displaced people
-
పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
రియోడిజెనెరియో: బ్రెజిల్లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో బ్రెజిల్ అతలాకుతలం అవుతోంది. దక్షిణ బ్రెజిల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రియో గ్రాండేలో వరదలు పోటెత్తాయి. బ్రెజిల్ గత 80 ఏళ్లలో ఎప్పుడూ చూడని వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల ధాటికి ఇప్పటివరకు 100 మందిపైగా చనిపోట్లు అధికారికంగా ప్రకటించారు.వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. లక్షల మంది చెల్లాచెదురయ్యారు. తాగునీరు, కరెంటు లేకుండా పోయాయి. టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఇంటర్నెట్ సర్వీసులు పనిచేయడం లేదు. వీధులు నదుల్లా మారిపోయాయి. రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లి ఇళ్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు ఇళ్లు విడిచి రావడానికి ఇష్టపడటం లేదు.A devastating flood has hit Rio Grande do Sul in Brazil impacting more than 1 million people, of which 41,000 had already been forced to flee.UNHCR is working with local authorities and civil society to respond to this climate emergency. https://t.co/Ewm4e1IprO pic.twitter.com/IypsMLTV7s— UNHCR, the UN Refugee Agency (@Refugees) May 9, 2024తమ ఇళ్లలో దోపిడీ జరుగుతుందేమో అన్న భయంతో వారు పునరావాస కేంద్రాలకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా గ్యూబా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మొత్తం ఐదు డ్యామ్‌లలో నీటి నిల్వలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. స్పందించిన బిలీయనీర్ ఎలాన్ మస్క్...బ్రెజిల్ రియో గ్రాండేలో పోటెత్తిన భీకర వరదలపై టెస్లా అధినేత, పాపులర్ బిలియనీర్ ఎలాన్‌మస్క్ స్పందించారు. స్టార్‌లింక్‌కు చెందిన 1000 టర్మినల్స్‌ను విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ కోసం ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. బ్రెజిల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Horse stranded on rooftop amidst the floodwater in the city of Canoas, Brazil. The city’s mayor said they were hoping to rescue the horse with a helicopter.pic.twitter.com/4CDfpA2Lst— Mahatma Gandhi (Parody) (@GandhiAOC) May 9, 2024ఇంటి మీదకు ఎక్కిన గుర్రం.. వీడియో వైరల్ రియో గ్రాండేలోని పోర్టో అలెగ్రెలోని కానోస్ పట్టణంలో పోటెత్తిన వరదల నుంచి తప్పించుకోవడానికి ఒక గుర్రం ఏకంగా ఇంటిపైకి ఎక్కి నిల్చుంది. ఈ గుర్రాన్ని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కారామెలో అని నిక్‌నేమ్‌తో నెటిజన్స్ పిలుచుకుంటున్న గుర్రాన్ని ఫైర్ ఫైటర్స్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కారామెలో వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. Man searching for survivors during the devastating floods in Brazil smashes through the roof of a fully inundated house to rescue a dog after he hears barking and whimpering. 🇧🇷🙏pic.twitter.com/51Kv6gylSM— GoodNewsCorrespondent (@GoodNewsCorres1) May 9, 2024 -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
బుట్టాయగూడెం/ పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో నిర్వాసిత గ్రామాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. నిర్వాసితులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారమవడంతో సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని రూ.10 లక్షలు చెల్లిస్తామని గతంలో సీఎం హామీఇచ్చారు. అన్నట్లుగానే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ జూలై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అదనపు చెల్లింపుల నేపథ్యంలో ప్రభుత్వంపై రూ. 550 కోట్ల అదనపు భారం పడనుంది. పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమో.. నిర్వాసితుల సమస్య పరిష్కారం కూడా ముఖ్యమని భావించిన సీఎం జగన్ ఈ భారాన్ని లెక్కచెయ్యకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. 