District Committees
-
టీఆర్ఎస్: తెరపైకి నామినేటెడ్ పదవులు
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఈక్రమంలో మళ్లీ జిల్లా కమిటీలను వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీతో పాటు అన్ని అనుబంధ కమిటీలను పునరుద్ధరించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగా భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్న సంకేతాలు కూడా పార్టీ శ్రేణులకు చేరినట్లు సమాచారం. వీటిపై సమాలోచనలు చేసేందుకు పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, సీని యర్లకు శుక్రవా రం సమాచారం అందింది. ఈ సమావేశంలో ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించేలా గ్రామ, మండల, జిల్లా కమిటీల పునరుద్ధరణతో పాటు సభ్యత్వ నమోదు అంశాలను చర్చించే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సంస్థాగత సందడి అధికార టీఆర్ఎస్లో ఇంతకాలం ఏ పదవీ లేకుండానే కొనసాగుతున్న పలువురు సీనియర్ నేతలను త్వరలోనే పదవులు వరించనున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వ నామినేటెడ్, సంస్థాగత పదవులను ఆశిస్తున్న నాయకులు అటు అడగలేక, ఇటు నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్ తదితర పదవులను ఆశించి.. అవి దక్కకపోవడంతో హామీలు పొందిన సీనియర్లు అధినేత ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన వారు, ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు నామినేటెడ్, సంస్థాగత పదవులు ఎప్పుడెప్పుడు వరి స్తాయా అని ఎదురుచూస్తున్నారు. గులాబీ దళనేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు వి విధ రాజకీయ పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన పలువురికి పదవుల్లేక రాజకీయ నిరుద్యోగులుగా మారామన్న అభిప్రాయంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలు, ఎంపీ, ఉప ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, ఆర్టీసీ సమ్మె, మున్సిపల్ ఎన్నికలు, కోవిడ్... ఇలా అనే క అవాంతరాలు ఏర్పడటంతో పార్టీ అధినాయకత్వం పదవుల భర్తీపై అంతగా దృష్టి పెట్టలేదన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న కీలక సమావేశంలో తీసుకునే నిర్ణయాలతో పదవుల భర్తీకి మళ్లీ మోక్షం కలగవచ్చన్న చర్చ జరుగుతోంది. తెరపైకి నామినేటెడ్ పదవులు పదవీకాలం పూర్తయిన చాలా నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్‌లో పడగా.. పార్టీ పదవుల ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు పొందిన పలువురి పదవీకాలం ముగిసిపోయి నెలలు దాటింది. ఉమ్మడి జిల్లా నుంచి వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మినహా ఎవరికీ మళ్లీ ఛాన్స్ రాలేదు. ట్రైకార్ చైర్మన్ గాంధీనాయక్, మహిళా అర్థిక సంస్థ చైర్పర్సన్ గుండు సుధారాణి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, గొర్రెల పెంపకందారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్, ఖాదీ గ్రామీ ణాభివృద్ధి సంస్థ చైర్మన్ యూసుఫ్ జాహేద్ పదవీకాలం ముగిసిపోయింది. గతేడాది ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో పార్టీ సభ్య త్వ నమోదు పూర్తయినా జిల్లా కమిటీల ఊసులేకపోగా చాలా వరకు గ్రామ, మండలాలతో పాటు పట్టణ / నగర కమిటీలు సైతం పెండింగ్‌లో పెట్టారు. వాటి స్థానంలో పార్టీ నియోజకవర్గ కమిటీలను వేశారు. ఈ కమిటీల వల్ల పార్టీకి, ప్రభుత్వానికి అంతగా ప్రయోజనం లేకపోగా, సంస్థాగత కమిటీలు లేని లోటు పలు సందర్భాల్లో కనిపించింది. దీంతో ఈసారి గ్రామ, మండల కమిటీలతో పాటు జిల్లా కమిటీలు, వాటి అనుబంధ సంఘాలను ఎన్నుకునే యోచన చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కీలక సమావేశం జరుగుతుండగా, త్వరలోనే పదవులు భర్తీ అవుతాయన్న ఆశాభావం పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. -
జిల్లా కమిటీలపై కసరత్తు
