
చెన్నై: విరుదునగర్ అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం ఆస్తులు, అప్పుడు వెల్లడించారు. బీజేపీ నాలుగో జాబితాలో లోక్‌సభ టికెట్ దక్కించుకున్న నటి 'రాధిక శరత్‌కుమార్', నటుడు & రాజకీయ నాయకుడైన విజయకాంత్.. కుమారుడు విజయ ప్రభాకరన్ DMDK తరపున విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారు.
విరుదునగర్ నుంచి పోటీ చేయడానికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన రాధిక వద్ద రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు.. ఇలా మొత్తం రూ. 53.45 కోట్లు ఉన్నట్లు తెలిపింది.
రాధిక రాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం అప్పులు రూ. 14.79 కోట్లు ఉన్నట్లు సమాచారం.
చెన్నై సిటీ కాలేజీకి చెందిన బీ ఆర్చ్ గ్రాడ్యుయేట్ అయిన విజయ ప్రభాకరన్ దగ్గర రూ. 2.50 లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి, చరాస్తులు రూ.11,38,04,371 గా ఉన్నాయి. ప్రభాకరన్ మొత్తం అప్పులు రూ.12,80,78,587 వరకు ఉన్నాయని సమాచారం. ఈయన మొత్తం ఆస్తి రూ. 17.95 కోట్లు అని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment