distribution of voter slips
-
మండలి పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
► 27 పోలింగ్ కేంద్రాలు ► ప్రతి మండల కేంద్రంలో ఓటర్లకు అందుబాటులో.. ► ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి.. ► నేటి సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెర సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఈ నెల 9వ తేదీన రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 6,528 మంది ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరంతా 9వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంటుంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులో లేనిచోట, బడుల్లో అరకొర సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపారు. ఉదయం 8 నంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పూర్తిగా బ్యాలెట్ పేపర్ ఆధారంగానే ఈ ఎన్నిక జరుగుతుంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల తరఫున మొత్తం 12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ తదితర సౌకర్యాలు ఉండేలా చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రచారం ఈ నెల 7 తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక కేంద్రాలు లేనప్పటికీ.. అన్ని కేంద్రాలపై పోలీసుల పటిష్ట నిఘా ఉంటుందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్లిప్పుల పంపిణీ.. నమోదైన ఓటర్లకు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు ఓటరు స్లిప్పుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు వెంట బెట్టుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవి లేకుంటే కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం ఓటర్లు : 6,528 పురుష ఓటర్లు : 3,655 మహిళా ఓటర్లు : 2,873 పోలింగ్ తేది : మార్చి 9 పోలింగ్ సమయం : ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు -
ఉత్కంఠ
* నేటితో ఎన్నికల ప్రచారానికి తెర * సాయంత్రం 5 గంటల వరకే అవకాశం * ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు * భారీ ర్యాలీలు, సభలతో బల ప్రదర్శన * అంతటా నేడు ఓటరు స్లిప్పుల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. సభలు, సమావేశాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ అన్ని రకాల ప్రచారాన్నీ నిలిపివేయనున్నారు. బల్క్ ఎస్సెమ్మెస్‌ల ప్రచారం కూడా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. చివరి రోజును వివిధ పార్టీలు డివిజన్ స్థాయిలోనే భారీ సభలు, ర్యాలీలతో బల ప్రదర్శనకు వాడుకునే దిశగా ఏర్పాట్లు చేసుకున్నాయి. టీఆర్ఎస్ శనివారం రాత్రి పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సభ విజయవంతం కావటంతో ఆ జోష్‌ను పోలింగ్ రోజు వరకు కొనసాగించే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది. బీజేపీ, టీడీపీల తరఫున చివరి రోజు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయతో పాటు ఏపీ శాఖ అధ్యక్షుడు హరిబాబు కూడా వివిధ సభల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ నేతలు వివిధ ప్రాంతాల్లో జరిగే ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఓటరు స్లిప్పుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని అన్ని పోలింగ్ బూత్‌లు, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఓటరు స్లిప్పులు అందజేయనున్నారు. ఇప్పటికే నగరంలో ఇంటింటికీవెళ్లి సుమారు 40 లక్షలు పంపిణీ చేశారు. వెబ్ నుంచి4.10 లక్షలు, యాప్ నుంచి 1.74 లక్షల స్లిప్పులు ఓటర్లకు చేరిపోయాయి. మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాల్లో 25 వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. సుమారు 3,200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 52, 722 ఓటరు స్లిప్పుల డౌన్లోడ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి శనివారం మొత్తం 52,722 మంది ఓటర్ స్లిప్పులు డౌన్లోడ్ చేసున్నారు. వీరిలో వెబ్సైట్ నుంచి 14,027 మంది డౌన్లోడ్ చేసుకోగా, మరో 38,695 మంది మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసున్నారు. -
ఓటరు స్లిప్పుల పంపిణీలో గందరగోళం
కురిచేడు, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ద్వారా ఓటర్లందరికీ ఓటేసేందుకు అవసరమైన స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ బూత్‌లెవల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మందికి అందలేదు. కురిచేడు మండలంలోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 1,030 మంది ఓటర్లుండగా, వారిలో 460 మందికి ఓటర్ స్లిప్పులు అందలేదు. 570 మందికి మాత్రమే స్లిప్పులు పంపిణీ చేశారు. అంతేగాకుండా పంపిణీ చేసిన స్లిప్పుల్లో కూడా 476 నుంచి 570 సంఖ్య వరకూ గల 94 మంది ఓటర్లకు పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చింతపల్లిపాడులోని 58వ నంబర్ పోలింగ్ కేంద్రంలోని ఓటర్లకు సంబంధించిన స్లిప్పులు అందజేశారు. ఆ స్లిప్పులు అందుకున్న.. మండలంలోని గొల్లపాలెం ఎస్సీకాలనీ ఓటర్లంతా అయోమయానికి గురయ్యారు. వీరితో పాటు అసలు స్లిప్పులే అందనివారు కూడా ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి బుధవారం తామంతా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.