శాసనసభ, లోక్‌సభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాలో అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించిన విషయం తెలిసిందే. జిల్లాలో గ్రామ, మండల కమిటీల ఏర్పాటును ముమ్మరం చేసింది. అన్ని గ్రామాల్లో పదిహేను మందితో కూడిన గ్రామ కమిటీలను ప్రకటించారు. పలు చోట్ల మండల కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. అన్ని మండలాల్లో కమిటీల ఏర్పాటు పూర్తికాగానే జిల్లా కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర కార్యవర్గంలో ఎవరిని తీసుకోవాలి అనే అంశంపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. సాక్షి, సిద్దిపేట: పార్టీకి కార్యకర్తలే జీవం. అందుకోసం గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం బలోపేతం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోకవర్గాల్లో పోటాపోటీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జిల్లాలో ఉన్న 499 గ్రామ పంచాయతీల పరిధిలో పార్టీ గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర సభ్యులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల కమిటీలు మొత్తం 15 మందితో కమిటీల నియామకం పూర్తి చేశారు. అదేవిధంగా గ్రామాల్లోని చురుకైనకార్యకర్తలను మండల కమిటీల్లోకి తీసుకుంటూ నియామకం చేపట్టారు. ఇందులో ఇప్పటికే సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట అర్బన్ మండల నూతన కార్యవర్గం నియామకం పూర్తి చేశారు. మిగిలిన మండలాల నియామకం పూర్తి చేసినప్పటికి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కార్యకర్తల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, మర్కుక్ మండలాలా నియామకం దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. కొండపాక మండలంలో మాత్రం పలువురి మధ్య పోటీ ఉండటంతో ఎవ్వరిని నియమించాలనలో నియోజకవర్గం ఇన్చార్జి, ఇతర నాయకులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ్ మండల పార్టీ అధ్యక్షులుగా పలువురు పోటీ పడగా.. పాత అధ్యక్షులకే తిరిగి పట్టకట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హుస్నాబాద్ పట్టణ కమిటీ విషయంలో మాత్రం ఇప్పుడేమీ కదిలించకుండా మున్సిపల్ ఎన్నికల తర్వాత కమిటీలు వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు చెబుతున్నారు. జిల్లా కమిటీపైనే అందరి చూపు.. పలు కారణాలతో జిల్లా పార్టీ నియామకం నిలిపి వేశారు. ఇప్పుడు తిరిగి జిల్లా పార్టీ కార్యవర్గ నియామకం చేపట్టే అవకాశం ఉందని పార్టీ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి పలువురు ఆశావహులు జిల్లా పార్టీ కార్యవర్గంలో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతీ జిల్లాలో పార్టీ నూతన భవన నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కోసం పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ రాకకోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణంతో కార్యాకలాపాలు అక్కడి నుండే జరుగుతాయని నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ప్రాధాన్యత పెరిగింది. జిల్లా కేంద్రంలో ఉండే నాయకుడికి పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తే అందరికి అందుబాటులో ఉంటారని ముఖ్య నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తమకు అవకాశం ఇవ్వాలని ఇతర ప్రాంతాల నాయకులు కూడా పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి ముందే జిల్లా కమిటీ నియామకం జరుగుతుందా..? లేదా? ఆలస్యం అవుతుందా? అనేది జిల్లాలో చర్చగా మారింది. -
