district bandh
-
నీ అంతుచూస్తాం!
సాక్షి, గుంటూరు: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బందోబస్తులో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. ఒకానొక దశలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ లాల్‌వజీర్ డీఎస్పీపై చెయ్యివేసి దౌర్జన్యానికి దిగారు. అంతటితో ఆగకుండా ‘నీ అంతుచూస్తా’నని బెదిరించారు. దీంతో అక్కడ టీడీపీ నాయకులు పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలివీ.. జిల్లా బంద్ పురస్కరించుకుని గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం వద్ద కాలేజీ బస్సులను అడ్డుకుంటూ, వ్యాపార సంస్థలను టీడీపీ నాయకులు మూసివేయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంద్‌కు ఎలాంటి అనుమతుల్లేవని, వాహనాలను అడ్డుకోవడం, వ్యాపార సంస్థలను మూసివేయించడం చేయకూడదని పోలీసులు వారించారు. ఈ సమయంలో ఓ ప్రైవేటు కళాశాల బస్సును టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి షేక్ లాల్‌వజీర్, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పార్టీ ఇతర నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులకు గుంటూరు అర్బన్ మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ సీతారామయ్య సర్దిచెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీ నాయకులు డీఎస్పీపై దౌర్జన్యానికి దిగారు. లాల్‌వజీర్ అయితే డీఎస్పీపై చెయ్యి వేసి ‘నీ అంతుచూస్తా..’ అంటూ రెచ్చిపోయారు. డీఎస్పీ సీతారామయ్య సైతం అదేస్థాయిలో జవాబివ్వడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ నాయకులు సర్దిచెప్పగా పరిస్థితి సద్దుమణిగింది. కాగా, డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించినందుకు లాల్‌వజీర్ సహా 15 మందిపై గుంటూరు పట్టాభిపురం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. బంద్‌కు స్పందన కరువు ఇదిలా ఉంటే..బంద్‌కు గుంటూరు నగరం సహా జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ ప్రజాస్పందన లభించలేదు. రోజువారిలాగే వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. దీంతో టీడీపీ నాయకులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా స్కూల్ బస్సులను, ఇతర వాహనాలను అడ్డుకుని, వ్యాపార సంస్థలను మూసివేయించడానికి ప్రయత్నించారు. మరోవైపు.. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, వెలగపూడి గ్రామాల్లో ఆందోళనకారులు దీక్షా శిబిరాల్లో తమ నిరసన కొనసాగించారు. టీడీపీ నేతలకు తల్లిదండ్రుల ఝలక్ బంద్ సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మూసివేయించడానికి వెళ్లిన టీడీపీ నాయకులకు పరాభవం ఎదురైంది. పాఠశాల మూసివేతను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వ్యతిరేకించారు. ‘మీ పిల్లలు చదివే విజయవాడ, గుంటూరుల్లోని కార్పొరేట్ స్కూళ్లు మూతపడలేదు. మరి నిరుపేదలమైన మా పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడాలి?’ అని టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో చేసేదిలేక నేతలు వెనుదిరిగారు. -
8న జిల్లా బంద్
కాకినాడ రూరల్: కేంద్ర బడ్జెట్లో నవ్యాంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లాలోని పది వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆదివారం సాయంత్రం కాకినాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్షాల సమావేశంలో పలువురు నాయకులు బడ్జెట్‌పై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చాయన్నారు. అందులో భాగంగా జిల్లాలో కూడా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు కేంద్రబడ్జెట్‌పై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 8వ తేదీన రాష్ట్ర బంద్‌లో పాల్గొనేలా తమ శ్రేణులకు పిలుపు నివ్వాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సమాశానికి సీపీఎం (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు ఎం రాజశేఖర్, తోకల ప్రసాద్, నక్కా కిషోర్, అంజి, జె కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
హన్మకొండ జిల్లా వద్ధని, జనగామ కావాలని డిమాండ్ ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు విజయవంతం చేయాలని పరిరక్షణ కమిటీ వినతి వరంగల్ : నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వరంగల్ నుంచి హన్మకొండను వేరు చేయడాన్ని అడ్డుకునేందుకు జిల్లా పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అధ్వర్యంలో మంగళవారం జిల్లా బంద్ చేపట్టాలని తీర్మానించారు. జనగామ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా జిల్లా ఏర్పాటు చేపట్టని ప్రభుత్వం.. అనూహ్యంగా హన్మకొండ జిల్లా పేరును తెరపైకి తెచ్చింది. చారిత్రక వారసత్వానికి నిలువుటుద్దమైన వరంగల్‌ను విడిదీయాలనే నినర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్లోని కొందరి ప్రయోజనాల కోసమే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అంశం