జిల్లా కమిటీలకు వైఎస్ జగన్ ఆమోదం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కొత్తగా నియమించిన జిల్లా కమిటీలకు వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. అందర్నీ కలుపుకొని, అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వేసిన కమిటీల జాబితాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా సమపాళ్లలో అందరికీ ప్రాధాన్యం కల్పించారంటూ జిల్ల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులను వైఎస్ జగన్ అభినందించారు. కోలగట్ల వీరభద్రస్వామి, పెనుమత్స సాంబశివరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల శ్రీరాములునాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సూర్యనారాయణరాజు, పీరుబండి జైహింద్‌కుమార్, ఎస్.బంగారునాయుడు తదితరులు మంగళవారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో గల వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా నియమించనున్న జిల్లా కమిటీతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షుల జాబితాను అందజేశారు.
అన్నీ పరిశీలించాక కమిటీలను బాగా రూపొందించారని అభినందిస్తూ, ఆ జాబితాలకు వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. పార్టీ కార్యక్రమాలు ఇప్పటికే బాగా చేపట్టారని, కమిటీలు కూడా త్వరగా వేశారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు పనిచేయాలని, ప్రభుత్వ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలబడాలని నేతలకు జగన్ సూచిం చా రు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ భవిష్యత్‌లో ఏ కార్యక్రమాన్నైనా రాష్ట్రంలోనే ఆదర్శంగా చేస్తామన్నారు.