door to door
-
8 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్
సాక్షి, హైదరాబాద్: టీ–ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని అన్ని ఇళ్లకు వచ్చే 6–8 నెలల్లో తక్కువ ధరకే హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతోపాటు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీనివల్ల ప్రతి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్‌తోపాటు కంప్యూటర్ ఆధారిత అన్ని రకాల సేవలు అందుబాటులో వస్తాయన్నారు.ఇప్పటికే అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మద్దూరు (కొడంగల్ నియోజకవర్గం), సంగంపేట (అందోల్), అడవి శ్రీరాంపూర్ (మంథని) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన టీ–ఫైబర్ ఇంటర్నెట్ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో వర్చువల్‌గా సంభాషించి అభినందనలు తెలిపారు. అలాగే పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన పలు యాప్‌లను ఆయన ఆవిష్కరించారు. ఇక 2 రోజుల్లో పంట రుణాలు.... రైతులు పంట రుణాలు పొందడానికి ప్రస్తుతం 30 రోజుల సమయం పడుతుండగా కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్విస్ యాప్ ద్వారా కేవలం 2 రోజుల్లోనే పొందవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అలాగే రైతులు వాయిస్ కమాండ్ ద్వారా ఎరువులు, క్రిమికీటకాల నివారణ వంటి అంశాల్లో సూచనలను సైతం పొందవచ్చని చెప్పారు. డ్రగ్స్పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ‘మిత్ర–తెలంగాణ’అనే మరో యాప్‌ను తీసుకొచ్చామన్నారు. ఇక యాప్ ద్వారా మీ–సేవ మీ–సేవ విస్తరణలో భాగంగా స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనారిటీ, ఇన్కమ్, క్యాస్ట్, క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సరి్టఫికెట్లతోపాటు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ఫిర్యాదులు, వణ్యప్రాణుల దాడిలో మరణించే వ్యక్తులు, పశువులకు నష్టపరిహారం, టింబర్ డిపో/సామిల్స్‌కు పరి్మట్ల జారీ/రెన్యూవల్ కలిపి మొత్తం 9 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు తెలిపారు.కొత్తగా ఆవిష్కరించిన మీ–సేవ యాప్, ‘కియోస్‌్క’లతో సైతం ఇప్పటికే మీ–సేవ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 400కిపైగా సేవలను ప్రజలు పొందొచ్చని వివరించారు. టీ–వర్క్స్–బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ(సీఆర్‌ఈఎన్‌ఎస్)ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య అన్వేషణ, అభివృద్ధికి ‘రూరల్ వర్క్స్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో 3 మెగా పరిశ్రమలురాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 3 కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరి శ్రమల శాఖ 4 పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఆయా సంస్థల ఏర్పాటుతో 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ప్రీమియర్ ఎనర్జీస్’.. వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 1,950 కోట్లతో సోలార్ ఇంగాట్స్ అండ్ అల్యూమినియం ప్లాంట్ ఏర్పా టు చేసేందుకు, మరో రూ. 3,342 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ సెల్, 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిందన్నారు.అలాగే రూ. 1,500 కోట్లతో ‘లెన్స్‌కార్ట్’ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, అనుబంధ ఉత్ప త్తుల తయారీ హబ్‌ను ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేయనుందని వివరించారు. ఆజా ద్ ఇంజనీరింగ్ సంస్థ ఘణపూర్‌లో రూ. 800 కోట్లతో సూపర్ అల్లాయ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడానికి చాలా మంది విషప్రచారం చేసినా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తాము తెచ్చిన పాలసీకి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎకరాల్లో రూ. 1,500 కోట్లతో కొత్తగా 12 మినీ ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. -
అమ్మానాన్నల విడాకులు.. డిప్రెషన్‌కి వెళ్లాను: అమీర్ ఖాన్ కూతురు
