Divali
-
స్వీట్లు, టపాసుల దుకాణాల వద్ధ కొనుగోలుదారుల సందడి
-
దీపావళికి గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్స్ ...
-
దుబాయ్ చరిత్రలోనే తొలిసారి..
దుబాయ్ : ఎడారి దేశంలో తొలిసారి.. దివ్వేల పండుగ జరుగుతుంది. అది కూడా ఏకంగా పది రోజులు. అవును.. దుబాయ్ ప్రభుత్వం తొలిసారి తమ దేశంలో దీపావళి ఉత్సవాలు నిర్వహిస్తోంది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి దాదాపు పది రోజుల పాటు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు దుబాయ్ అధికారులు తెలిపారు. నవంబర్ 1న మొదలైన ఈ వేడుకలు ఈ నెల 10 వరకూ కొనసాగుతాయన్నారు. వేడుకల్లో భాగంగా పది రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల చేత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు.. భంగ్రా ప్రదర్శనలతో పాటు దీపావళి సందర్భంగా దీపాల ప్రదర్శనే కాక ఫైర్‌క్రాకర్స్ షోని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీపావళి వేడుకల సందర్భంగా దుబాయ్ అధికారులు మరో అరుదైన రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎక్కువ మంది చేత ఒకేసారి ఎల్ఈడీ దీపాలను వెలిగించి.. గిన్నిస్ రికార్డ్ సృష్టించాలని దుబాయ్ ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలిస్తోంది. ఇవన్ని ఒక ఎత్తయితే.. దీపావళి వేడుకలకే హైలెట్‌గా నిలిచిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఏంటంటే దీపావళి వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడమే కాకుండా.. దుబాయి పోలీస్ బ్యాండ్ మన జాతీయ గీతాన్ని గిటార్ మీద ప్లే చేశారు. Diwali celebration in Dubai. Friend has shared this video from Ground Zero. A proud moment Indeed! Happy Diwali to all brother and Sisters of Dubai. pic.twitter.com/JflSGqqsoL — Prakash Priyadarshi (@priyadarshi108) November 5, 2018 అంతేకాక దుబాయ్ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ కూడా దివాళి వేడుకల్లో పాలుపంచుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులకు భారతీయ సాంప్రదాయ మిఠాయిలను, చిరుతిళ్లను అందిస్తోంది. -
‘ఈ దివాళి వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి’
మాల్స్ వచ్చిన దగ్గర నుంచి వీధి చివర దుకాణాలకు.. రోడ్ల వెంబడి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందనే చెప్పవచ్చు. విదేశీ సంస్కృతి మీద మోజుతో స్వదేశీయులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాము. మాల్స్‌లో వేలకు వేలు ఖర్చు చేసే జనాలు.. చిరు వ్యాపారస్తుల దగ్గర కొనేటప్పుడు మాత్రం గీసిగీసి బెరమాడతారు. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవులకిచ్చే పది, ఇరవై రూపాయల దగ్గర వంద సార్లు ఆలోచిస్తుంటాం. ఈ సంస్కృతి మారి.. చిరువ్యాపారులకు సాయం చేసినప్పుడే.. వారి వ్యాపారాలు కలకలలాడినప్పుడే నిజమైన దీపావళి అనే ఉద్దేశంతో చేసిన ఓ యాడ్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కంప్యూటర్లు, ప్రింటర్ల మేకింగ్ కంపెనీ హెచ్‌పీ ఇండియా ‘వీధి వ్యాపారస్తులకు మద్దతు తెలపండి.. మన ఇళ్లలోని దీపాలు వారి ఇళ్లలో కూడా కాంతులు నింపుతాయి’ అనే ఉద్దేశంతో ఓ యాడ్‌ను రూపొందించింది. తొమ్మిదేళ్ల బాలుడు వీధుల్లో ప్రమిదలు అమ్ముకునే ఓ మహిళ ముఖంలో దివాళి ఆనందం ఎలా తీసుకు వచ్చాడనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ వీడియోను హెచ్‌పీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్లో 'ఉమ్మీద్ కా దియా' పేరిట పోస్ట్ చేసింది. ఇలా షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడయోను దాదాపు 2.3 మిలియన్ల మంది చూశారు. -
మొసలితో పోరాడి...కుమార్తెను రక్షించుకుంది
వడోదరా: ఓ మహిళ ధైర్య సాహసాలు ప్రదర్శించి మొసలి బారిన పడిన కుమార్తెను రక్షించిన సంఘటన గుజరాత్లో శుక్రవారం చోటు చేసుకుంది. వడోదరాలోని పడ్రా పట్టణ సమీపంలోని తికారియంబరక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నది ప్రవహిస్తుంది. ఆ నదిలో బట్టలు ఉతుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించి.... బట్టలు ఉతికే బ్యాట్ (క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది) తో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది. దాంతో మొసలి కుమార్తె కాంత వాంకర్ కాలు వదిలి నదిలోకి జారుకుంది. దీపాలి వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తెలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నదిలో పరివాహాక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.