Difficulties in the water
-
పానీ.. పరేషానీ
► ఇప్పటికే కొన్ని కాలనీల్లో ఎండిపోతున్న చేతిపంపులు ► రెండు రోజులకోసారి నీటి సరఫరా ► ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆదిలాబాద్ కల్చరల్ : ‘అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ’మారింది ఆదిలాబాద్ మున్సిపాలిటి విధానం. మావల చెరువు, లాండసాంగ్వి ప్రదాన నీటివనరులు మున్సిపాలిటికి ఉన్న అధికారుల అలసత్వం ప్రజలకు శాపంగా మారింది. ఏండ, వాన, చలి కాలనీ ఎళ్లుగా నీటి కష్టాలు తప్పడం లేవు. ముందస్తుగా చర్యలు లేక మున్సిపాలిటిలోని ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారు. వ్యవస్థలో మార్పురాకపోగా ఎండకాలం కావడంలో మరింతగా బాధలు పడుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో నీళ్లు వస్తాయో తెలియక సతమతమవుతున్నారు. నీళ్లు పట్టేందుకు ప్రత్యేకంగా పనులు వదులుకుని ఇంటివద్ద ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యతరగతి, కూలీ చేసేకుటుంబీకులకు కష్టతరంగా మారింది. 2010లో నీటి కష్టం ఉండటంతో అప్పటి అధికారులు ఒకరోజు విడిచి ఒకరోజు మున్సిపాలిటి నల్లల ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే ఇప్పటి అధికారులు ఎన్ని నిధులు కేటాయించిన..ఎండ,వాన, చలి కాలల్లోనూ ప్రతిరోజునీటి సరఫరా చేసే విధానం కనిఫించడం లేదు. మున్సిపల్ అధికారుల అలసత్వమే కన్నీటి కష్టాలకు కారణమని పలువురు వాపోతున్నారు. నీటి ఎద్దడి ఈ ఏడాది కష్టాలు తెచ్చిపెట్టినప్పటికీ అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో చేతిపంపులు చెడిపోయిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, వరలక్ష్మీనగర్, చిలుకూరి లక్ష్మీనగర్, ఖానాపూర్, కొత్తకుమ్మరివాడ, శాంతినగర్, తదితర కాలనీల్లో ఉన్న చేతిపంపుల్లో సగానికిపైగా పనిచేయడం లేదు. వాటి మరమ్మతుల కోసం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. దీంతో పైప్‌లైన్ లేని కాలనీల ప్రజలు ఇతర కాలనీల నుంచి నీటిని తెచ్చుకునే దుస్థితి నెలకొంది. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాల్సిన అధికారులు రెండు మూడు రోజులకోసారి తాగు నీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్యాంకర్ ద్వారా ప్రతి రోజూ ఆయా కాలనీల్లో నీటిసరఫరా చేయాల్సినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ట్యాంక ర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి 36 వార్డులకు రెండే ట్యాంకర్లు ఉండటం విశేషం. రెండుమూడ్రోజులకోసారి నీళ్లు... మున్సిపల్ నీళ్లు రెండు మూడు రోజులకొసారి వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాగే ఉంది. కానీ ఈ సమస్య తీరడం లేదు. విద్యుత్ సమస్య లేన్నప్పటికీ రెండుమూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజు మున్సిపల్ నీళ్లు వచ్చేలా కృషి చేయాలి. వేసవిలోనే కాకుండా ఏండవాన చలికాలాల్లోనూ నీటి తంటాలు పడుతున్నారు. అధికారుల స్పందించాలి. -కె.కృష్ణ. శాంతినగర్ నీటి కోసం తంటాలు పడుతున్నాం. మున్సిపల్ మంచినీళ్ల సర ఫరా సంక్రమంగా లేక తంటాలు పడుతున్నాం. కొన్ని కాలనీలకు మంచినీటి సరఫరా రావడం లేదు. నల్ల కనెక్షన్ ఉన్న నిరుపయోగంగా ఉన్నాయి. నీటి ఎద్దడిని తీర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు. ప్రతి సారి నీటి సరఫరాలో అంతరాయం అంటున్నారు. కానీ సరఫరా సంక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నాం. - రవి, కోలిపూర -
జల శోకం
అడుగంటిన భూగర్భ జలాలు పని చేయని బోరు బావులు గ్రేటర్, శివార్లలో నీటి కష్టాలు మహా నగరాన్ని ఓ వైపు ఎండలు వణికిస్తున్నాయి. మరోవైపు నీరు కన్నీరు తెప్పిస్తోంది. భూగర్భ జలమట్టాలు అడుగంటడంతో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. బిందెడు నీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పిల్లా పాపలతో కలసి నీటి కోసం జనం బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. సిటీబ్యూరో: భానుడి భగభగలతో భూగర్భ జలమట్టాలు దారుణం గా పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలోని బోరు బావులు చుక్క నీరు లేక బావురుమంటున్నాయి. గ త ఏడాది మార్చి చివరికి సగటున 10.72 మీటర్ల లోతున నీటి చుక్క జాడ లభించగా.. 