DMDK party
-
ఆస్తులు, అప్పులు వెల్లడించిన విరుదునగర్ ఎంపీ అభ్యర్థులు
చెన్నై: విరుదునగర్ అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆస్తులు, అప్పుడు వెల్లడించారు. బీజేపీ నాలుగో జాబితాలో లోక్‌సభ టికెట్ దక్కించుకున్న నటి 'రాధిక శరత్‌కుమార్', నటుడు & రాజకీయ నాయకుడైన విజయకాంత్.. కుమారుడు విజయ ప్రభాకరన్ DMDK తరపున విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు. విరుదునగర్ నుంచి పోటీ చేయడానికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన రాధిక వద్ద రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు.. ఇలా మొత్తం రూ. 53.45 కోట్లు ఉన్నట్లు తెలిపింది. రాధిక రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం అప్పులు రూ. 14.79 కోట్లు ఉన్నట్లు సమాచారం. చెన్నై సిటీ కాలేజీకి చెందిన బీ ఆర్చ్ గ్రాడ్యుయేట్ అయిన విజయ ప్రభాకరన్ దగ్గర రూ. 2.50 లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, చరాస్తులు రూ.11,38,04,371 గా ఉన్నాయి. ప్రభాకరన్ మొత్తం అప్పులు రూ.12,80,78,587 వరకు ఉన్నాయని సమాచారం. ఈయన మొత్తం ఆస్తి రూ. 17.95 కోట్లు అని తెలుస్తోంది. -
రాజుకుంటున్న ఎన్నికల వేడి
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఆరునెలల గడువు మాత్రమే ఉంది. అందుకే అన్ని పార్టీల్లోనూ అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. కొన్నిపార్టీలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఎన్నికలకు సమాయుత్తం అవుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ముచ్చటగా మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎలాగైనా జార్జికోటపై జెండా ఎగురవేయాలని పట్దుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఏ కూటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ పోలీసులు సర్వే ప్రారంభించారు. ప్రధాన రెండు కూటములు (డీఎంకే, అన్నాడీఎంకే)లకు చెందిన ప్రముఖ నేతలను కలుసుకుంటూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే, ఎమ్మెల్యేగా గెలుపు అవకాశాలు కలిగిన నేతలు, నియోజకవర్గాల గురించి ఆరాతీస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్నాడీఎంకే, డీఎంకేలో జిల్లా కార్యదర్శులకు లేదా వారు సూచించే వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే సంప్రదాయం ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్ల కోసం పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్షంగా 70 వేల మంది ఐటీ విభాగంతో అడుగు ముందుకేయాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఎంపికను ప్రారంభించింది. మండలానికి 13 మంది, జిల్లాకు 14 మంది నిర్వాహకుల చొప్పున నియమించి, ఎన్నికల వేళ ప్రతిపక్షాల విమర్శలకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతివిమర్శలను సంధిస్తూ విజయానికి బాటలు వేసేందుకు సన్నద్ధం అవుతోంది. డీఎండీకే కసరత్తు డీఎండీకే కోశాధికారి ప్రేమలత సైతం ఎన్నికల దిశగా కార్యోన్ముఖులయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను ఉత్తేజితులను చేసేందుకు ఈ నెల 25వ తేదీన జరగబోయే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ జన్మదినాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ వారిని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. (సొంత గూటికి పైలట్!) డీఎంకే దిశగా కమల్ అడుగులు ఇదిలా ఉండగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరేందుకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించినప్పుడే ఢిల్లీ వెళ్లి నేరుగా కాంగ్రెస్ అధినేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీని కమల్ కలిసి వచ్చారు. కూటమికి సారధ్యం వహిస్తున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో మాటమాత్రం అనకుండా అధిష్టానం వద్దకు వెళ్లడంతో వ్యవహారం చెడింది. దీంతో కమల్ ఈ నెల 7వ తేదీన కరుణానిధి వర్దంతి రోజున ట్విట్టర్ ద్వారా నివాళులర్పించి గతంలో చేసిన పొరబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కమల్ చేరిక డీఎంకేకు మరింత బలం