Digital Telangana
-
ఏటా మూడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు
సాధారణ స్మార్ట్‌ఫోన్ యాప్‌ల వినియోగం మొదలుకుని, అత్యాధునిక సాంకేతికత దాకా రాష్ట్ర ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ జీవితాన్ని అందిస్తాం. ప్రజల రోజువారీ జీవితానికి తోడ్పడేలా మెరుగైన పౌర సేవలను కాగిత రహిత విధానంలో అందిస్తాం. ప్రతి ఇంట్లో ఒకరిని, స్వయం సహాయక సంఘాల మహిళలను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, మారుమూల ప్రాంతాల ప్రజానీకానికి డిజిటల్ సేవలు అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ‘డిజిటల్ తెలంగాణ సెంటర్లు’ఏర్పాటు చేస్తాం. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో రూ.3లక్షల కోట్ల వార్షిక ఎగుమతులు సాధించాలని.. పది లక్షల మందికి ఉద్యోగాల కల్పి ంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావు ప్రకటించారు. డిజి టల్ ప్రపంచానికి పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అన్ని సామాజిక నేపథ్యాల ప్రజలు సాధికారత సాధించేలా రెండో ‘ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)’పాలసీకి రూపకల్పన చేశామని తెలిపారు. 2021 నుంచి 2026 వరకు అమలు చేసే ఈ రెండో ఐసీటీ పాలసీని గురువారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పాదకత, ఇంజనీరింగ్, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ద్వారా దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని ప్రకటించారు. స్టార్టప్‌లు, పెట్టుబడిదారులకు తెలంగాణను మొదటి గమ్యస్థానంగా మార్చుతామని.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌లను స్థాపించడం ద్వారా ఐటీ రంగంలో కొత్తగా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపారు. చదవండి: గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా కొత్త ఐటీ పాలసీ లక్ష్యాలెన్నో.. డ్రైవింగ్ టెస్ట్ వంటి సేవలు మినహా దాదాపు ప్రభుత్వ సేవలన్నింటినీ.. వెబ్, మొబైల్ యాప్‌ల ద్వారా అందుబాటులోకి తెస్తామని, కాగితరహిత పాలన అందిస్తామని కేటీఆర్ చెప్పారు. ‘‘కొత్త టెక్నాలజీల యుగంలో ఐటీ పట్టభద్రులు ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా కృత్రిమ మేథస్సు (ఏఐ) సాంకేతికతపై ప్రాథమిక శిక్షణ ఇస్తాం. రూ.13 వందల కోట్లతో స్టార్టప్ ఫండ్‌తోపాటు ప్రభుత్వ పెట్టుబడుల కమిటీ ఏర్పాటు చేసి 8వేల స్టార్టప్‌లకు చేయూతనిస్తాం. దేశంలోనే తెలంగాణను స్టార్టప్‌లకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం. ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు, ఆటోమొబైల్ రం గాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తాం. ఎలక్టానిక్స్ రంగం ద్వారా రూ.75వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ కారిడార్’ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ సేవల్లో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. డేటా స్టాక్, డేటా ఎనాలసిస్ వింగ్ ఏర్పాటు చేస్తాం. స్థానికంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరి ష్కారాల ద్వారా రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) అం డగా నిలుస్తాం. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో ‘స్మార్ట్ సిటీస్ వింగ్’ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 40 ‘స్మార్ట్ రీజియన్లు’సృష్టిస్తాం..’’