త్వరలో టీఆర్ఎస్ జిల్లా కమిటీలు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోందా..? గతంలో జిల్లా కమిటీలు అవసరం లేదన్న నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటోందా..? కొత్త జిల్లాల ప్రాతిపదికన పార్టీ యంత్రాంగాన్ని క్రియాశీలం చేయాలనే నిర్ణయానికి వచ్చిందా..? దీనికి టీఆర్ఎస్ ముఖ్య నేతలు అవుననే సమాధానం చెబుతున్నారు. జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణం, కమిటీలు అవసరం అని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు పలువురు సన్నిహితులు, ముఖ్యులు విన్నవించారు. జిల్లా స్థాయిలో పార్టీ యంత్రాంగం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో వస్తున్న పలు సమస్యలు, ఇబ్బందులను కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరించడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. పార్టీ కార్యాల యాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని, నిబంధనల మేరకు కేటాయించాలని అందులో కోరారు. పార్టీ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్న నాలు గైదు స్థలాల్ని ప్రతిపాదిస్తే, వాటిలో పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం అనువైన స్థలాలను ఎంపిక చేసుకోవాలని జిల్లా మంత్రులకు కేసీఆర్ సూచించారు. పాత జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నవారే, ఆ జిల్లాలోని కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయం కోసం స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే పలు జిల్లాల మంత్రులు స్థలాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్లు భూమిని కేటాయించ గానే కార్యాలయ భవన నిర్మాణం ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నమూనాతో కాకుండా, అన్ని జిల్లాలకు ఒకటే నమూనాతో కార్యాలయాలను నిర్మించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. సంపూర్ణ వాస్తు, పార్టీ అవసరాలు, జిల్లా స్థాయి సమావేశాలకు అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు వంటివాటి కోసం నమూనాను సిద్ధం చేయాలనే యోచనలో ఉన్నారు. కమిటీలు అవసరమంటున్న నేతలు.. రాజకీయ పార్టీగా విస్తృత యంత్రాంగం, పార్టీ కార్యకర్తల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఉండాలని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యేలు లేదా పార్టీ ఇన్‌చార్జ్‌లు చూసుకోవాలని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి జిల్లా కమిటీలున్నా, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా కమిటీలు అవసరం లేదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గమే యూనిట్‌గా పార్టీ పనిచేస్తుందని, దీనికి పార్టీకి చెందిన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేకుంటే ఇన్చార్జ్ పార్టీ వ్యవహారాలకు బాధ్యత వహించాలని ఆదేశించారు. పార్టీ కార్యకలాపాల సమన్వయం కోసం నియోజకవర్గం నుంచి ఒక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. పార్టీకి జిల్లా సమన్వయకర్తల నియామకం కూడా ఇప్పటిదాకా పూర్తికాలేదు. అయితే టీఆర్ఎస్లో భారీగా చేరికలతో పాత, కొత్త నాయకుల మధ్య చాలా నియోజకవర్గాల్లో విబేధాలు తలెత్తాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత వైషమ్యాలు పార్టీకి నష్టం చేసే పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదికలు, ఫిర్యాదులు అందాయి. దీంతో వాటివల్ల పార్టీకి నష్టం రాకుండా ఉండటానికి జిల్లా స్థాయిలో పూర్తిస్థాయి యంత్రాంగం ఏర్పాటు చేయాలనే యోచనకు కేసీఆర్ వచ్చినట్టుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో పార్టీకి అధ్యక్షుడు, కార్యవర్గం ఉంటుందా, సమన్వయకర్తలు ఉంటారా, జిల్లా పార్టీ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. -