10,429 కుటుంబాలు తరలించేందుకు ఏర్పాట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 44 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆ గ్రామాల ప్రజల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో 44 గ్రామాల తరలింపునకు మార్గం సుగమమైంది. పోలవరం మండలంలో 19 గ్రామాల్లో 3,311 కుటుంబాలు, కుక్కునూరు మండలంలో 8 గ్రామాల్లో 3,024 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 17 గ్రామాల్లో 4,094 కుటుంబాలు మొత్తం 10,429 కుటుంబాలను తరలించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 41.15 కాంటూరు పరిధిలో నిర్వాసితులను తరలించేందుకు నిర్మిస్తున్న పునరావాస గృహ నిర్మాణాలు ఇప్పటికే అన్ని సౌకర్యాలతో సిద్ధమయ్యాయి. ఆయన చెప్పాడంటే చేస్తాడు.. సీఎం జగన్మోహన్రెడ్డి ఒక మాటిస్తే ఆ మాట నెరవేరుస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను రెండేళ్లలో 99 శాతం పూర్తి చేశారు. నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్యలు కూడా అంతే ముఖ్యమని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే సీఎంకు రుణపడి ఉంటాం ఇచ్చిన మాట ప్రకారం మాకు పరిహారం రూ.10 లక్షలకు పెంచినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. రూ.10 లక్షలు చెల్లించేందుకు జీఓ ఇవ్వడమే కాకుండా కేబినెట్ ఆమోదం తెలపడంతో మాకు మరింత నమ్మకం ఏర్పడింది. రూ. 7,11,000 ఇప్పటికే మా బ్యాంక్ ఖాతాలో జమైంది. మిగిలిన సొమ్ము త్వరలో అందుతుందని చెప్పారు. – జి.అనిల్ కుమార్, నిర్వాసితుడు, కోండ్రుకోట, పోలవరం మండలం చాలా సంతోషంగా ఉంది మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ. 10 లక్షలు ఇస్తారని ఊహించలేదు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో మా బాధ చెప్పుకున్నాం. రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కృషి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత సొమ్ము పరిహారంగా వస్తుందని ఊహించలేదు. – ఎం. బొత్తయ్య, నిర్వాసితుడు, మాదాపురం, పోలవరం మండలం -
అడియాసేనా... ?!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శ్రీశైలం నిర్వాసితులు... ఈ పదం వినగానే టక్కున గుర్తొచ్చేది 98 జీఓ. ఇంతగా జనంలోకి చొచ్చుకుపోయిన అంశమిది. మూడు దశాబ్దాలు గా శ్రీశైలం నిర్వాసితులు ఉద్యోగాల కోసం ఉద్యమిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకున్నా ఆ ఆశ కూడా అడియాసే అయింది. పాలకులు పట్టించుకోక, ప్రభుత్వాలు ఆదరించక శ్రీశైలం నిర్వాసితుల బతుకుల్లో వెలుగులు కానరాకుండా పోతున్నా యి. స్వరాష్ట్రంలోనూ నిర్వాసితుల అంశం కొలిక్కిరాకపోవడం... ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ అంశంగా మారడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేత బీరం హర్షవర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత జి.రాంభూపాల్‌రెడ్డి నిర్వాసితులకు అండగా పోరాటాలు చేయడం... తాజాగా తెలంగాణ నవనిర్మాణ వేదిక అధ్యక్షుడు మురళీధర్‌గుప్తా శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం కోసమే రానున్న ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ప్రకటించడం చర్చనీయాశమైంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ముంపు నిర్వాసితుల అంశం ఉమ్మడి జిల్లాలో ఎన్నికల అజెండాగా మారింది. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం 1981లో శ్రీశైలం బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నదీ తీరంలోని 67 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. 11 వేల కుటుంబాలకు చెందిన 27 వేల మందికి పైగా ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లారు. బంగారం వంటి పంట పండే భూములు బ్యాక్‌వాటర్‌లో మునిగిపోవడంతో రైతులు కూలీలుగా మారారు. కర్నూలు జిల్లాతో పాటు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజవర్గాల్లోని గ్రామాలు నీటిముంపునకు గురయ్యాయి. నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. జీఓ 98ను రూపొందించారు. నిర్వాసితులకు నష్టపరిహారంగా రూ.17.90కోట్లు చెల్లించారు. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పునరావాసం కోసం కేవలం రూ.2.90కోట్లు మాత్రం ఖర్చు చేశారు. నాటి నుంచి నేటివరకూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కొందరికి ఉద్యోగాలు జీఓ 98 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 1992లో కొందరికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో అధికంగా కర్నూల్ జిల్లా వాసులకే అవకాశం దక్కింది. అర్హులైన వారు ఉద్యోగాల కోసం ధరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో ఇప్పటివరకు 2,435 మంది నిర్వాసిత నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు, ఉద్యోగ అర్హత లేనివారికి అదనపు పరిహారం చెల్లించాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయన అకాల మరణం చెందారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 143 మంది నిర్వాసిత నిరుద్యోగులకు లష్కర్ పోస్టులను ఇచ్చారు. నిర్వాసితులకు ఉద్యోగాల కల్పన కోసం జీఓ నెం 68ను రూపొందించారు. రాష్ట్రం విడిపోవడంతో ఈ అంశం అటకెక్కింది. విభజన తర్వాత.... రాష్ట్ర విభజన జరిగితే తమకు ఉద్యోగాలు వస్తాయని శ్రీశైలం నిర్వాసితులు భావించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోయాక కర్నూలు జిల్లాలోని నిర్వాసిత నిరుద్యోగలందరికీ అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. తెలంగాణలో మాత్రం ఉద్యోగాల కల్పన జరగలేదు. దీంతో నిర్వాసితులు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో వంద రోజుల పాటు రిలే నిరాహారదీక్షలు కూడా చేశారు. అప్పట్లో ప్రభుత్వం స్పందించగా.. మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు సాధ్యమైనంత త్వరలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే నెలల తరబడి ఎదురుచూసిన ఆహామి అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక, న్యాయబద్దమైన పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. నిర్వాసితుల పక్షాన టీజేఏసీ, తెలంగాణ నవనిర్మాణ వేదిక, కాంగ్రెస్, వైఎస్సార్సీపీతో పాటు పలు రాజకీయ పార్టీలు నేటికీ పోరాటాలు సాగిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిర్వాసితులు సమస్యలు పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. ఉద్యోగాలు కల్పించాలి నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం 30 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. వారి ఉద్యమంలో న్యాయం ఉంది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వమే జీఓ ఇచ్చింది. ఆంధ్రా పాలకుల వివక్ష వైఖరి కారణంగా ఉద్యోగాల కల్పనలో ఆలస్యం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిర్వాసిత నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అంతా భావించారు. రాష్ట్రం వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిన నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రతీ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం చెల్లించాలి. – మురళీధర్‌గుప్తా, తెలంగాణ నవనిర్మాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిర్వాసితులపై ఇంకా వివక్షే... శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులపై పాలక ప్రభుత్వాలు ఇంకా వివక్షత కొనసాగిస్తున్నాయి. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం 98 జీఓ అమలులో మాత్రం వెనకంజ వేస్తోంది. ఏపీలో నిర్వాసిత నిరుద్యోగులందరికీ దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్సార్ బతికి ఉంటే నిర్వాసితులందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వాసితులకు ఉద్యోగాలిస్తామని కేసీఆర్ కూడా ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నిర్వాసిత కుటుంబాలకు అదనపు పరిహారం ఇవ్వాలి. నిర్వాసితుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుంది. – జి.రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
గడువు ముగిసింది.. గ్రామాన్ని ఖాళీ చేయండి
మాచవరం (గురజాల) : గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామమైన వెల్లంపల్లిని ఖాళీ చేసేందుకు ఇచ్చిన 2 రోజుల గడువు పూర్తయిందని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రాజెక్టు అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు ముంపు నిర్వాసితులను ఆదేశించారు. త్వరలో పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు చేరే అవకాశం ఉన్నందున, గ్రామాన్ని సత్వరమే ఖాళీ చేయించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆదివారం జేసీబీతో గ్రామంలోని ఇళ్లను తొలగించేందుకు యత్నించారు. పరిహారం అందజేసిన నిర్వాసితుల ఇళ్లకు మార్కింగ్ ఇచ్చామని, వీటిని ఆదివారంలోగా ఖాళీ చేయకుంటే