అ«ధికార టీఆర్ఎస్లో చిచ్చుపెడుతోంది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు వరంగల్‌ను విడదీయవద్దని అభిప్రాయపడుతుండగా, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే సురేఖ హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకోనందున బంద్ చేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు బిజెపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, ఎంఎస్ఎస్, ఆర్పీఐ, బీఎస్పీ, న్యూyð మోక్రసీ, ఎమ్మార్పీఎస్, కుల, ప్రజాసంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ రంగాలకు చెందిన వారంతా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ కోరింది. -
జనగామ జిల్లా కోసం పోరాడుతాం
జనగామ జేఏసీ నాయకుల ఆమరణ దీక్ష విరమింపజేసి అఖిలపక్ష నాయకులు ఎంజీఎం : హన్మకొండ జిల్లా ఏర్పాటును రద్దు చేసి, జనగామను జిల్లాగా ప్రకటించే వరకూ వరంగల్ పరిరక్షణ సమితి పోరాడుతుందని అఖిలపక్ష నాయకులు గురువారం రాత్రి జనగామ జేఏసీ నాయకులకు నిమ్మరసం అందిం చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వరంగల్ పరిరక్షణ సమితి కన్వీనర్ బైరపాక జయప్రకాశ్ మాట్లాడారు. జనగామ జిల్లా కోసం ఆరు నెలలుగా పోరాటం చేస్తున్న ప్రజ ల ఆకాంక్షను గౌరవించకుండా, ఎవరూ కోరని హన్మకొండను జిల్లాగా ప్రకటించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న అఖిలపక్షం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో బహిరంగ సభ నిర్వహించి, కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. చారిత్రాత్మక ఓరుగల్లును విడదీస్తూ హన్మకొండ జిల్లా ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్, ఈవీవీ శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, న్యూడెమోక్రసీ అధ్యక్షుడు అప్పారావు, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా అమరేందర్‌రెడ్డి, అడ్వకేట్స్ జేఏసీ నాయకులు మద్దసాని సహోదర్, చిల్లా రాజేంద్రప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
కాపు సద్భావనా సంఘం పిలుపు ముద్రగడ అరెస్టుకు నిరసన కాకినాడ సిటీ / అమలాపురం : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా కాపు సద్భావనా సంఘం శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు, రైళ్ళు నిలుపుదల చేసి ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి బసవా ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ నిర్వహణలో కాపు నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా కోనసీమ వ్యాప్తంగా జరిగే ఈ బంద్‌కు వ్యాపార సంఘాలు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోనసీమ కాపు సంఘం అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కోరారు. కోనసీమ అంతటా దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని 16 మండలాల తెలగ బలిజ కాపు (టీబీకే) సంఘాల ప్రతినిధులు బంద్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్ వైఫల్యానికి పోలీసుల యత్నం కాగా బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 144, 30 సెక్షన్లు అమలులో ఉండటం వల్ల దుకాణాలు బంద్ చేయించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకోవచ్చని, పోలీసులు రక్షణగా ఉంటారని, ప్రజలు కూడా మార్కెట్ అవసరాలకు రావచ్చని అమలాపురం పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. బంద్ పిలుపుతో పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో కూడా పోలీసు బలగాలను మోహరించారు. -
10న మహబూబ్‌నగర్ జిల్లా బంద్
మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అధికార టీఆర్ఎస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినిమా థియేటర్ల యజమానులు సహకరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బంద్‌కు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. -
నేడు జిల్లా బంద్
టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు నల్లగొండ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం జిల్లాబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్ యువజన విభాగాలు సైతం బంద్‌లో పాల్గొనున్నట్లు వేర్వేరు పత్రిక ప్రకటనలు జారీ చేశాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆమోదించిన బిల్లును ఉపసంహరించుకోవాలని వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జిల్లా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలో నల్లగొండలో క్లాక్‌టవర్ సెంటర్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపి కేంద్రం చట్టం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రలోభాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందన్నారు. మూడు లక్షల మంది గిరిజనుల హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని జిల్లా ప్రజలను కోరారు. -
పోగాలమిది..
