'రాష్ట్ర విభజన ఆగదు.. నేను విభజనవాదినే'
తాను విభజనవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం అన్నారు. రాష్ట్ర విభజన ఆగదని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్టే తాను నడుచుకుంటానని తెలిపారు. సీమాంధ్రకు కావాలంటే ప్యాకేజీ ఇస్తారని మంత్రి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో తీవ్ర ఉద్రిక్తత, బంద్ కొనసాగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మంత్రి విభజనకు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఇదిలావుండగా కేంద్ర మంత్రి పల్లంరాజు మరోసారి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.