మానసిక అనారోగ్యం వెంటనే తెలియదు. తమకు మానసిక అనారోగ్యం ఉంది అని చాలామంది తామే అంగీకరించరు. కుటుంబ సభ్యులు గమనించినా నామోషి వల్ల వైద్యుని దగ్గరకు తీసుకెళ్లరు. ‘వైద్యులే ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తే చాలా సమస్యలు తెలుస్తాయి’ అంటుంది ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురైన ఇరా ఖాన్ మానసిక సమస్యలతో బాధ పడుతూ తనలా బాధ పడేవారి కోసం ‘అగత్సు ఫౌండేషన్’ స్థాపించి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రచారం చేస్తోంది. బాంద్రాలోని పాలీ విలేజ్‌లో ఉంటుంది రెండంతస్తుల అగత్సు ఫౌండేషన్. ముంబైలో ముఖ్యంగా బాంద్రాలో ఉన్న మానసిక సమస్యల బాధితులు అక్కడికి వచ్చి సహాయం పొందవచ్చు. చుట్టుపక్కల బస్తీల్లో ఉన్నవారు కూడా వచ్చి అందులోని కమ్యూనిటీ సెంటర్లో వైద్య సహాయం పొందవచ్చు. నిజానికి మానసిక వైద్యం, కౌన్సిలింగ్, థెరపీ కొంచెం ఖరీదుతో కూడినవి. కాని ఇక్కడ 50 రూపాయల నుంచి 750 రూపాయల లోపు ఎంతైనా ఫీజు కట్టవచ్చు. ఇక్కడ నలుగురు సైకియాట్రిస్ట్‌లు ఉంటారు. వైద్యసూచనలు చేస్తారు. దీనికి తోడు నిర్ణీత రోజులలో బాంద్రాలో డోర్ టు డోర్ తిరిగి ఇళ్లల్లో ఉన్నవాళ్ల మానసిక సమస్యలను తెలుసుకుని వైద్య సహాయం ఎంత అవసరమో చెబుతారు. ఈ పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అగత్సు ఫౌండేషన్ స్థాపించి ఈ పనంతా చేస్తున్న వ్యక్తి ఇరా ఖాన్. ఆమిర్ ఖాన్– రీనా దత్తా (మొదటి భార్య)ల కుమార్తె. ‘శరీరానికే కాదు.. మనసుకూ గాయాలవుతాయి. ఆ గాయాల వల్ల మనసు ప్రభావితం అవుతుంది. దానికి సరైన వైద్య సహాయం అందాలి’ అంటుంది ఇరా ఖాన్. స్వయంగా బాధితురాలు ‘మా కుటుంబంలో మానసిక సమస్యలు ఉన్నాయి. నా మానసిక సమస్యకు అనువంశికత కొంత కారణం అనుకుంటాను. నాకు 12వ ఏట స్కూల్లో ఉన్నప్పటి నుంచే డిప్రెషన్ సూచనలు కనిపించాయి. అయితే గుర్తించలేదు. ఇంటర్ తర్వాత నెదర్లాండ్స్‌లో లిబరల్ ఆర్ట్స్ చదవడానికి వెళ్లినప్పుడు నేను తీవ్ర డిప్రెషన్‌తో బాధ పడ్డాను. రోజంతా ఏడుస్తూ... నిద్రపోతూ ఉండేదాన్ని. నా డిప్రెషన్‌కు నా తల్లిదండ్రుల విడాకులు వేసిన ప్రభావం కూడా కారణం కావచ్చు. అక్కడ నేను చదువు డిస్కంటిన్యూ చేసి ఇండియా వచ్చి ఒక సంవత్సరం బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వెళ్లి జాయిన్ అయినా చదవలేకపోయాను. 2018లో చదువు మానేసి ఇండియా వచ్చేశాను. ఇక్కడకు వచ్చాక నా బాధ లోకానికి చెప్పాలనిపించింది. 2019లో మొదటిసారి నా డిప్రెషన్ గురించి చెప్పాను. ఇందుకు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు. నాకు వారెంతో సపోర్ట్‌గా నిలిచారు. అంతేకాదు మానసిక ఆరోగ్యం విషయంలో చాలా మంది చూపే నిర్లక్ష్యానికి ముగింపు పలికే చైతన్యం కోసం పని చేయాలంటే అందుకూ సపోర్ట్ చేశారు. అలా ఈ అగత్సును మొదలెట్టాను’ అని తెలిపింది ఇరా ఖాన్. మానసిక శుభ్రత ‘మనందరికీ శారీరక శుభ్రత తెలుసు. అలాగే మానసిక శుభ్రత కూడా ఉండాలి. భావోద్వేగాల శుభ్రత ఉండాలి. నా విషయమే చూడండి... డబ్బుంది.. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది... మంచి వైద్య సహాయం ఉంది... అయినా సరే డిప్రెషన్ నన్ను చావగొట్టింది. అలాంటిది పై మూడింటిలో ఏది లేకపోయినా అలాంటి వారు ఎంత బాధ పడుతుంటారో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ పరంగా, ప్రయివేటుగానూ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి చేయవలసిన పని చాలా ఉంది. యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటిని మనసును శుభ్రం చేసుకోవడం వల్ల తొలగించుకోవాలి. ఇందుకు చేయవలసిన పనులతో పాటు మందులు కూడా తీసుకోవాల్సి రావచ్చు. మేం ఏం చేస్తామంటే ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నవారిని అలాంటి సమస్యతోనే బాధ పడుతున్నవారితో కలుపుతాము. వారంతా ఒక కమ్యూనిటీ అవుతారు. ఒకరికొకరం సాయంగా దీనిపై పోరాడవచ్చనే ధైర్యం తెచ్చుకుంటారు. ఆ విధంగా మేము పని చేస్తాం’ అంటుంది ఇరా ఖాన్. గమనించుకోవాలి ‘మానసిక సమస్యలు పునరావృత్తం అవుతుంటాయి. మీరు ఏం చేస్తే సమస్య అధికమవుతుంది, ఏం చేయకపోతే సమస్య తక్కువ అవుతుంది గమనించుకోవాలి. ఎన్ని రోజులకొకమారు సమస్య కనపడుతూ ఉంది... ఎన్నాళ్లకు దూరమవుతుంది ఇదంతా గమనించుకుని మనకు మనమే సమస్య పై పోరాడాలి. మంచి నిద్ర అలజడి తగ్గిస్తుంది. నిద్ర సరిగా పట్టేలా చూసుకోవాలి’ అంటుంది ఇరా ఖాన్. మానసిక సమస్యలను దాచుకోవద్దని, అవి శారీరక సమస్యల్లాంటివేనని చెబుతోంది ఇరా ఖాన్. ‘సెలబ్రిటీ కూతురినై ఉండి నేను బయటకు చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి. సహాయం పొందండి’ అని కోరుతోందామె. -