సాక్షి, అనంతపురం : ఢిల్లీ పరిణామాలపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. పౌర సేవలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రూ.40 లక్షల మేరకు ఆదాయం కోల్పోయింది. తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి బద్రీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి, నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత సుభాష్ రోడ్డులోని మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి.. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను చింపివేశారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అనంతరం ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. టీ బిల్లును లోక్‌సభలో పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.మధుసూదన్‌రెడ్డి, సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విడపనకల్లులో రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ బిల్లును కేంద్రం మొండిగా లోక్‌సభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ధర్మవరంలో సమైక్యవాదులు రోడ్డుపై మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త బి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ బిల్లు ప్రతులను కాల్చివేశారు. మడకశిరలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పెనుకొండలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మంగమ్మ ఆధ్వర్యంలో బంద్‌ని ర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. పుట్టపర్తిలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్.హరికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి సమైక్య పరుగును ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకోవడం సిగ్గుచేటన్నారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నమన్వయకర్త వీ.ఆర్.రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. -
మళ్లీ సమైక్య జోరు
సమైక్య ఉద్యమం మళ్లీ తీవ్ర రూపం దాల్చనుంది. నేటి నుంచి అసెంబ్లీలో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థకీరణ బిల్లు’పై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సమైక్యం కోసం నిరంతపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాల కార్యాచరణ ప్రకటించింది. ఏపీ ఎన్జీవోలు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన అంశం చివరి అంకానికి చేరడంతో ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమబాటలో నడిచి సమైక్యకాంక్షను నెరవేర్చుకునేందుకు పిడికిలి బిగించనున్నారు. సాక్షి, కడప: సమైక్య తెలుగు రాష్ట్రంలో రగిలిన విభజన చిచ్చును చల్లార్చేందుకు అన్ని వర్గాల ప్రజలు దాదాపు మూన్నెళ్లపాటు అలుపెరుగని పోరు సాగించారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీల వైఖరి కారణంగా విభజన బిల్లు అసెంబ్లీ దాకా వచ్చింది. నేటి నుంచి బిల్లుపై అభిప్రాయసేకరణ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనన్న ఏకైక డిమాండ్‌తో నిరంతరపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఏపీ ఎన్జీవోలు కూడా వైఎస్సార్సీపీ పోరుకు సంపూర్ణమద్దతు ప్రకటించారు. నేడు జిల్లా బంద్‌లో ఎన్జీవోలు కూడా పాల్గొననున్నారు. విభజన అంశం...చివరి అంకం: రాష్ట్ర విభజనపై గత ఏడాది జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో ప్రకటించారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా సమైక్య జ్వాలలు మిన్నంటాయి. వందరోజులకుపైగా బలమైన ఉద్యమం నడిచింది. కొద్దిరోజుల పాటు నాయకత్వ లోపంతో సమైక్య ఉద్యమం చుక్కాని లేని నావలా నడిచింది. అయితే వైఎస్ జగన్మోహ న్‌రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తి సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని పోరు సాగిస్తున్నారు. దీంతో సమైక్యవాదుల్లో కూడా ఉద్యమస్ఫూర్తి మరింత రెట్టించింది. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోగలమనే సంకల్పం బలపడింది. అందుకు జిల్లాలో రోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ‘సమైక్య శంఖారావం’ పేరుతో జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. విభజనవల్ల వాటిల్లే నష్టాలను వివరిస్తున్నారు. ఇప్పటికే కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, జమ్మలమడుగులో సభలు విజయవంతమయ్యాయి. అలాగే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు కూడా కడప సెవెన్‌రోడ్స్, కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమాలు సాగిస్తున్నారు. గతంలో సకలజనుల సమ్మె వల్ల ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు, ఏపీ ఎన్జీవోల సమ్మెవల్ల ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో పాఠశాలలు మూతపడ్డాయి. ప్రస్తుతం అంసెబ్లీలో బిల్లుపై చర్చ జరిగే తీరు, పరిణామాల ఆధారంగా మళ్లీ ఉద్యమం గత ఏడాది ఆగస్టు నెల పరిస్థితిని తలపించే అవకాశం ఉంది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా చేతులెత్తేసిన కాంగ్రెస్, టీడీపీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతున్నా, అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షపార్టీ టీడీపీలు ఉద్యమానికి అండగా నిలువలేకపోయాయి. సమైక్యవాదమో, విభజనవాదమో రెండుపార్టీలు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాయి. పార్టీ నాయకత్వం సమైక్యవాదంపై ప్రకటన చేయకపోవడంతో జిల్లాలోని టీడీపీ నేతలు పూర్తిగా ఉద్యమానికి దూరమయ్యారు. కేవలం ప్రజల్లో ఉనికిని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు పదిమంది రోడ్లపైకి రావడం మినహా సమైక్యం కోసం పోరాడలేకపోతున్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేవనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఏకాభిప్రాయంతో ముందుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగసంఘాలు నేటి వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు పలుకుతున్నాయి. అలాగే వారం రోజులపాటు జరిగే నిరసన కార్యక్రమాలకు కూడా ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అశోక్‌బాబు చెప్పలేదు...