2016 మార్చి నాటికి 17.86 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఫలితంగా శివారు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్ నీటి ప్లాంట్లను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మండలాల్లో దుర్భరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మండుటెండలకు తోడు నీటిని ఒడిసి పట్టేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో వివిధ మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. ప్రధాన నగరంలోని ఆసిఫ్‌నగర్‌లో 3.92 మీటర్లు, బండ్లగూడలో 0.70, ఖైరతాబాద్‌లో 2.35, బహదూర్‌పురాలో 1.25 మీటర్ల మేర నీటి మట్టాలు పడిపోయాయి. శివార్లలోని హయత్‌నగర్‌లో 1.79 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 0.60, మహేశ్వరంలో 4.50, మేడ్చల్‌లో 4.61, శామీర్‌పేట్‌లో 0.55, ఉప్పల్‌లో 2.50, బాలానగర్‌లో 0.50, రాజేంద్రనగర్‌లో 1.15, శంషాబాద్‌లో 1.65 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోయినట్లు భూగర్భ జల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ బోరు బావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల నీటి దందా జోరందుకుంది. నిజాంపేట్, మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బోడుప్పల్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో ..ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కు డిమాండ్‌ను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వారికి ఇంటి అద్దెతో సమానంగా నెలకు నీటికి ఖర్చు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీని అదుపు చేయడంలో జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాలు విఫలమవుతుండడం గమనార్హం. వేసవిలోనే ఇంకుడు గుంతల నిర్మాణాలతో సత్ఫలితాలు ఇంకుడు గుంత ఇలా ఉండాలి మధ్య తరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు ఉన్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి... అందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజు రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు గుంతలో కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుందని, బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణుడు సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ఇల్లు, కార్యాలయం విస్తీర్ణాన్ని బట్టి దీని సైజు పెరుగుతుందని తెలిపారు. -
నీరు తెచ్చిన కష్టం
ట్యాంకర్ కోసం తల్లిదండ్రుల పరుగులు భవనం పైనుంచి పడి చిన్నారికి తీవ్ర గాయాలు కుత్బుల్లాపూర్‌లో ఇదీ దుస్థితి కుత్బుల్లాపూర్: నీటి కష్టాలు నాలుగేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారాయి. తల్లి మంచినీళ్ల కోసం ట్యాంకర్ వెంట పరుగులు పెడుతుండడాన్ని చూస్తూ రెండంతస్తుల పైనుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ ప్రసూన నగర్‌కు బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో నీటి ట్యాంకర్ వచ్చింది. స్థానికంగా ఉండే దస్తగిరి, నాగలక్ష్మి దంపతులు బిందెలు తీసుకుని క్యూలో నిలుచున్నారు. నీళ్లు దొరక్కపోవడంతో తల్లి నాగలక్ష్మి ట్యాంకర్ల వెంట పరుగులు పెట్టారు. ఇదంతా రెండోఅంతస్తు నుంచి చూస్తున్న పెద్ద కుమార్తె నాగ సజన(4) ఒక్కసారిగా భవనంపై నుంచి జారి కింద పడింది. తీవ్ర గాయాలైన చిన్నారిని హుటాహుటిన చింతల్ హ్యాపీ చిల్డ్రన్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన వైద్యం కోసం అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఇదే కాలనీలో నీటి కోసం జరిగిన యుద్ధంలో ఓ మహిళ ముక్కుకు గాయమైంది. బుధవారం నాగేశ్వరరావు అనే వ్యక్తి వేలికి గాయమైంది. ఇలా అధికారులు నీటి కష్టాలు తెచ్చి పెట్టడంతో జనం అవస్థలు పడుతూ రహదారిపై నీళ్ల ట్యాంకర్ కనిపిస్తే చాలు దాని వెంట పరుగులు పెడుతున్నారు. రెండో రోజూ కన్నీటి కష్టాలే.. కుత్బుల్లాపూర్ సర్కిల్లో రెండోరోజైన బుధవారమూనీటి యుద్ధాలు కొనసాగాయి. వివిధ కాలనీల్లో జనం ట్యాంకర్ నీళ్ల కోసం క్యూ కట్టారు. సర్కిల్లోని 200 కాలనీల్లో సుమారు 5 లక్షల జనాభా ఉంది. మురికివాడలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో సుమారు 40 కాలనీలకు తాగునీటి పైపులైన్ వ్యవస్థ లేదు. 58 వేల నల్లా కనెక్షన్లకు గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిపివేయడంతో ఈ కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. నీటి సరఫరాకు కేవలం 36 ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతో వీటి వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు సైతం డ్రమ్ముకు రూ.40 చొప్పున వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారుల నిఘా లోపం, బాధ్యతా రాహిత్యం వల్లనే తాగునీటి కష్టాల వచ్చాయని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
