్థానం చేరే చర్యలు చేపట్టాలి. రైల్వేల అభివృద్ధి కొరకు స్వదేశీ లేదా విదేశీ నిధులను కంట్రాక్టర్లు లేదా సంపన్న వర్గాలకు లబ్ది చేకూర్చేదిగా ఉండకూడదు. ప్రయాణ చార్జీలు పెంచితే 6 శాతం ప్రయాణికులు రైల్వేకు దూరమైన స్థితిలో, బుల్లెట్ రైళ్లను ప్రయాణికులు ఆదరిస్తారా? కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న భారత రైల్వేలు, ప్రజాసౌకర్యాల కోసం లక్షల కోట్ల భారాన్ని మోయగలవా? ప్రీమియం తత్కాల్ పేరుతో రెట్టింపు చార్జీలను పెంచటం దారుణం. ఈ చర్య రైల్వేలను ప్రయాణికులకు దూరం చేయడం కాదా? వీటన్నింటినీ గుర్తించి, ప్రయాణ చార్జీలు పెంచకుండా, ప్రీమియం తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, తెలుగు రాష్ట్రాలలోని 2 లేదా 3 కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చి, సత్వరం వాటికి పూర్తి స్థాయి నిధులు కేటాయించాలి. ఉన్న మార్గాలను పటిష్టపరచే చర్యలు చేపట్టాలి. రైళ్లలో దేశవ్యాపితంగా ఆహార పానీయాలను ఒకే ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. రైళ్లలో సరిపడ నీటిలభ్యత, పరిశుభ్రతలకు చర్యలు చేపట్టాలి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఫార్మసీ షాపులు ప్రారంభించి లక్షలాది ప్రయాణికుల అనారోగ్య సమస్యలను పార దోలాలి. భద్రతా చర్యలు మెరుగుపరచి, దొంగతనాలు, దోపిడీలను నివారించాలి. అన్ని కొత్త మార్గాల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు 50:50 నిధులు కేటాయించడం ద్వారా కొత్త లైన్ల నిర్మాణం పూర్తి చేయాలి.ఈ చర్యలతోనే రైల్వేల అభివృద్ధి సాధ్యం. ఎం రోజా లక్ష్మీ (ఈ నెల 26న రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా...) వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యకర్త మొబైల్ : 9441048958