హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ తెలంగాణలో భాగంగా అన్ని గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే రెండేళ్లలో కొత్తగా 5,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్‌లోగా 1,000 గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,800 మీ సేవా కేంద్రాలున్నాయి.