చేకూరుస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డీఎంకే కూటమిలో మక్కల్ నీది మయ్యం చేరడం ఎంతవరకు సాధ్యమనే సందేహాలు నెలకొన్ని ఉన్నాయి. నటుడు రజనీకాంత్ పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారా.. లేక కమల్‌తో కలుస్తారా, అదే జరిగితే రాజకీయ బలాబలాల మాటేమిటని కూడా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరిస్తోంది. డీఎంకేకు చావోరేవో పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అగ్రనేత కరుణానిధి కన్‌నుౖమూసిన తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అదే విజయాన్ని పునరావృతం చేయగలమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ ధీమాతో ఉన్నారు. ఒక్క రజనీకాంత్ మినహా అందరూ అసెంబ్లీ ఎన్నికలవైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం. -
ఆ రెండు పార్టీలకు కమల్ ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కొన్నిపార్టీలు మమ్మల్ని పిలిచాయి, ప్రజలకు ఇష్టం లేదని వదులకున్నాం, మరి కొన్నింటిని మేమే వద్దనుకున్నాం, ఒంటరిగానే పోటీచేస్తాం, ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు’. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్ రెండురోజుల క్రితం చెప్పిన మాటలు ఇవి. అయితే అంతలోనే బాణీ మార్చారు. రెండు ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపడం ద్వారా సరికొత్త స్వరం ఆలపించారు. ఎన్నికల బరిలో నిలిచి నెగ్గుకురావడం ఆషామాషీ కాదు. అసెంబ్లీ ఎన్నికలైతే ఎంతో కొంత ప్రాంతీయతా భావం ఉంటుంది. దీంతో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. అదే పార్లమెంటు ఎన్నికలైతే ఓటర్లు జాతీయస్థాయిలో ఆలోచిస్తారు. అందుకే రాష్ట్రంలోని అన్నాడీఎంకే, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయపార్టీలు సైతం బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి నడిచేందుకు రంగం సిద్ధమైంది. కొత్త పార్టీ, ఎన్నికలను ఎదుర్కొనడం కొత్తైన కమల్‌హాసన్ కాంగ్రెస్–డీఎంకే కూటమిలో చేరేందుకు ఆశపడ్డారు. పార్టీని స్థాపించిన కొత్తల్లోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అప్పటి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్ దేశంలోని పలువురు జాతీయనేతలను కమల్ కలుసుకున్నారు. వీరంతా కాంగ్రెస్ మిత్రపక్షాలే కావడం గమనార్హం. దీంతో రాబోయే ఎన్నికల్లో కమల్ కాంగ్రెస్‌తో జతకడతారని అందరూ నమ్మారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం స్థాయిలో పావులు కదిపినా రాష్ట్రస్థాయిలో ఆయనకు పిలుపురాలేదు. అన్నిపార్టీలూ పొత్తులు, సీట్లసర్దుబాట్లలో తలమునకలై ఉన్న తరుణంలో కమల్‌కు దిక్కుతోచలేదు. ఇక ఒంటరిపోరే శరణ్యమని నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరీలోని ఒక్కటి మొత్తం 40 స్థానాల్లో ఏపార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా తమపార్టీ ఒంటరిగానే పోటీచేస్తుందని ఈనెల 6న ఆయన మీడియా వద్ద అధికారికంగా ప్రకటించారు. అనుకున్నదానికంటే వేగంగా అన్నిగ్రామాల్లోనూ పార్టీ బలపడిందని చెప్పారు. మాపార్టీ సిద్ధాతాలను ఇతర పార్టీలు కాపీకొట్టే స్థాయికి ఎదిగామని చెప్పుకున్నారు. ప్రజలకు తమ పార్టీపై నమ్మకం పెరిగింది, ఆ ధీమాతోనే పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమయ్యామని తెలిపారు. పార్టీలతో పొత్తు పెట్టుకుంటే వారి పలకిని నేను మోయాల్సి ఉంటుందని, ఎవ్వరినీ భుజాలపై మోసేందుకు తాము సిద్ధంగా లేమని కూడా వ్యాఖ్యానించారు. రెండో రోజునే రెండు పార్టీలకు పిలుపు: కమల్ ధైర్యానికి అందరూ ఆశ్చర్యపడుతున్న వేళ ఒంటరి పోరుపై వెనక్కు తగ్గడం ద్వారా ఔరా అని ముక్కున వేలేసుకునేలా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు ఎవరికివారు కొన్ని పార్టీలతో కూటమిగా ఏర్పడిపోగా డీఎండీకే, పీఎంకేలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరివైపు వెళదామా అని ఆలోచిస్తున్నాయి. ఇదే అదనుగా కమల్‌హాసన్ కూటమి ఆలోచనలు మొదలుపెట్టారు. ఈరెండు కూట ముల వైపు వెళ్ల వద్దు, కొత్త కూటమిగా కలిసుందాం రండి అంటూ శుక్రవారం అకస్మాత్తుగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ డీఎంకే, అన్నాడీఎంకే