కరెంట్ షాక్ తగిలి వధువు తల్లిదండ్రులకు తీవ్రగాయాలు
పెళ్లి మండపంపై విద్యుత్ తీగలు తెగిపడటంతో వధువు తల్లిదండ్రులతోపాటు మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన ఆనంతపురం జిల్లా అగళి మండలం డొక్కలపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దాంతో పెళ్లికి వచ్చిన బంధువులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మడకశిర ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆదివారం ఉదయం మండపంలో పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ మండపంపైన ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దాంతో పెళ్లి కుమార్తె తల్లితండ్రులతోపాటు మరో అయిదుగురికి కరెంట్ షాక్ తగిలింది. దాంతో పెళ్లి ఆగిపోయింది.