జిల్లా కమిటీలకు వైఎస్ జగన్ ఆమోదం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కొత్తగా నియమించిన జిల్లా కమిటీలకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. అందర్నీ కలుపుకొని, అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వేసిన కమిటీల జాబితాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా సమపాళ్లలో అందరికీ ప్రాధాన్యం కల్పించారంటూ జిల్ల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులను వైఎస్ జగన్ అభినందించారు. కోలగట్ల వీరభద్రస్వామి, పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సూర్యనారాయణరాజు, పీరుబండి జైహింద్‌కుమార్, ఎస్.బంగారునాయుడు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా నియమించనున్న జిల్లా కమిటీతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షుల జాబితాను అందజేశారు. అన్నీ పరిశీలించాక కమిటీలను బాగా రూపొందించారని అభినందిస్తూ, ఆ జాబితాలకు వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. పార్టీ కార్యక్రమాలు ఇప్పటికే బాగా చేపట్టారని, కమిటీలు కూడా త్వరగా వేశారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు పనిచేయాలని, ప్రభుత్వ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలబడాలని నేతలకు జగన్ సూచిం చా రు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏ కార్యక్రమాన్నైనా రాష్ట్రంలోనే ఆదర్శంగా చేస్తామన్నారు. -
డీఎంకేలో ప్రక్షాళన
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి డీఎంకే నేతల కంటిపై కునుకు లేకుండా చేసింది. ప్రత్యర్థి అన్నాడీఎంకే జయకేతనం వారిని మరింత కృంగదీసింది. పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా కోల్పోయిన జవసత్వాలను కూడగట్టుకునే పనిలో పడింది. ఓటమి భారంతో అస్తమించిన ‘సూర్యుడి’ని మళ్లీ ఉదయింపజేసేందుకు సన్నద్ధం అవుతోంది. - రాజీనామా లేదా తొలగింపు - కొత్తగా 10 జిల్లా కమిటీలు - జూన్ 2న ఉన్నతస్థాయి సమావేశం చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల్లో ఎదురుదెబ్బలు తింటున్న డీఎంకేకు లోక్‌సభ ఎన్నికలు మరో చేదు అనుభవాన్ని మిగి ల్చారుు. 37 స్థానాల్లో ఒంటి చేత్తో విజయం సాధిం చిన సీఎం జయలలిత దూకుడుకు కళ్లెం వేయలేని డీఎంకే డీలా పడింది. స్వయంగా పోటీ చేసిన 35, మిత్రపక్షాలకిచ్చిన ఐదు ఏ ఒక్కింటినీ డీఎంకే దక్కించుకోలేక పోయింది. పైగా అనేక చోట్ల డిపాజిట్టు కోల్పోయి అవమానాల పాలైంది. ఈలం తమిళుల సమస్య, అవినీతి, అక్రమాల ఆరోపణలపై సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఏ రాజా, దయానిధి మారన్‌లను పోటీకి దింపడం, కరుణ పెద్ద కుమారుడు అళగిరి బహిష్కరణతో పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలు తమ కొంపముంచాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ ప్రతిష్ట అడుగంటిపోయిన స్థితిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే మీమాంసలో పడిపోయారు. ప్రక్షాళన, పదవులతో పూర్వ వైభవం పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తూ సంస్కరించడం ద్వారా పూర్వవైభవం సాధించాలని డీఎంకే అగ్రనాయకత్వం ఆశిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్ రాజీనామా చేయడం, పార్టీ నిరాకరించడం, ఆయన ఉపసంహరిచడం వంటి హైడ్రామా సాగింది. ఇందుకు కొనసాగింపుగా జూన్ 2న పార్టీ ఉన్నతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ పరాజయంపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరపనుంది. అధిక సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన 10 జిల్లాలను పార్టీపరంగా రెండుగా విభజించి రెండు కమిటీలను వేయాలని భావిస్తోంది. తద్వారా ఎక్కువమందికి పార్టీ పదవులను కట్టబెట్టితే వారు ఉత్తేజితులు కాగలరని అదిష్టానం ఆశపడుతోంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో సుదీర్ఘకాలంగా ఉన్నవారిని తొలగించి కొత్తవారికి ఇవ్వాలని సంకల్పించింది. సుమారు 20 ఏళ్లుగా అధ్యక్ష, కార్యదర్శులున్నవారు 50 శాతం మంది ఉన్నారు. వీరందరికీ పదవీ వియోగం తప్పేట్లు లేదు. జిల్లా స్థాయిలో మార్పులు, కూర్పులు చేసేందుకు వీలుగా నేతల నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు కోరాలని, కాదన్నవారిని బలవంతంగా తప్పించాలని భావిస్తోంది.