పట్నంలో నీటి గోస!
మొత్తం నగరాలు, పట్టణాలు.. 67 18 నగరాలు, పట్టణాల్లో రోజూ సరఫరా 28 చోట్ల రెండు రోజులకోసారి నీళ్లు 13 పట్టణాల్లో మూడు రోజులకు ఒకసారి 5 చోట్ల నాలుగు రోజులకోసారి 3 పట్టణాల్లో ఏడు రోజులకోసారి సరఫరా పట్టణాల్లో తాగునీటి పథకాల సామర్థ్యం, తగ్గుదల, సరఫరా వివరాలు పథకాల గరిష్ట సామర్థ్యం : 747 ఎంఎల్డీ ప్రస్తుత సరఫరా సామర్థ్యం : 459 ఎంఎల్డీ (61.5 శాతం) తరుగుదల : 287 ఎంఎల్డీ (38.5 శాతం) రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి తీవ్ర కటకట తాగునీటి సరఫరాలో 30-60 శాతం తరుగుదల రాష్ట్రంలో పురజనుల గొంతెండుతోంది.. దాహం దాహం అంటూ పట్టణవాసులు అల్లాడిపోతున్నారు.. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదరడంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత పెరిగింది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. నిధులు లేక నగర, పురపాలక సంస్థలు తాగునీటి సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో వందల కోట్లు కుమ్మరించి నిర్మించిన నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారిపోయాయి. మరోవైపు... ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాలు కోట్లాది రూపాయల దందాకు తెరలేపాయి. - సాక్షి, హైదరాబాద్ ‘కొత్త’ సమస్యలు నగరాలు, పట్టణాల పరిధిలోని 26.85 శాతం ప్రాంతాలకు అసలు నీటిసరఫరా వ్యవస్థే లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలు, 25 కొత్త నగర పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆరు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సైతం 4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్, మధిర, దేవరకొండ, బడంగ్‌పేట, ఐజ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ పట్టణాల పరిధిలోని 50 శాతానికిపైగా ప్రాంతాలకు నీటి సరఫరా వ్యవస్థే లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయింది. నీటిని విడుదల చేస్తేనే.. నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణాల్లో సరఫరా క్లిష్టంగా మారింది. పలుచోట్ల తక్షణమే సంబంధిత ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఖమ్మం-పాలేరు రిజర్వాయర్ నుంచి మునేరుకు నీటిని విడుదల చేయాలి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాలకు నీరందించడం కోసం ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులు, వెంకటరావుపేట చెరువుకు నీళ్లు వదలాల్సి ఉంది. సగం మందికి దాహమే! నీటి సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సగటున ఒకరికి రోజుకు 140 లీటర్ల (ఎల్పీసీడీ) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో 40 నుంచి 100 లీటర్లలోపు మాత్రమే సరఫరా అవుతున్నాయి. సాధారణ పరిస్థితిలో ఒక రోజులో 43.11 శాతం జనాభాకే తాగునీరు అందుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టాలు తరిగిపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని 67 పట్టణాల్లో నీటి సరఫరా పరిస్థితి ఇలా ఉంది.. ►18 పట్టణాల్లో నీటి సరఫరా 44 -100 ఎల్పీసీడీలు ఉండగా.. వేసవి ప్రభావంతో 30 శాతం తగ్గిపోయింది. ► 28 పట్టణాల్లో 8-56 ఎల్పీసీడీల మధ్య ఉన్న సరఫరా ప్రస్తుతం 40 శాతం తగ్గింది. ► 13 చోట్ల మూడు రోజులకోసారి 5-49 ఎల్పీసీడీలుగా ఉన్న సరఫరా.. ఇప్పుడు సగానికి పడిపోయింది. ► 5 పట్టణాల్లో నాలుగు రోజులకోసారి 11-17 ఎల్పీసీడీల నీటిని సరఫరా చేసేవారు. కానీ గత మూడు నెలల్లో సరఫరా 60 శాతం తగ్గింది. ► మిగతా 3 చోట్ల వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ‘నీరు’గారిన పథకాలు రాష్ట్రంలోని పట్టణ తాగునీటి పథకాల ‘సరఫరా సామర్థ్యం’ దాదాపు 40 శాతం తగ్గిపోయింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేసే పథకాల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణులతో చేయించిన సమగ్ర సర్వేలోనే ఈ విషయం బయటపడింది. తుప్పుపట్టిన ప్రధాన పైప్లైన్లు, లికేజీలు, శిథిలమైన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మొరాయిస్తున్న పంపింగ్ స్టేషన్లతో నీటి పథకాలు సరిగా పనిచేయడం లేదు. ఈ పథకాలన్నీ తిరిగి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలంటే ఏకంగా రూ.624.33 కోట్లతో మరమ్మతులు చేయాల్సి ఉందని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. -