అని ప్రకటించారు. చదవండి: ఏకతాటిపైకి టెల్కోలు ప్రతికూల పరిస్థితుల్లోనూ వృద్ధి కరోనా సంక్షోభ సమయంలోనూ తెలంగాణ ఐటీ రంగం అద్వితీయంగా పురోగమించిందని నాస్కామ్ చైర్పర్సన్ రేఖా మీనన్ అభినందించారు. రెండో ఐటీ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పాలసీలతో పురో గామి విధానాలు అవలంభిస్తోందని ప్రశంసిం చారు. ఇక తెలంగాణ ఐటీ రంగంతో అమెరికాకు గాఢమైన బంధముందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్మన్ అన్నారు. హైదరాబాద్‌లో 48 అమెరికా ఐటీ సం స్థల కార్యకలాపాల ద్వారా 1.10 లక్షల మంది ఉద్యోగాలు పొందారని చెప్పారు. కార్యక్రమంలో సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, రాజన్న(టీసీఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లు పాల్గొన్నారు. దేశంలోనే వేగంగా పురోగమిస్తున్నాం కోవిడ్‌తో జాతీయ వృద్ధిరేటు 1.26 శాతానికి పడిపోయినా.. రాష్ట్రం 2020–21లో రూ.9.78 లక్షల జీఎస్డీపీ, 8%వృద్ధిరేటు సాధించిందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందని కేటీఆర్ అన్నారు. రూ.1.45 లక్షల కోట్ల ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు సాధించామని, 2016 నాటి తొలి ఐసీటీ పాలసీ లక్ష్యాలను అం దుకున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రముఖ పెట్టుబడిదారులను ఆకర్షించామని, 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు సాధించామని తెలిపారు. ఇం దులో కేవలం ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 1.5 లక్షల ఉద్యోగాలు సృష్టించడంతోపాటు దేశంలోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో 7% వాటా సాధించామన్నారు. టీహబ్, వీహబ్, టీఎస్ఐసీ, రీచ్, టాస్క్, టీవర్క్స్ వంటివాటితో ఆవిష్కరణల వాతావరణాన్ని సృష్టించామని, 15 వందలకుపైగా స్టార్టప్‌లకు రూ.1,800 కోట్ల మేర నిధులు అందా యని తెలిపారు. టాస్క్‌ద్వారా 3 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, ఆన్లైన్లో 500 రకాల ప్రభుత్వ సేవలు, టీ యాప్ ఫోలియో ద్వారా 250 ప్రభు త్వ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఓపెన్‌డేటా, బ్లాక్ చెయిన్, డేటా అనలిటిక్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ అడాప్షన్ వంటి పాలసీలు, 3వేలకు పైగా పబ్లిక్ వైఫై పాయింట్లు, ఐదు లక్షల మందికి డిజిటల్ అక్షరాస్యత వంటి లక్ష్యాలను ఐదేళ్లలో సాధించామన్నారు. -
చెల్లింపులన్నీ ఈ–కుబేర్ ద్వారానే..
హన్మకొండ అర్బన్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రతి నెలా చెల్లింపులు జరిపే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ట్రెజరీ, ఆర్బీఐ ప్రతిష్టాత్మకంగా ఈ–కుబేర్ద్వారా చెల్లింపులు చేయనుంది. ఈ విధానం ద్వారా సత్వర చెల్లింపులు జరగడంతో పాటు ప్రభుత్వానికి భారీగా డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో వేతనాలే కాకుండా ఇకపై ప్రభుత్వ పరంగా చేసే చెల్లింపులన్నీ ఈ–కుబేర్ విధానం ద్వారానే చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే సంబంధిత లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. మార్చి నుంచి మొదలు.. వేతనాలకు సంబంధించి ఆగస్టు నుంచి మొదలు పెట్టిన ప్రభుత్వం ప్రస్తుత మార్చి నుంచి గ్రామ పంచాయతీ బిల్లులు, మునిసిపాలిటీ, సీపీవో, జెడ్పీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంథా లయ సంస్థలు, కేయూ, కాళోజీ నారాయణరా వు హెల్త్ యూనివర్సిటీ, జూనియర్, డిగ్రీ కాలేజ్ నిధులు, ఇకపై ఈ కుబేర్ విధానం ద్వారా చెల్లిం పులు చేయనున్నారు. ప్రసుత్తం ఫిబ్రవరి 28 వర కు ఉన్న చెక్కులు సంబంధిత బ్యాంకుల ద్వారానే చెల్లిస్తారు. మార్చి ఒకటి నుంచి ఈ–కుబేర్ ద్వారా ట్రెజరీ అధికారులు పనులు చేపడతారు. ఎలాగంటే.. గతంలో ట్రెజరీలో పాస్ అయిన చెక్కులు బ్యాంకులకు ఎస్బీఐకి పంపేవారు. ఇకపై అలా కాకుండా ఖజానా నుంచి నేరుగా ఆర్బీఐ సర్వర్కి అప్లోడ్ చేస్తారు. దీని వల్ల డ్రాయింగ్ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు. లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్ఓసీ)కూడా బ్యాకులకు పంపాల్సిన అవసరం లేదు. పర్సనల్ డిపాజిట్స్ ఉన్నా డీడీఓలు నేరుగా సాధారణ, ఎల్ఓసీ చెక్కులు తీసుకు రావాల్సి ఉంటుంది. డబ్బులు కూడా ఎన్ఈఎఫ్టీ పద్ధతిలో రెండు గంటల్లోపు చెల్లింపులు చేస్తారు. ఇవి పాత లెక్కనే.. గతంలో మాదిరిగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, భూసేకరణ, రైతుబంధు చెల్లింపులు ఈ–కుబేర్ విధానం ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తారు. ఈ–కుబేర్ చెల్లింపుల విషయంలో సంబంధిత డ్రాయింగ్ అధికారులు సందేహాలుంటే జిల్లా ఖజానా అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. -