రెండునూ అవినీతి మచ్చపడినవి, ఇది తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో మార్పురావాలి, మంచి తేవాలి అనే మంచి ఉద్దేశంతో రాజకీయపయనం చేస్తున్నపుడు అవినీతిమయమైన పార్టీలు మనకొద్దని అన్నారు. డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్, పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్‌లతో కమల్ పొత్తు చర్చలు ప్రారంభించారు. ఈ రెండుపార్టీలూ ఇప్పటి వరకు అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వైపు మొగ్గి ఉన్నాయి. అనారోగ్యం కుదుటపడి త్వరలో అమెరికా నుంచి చెన్నైకి చేరుకోనున్న విజయకాంత్‌ను ఫోన్ ద్వారా కమల్ సంప్రదించినట్లు సమాచారం. -
తళి బరిలో స్వతంత్ర అభ్యర్థి
డెంకణీకోట: 30 ఏళ్లుగా తళి నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదు. తళి ప్రాంతంలో కళాశాలలేదు. వైద్యసదుపాయం అంతంత మాత్రం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు సరిగ్గాలేవు. గుల్లట్టి, వరదేగౌడరదొడ్డి, కొడగరై తదితర గ్రామాల ప్రజలకు బస్సు వసతులు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని తళి నియోజకవర్గంలో కర్మాగారాలు స్థాపించాలని, తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్లుగా ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకోలేదు. వెనుకబడిన తళి ప్రాంతం అభివృద్దికి కృషి చేస్తానని తళి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి తెలిపారు. ఆదివారం గెండగానపల్లిలో తన మద్దతుదారులతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. తనకు ప్రజలు ఓటు వేసి ఆదరించాలని కోరారు. నియోజకవర్గంలో పర్యటించానని ప్రజలు తనను పోటీ చేయవలసిందిగా కోరడంతో ఈ నిర్ణయం తీసుకొన్నానని తెలిపారు. నియోజకవర్గంలో చిరంజీవి, మెగాకుటుంబం అభిమానుల మద్దతుతో తన కార్యాచరణ రూపొందించామని హరి తెలిపారు. డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో 300 మందికిపైగా మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో డీఎండీకే కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొనలేదు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు కెలమంగలం, డెంకణీకోట, తళి, బెణ్ణంగూరు, జెక్కేరి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిరంజీవి అభిమానులు కే.కేశవమూర్తి, శ్రీనివాసన్, వేణుగోపాల్, సంపంగిరామయ్య, వెంకటేశ్, మునిరాజు, మాదేవప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగు నటుల ఫ్యాన్స్హవా! హొసూరు: తెలుగు చలన చిత్ర నటుల అభిమానులు వారి సంఘాల ఆధ్వర్యంలో తళి రాజకీయం చక్రం తిప్పుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు తళిలో స్వతంత్ర అభ్యర్థిని నిలిపారు. డీఎండీకే పార్టీ జిల్లా కార్మిక శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న హరి తళి నియోజకవర్గంలో డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించారు. డీఎండీకే కూటమిలో తళి నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించడంతో టికెట్ ఆశించిన హరి మనస్తాపం చెందారు. చిరంజీవి, మెగాఫ్యామిలి అభిమాన సంఘాలు హరి అసంతృప్తిని రాజేసి స్వతంత్ర అభ్యర్థిగా తళి నియోజకవర్గంలో బరిలో దించారు. ఆదివారం హరి ఏర్పాటు చేసిన మద్దతుదారుల సమావేశంలో 400 మంది పాల్గొన్నారు. వీరిలో 300 మంది చిరంజీవి మెగాఫ్యామిలీ అభిమాన సంఘాల సభ్యులే. చిరంజీవి అభిమానులకు ప్రత్యేకంగా అంటూ వక్తలు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కటే కేరింతలు. సభలో చిరంజీవి సినిమా డైలాగులే. ఒక్కొక్క అభిమాని, ముగ్గురిని ఆ ముగ్గురు మరో ముగ్గురిని తయారు చేసి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయించాలని హర్షధ్వానాల మద్య ఫ్రకటించారు. వేదికపై చిరంజీవి, ఆయన ఫ్యామిలీ నటుల ఫొటోలు వేసుకొన్నారు. సినీ అభిమాన సంఘాలతో తళిలో రాజకీయ ప్రభావం వేడెక్కుతుందా అని ఇక్కడి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
నటుడిపై కేసు
