బుల్లెట్ రైళ్ల యుగంలోనూ డీజిల్ ఇంజిన్ రైళ్లేనా?
దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరా లు, రైల్వేల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు.
గత రెండు దశాబ్దాలుగా భారత రైల్వేల పరిస్థితి అధ్వా నంగా మారుతోంది. రైలు మార్గాల విస్తరణ, ఉన్న మార్గా ల పటిష్టత, ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన లాంటి అనేక ముఖ్య అంశాలను, భారత ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగుపర్చడంలో భారత ప్రభుత్వాలు, రైల్వే శాఖ పూర్తిగా విఫలమయ్యాయి. భారత రైల్వేలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని 2.5 కోట్ల రైలు ప్రయాణికులను నిత్యం అవస్థలపాలు చేస్తున్నాయి. కేంద్రంలో చాలా కాలం తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున ఏడు దశాబ్దాల తిరోగమన స్థితికి చరమగీతం పాడి భారత రైల్వేలను ప్రగతి వైపు నడిపించటంలో, ఈ నెల 26న ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ దోహదపడగలదని ఆశిద్దాం.
భారత రైల్వేల వైఫల్యాలు: మనకు స్వాతంత్య్రానం తరం, దేశ జనాభా 85 కోట్ల్లు పెరిగి, మొత్తం జనాభా 120 కోట్లకు చేరింది. అయితే మన పాలకులు పెరిగిన 85 కోట్ల జనాభా అవసరాలకు, కేవలం 12వేల కి.మీ రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను అవే మార్గాలలో ప్రవేశపెట్టడం వలన ట్రాక్‌పై ఒత్తిడి పెరిగి, తరచూ ప్రమాదాలు, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. మొత్తం 65 వేల కి.మీ రైలు మార్గం లో 20,884 కి.మీ (31.9 శాతం) విద్యుదీకరణ జరిగినా, ఇంకా 70 శాతం మార్గాన్ని విద్యుదీకరించవలసి ఉంది. దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై, దేశంలో 5వ పెద్ద నగరమైన హైదరాబాద్ మధ్య ఇప్పటికీ డీజిల్ ఇంజిన్‌లతో రైళ్లు నడుస్తున్నాయంటే, ప్రజల అవసరాల పట్ల ఏపాటి శ్రద్ధ ఉందో అర్థం కాగలదు.
రైల్వేల అవసరాలకు సరిపడా రైలు ఇంజిన్లు, రైలు పెట్టెల నిర్మాణం, రైలు బోగీల మరమ్మతులు, గూడ్స్ వ్యాగన్ల నిర్మాణం జరగడంలేదు. మనిషి కాపలాలేని వేల లెవెల్ క్రాసింగ్‌లు ఇంకా నడుస్తూ, ప్రతి ఏడాది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పైగా ఒక్కో రైలు లో ఒక్కో ధరకు ఆహార పదార్థాలను విక్రయిస్తూ రోజూ లక్షలాది ప్రయాణికులను దోచుకుంటున్నారు.
దేశంలో 12,500 ైరె ళ్లల్లో అత్యధిక శాతాన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లుగా పేరు మార్చి సర్‌చార్జి మొత్తం బెర్త్‌లలో 30 శాతం తత్కాల్ పేరుతో 100-200 ఎక్కువ వసూలు, ఇవి చాలక తత్కాల్‌కు కేటాయించిన బెర్త్‌లలో 50 శాతం ప్రీమియం తత్కాల్ పేరుతో టికెట్ ధరపై రెట్టింపు చార్జిని వసూలును 2014 అక్టోబర్ 1 నుండి అమలు చేస్తున్నారు. అధిక చార్జీల భారాన్ని మోయలేక సకు టుంబ సమేతంగా వెయ్యి కి.మీ లోపు దూర ప్రయా ణానికి కూడా స్వంత కార్లలో ప్రయాణాలు సాగిస్తుం డగా, కొందరు అదే ఖర్చుతో విమాన యానాన్ని ఆశ్రయిస్తున్నారు. పైగా, ఇప్పుడిస్తున్న అరకొర నిధులు ఇలానే ఇస్తే నిర్మాణ వ్యయం పెరగటమేగాక, కొత్త మార్గాలు పూర్తికాక, రైల్వేలకు అవి గుదిబండలుగా తయారవుతాయి.
