'ఉమ్మడి పౌరస్మృతి ఉండాలన్నారు'
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన లోక్ సభలో మాట్లాడారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అంబేడ్కర్ అస్పృశ్యత, అసమానతలపై పోరాటం చేశారని పేర్కొన్నారు.
స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమని ఉద్బోధించారని గుర్తు చేశారు. సామాజికంగా, నైతికంగా ప్రజలు ఎదగాలని ఆయన కోరుకున్నారన్నారు. మనుషులంతా సత్ప్రవర్తనతో మెలగాలని, విద్యతోనే అది అలవడుతుందని రాజ్యాంగ నిర్మాత భావించారని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేడ్కర్ గట్టిగా ఆకాంక్షించారని అన్నారు.