పానీ.. పరేషానీ
► ఇప్పటికే కొన్ని కాలనీల్లో ఎండిపోతున్న చేతిపంపులు
► రెండు రోజులకోసారి నీటి సరఫరా
► ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆదిలాబాద్ కల్చరల్ : ‘అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ’మారింది ఆదిలాబాద్ మున్సిపాలిటి విధానం. మావల చెరువు, లాండసాంగ్వి ప్రదాన నీటివనరులు మున్సిపాలిటికి ఉన్న అధికారుల అలసత్వం ప్రజలకు శాపంగా మారింది. ఏండ, వాన, చలి కాలనీ ఎళ్లుగా నీటి కష్టాలు తప్పడం లేవు. ముందస్తుగా చర్యలు లేక మున్సిపాలిటిలోని ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారు. వ్యవస్థలో మార్పురాకపోగా ఎండకాలం కావడంలో మరింతగా బాధలు పడుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో నీళ్లు వస్తాయో తెలియక సతమతమవుతున్నారు. నీళ్లు పట్టేందుకు ప్రత్యేకంగా పనులు వదులుకుని ఇంటివద్ద ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మధ్యతరగతి, కూలీ చేసేకుటుంబీకులకు కష్టతరంగా మారింది. 2010లో నీటి కష్టం ఉండటంతో అప్పటి అధికారులు ఒకరోజు విడిచి ఒకరోజు మున్సిపాలిటి నల్లల ద్వారా నీటిని సరఫరా చేశారు.
అయితే ఇప్పటి అధికారులు ఎన్ని నిధులు కేటాయించిన..ఎండ,వాన, చలి కాలల్లోనూ ప్రతిరోజునీటి సరఫరా చేసే విధానం కనిఫించడం లేదు. మున్సిపల్ అధికారుల అలసత్వమే కన్నీటి కష్టాలకు కారణమని పలువురు వాపోతున్నారు. నీటి ఎద్దడి ఈ ఏడాది కష్టాలు తెచ్చిపెట్టినప్పటికీ అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు. సమస్యాత్మక ప్రాంతాల్లో చేతిపంపులు చెడిపోయిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్, వరలక్ష్మీనగర్, చిలుకూరి లక్ష్మీనగర్, ఖానాపూర్, కొత్తకుమ్మరివాడ, శాంతినగర్, తదితర కాలనీల్లో ఉన్న చేతిపంపుల్లో సగానికిపైగా పనిచేయడం లేదు. వాటి మరమ్మతుల కోసం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. దీంతో పైప్‌లైన్ లేని కాలనీల ప్రజలు ఇతర కాలనీల నుంచి నీటిని తెచ్చుకునే దుస్థితి నెలకొంది. రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయాల్సిన అధికారులు రెండు మూడు రోజులకోసారి తాగు నీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ట్యాంకర్ ద్వారా ప్రతి రోజూ ఆయా కాలనీల్లో నీటిసరఫరా చేయాల్సినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ట్యాంక ర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి 36 వార్డులకు రెండే ట్యాంకర్లు ఉండటం విశేషం.
రెండుమూడ్రోజులకోసారి నీళ్లు...
మున్సిపల్ నీళ్లు రెండు మూడు రోజులకొసారి వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాగే ఉంది. కానీ ఈ సమస్య తీరడం లేదు. విద్యుత్ సమస్య లేన్నప్పటికీ రెండుమూడు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ప్రతి రోజు మున్సిపల్ నీళ్లు వచ్చేలా కృషి చేయాలి. వేసవిలోనే కాకుండా ఏండవాన చలికాలాల్లోనూ నీటి తంటాలు పడుతున్నారు. అధికారుల స్పందించాలి. -కె.కృష్ణ. శాంతినగర్
నీటి కోసం తంటాలు పడుతున్నాం.
మున్సిపల్ మంచినీళ్ల సర ఫరా సంక్రమంగా లేక తంటాలు పడుతున్నాం. కొన్ని కాలనీలకు మంచినీటి సరఫరా రావడం లేదు. నల్ల కనెక్షన్ ఉన్న నిరుపయోగంగా ఉన్నాయి. నీటి ఎద్దడిని తీర్చేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు. ప్రతి సారి నీటి సరఫరాలో అంతరాయం అంటున్నారు. కానీ సరఫరా సంక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నాం. - రవి, కోలిపూర