డిజిటల్ తెలంగాణకు గూగుల్ సాయం
రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందం సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ తెలంగాణకు గూగుల్ తనవంతు సాయం అందించనుంది. క్లౌడ్ టెక్నాలజీ వినియోగం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు, చిన్న, మధ్యతరహా వ్యాపారాల్లో ఆన్ లైన్ వినియోగంలో ప్రభుత్వానికి సహకారం అందించనుంది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం–గూగుల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్, గూగుల్ ఇండియా డైరెక్టర్ చేతన కృష్ణ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. టీహబ్‌లో ప్రారంభించిన స్టార్టప్‌లకు క్లౌడ్ వినియోగంలో గూగుల్ సహకరించనుంది. రాష్ట్రంలో బీటెక్, ఎంసీఏ విద్యారు్థలకు ఆండ్రాయిడ్‌లో శిక్షణకు కోర్సులు ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ వెబ్సైట్లను మొబైల్ ఫ్రెండ్లీగా మార్చడానికి సహకరిస్తుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆన్ లైన్ పాయాలను కల్పించడం, గ్రామీణ ప్రాంత మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచడానికి ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న డిజిటల్ తెలంగాణ సాధనలో గూగుల్ ముఖ్య భాగస్వామి అని, భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాల్లో గూగుల్ సహకారం తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్ టు కరీంనగర్
సిద్దిపేటకు చేరుకున్న అదనపు డీజీ రాజీవ్ త్రివేదీ సైకిల్ యాత్ర హైదరాబాద్/సిద్దిపేట రూరల్: ఎప్పుడూ ఏదో ఒక సాహసానికి, సాహసయాత్రకు అంకురార్పణ చేసే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. ఈసారి ఆయన వెంట∙ఇద్దరు కుమారులు ప్రసూన్, ప్రశాంత్ సైతం బయలుదేరారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర సిద్దిపేట మీదుగా కరీంనగర్ వరకు 165 కిలోమీటర్లు సాగనుంది. ఈ యాత్ర దారిలోని పలు ప్రాంతాల్లో పోలీసు, విజిలెన్స్ అధికారులతో కలసి వ్యాపార, వాణిజ్య వర్గాలు, బ్యాంకర్లు ఇతర ఆఫీసర్లతో రాజీవ్ త్రివేది సమావేశాలు ఏర్పాటు చేశారు. డిజిటల్ తెలంగాణ కావాలి: రాజీవ్ త్రివేదీ రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపే యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డీజీ రాజీవ్ త్రివేది అన్నారు. హైదరాబాద్ నుంచి తమ కుమారులతో కలసి సైకిల్ తొక్కుతూ 100 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు చేరుకున్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ మొదట సిద్దిపేటను క్యాష్‌లెస్ నియోజకవర్గంగా మారుస్తున్నారనీ, ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. -
అభివృద్ధికి ప్రతిబింబంగా ‘డిజిటల్ తెలంగాణ’
ట్రేడ్ ఫెరుుర్‌లో రాష్ట్ర పెవిలియన్‌ను ప్రారంభించిన మంత్రి చందూలాల్ సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రారంభమైన 36వ భారత అంతర్జాతీయ ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ రాష్ట్రం ’డిజిటల్ తెలంగాణ’ పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. సోమవారం ప్రారంభమైన ట్రేడ్ ఫెరుుర్‌లో తెలంగాణ పెవిలియన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చందూలాల్ మాట్లాడుతూ టీ-హబ్ నమూనాతో తీర్చిదిద్దిన పెవిలియన్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా చాటేలా ఉందన్నారు. ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి, ప్రపంచ స్థారుు సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. చందూలాల్ వెంట ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్ర తేజోవత్, కేఎం సహాని తదితరులున్నారు. ఈ ఎగ్జిబిషన్లో రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారుు. ఈ నెల 27 వరకు కొనసాగనున్న ఈ ఫెరుుర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు హాజరుకానున్నారు. -
