Dineshwar Sharma
-
మిషన్ కశ్మీర్.. కేంద్రం వ్యూహం ఫలిస్తోందా?
శ్రీనగర్ : కశ్మీర్ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మ చర్చలు వేర్పాటువాదుల్లో చీలిక తీసుకొస్తున్నాయి. తొలుత కొన్ని వేర్పాటువాద సంస్థలు ఆయనతో చర్చకు అంగీకరించని విషయం తెలిసిందే. అయితే ముస్లిం కాన్ఫరెన్స్ ప్రతినిధి అబ్దుల్ ఘని భట్ ఇప్పుడు దినేశ్వర్‌తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు హురియత్ కాన్ఫరెన్స్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అబ్దుల్.. తర్వాత సొంతగా ముస్లిం కాన్ఫరెన్స్(ఎంసీ) సంస్థ ఏర్పాటు చేసుకుని కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రత్యేక ప్రతినిధి తో రహస్య సమావేశం అయిన వార్తల నేపథ్యంలో ఎంసీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. అనంతరం అబ్దుల్‌ను సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్లు ముస్లిం కాన్ఫరెన్స్ ప్రకటించింది. ఇక మహ్మద్ సుల్తాన్‌ను కొత్త చీఫ్‌గా ఎంసీ ప్రకటించింది. తొలుత ఓ జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భేటీ వార్తలను అంగీకరించిన అబ్దుల్.. వేటు తర్వాత అదంతా అబద్ధమని చెబుతున్నారు. కొందరు కక్ష్య కట్టి తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అబ్దుల్ ఘని భట్ ఫోటో ఇక కశ్మీర్ విషయంలో చర్చల కోసం కేంద్రం ఐబీ మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించిన రెండు నెలల్లోనే వేర్పాటు వాద సంస్థల్లో చీలికలు రావటం విశేషం. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని సంస్థలు స్వాగతించగా.. పాక్ ప్రేరేపిత సంస్థల్లో మాత్రం విభేదాలతో చీలికలు వస్తుండటం గమనార్హం. -
‘ఆ నివేదికను పార్లమెంట్లో పెట్టాలి’
శ్రీనగర్ : కశ్మీర్ చర్చలపై కేంద్రం నియమించిన ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ చర్చలపై కేంద్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక పార్లమెంట్లో వెలుగుచూస్తేనే ఆయన విజయం సాధించినట్లని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ‘కశ్మీర్ చర్చలకు సంబంధించి దినేశ్వర్ శర్మను ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంలో కేంద్రం ఆంతర్యమేమిటో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉంది. చర్చలు మొదలు కాకముందే ఆయన పాత్రను నామమాత్రం చేసేందుకు ప్రభుత్వమే వివిధ రకాల వాదనలను లేవనెత్తుతోంది. కశ్మీర్‌పై నేనెప్పుడూ చర్చలకు సిద్ధమే..అయితే చర్చలపై నాకున్న అభ్యంతరమల్లా కేంద్రం అనుసరిస్తోన్న అస్పష్ట వైఖరితోనే. కశ్మీర్‌పై శర్మకున్న స్పష్టత ఏమిటో ఎవరికీ అంతు చిక్కడంలేదు. కశ్మీర్‌పై ఆయన ఏ అజెండాతో ముందుకెళ్తారన్నది ఇప్పటికీ తెలియడం లేదు. 2010లో యూపీఏ ప్రభు త్వం కశ్మీర్ అంశాన్ని తేల్చేందుకు దిలీప్ పద్గోవంకర్, రాధా కుమార్, ఎమ్.ఎమ్ అన్సారీలతో కూడిన త్రిసభ్య కమిటీని నియమించింది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తే సరైనదంటూ ఈ త్రిసభ్య కమిటీ 2012లో కేంద్రానికి నివేదికను సమర్పిచింది. అయితే, ఈ కమిటీ నివేదిక ఇప్పటివరకూ వెలుగుచూడలేదు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బహిర్గత పరచాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘మరో సిరియాగా మారనివ్వం’
సాక్షి, న్యూఢిల్లీ: యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా.. పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రశాంత కశ్మీర్‌ను రూపొందించడమే తన తక్షణ లక్ష్యమని నూతనంగా నియమించబడిన జమ్ము-కశ్మీర్ చర్చల ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేస్తానని ఆయన అన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘‘శాంతిని నెలకొల్పడమే మా తక్షణ కర్తవ్యం. దాని కోసం అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటాం. శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరితో చర్చిస్తాం. తప్పుదోవ పట్టిన కశ్మీర్ యువతను చూస్తూంటే బాధేస్తోంది. హింసావాదంతో వినాశనం తప్ప మరేం లేదు. హింసకు సాధ్యమైనంత త్వరగా స్వస్తి పలకడమే మా లక్ష్యం. యువత తప్పుదోవ పడితే సమాజమే నాశనం అవుతుంది. ఇలా జరగడాన్ని మేము సహించం.. కశ్మీర్‌ను మరో సిరియాగా మారనివ్వం’’ అని అన్నారు. -
మిషన్ కశ్మీర్..