అయినా మద్దతు: గోపాల్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు. శుక్రవారం బంద్ చేయాలని ఇప్పటి వరకూ అశోక్‌బాబు నుంచి సమాచారం రాలేదు. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మేం బంద్‌లో పాల్గొంటున్నాం. సమైక్యకాంక్షను కోరే ప్రతి ఒక్కరితో కలిసి నడుస్తాం. శాంతియుతంగా నిరసనలు చేయాలి: జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ, శుక్రవారం నుంచి అసెంబ్లీలో విభజనబిల్లుపై చర్చ జరగనుంది. దీంతో జిల్లాలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో బందోబస్తును పటిష్టం చేశాం. శాంతియుతంగా నిరసనలు తెలియజేయవచ్చు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించకూడదు. సమైక్య ప్రకటన వచ్చే వరకూ పోరు : సురేష్‌బాబు, జిల్లా కన్వీనర్, వైఎస్సార్సీపీ సమైక్య ప్రకటన వచ్చే వరకూ ఉద్యమాన్ని సాగిస్తాం. అందులోభాగంగా శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాం. అలాగే వారం రోజులపాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాం. అసెంబ్లీలోని పరిణామాలను బట్టి, రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఉద్యమంపై కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ప్రజలు, ఉద్యోగులు అందరూ సహకరించాలి. వైఎస్సార్సీపీ ఉద్యమ కార్యాచరణ ఈ నెల 3న జిల్లా బంద్ -4న బైకు ర్యాలీ 6న మానవహారాలు 7 నుంచి 10 వరకు నియోజకవర్గ కేంద్రాల్లో రిలేనిరాహార దీక్షలు -
ఇక సమరమే..
=నేడు జిల్లా బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు =పొలిటికల్ జేఏసీ మద్దతు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలన్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా బంద్ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 121 రోజులుగా ప్రజలు సమైక్యం కోసం ఉద్యమం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం సోనియాగాంధీ రాష్టాన్ని ముక్కలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని జిల్లాలో ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం, తన స్వార్థ రాజకీయం కోసం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం దారుణమని విమర్శించారు. శుక్రవారం జరిగే బంద్‌కు వ్యాపార, వర్తక, వాణిజ్యంతో పాటు విద్యాసంస్థలు, ఉద్యోగులు బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును పొలిటికల్ జేఏసీ బలపరిచింది. పొలిటికల్ జేఏసీ కన్వీనర్ కొలనుకొండ శివాజీ ఒక ప్రకటన చేస్తూ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా వేర్వేరు ప్రకటనలలో బంద్‌కు పిలుపిచ్చాయి. -
స్తంభించిన జనజీవనం
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు జేఏసీలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. జనజీవనం స్తంభించింది. వ్యాపారులు స్వచ్ఛ ందంగా బంద్ పాటించారు. రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణంతో కనిపించారుు. నిత్యం రద్దీగా జంక్షన్లన్నీ జనం లేక బోసిపోయాయి. అన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారారుు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టడంతో దాదాపు 45 రోజులుగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లన్నీ బంద్ పాటిం చారుు. ఎక్కడికక్కడ ఆటో కార్మికులు ఆటోలను నిలుపుతూ కనిపించారు. పలుచోట్ల సమైక్యవాదులు మానవహారాలు, రాస్తారోకో లు చేపట్టారు. వస్త్ర దుకాణాలు, హోటల్స్ మూత పడ్డారుు. మార్నింగ్, మ్యాట్నీషోలు రద్దు చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, యలమం చిలి,పాయకరావుపేట, చోడవరం, ఏజెన్సీలో ని పాడేరు, అరకులోయ ప్రాంతాల్లో బంద్ ప్రభావం బాగా కనిపిం చింది. ఆయా చోట్ల బ్యాంకులు, పెట్రోల్ బంకులు తెరచుకోలేదు. అరకులోయలో రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా రోడ్లపై చెట్లు నరికి, వాహనాలను అడ్డంగా ఉంచారు. -
7న జిల్లా బంద్
కడప రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర సాధన కోసం చేపడుతున్న ఉద్యమాలలో భాగంగా ఈ నెల 7వ తేదీన జిల్లా బంద్ చేపడుతున్నట్లు జేఏసీ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి, ఎస్.గోవర్థన్‌రెడ్డి, నిత్యానందరెడ్డి,ఎస్.రమణయ్య తెలిపారు. ఆదివారం కడప నగరంలో జరిగిన సమావేశంలో ఉద్యమ కార్యాచ రణను వెల్లడించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 6వ తేదీన మహిళలతో ర్యాలీలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ నాయకులు హరిప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, అమర్నాధ్రెడ్డి, ఇలియాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.