డిజిటల్ తెలంగాణే లక్ష్యం: కేటీఆర్
♦ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందిస్తాం: కేటీఆర్ ♦ డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాం ♦ ఫైబర్ గ్రిడ్‌తో సత్వర సేవలు ♦ సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తాం ♦ ఇండియా ఎకనమిక్ సమిట్‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇంటింటికీ మంచి నీటిలాగా.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ ఆధ్వర్యంలో రెండు రోజుల ఇండియా ఎకనమిక్ సమిట్ గురువారం ప్రారంభమైంది. దేశ విదేశాల పారిశ్రామికవేత్తలు హాజరైన ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొని, ప్రసంగించారు. గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన డిజిటల్ లిటరసీ అంశంలో తెలంగాణ రాష్ట్రం సమీప భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా ఉండబోతోందన్నారు. డిజిటల్ లిటరసీ మిషన్‌లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే రెండు లక్షల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని... కనీసం ప్రతి ఇంటిలో ఒకరిని డిజిటల్ అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా పల్లెలకు కూడా ఇంటర్నెట్ సేవలను, ఐటీ పరిజ్ఞాన ఫలాలను అందిస్తామన్నారు. ఇంటింటికీ ఇంటర్నెట్ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమం పూర్తయితే ప్రభుత్వ సేవలు ప్రజలకు సత్వరం అందుతాయని చెప్పారు. సేవల వేగం పెరుగుతుందని, పారదర్శకత ఉంటుందని పేర్కొన్నారు. డిజిటల్ పరిజ్ఞానాన్ని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నామని.. అందుకే తాగునీటితోపాటు ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే బృహత్తర కార్యక్రమమైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. ఈ-గవ ర్నెన్స్ను దాటి ఎం(మొబైల్)-గవర్నెన్స్ దిశగా ప్రభుత్వ సేవలను తీసుకెళ్తున్నామన్నారు. తాము ఇటీవల ప్రారంభించిన ఎం-వ్యాలెట్‌ను దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఈ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పెంపు ‘దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, పెట్టుబడులు’ అనే అంశంపై కేటీఆర్ మాట్లాడారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశం, రాష్ట్రాలు ముందుకు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ప్రజల జీవన విధానంలో నాణ్యమైన, వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. అయితే ప్రభుత్వాల దగ్గర మూలధనం కొరత ఉన్న నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులతో మౌలిక సదుపాయాల రంగంలో వేగంగా అభివృద్ధి సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు పారిశ్రామిక అనుకూల విధానాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఉన్న 1,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను కేంద్ర సహకారంతో త్వరలోనే రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతమున్న 9 వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచే కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రీన్ ఫండ్స్ తెలంగాణ వంటి రాష్ట్రాలు చేపట్టే ప్రయత్నాలకు పెట్టుబడితో సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులకు రక్షణ కల్పించేలా సెక్టోరల్ పాలసీలు, వివాదాల పరిష్కార యంత్రాంగం, ఎగ్జిట్ పాలసీ వంటి అంశాలను కూడా తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. పెట్టుబడులు, డిజిటల్ పరిజ్ఞానం అంశాలపై కేటీఆర్ చేసిన ప్రసంగాలను పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. -
మీ సర్టిఫికెట్లు ఇక ఎంతో భద్రం..!