వాటర్ గ్రిడ్ అసాధ్యమే!
జిల్లాకు నీటి కష్టాలు తప్పవా? పోలవరం వస్తేనే 24 టీఎంసీల నీటికి అవకాశం తేల్చిన నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక సిద్ధం ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. జిల్లాలో గ్రిడ్ ఏర్పాటు అసాధ్యమని నిపుణులు తేల్చేశారు. పోలవరం వస్తేనే గాని అది సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో జిల్లాకు నీటి కష్టాలు తప్పేట్టు లేవు. పరిశ్రమలు, వ్యవసాయానికే కాకుండా తాగునీటికీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. విశాఖ రూరల్: జిల్లాకు నీటివనరుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. కారణం రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే పడింది. మున్ముందు బహుళజాతి కంపెనీలు, ఐటీ, భారీ పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. మానవ వనరులు కూడా విపరీతంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో నీటి వినియోగం రెట్టింపు కానుంది. ఇప్పటికే అవసరాలకు తగ్గ నీటి సరఫరా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో ఉన్న పరిశ్రమలకు, తాగునీటికి రోజుకు 90 ఎంజీడీలు అవసరం. కానీ ఏలేరు, రైవాడ, మేహాద్రిగెడ్డ, గోస్తనీ, గోదావరి, ముడసర్లోవ, గంభీరం, తాటి పూడి జలాశయాల నుంచి రోజుకు 65 నుంచి 70 ఎంజీడీలు మాత్రమే వస్తోంది. దీంతో పరిశ్రమలకు నీటి కేటాయింపుల్లో కోత విధించాల్సి వస్తోంది. తాగునీటి సరఫరాను కూడా కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సి వస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఉండనే ఉన్నాయి. వాటర్ గ్రిడ్ కష్టమే : ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వలను పెంచుకోడానికి గల అవకాశాలపై నివేదిక ఇవ్వాలని, జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నీటి సరఫరా విభాగం అధికారులు రెండు రోజుల క్రితం ఏర్పాటు నిర్వహించన సమావేశంలో తేల్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రుణమాఫీ తప్పించుకోడానికి, ప్రజల ఆలోచనలను మళ్లించడానికే రోజు కో ఆచరణ సాధ్యం కాని కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకువస్తోందన్న విమర్శలున్నాయి. పోలవరంతోనే గ్రిడ్ సాధ్యం : గోదావరి నుంచి గాని, ఒరిస్సా, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో ఉన్న నదుల నుంచి జిల్లాకు నీరు చేరే అవకాశం లేదు. దీంతో ఇక్కడ పడిన వర్షపు నీటినే జలాశయాల్లో నిల్వ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయానికే ఈ నీటి నిల్వలు సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమని అధికారులు తేల్చారు. పోలవరం ద్వారా జిల్లాలో తాగునీటి అవసరాలకు 24 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. దీంతో మిగిలిన జలాశయాల్లో నీటిని పరిశ్రమలు, సాగు అవసరాలకు వినియోగించుకొనే వీలు కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 5 నుంచి 7 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని అధికారులు సమాయత్తమవుతున్నారు. -
ఉక్కు ఆశలపై నీళ్లు
ఏలేరు నీటి సరఫరాలో కోత గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు గోదావరి పంపింగుకూ ఆటంకాలు రెండు పైపులుమొరాయింపు కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్‌ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్ప్లాంట్కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్‌ప్లాంట్‌కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది. ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి. ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్‌కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు. -
సిద్దిపేట.. నీటి కటకట!
