‘ఉత్సవం' మనందరం గర్వపడే సినిమా
‘‘కన్నడలో ‘క్రేజీ బాయ్’ సినిమా చేశాను. తెలుగులో నా తొలి చిత్రం ‘ఉత్సవం’. సురభి నాటక సమాజం స్ఫూర్తితో రంగస్థల కళాకారులపై తీసిన సినిమా ఇది. చాలా మంచి కథ. ఈ చిత్రానికి కథే హీరో’’ అని దిలీప్ ప్రకాష్ అన్నారు. అర్జున్ సాయి దర్శకత్వంలో దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్ర లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. దిలీప్ ప్రకాష్ మాట్లాడుతూ– ‘‘సినిమాలు పుట్టిందే నాటకాల నుంచి. ఈ విషయాన్నే ‘ఉత్సవం’లో చూపిస్తున్నాం. ఈ మూవీలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. సందేశంలా కాకుండా వినోదాత్మకంగా చెబు తున్నాం. మనందరం గర్వపడే సినిమా ఇది. రెజీనాగారు మంచి కోస్టార్. నా తర్వాతి చిత్రం తెలుగులోనే ఉంటుంది’’ అన్నారు.