DL Ravindhra Reddy
-
యూ... సిల్లీ !
-
ఎవరేమనుకుంటే నాకేం..
సాక్షి ప్రతినిధి, క డప: చెప్పెందుకే శ్రీరంగ నీతులు..అన్నట్లుగా మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి వైఖరి ప్రస్ఫుటం అవుతోంది. ఏఎండకు ఆగొడుగు పడుతూ ఎప్పటికప్పుడు రాజకీయ అవసరాలకు అనుగుణంగా అడుగులు వేస్తుండటమే అందుకు కారణం. అపార రాజకీయ అనుభవం ఉన్నా అనైతికతతో వ్యవహరిస్తుండటం పరిపాటిగా మారింది. మైదుకూరు శాసనసభ్యుడు డీఎల్ రవీంద్రారెడ్డి పాతతరం నాయకుడు. రాజకీయ ఉద్ధండుడిగా పేరుగాంచిన ఆయన ఐదేళ్ల కాలంలో పదవుల కోసం అనైతికంగా వ్యవహరిస్తూ అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన డీఎల్‌ను మైదుకూరు ప్రజలు ఆదరించారు. మహానేత వైఎస్ వర్గంలో ప్రముఖుడిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ అకాలమృతి చెందారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఏనాడూ ప్రత్యక్ష్య విమర్శలకు దిగని డీఎల్ ఆయన చనిపోయాక ఆరోపణలు గుప్పించసాగారు. మంత్రి పదవి కోసమే డీఎల్ అలా చేస్తున్నట్లు పరిశీలకులు భావిస్తూ వచ్చారు. మంత్రి పదవి రాగానే దివంగత వైఎస్ కుటుంబాన్ని డీఎల్ టార్గెట్‌గా చేసుకున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిపై సైతం ఆరోపణలు చేశారు. డీఎల్ చర్యలు మింగుడుపడని కిరణ్ తన మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో వైఎస్‌పై డీఎల్ పొగడ్తలతో ముంచెత్తుతుండటం గమనార్హం. ప్రజలు ఛీత్కరించినా మారని వైనం.... మహానేత వైఎస్‌పై విమర్శలు చేసిన డీఎల్‌కు ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పినా కనువిప్పు కల్గలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. మంత్రిగా ఉంటూ కడప పార్లమెంటు ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు డిపాజిట్టు ద క్కలేదు. నైతిక విలువలు పాటించే నేతలు ఎవరైనా సరే ప్రజాతీర్పుకు విలువ ఇచ్చి మంత్రి పదవిని త్యజించేవారు. అయితే డీఎల్ ఇటువంటివాటిని ఖాతరు చేయకుండా పదవిలో కొనసాగారు. ‘దేశం’ నేతలతో సమావేశం... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డీఎల్ రవీంద్రారెడ్డి ఆపార్టీ సభ్యునిగా ఉంటూ తెలుగుదేశం నేతలతో సమావేశం నిర్వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ నేతలతో జట్టు కట్టి ఉంటే కొంతలో కొంతైనా నైతికత చాటుకునే అవకాశం ఉండేదని విశ్లేషకుల అభిప్రాయం. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్‌తో కలిసి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక కోసం డీఎల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్రమించిన పదవిలో ఉంటూ టీడీపీ నేతలతో సమావేశం కావడం ఏమేరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక జగన్‌పై విమర్శలు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇటీవల రాజకీయ వైరాగ్యాన్ని ప్రదర్శించి, మీదారి మీరు చూసుకోండని అనుచరులకు హితబోధ చేసిన డీఎల్ టీడీపీ సమావేశానికి హాజరు కావడంపట్ల తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. -
రాబోయే ఎన్నికల్లో మంచివ్యక్తిని ఎన్నుకోండి
కడప : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'రచ్చబండ' కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వృద్ధుల కోసం కేటాయించిన రూ.9కోట్లు ఫించన్లు వారికి చేరలేదన్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అవుతోందని డీఎల్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మరోవైపు పలు జిల్లాల్లో రచ్చబండ కార్యక్రమం అభాసుపాలవుతోంది. అధికార పార్టీ నేతలతో, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అభివృద్దిపై కొందరు, సమైక్యాంధ్రపై మరికొందరు నిలదీస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుపతి ఎంపీ చింతామోహన్, సత్యవేడు ఎమ్మెల్యే హేమలతను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్య ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. పదవులకు పార్టీకి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సమైక్యవాదులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం రచ్చబండలో పాల్గొనేందుకు వచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చారంటూ నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే పులపర్తి అసహనం వ్యక్తం చేస్తూ స్టేజీ దిగి వెళ్లిపోయారు. మరోవైపు కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో ముఖ్యమంత్రి కిరణ్ నివేదిక ప్రసంగాన్ని చదవకుండానే మంత్రి శ్రీధర్‌బాబు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
డీఎల్వి వెకిలి చేష్టలు: వరదరాజులు రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే తన వంతుగా రూ.10 లక్షలు ఇస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెకిలిచేష్టలుగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటువంటి వెకిలి ప్రవర్తన, అవినీతి పనుల కారణంగానే ఆయన్ని సీఎం మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని విమర్శించారు. మంగళవారం సచివాలయంలో వరద రాజులు రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను సొంత పార్టీ పెడుతున్నట్టు సీఎం కిరణ్ స్వయంగా ఎప్పుడూ ప్రకటించలేదని అది కేవలం మీడియా చేస్తున్న అసత్య ప్రచారమేననని చెప్పారు. డీఎల్ రవీంద్రారెడ్డి అక్రమంగా రూ.2వేల కోట్లు సంపాదించారని, వైద్య మంత్రిగా ఉండగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 10శాతం సీట్లు కోత వేసి వాటిని ప్రైవేటు కళాశాలలకు కేటాయించేందుకు పావులు కదిపారని, ఇందుకు గాను ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.30 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపించారు. డీఎల్ అవినీతి బాగోతాలు సోనియాగాంధీకి కూడా చేరడంతో ఆమె ఆదేశాల మేరకు సీఎం కిరణ్ డీఎల్‌ను బర్తరఫ్ చేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం సీఎం కిరణ్ నిజాయితీగా పోరాడుతున్నారని వరదరాజుల రెడ్డి చెప్పారు.