AP: ఒమిక్రాన్ నేపథ్యంలో ఇంటింటి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సోమవారం నుంచి 34వ రౌండ్ ఇంటింటి (హౌస్ టు హౌస్) ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సిందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. చదవండి: ఓటీఎస్‌కు మంచి స్పందన ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తారు. వారు వెంటనే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్, చికిత్సకు సంబంధించిన సూచనలు చేస్తారు. ఉచిత మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు. ఇప్పటికే 33 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి నియంత్రించడంలో ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఈ సర్వే డేటాను ఆన్లైన్ యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు 34వ రౌండ్ తర్వాత వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు ఒమిక్రాన్ వచ్చిన తరువాత విదేశాల నుంచి రాష్ట్రానికి రోజుకు 1,500 నుంచి 2,000 మంది వస్తున్నారు. ఈ నెల 1 నుంచి 17 వరకు 26,000 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాం. కోవిడ్ లక్షణాలుంటే తగిన చర్యలు చేపడుతున్నాం. ఒక పక్క కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తూ మరో పక్క ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
ఇంటింటికి వ్యాక్సిన్ ఎందుకు సాధ్యం కాదు: హైకోర్టు
ముంబై: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకా విధానంపై బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న టీకా విధానం వల్ల దేశ వ్యాప్తంగా ఇంటింటికి వ్యాక్సిన్ డ్రైవ్ సాధ్యం కాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. టీకా కార్యక్రమంలో భాగంగా కేరళ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలు పాటిస్తున్న ‘డోర్-టు-డోర్’ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. ఆ రెండు రాష్ట్రాలు ఇంటింటికి టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుండగా.. మీరు మాత్రం.. రాష్ట్రాల్లో ఈ పద్దతి సాధ్యం కాదని చెబుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ విధమైన పాలసీని పాటించేందుకు మీకు ఎదురవుతున్న సమస్య ఏంటి అని చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జి.ఎన్.కులకర్ణిలతో కూడిన బెంచ్ కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇంటింటికి వ్యాక్సిన్ కార్యక్రమంపై ధృతి కపాడియా, కునాల్ తివారీ అనే అడ్వొకేట్లు దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్బంగా కోర్టు ఇలా తీవ్రంగా స్పందించింది. ఆ లాయర్లు తమ పిల్లో ఈ ప్రత్యేక ‘పాలసీ’ గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. దీనిపై కోర్టు దాదాపు వీరి వాదనతో ఏకీభవిస్తూ..ఈ విషయంలో మీకు వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావడం లేదని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ విధమైన కార్యక్రమాన్నితామూ చేపడతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని లాయర్లు ప్రస్తావించారు. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదించి తగిన ఆదేశాలు తీపెకోవాలని, ఈ విధమైన కారక్రమం అమలులో సాధ్యాసాధ్యాలను వీలైనంత త్వరగా పరిశీలించాలని కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్‌కి సూచించింది. ఈ నెల 14 న ఈ పిల్ పై మళ్ళీ విచారణ జరగాలని బెంచ్ నిర్ణయించింది. చదవండి: విద్యార్థుల భవిష్యత్తును చెడగొడతారా?: బాంబే హైకోర్ట్ -