♦ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్న రాష్ట్ర సర్కారు ♦ ఉచితంగా వెయ్యి సర్టిఫికెట్లు,ఇతర ధ్రువపత్రాలను దాచుకునే వెసులుబాటు ♦ పౌర సేవలందించే 17 విభాగాలతో అనుసంధానం ♦ పేపర్ లెస్ గవర్నెన్స్ అమలులో భాగంగా ప్రభుత్వం చర్యలు సాక్షి, హైదరాబాద్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియాకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ‘డిజిటల్ లాకర్’ సదుపాయాన్ని అమల్లోకి తేవాలని ఐటీశాఖ నిర్ణయిం చింది. వివిధ ప్రభుత్వ విభాగాలు జారీచేసిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఈ-డాక్యుమెంట్ల రూపంలో డిజిటల్ లాకర్లో దాచుకునేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలు, మరేదైనా సమయంలో డిజిటల్ లాకర్లోని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లను ఉన్నతాధికారులు పరిశీలించేందుకు, ధ్రువీకరించేందుకు అవకాశం లభిస్తుంది. కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ పరిధిలోని ఎలక్ట్రానిక్స్ విభాగం సహకారంతో రాష్ట్రంలో ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలను డిజిటల్ లాకర్ ప్రక్రియలో భాగస్వాములను చేయనుంది. ఆయా ప్రభుత్వ విభాగాలు పౌరులకు జారీ చేసే ధ్రువపత్రాలు, ఇతర డాక్యుమెం ట్లను ఎలక్ట్రానిక్ రిపోసిటరీ ద్వారా డిజిటల్ లాకర్లో పొందుపరచనున్నారు. ఇలా పొందుపరిచిన డాక్యుమెంట్లను అవసరమైనపుడు సం బంధిత ప్రభుత్వ విభాగాలతో పాటు పౌరులు/యజమాని ఆమోదం మేరకు ప్రైవేటు సంస్థలు కూడా పరిశీలించేందుకు, ధ్రువీకరించేందుకు వెసులుబాటు కలుగనుంది. వెయ్యి పత్రాలు దాచుకోవచ్చు డిజిటల్ లాకర్లో ఒక్కో వ్యక్తి తనకు సంబంధించిన ముఖ్యమైన ధ్రువపత్రాలు/వ్యక్తిగత డాక్యుమెంట్ పేపర్లను 1,000 వరకు దాచుకునేందుకు వీలుంది. పౌరుడి డిజిటల్ లాకర్ ఖాతాకు ఉచితంగా ఒక జిగా బైట్ స్పేస్(ఖాళీ) ఉంటుంది. సర్టిఫికెట్లపై స్వీయ ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ లాకర్లో ఖాతా కలిగిన పౌరులు డిజిటల్ సిగ్నేచర్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సర్టిఫికెట్లు పోతాయనిగానీ, పాడై పోతాయనిగానీ బెంగ అక్కర్లేదు. వివిధ కార్యాలయాలకు, ఇంటర్వ్యూల సమయంలో ఒరిజనల్ ధ్రువపత్రాలను, జిరాక్స్ ప్రతులను భౌతికంగా వెంట బెట్టుకొని వెళ్లాల్సిన పని ఉం డదు. పౌరసేవలను అందించే 17 ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరిచి త్వరలోనే డిజి టల్ లాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఏ విభాగం నుంచి ఏ ధ్రువపత్రాలు..? డిజిటల్ లాకర్లో అనేక పత్రాలు దాచుకునే వీలుంటుంది. రెవెన్యూ శాఖ జారీ చేసే కుల, ఆదాయ, నివాస, నిరభ్యంతర(ఎన్వోసీ) పత్రాలు, ఆర్వోఆర్, అడంగల్, పీపీబీ తదితర రెవెన్యూ రికార్డులు, పోలీసుశాఖ ఇచ్చే క్యారెక్టర్ సర్టిఫికెట్, ఎన్వోసీ, బందోబస్తుకు అనుమతి, విద్యాశాఖకు సంబంధించి వివిధ పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలు, విద్యా సంస్థ లు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇతర శాఖలు కార్డులు, సర్టిఫికెట్లను జారీ చేసే సమయంలోనే ఆయా శాఖల నుంచి నేరుగా పౌరుడి డిజిటల్ లాకర్ ఖాతాలో పొందు పరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే https://digilocker.gov.in/వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి డిజిటల్ లాకర్ ఖాతాను ఎవరైనా పొందేందుకు వీలు కల్పించామని, ఆధార్ లేదా మొబైల్ నెంబర్‌తో ఖాతాలను యాక్టివేట్ చేసుకోవచ్చని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని సేవలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఉద్యమంగా డిజిటల్ తెలంగాణ
హైదరాబాద్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఐటీ రంగ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. జేఎన్టీయూలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఏర్పాటు చేసిన తెలంగాణ డిజిథాన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ బేసిక్స్‌పై అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువతలో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు డిజిటల్ లిటరసీ దోహదపడుతుందన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పేదరికాన్ని పోగొట్టే ఆయుధంగా డిజిటల్ లిటరసీ ఉపకరిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. 90శాతం గ్రామీణ ప్రజలు, 40శాతం పట్టణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత లేదన్నారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం బాధ్యతాయుతమైన వ్యక్తులు చేస్తేనే ఆశించిన ఫలితాలను పొందగలమన్నారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి జరిగితేనే అవకశాలు పెరిగి అవినీతి తగ్గుతుందని, డిజిటల్ లిటరసీని పెంచడం ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ.. ట్రెయిన్డ్ ట్రెయినీస్ ప్రోగ్రామ్‌గా డిజిథాన్‌ను రూపొందించామన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ రెక్టార్ కిషన్‌కుమార్‌రెడ్డి, ఐఎస్టీ డెరైక్టర్ గోవర్థన్, టీటా ప్రతినిధులు మాధవి, సౌమ్య, మోహన్, వివేక్, ప్రదీప్, విజయ్, రామ్‌కుమార్, టీటా గౌరవాధ్యక్షుడు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్ళలో తెలంగాణ ప్రతీ గ్రామంలో మీ సేవా కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ తెలంగాణలో భాగంగా అన్ని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో కొత్తగా 5,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్‌లోగా 1,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,800 మీ సేవా కేంద్రాలున్నాయి. -
'డిజిటల్ తెలంగాణ' కు శ్రీకారం
పౌరులకు డిజిటల్ సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రాష్ట్రవ్యాప్తంగా 4జీ, ముఖ్య పట్టణాల్లో వైఫై తదితర సేవల కల్పనే లక్ష్యం జూలై 1 నుంచి వారోత్సవాలు ఐటీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ తెలంగాణ పేరిట అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జూలై 1 నుంచి డిజిటల్ తెలంగాణ వారోత్సవాలు నిర్వహించాలని ఐటీశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ డి జిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, రాష్ట్రం మొత్తం 4జీ సేవలను అందించడం, పెద్ద నగరాలు, ముఖ్య పట్టణాల్లో వైఫై సదుపాయాల కల్పన, ఈ పంచాయత్ పథకం ద్వారా ప్రతి పంచాయతీలోనూ వన్‌స్టాప్ షాప్‌ను ఏర్పాటు చే యడం వంటి వాటిని ఈ కార్యక్రమం లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. డిజిటల్ అక్షరాస్యత డిజిటల్ తెలంగాణ లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యత, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, మొబైల్ గవర్నెన్స్ ద్వారా మీ-సేవలను మరింత విస్తృతపరచడం, టెక్నాలజీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి పౌరులకు మెరుగైన సేవలందించడం సులభం కానుంది. డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా దేవాదాయశాఖ పరిధిలోని యాదాద్రి, భద్రాచలంలో ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల ఏర్పాటు, వ్యవసాయశాఖలో గ్రీన్ ఫ్యాబ్లెట్ సదుపాయాన్ని కల్పించనున్నారు. డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడం, సైబర్ సెక్యూరిటీ, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, 2కె, 5కె రన్లు, ప్రతిజ్ఞలు, హ్యాక్థాన్లు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ సంస్థల్లో హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి వైఫై సదుపాయం కల్పించనున్నారు. డిజిటల్ వారోత్సవాలు ఇలా... వారోత్సవాల్లో భాగంగా జూలై 1న ప్రధాని మోదీ రేడియో ప్రసంగం మన్‌కీబాత్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చేస్తారు. 2న గ్రామస్థాయిలో ఆధార్, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 3న డివిజన్ స్థాయిలో ప్రభుత్వ విభాగాల అధికారులు, మీసేవ సిబ్బందికి నూతన సర్వీసులపై శిక్షణ అందిస్తారు. 4న జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5న రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌లో 5కె రన్, డిజిటల్ రాహ్‌గిరి కార్యక్రమాలతో డిజిటల్ తెలంగాణపై అవగాహన కల్పిస్తారు. 6న ఈ-వేస్ట్ మేనేజ్మెంట్తో స్వచ్ఛ తెలంగాణ, ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.