తెలంగాణలో కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకత :
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ మార్గం నిర్మాణం గత 2 దశాబ్దాలుగా నడుస్తోంది. అలానే బీబీనగర్- సికిందరాబాద్ మధ్య 3వ లైన్ నిర్మాణ పనులు జరుగు తున్నా, సరిపడా నిధులు కేటాయించడం లేదు. బీబీనగర్-నడికుడి రెండవ లైన్‌కు, సికింద్రాబాద్- జహీరాబాద్‌కు, కాచిగూడ-చిట్యాలకు, జగ్గయ్యపేట- మిర్యాలగూడకు, డోర్నకల్-మణుగూరు, ఆర్మూరు- ఆదిలాబాద్, పటాన్‌చెరు-పెద్దపల్లి, సికిందరాబాద్- కరీంనగర్‌ల మధ్య కొత్త లైన్ల నిర్మాణానికి, మనోహ రాబాద్-గద్వాల నిర్మాణానికి సర్వేలు జరిగి అరకొర నిధులు కొన్ని, అసలు నిధులు కేటాయించక మరికొన్ని నిద్రావస్థలో ఉన్నాయి.
ఖాజీపేటలో వ్యాగన్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చినా పనులు ప్రారంభిం చలేదు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్లాట్ ఫారంల సంఖ్య పెంచి, రైళ్ల ఆలస్యాన్ని తగ్గించాలి. నడికుడి- బీబీనగర్ మార్గాన్ని విద్యుదీకరించాలి. హైదరాబాద్ ఎంఎంటిఎస్ 2వ దశ పనులను వేగవంతం చేయాలి. సికింద్రాబాద్ స్టేషన్‌లో సాధారణ టికెట్ కౌంటర్లను పెంచాలి. ఎస్కలేటర్ సౌకర్యాన్ని అన్ని ప్లాట్‌ఫారంలలో నిర్మిం చాలి. సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లు సకాలంలో గమ్య స్థానం చేరే చర్యలు చేపట్టాలి.
రైల్వేల అభివృద్ధి కొరకు స్వదేశీ లేదా విదేశీ నిధులను కంట్రాక్టర్లు లేదా సంపన్న వర్గాలకు లబ్ది చేకూర్చేదిగా ఉండకూడదు. ప్రయాణ చార్జీలు పెంచితే 6 శాతం ప్రయాణికులు రైల్వేకు దూరమైన స్థితిలో, బుల్లెట్ రైళ్లను ప్రయాణికులు ఆదరిస్తారా? కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితిలో ఉన్న భారత రైల్వేలు, ప్రజాసౌకర్యాల కోసం లక్షల కోట్ల భారాన్ని మోయగలవా? ప్రీమియం తత్కాల్ పేరుతో రెట్టింపు చార్జీలను పెంచటం దారుణం.
ఈ చర్య రైల్వేలను ప్రయాణికులకు దూరం చేయడం కాదా? వీటన్నింటినీ గుర్తించి, ప్రయాణ చార్జీలు పెంచకుండా, ప్రీమియం తత్కాల్ విధానాన్ని రద్దు చేసి, తెలుగు రాష్ట్రాలలోని 2 లేదా 3 కొత్త లైన్ల నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చి, సత్వరం వాటికి పూర్తి స్థాయి నిధులు కేటాయించాలి. ఉన్న మార్గాలను పటిష్టపరచే చర్యలు చేపట్టాలి.
రైళ్లలో దేశవ్యాపితంగా ఆహార పానీయాలను ఒకే ధరకు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. రైళ్లలో సరిపడ నీటిలభ్యత, పరిశుభ్రతలకు చర్యలు చేపట్టాలి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఫార్మసీ షాపులు ప్రారంభించి లక్షలాది ప్రయాణికుల అనారోగ్య సమస్యలను పార దోలాలి. భద్రతా చర్యలు మెరుగుపరచి, దొంగతనాలు, దోపిడీలను నివారించాలి. అన్ని కొత్త మార్గాల నిర్మాణా నికి రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వేలు 50:50 నిధులు కేటాయించడం ద్వారా కొత్త లైన్ల నిర్మాణం పూర్తి చేయాలి.ఈ చర్యలతోనే రైల్వేల అభివృద్ధి సాధ్యం.
ఎం రోజా లక్ష్మీ (ఈ నెల 26న రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా...)
వ్యాసకర్త సోషల్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ కార్యకర్త
మొబైల్ : 9441048958