‘అది మీ పథకమే.. మేం ఏ పేరు పెట్టలేదు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన ‘ఇంటింటికి రేషన్ బియ్యం’ పంపిణీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పథకాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ఈ పథకం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇక పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ తాము వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పథకం అమలు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఢిల్లీలో ఈ పథకం అమలు విషయంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. చదవండి: సీఎం జగన్ పథకాల స్ఫూర్తితో మమతా బెనర్జీ ‘దీనికి ముఖ్యమంత్రి రేషన్ యోజన అనే పేరు పెట్టడం లేదు. ఈ పథకానికి ఎలాంటి పేరు లేదు’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పేదలకు అందించే చౌకధరల వస్తువల సరఫరాలో మాఫియా ప్రవేశించిందని.. వారిని నుంచి కాపాడేందుకు ఇంటింటికి రేషన్ అమలు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం వివరణ ఇచ్చారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఢిల్లీ ఆహార శాఖ మంత్రి సంయుక్త కార్యదర్శి జగన్నాథన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ పథకం కేంద్రానిదే, మేం కేవలం అదనపు సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. సహదార జిల్లా సీమపురి ప్రాంతంలో ఈ పథకం అమలు చేయనున్నారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేసే యోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది. -
ముంగిట్లోకి సర్కారు సేవలు
న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం. ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు. ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక.. రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్‌లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు. -
ఇంటి ముంగిటకు ‘భగీరథ’
♦ ఆగస్టు 7న ముహూర్తం ♦ ఆ రోజు నుంచి ‘గజ్వేల్’లో ఇంటింటికీ నీళ్లు ♦ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ♦ 5 నెలల్లోనే పనులు పూర్తి చేయడం రికార్డు ♦ ఏడో తేదీనే సుదర్శనయాగం మంత్రి హరీశ్‌రావు వెల్లడి గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందించే ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. అదేరోజు సుదర్శనయాగం చేపడుతారన్నారు. మంగళవారం ఆయన గజ్వేల్ నియోజక వర్గంలో హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం గజ్వేల్ మండలం బంగ్ల వెంకటాపూర్‌లోని అటవీశాఖ నర్సరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐదు నెలల కాలంలోనే ‘మిషన్ భగీరథ’ ద్వారా 67,551 నల్లా కనెక్షన్లు ఇవ్వడం జాతీయ రికార్డుగా పేర్కొన్నారు. నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లోగల 243 గ్రామాలకుగాను 231గ్రామాల్లో ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేయగా... 144 గ్రామాల్లో ప్రజలు ప్రస్తుతం నీటిని తాగుతున్నారన్నారు. 78గ్రామాల్లో వందశాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. నియోజకవర్గంలో 150 ఓవర్‌హెడ్ ట్యాంకులకుగాను 120 ట్యాంకుల నిర్మాణం పూర్తయినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల కృషి ఫలితంగానే ఈ రికార్డు సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. డిసెంబర్ నాటికి దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోనూ ‘మిషన్ భగీరథ’ ద్వారా పూర్తి స్థాయిలో నల్లా నీటిని అందిస్తామన్నారు. హైదరాబాద్‌తోపాటు గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు మంచినీటిని అందిస్తున్న ఎల్లంపల్లి రిజర్వాయర్ ఇప్పటికే నిండుతోందని చెప్పారు. గతేడాది 9టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్‌ను నింపడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈ రిజర్వాయర్‌లోకి 20టీఎంసీల నీరు రాబోతుందన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ జలాశయం పూర్తిగా నిండే అవకాశముందని వెల్లడించారు. ఫలితంగా మంచినీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండబోదన్నారు. విలేకరుల సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు, వాటర్‌గ్రిడ్ ఎస్ఈ విజయప్రకాశ్, ఈఈ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండ్లేళ్లలో ఇంటింటికి మంచి నీళ్లు