- నేటినుంచి వారంపాటు సరఫరా బంద్ - ఎల్ఎండీలో సాంకేతిక లోపం - పంపింగ్ మార్గంలో లీకేజీల నియంత్రణ - పనుల్లో హైదరాబాద్ బృందం నిమగ్నం - సహకరించాలని అధికారుల విన్నపం సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణ ప్రజలకు వారంరోజుల పాటు నీటి కష్టాలు తప్పేటట్లు లేవు. కరీంనగర్ జిల్లా యశ్వాడ(లోయర్ మానేర్ డ్యాం) నుంచి లిఫ్టింగ్ విధానంతో పట్టణానికి సరఫరా అవుతున్న మానేరు నీటి పంపింగ్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో మంగళవారం నుంచి వారంరోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనులను వేగవంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. కరీంనగర్ జిల్లా నుంచి సిద్దిపేట వరకు, ఆయా వార్డుల్లో ఉన్న లీకేజీలను నియంత్రించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందానికి పనులు అప్పగించినట్లు తెలిసింది. సిద్దిపేట పట్టణంతో పాటు ప్రశాంత్‌నగర్, హనుమాన్‌నగర్, గాడిచెర్లపల్లి, నర్సాపూర్, ఇమాంబాద్, రంగధాంపల్లి గ్రామాలను కలుపుతూ ఇటీవల స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీగా రూపొందించారు. ఈ క్రమంలో మండల పరిధిలోని వంద పైచిలుకు గ్రామాలకు మంచినీటి పథకం(ఆర్డబ్ల్యూఎస్) ద్వారా తాగు నీరందిస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి లోయర్ మానేర్ నుంచి 54 కిలోమీటర్ల పొడవున 3 పంపింగ్ స్టేషన్ల ద్వారా 189 పవర్ బోర్లతో పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని లక్షన్నర పై చిలుకు జనాభాకు సంబంధించి 1.10 లక్షల గ్యాలన్ల తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి రోజూ మెరుగైన నీటి సరఫరా చేసే ఉద్దేశంతో ఇటీవల మంత్రి హరీష్‌రావు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఈ నెల 15 నుంచి పట్టణంలో ప్రతిరోజూ మానేరు నీరును అందించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. పలుమార్లు జరిగిన సమీక్షల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ ద్వారా ప్రభుత్వ లక్ష్యానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే క్రమంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు సాంకేతిక సమస్యల అధ్యయనానికి రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో అధికారులు పంపింగ్ స్టేషన్లు, నీటి పంపిణీ పైప్ లైన్ల మరమ్మతు, లీకేజీల నియంత్రణ, పంపింగ్ పునరుద్ధరణ చర్యలకు దిగనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే యశ్వాడలో నెలకొన్న సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తూ, భవిష్యత్తులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు పట్టణానికి నీటి సరఫరాను పూర్తిస్థాయిలో నిలిపివేసి, 54 కిలోమీటర్ల సుదీర్ఘ పంపింగ్ ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు వాటర్ సప్లై విభాగం సమాయత్తమవుతోంది.