కూల్చేస్తామని శనివారం ప్రకటించారు. గడువు కోరినా అధికారులు స్పందించకపోవడంపై నిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం జేసీబీతో ఓ ఇంటిని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా గడువు విధించి గ్రామాన్ని ఖాళీ చేయాలంటే ఎలాగని అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పరిహారం అందిన వారి ఇళ్లను కూల్చివేస్తున్నామని, పరిహారం అందని వారికి కొంత గడువు ఇస్తామని ప్రకటించారు. అయితే, ఇళ్లను కూల్చేయక ముందే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాన్ని ఖాళీ చేసేందుకు మరికొన్ని రోజులు గడువు కావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో.. పరిహారం అందిన వారు సోమవారం సాయంత్రంలోగా ఖాళీ చేయాలని, లేకుంటే మంగళవారం ఉదయాన్నే యంత్రాలతో కూల్చేస్తామంటూ అధికారులు హెచ్చరించారు. పరిహారం అందని వారు నష్టపరిహారం అందేవరకూ ఇక్కడ ఉండవచ్చని తెలిపారు. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ధనుంజయ్, స్థానిక తహసీల్దారు మస్తాన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
త్యాగాలకు అవమానాలే బహుమానం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జాతీయ గిరిజన కమిషన్ ఇటీవల రాష్ట్రపతి కోవింద్‌కు నివేదిక అందజేసింది. గిరిజనుల నుంచి సేకరించిన భూమికి బదులుగా ప్రభుత్వం ఇస్తున్న భూమి సాగుకు యోగ్యంగా లేదని పేర్కొంది. బండరాళ్లు, చెట్లు, పుట్టలతో కూడిన బంజరు భూమిని అంటగడుతోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవని, జీవన ప్రమాణాలు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేస్తున్న గిరిపుత్రులను ప్రభుత్వం అవమానిస్తోందని తెలిపింది. వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మెరుగైన పునరావాసం కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరింది. క్షేత్రస్థాయిలో పర్యటన, సమీక్ష సహాయ, పునరావాస ప్యాకేజీ అమల్లో డొల్లతనాన్ని జాతీయ గిరిజన కమిషన్ బహిర్గతం చేయడం కలకలం రేపుతోంది. పోలవరం ముంపు గ్రామాల్లో మార్చి 26, 27న గిరిజన కమిషన్ పర్యటించింది. భూసేకరణ, పునరావాసం కల్పనలో గిరిజనులకు అన్యాయం జరుగుతున్నట్లు గుర్తించింది. మార్చి 28న సీఎం చంద్రబాబు, జలవనరులశాఖ అధికారులు, సహాయ పునరావాస విభాగం కమిషనర్‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన అంశాల ఆధారంగా రూపొందించిన నివేదికను జూలై 3న రాష్ట్రపతికి అందజేసింది. 3,922 కుటుంబాలకే పునరావాసం పోలవరం జలాశయంలో ముంపునకు గురువుతున్న భూమిలో సింహభాగం అడవి బిడ్డలదేనని జాతీయ గిరిజన కమిషన్ గుర్తించింది. భూమికి బదులుగా గిరిజనులకు ఇస్తున్న విస్తీర్ణానికి పొంతన లేదని తెలియజేసింది. బంజరు భూముల్లో గిరిజనులు పంటలు పండించుకోవడం ఎలా సాధ్యమని నివేదికలో ప్రశ్నించింది. పోలవరం వల్ల 98,818 కుటుంబాల ప్రజలు నిర్వాసితులుగా మారుతారని.. ఇప్పటిదాకా కేవలం 3,922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారని స్పష్టం చేసింది. గిరిజనుల కోసం 10 ప్రతిపాదనలు త్యాగధనులైన గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేలా ప్యాకేజీ అమలు చేయడానికి గిరిజన కమిషన్ 10 ప్రతిపాదనలు చేసింది. గిరిజనుల నుంచి ఎంత భూమిని సేకరిస్తే పరిహారం కింద అంతే భూమి ఇవ్వాలని సూచించింది. ఇందులో కనీసం 2.50 ఎకరాలను పోలవరం ప్రాజెక్టు ఆయకట్టులో కేటాయించాలంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహానది బొగ్గు గనుల నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ పరిహారం చెల్లించాలని పేర్కొంది. నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కళాశాలలు, విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని వెల్లడించింది. నిర్వాసితుల కాలనీలకు అనుబంధంగా పారిశ్రమిక వాడను ఏర్పాటు చేయాలని.. పదేళ్లపాటూ వంద శాతం పన్ను రాయితీలు ఇచ్చి పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పోత్సహించాలని, అందులో నిర్వాసితులైన గిరిజనులకు ఉపాధి కల్పించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని రాష్ట్రపతికి జాతీయ గిరిజన కమిషన్ విజ్ఞప్తి చేసింది. -
సాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం
విపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: హరీశ్‌రావు భూసేకరణ చట్టం అమలు చేస్తే ఎకరాకు వచ్చేది రూ.1.8 లక్షలే.. రాష్ట్రం రూ.5.8 లక్షలు ఇస్తోంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు ఇస్తోంది సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటామని.. రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ రైతుల పక్షపాతి అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ విపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని, రైతుల పొట్ట కొట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రభుత్వ పథకాల అమలుకో, ప్రాజెక్టుల నిర్మాణానికో భూసేకరణ జరిపితే... నిర్వాసితులకు అండగా ఉండాలన్నదే మా ప్రభుత్వ మూల సూత్రం. మల్లన్నసాగర్ విషయంలోనూ ఇదే పంథాను కొనసాగిస్తాం.. కానీ దీనిపై విపక్షాలు వితండవాదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏనాడూ వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. పేద రైతుల పొట్ట కొట్టాలని ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు..’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో నష్టపోతున్న ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులకు 2013 భూసేకరణ చట్ట పరిధికి మించి మరీ న ష్ట పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎకరానికి మెట్టభూములకు రూ.50వేలు, తరి భూములకు రూ.60వేలుగా ఉందని.. భూసేకరణ చట్టం ప్రకారం దానికి మూడు రెట్లు పరిహారం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. అంటే రైతులకు రూ.1.5 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు మాత్రమే వస్తుందని... కానీ ప్రభుత్వం నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఎకరాకు రూ.5.8 లక్షలు పరిహారంగా చెల్లిస్తోందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా రూ.5.4 లక్షలు అందజేస్తోందని వెల్లడించారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.. నిర్వాసితుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నా కుహానా మేధావులు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు మిడిమిడి జ్ఞానంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని... ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. చట్టప్రకారం భూములు స్వాధీనం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
పోలవరం నిర్వాసితులకు అన్యాయం: వైస్ జగన్
పోలవరంలో ప్రతిరోజూ ధర్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి అక్కడ ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 12వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో చూడాలని, కావాలంటే తాను కూడా వస్తానని ఆయన చెప్పారు. పదేళ్ల నుంచి భూసేకరణ జరుగుతున్నా ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాక గిరిజనులు కష్టపడుతున్నారని, నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టు కట్టడం న్యాయమని తెలిపారు. ఇలా అంటున్నాము కదా అని తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం అనే ముద్ర వేయొద్దని, తామెవ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. నిర్వాసితులను విశ్వాసంలోకి తీసుకోవాలని, వాళ్లకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పోలవరం గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు. రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారు. పట్టిసీమలో ఎకరాకు 25 లక్షల చొప్పున ఇచ్చారని గుర్తు చేశారు. భూసేకరణకు అయ్యే ఖర్చు ఎప్పుడూ ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం కన్నా తక్కువే ఉంటుందని, అలాంటప్పుడు పేదప్రజలను సంతృప్తిపరుద్దామని వైఎస్ జగన్ అన్నారు. ప్యాకేజి తీసుకోనప్పుడు ఇవ్వడంలో తప్పేముందని, అప్పుడు తీసుకోలేదు కాబట్టి కొత్త చట్టాన్ని అనుసరించి తమకు పరిహారం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారని తెలిపారు. అప్పుడు డబ్బులు తీసుకుంటే ఇప్పుడు అడగడం తప్పే గానీ అలా తీసుకోలేదు కాబట్టి వాళ్లకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చేగొండపల్లి గ్రామాన్ని శుక్రవారమే ఖాళీ చేయించినట్లు మంత్రి ఉమా మహేశ్వరరావు చెప్పారు. పైడిపాక, రామయ్యపేట గ్రామస్తులకు నచ్చజెబుతున్నామని అన్నారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, ఆర్అండ్ఆర్, భూసేకరణ విషయాల్లో వాళ్లకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.