తమిళసినిమా: నటుడు రాజేంద్రనాథ్‌పై తూత్తుకుడి పోలీసులు కేసు నమోదు చేశారు.పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రలు పోషిస్తున్న నటుడు రాజేంద్రనాథ్. ఈయన డీఎండీకే పార్టీ ప్రచార కర్తగానూ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న తూత్తుకుడి, చిదంబరనగర్లో ప్రజా సంక్షేమ కూటమి తరఫున విజయకాంత్ భార్య ప్రేమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాంజేంద్రనాథ్ ప్రసంగిస్తూ ఇతర పార్టీల వారు ఓటుకు డబ్బు ఇస్తే తీసుకోండి అనిఅన్నారు. దీనిపై గురించి తహశీల్దార్ తూత్తుకుడి, తెన్బాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజేంద్రనాథ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంగించినందుకుగానూ ఆయనపై కేసు నమోదు చేశారు. -
లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్
మహిళ జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహల్కా ఎడిటర్ అరుణ్ తేజ్‌పాల్ అరెస్ట్ ఘటన స్మృతి పథంలో నుంచి చెరిగి పోక ముందే మరో ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ సంస్థలో విధులు నిర్వర్తించిన మాజీ మహిళ జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ ను ఆదివారం చెన్నైలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాజీ ఉద్యోగి అయిన మహిళ జర్నలిస్ట్ ఆరోపణలను కెప్టెన్ టీవీ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఆ మహిళ ఆరోపణ సత్య దూరమైనవని పేర్కొంది. కెప్టెన్ టీవి ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్‌కు సారథ్యంలో నడుస్తోంది. ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ అధికార చానల్‌గా కెప్టెన్ టీవీ పని చేస్తోంది. -
మల్లగుల్లాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ పొత్తులపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కెప్టెన్‌కు గాలం వేసే పనిలో పడ్డాయి. అన్నాడీఎం, డీఎంకేలు తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఇక మూడో ప్రాంతీయ పార్టీ అరుున డీఎండీకేపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. రాజ్యసభ ఎన్నికల్లో తనకు స్నేహ హస్తం ఇవ్వలేదనే కోపంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. డీఎంకే సైతం చివరి వరకు ఆశచూపి కాంగ్రెస్ మద్దతును పొందడం విజయకాంత్‌ను బాధించింది. ఈ కారణంగా డీఎంకేపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా మారుతున్న బీజేపీవైపు వెళితే ఎలా ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చెందిన మరో ప్రాంతీయ పార్టీకూడా బీజేపీ కూటమిలో చేరితే తన ప్రాధాన్యత ఉండదనే సంశయంలో ఉన్నారు. ఎండీఎంకే ఇప్పటికే బీజేపీకి పచ్చజెండా ఊపింది. పీఎంకే సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉంది. తన నాయకత్వాన్ని మన్నించి, గౌరవించినవారికే తన పార్టీ మద్దతు పలుకుతుందని విజయకాంత్ ఇటీవలే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర స్థాయిలో కొత్తకూటమికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందు ఉంది. ఈ కొత్తకూటమిల దృష్టిలో ప్రధానమైన అంశంగా డీఎండీకే ఉంది. మాజీ కాంగ్రెస్ నేత, గాంధేయ మక్కల్ ఇయక్కం అధినేత తమిళరువి కెప్టెన్‌కు నచ్చజెప్పే పనిలో పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును విజయకాంత్ కోరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎంకే వైపు మొగ్గుచూపింది. అప్పుడు కాదని నేడు కలుపుకుపోతామని కోరితే కెప్టెన్ అంగీకరిస్తాడా అని కాంగ్రెస్ సంశయిస్తుండగా, ఎవ్వరూ దిక్కులేకపోవడంతో తనతో బేరసారాలకు దిగిందని కెప్టెన్ కాంగ్రెస్ వైపు గుర్రుగా చూస్తున్నారు. ప్రతి కీలకమైన అంశాన్ని నాన్చే అలవాటున్న కెప్టెన్ ఏర్కాడులో పోటీ చేయాలా వద్దా అని నెలరోజుల పాటు మీమాంసలో పడ్డారు. నేడు లోక్‌సభ వంతు వచ్చింది. ఏదేమైనా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో డీఎండీకే ఏదో ఒక పార్టీ పంచన చేరకతప్పదని తెలుస్తున్నా, దాదాపు అన్ని పార్టీలు కెప్టెన్ చుట్టూ తిరుగుతున్నా అయోమయం వీడకపోవడం డీఎండీకే వర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తాము అన్ని పార్టీల చుట్టూ తిరిగితే లోక్‌సభ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తమ చుట్టూ తిరగడం శుభపరిణామమంటున్నారు.