double deccar train
-
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: నార్త్‌సిటీ మెట్రో కారిడార్లపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది. మార్చి నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు రెండు కారిడార్లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలైంది. కారిడార్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురు కానున్న సమస్యలు తదితర అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేపట్టారు. ఈ రెండు రూట్లలో ఇప్పటికే హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మార్గాల్లోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో డబుల్ డెక్కర్ కారిడార్ల కోసం పియర్స్ ఎత్తును ఏమేరకు పెంచాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కారిడార్లు సైతం డబుల్ డెక్కర్ (Double Deccar) పద్ధతిలో చేపట్టనున్న దృష్ట్యా ఇతర ఎలివేటెడ్ మెట్రోల కంటే నార్త్‌సిటీ మెట్రో (North City Metro) భిన్నంగా ఉండనుంది. ఇందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. 3 నెలల్లో డీపీఆర్ రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం కసరత్తు చేపట్టారు.హెచ్ఎండీఏతో సమన్వయం.. రెండు రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల కోసం నిర్మించే పియర్స్పైనే మెట్రో కారిడార్ రానుంది. దీంతో నార్త్‌సిటీ మెట్రోకు పియర్స్ ఎత్తు, మెట్రో స్టేషన్ల నిర్మాణం కీలకం కానున్నాయి. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్‌కు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. దీంతో మెట్రో నిర్మాణంపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సంస్థ హెచ్ఎండీఏతో కలిసి పని చేయనుంది. పియర్స్, కారిడార్ల నిర్మాణం తదితర అంశాల్లో రెండు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. డబుల్ డెక్కర్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నగర వాసులకు ఒకే రూట్లో రోడ్డు, మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ. మెట్రో కారిడార్‌లో డెయిరీఫామ్ వరకు అంటే 5.32 కి.మీ డబుల్‌డెక్కర్ ఉంటుంది. మిగతా 17.68 కి.మీ ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నారు. మరోవైపు జేబీఎస్ (JBS) నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. మార్గంలో ఇంచుమించు పూర్తిగా డబుల్‌డెక్కర్ నిర్మాణమే. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కి.మీ, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. పొడవుతో మెట్రో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశ ‘బి’ విభాగం కింద చేర్చనున్నారు.ఇదీ చదవండి: చర్లపల్లి తరహాలో మరిన్ని రైల్వే స్టేషన్లుడబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల సికింద్రాబాద్ నుంచి ఉత్తరం వైపు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ రంగాల్లో పని చేసే అసంఘటిత కారి్మక వర్గాలు సిటీ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలుమెట్రో రెండో దశపై కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో నిర్మాణానికి నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదని, కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్లలో మెట్రో విస్తరణకు గత బడ్జెట్లలో నిధులు కేటాయించినట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా ఈసారి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
విశాఖకు ఇది శుభోదయం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూత పెట్టింది. పరుగు ప్రారంభించింది. అతి తక్కువ సమయం, తక్కువ చార్జీలు, మెరుగైన సౌకర్యాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది. గురువారం ఉదయం 11.30 గంటలకు రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి జెండా ఊపి ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. అలాగే వాల్తేర్ డివిజన్‌ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్ పరిశీలనలో ఉందన్న మంత్రి వెల్లడించారు. సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ): ‘విశాఖవాసులకు ఇది శుభోదయం.. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సమయం . అతి తక్కువ ప్రయాణ సమయం, ఏసీ, డైనింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది’ అన్నారు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ చెన్నబసప్ప. విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం దీనిని ప్రత్యేక రైలుగా ఆయన ప్రారంభించారు. అతిథులు, డీఆర్ఎం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక రైళ్లను బిజీ రూట్లలో మాత్రమే నడుపుతామని, విశాఖ ప్రజలకు దీని అవసరం ఉండటంతో ఉదయ్‌ను ఏపీకి కేటాయించామన్నారు. రైల్వేలో ఆ మూడింటికి ప్రాధాన్యం మోదీ ప్రభుత్వం రైల్వేలో మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటిది ప్రయాణికుల భద్రత, రెండోది పరిశుభ్రత, మూడోది సమయపాలన అని తెలిపారు. ఈ మూడింటిని రైల్వే కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప, డీఆర్ఎం శ్రీవాస్తవ, ఎంపీలు జీవీఎల్, ఎంవీవీ తీరిన విశాఖ వాసుల చిరకాల కోరిక విశాఖవాసుల చిరకాల కోరిక విజయవాడకు విశాఖ నుండి డైరెక్ట్ రైలు నడపడం. నేడు ఉదయ్ ప్రారంభంతో ఈ కోరిక తీరిందని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. రైల్వేస్టేషన్లో ఉదయ్ ప్రారంభం సందర్భంగా డీఆర్ఎం మాట్లాడారు. ఉదయ్ సర్వీస్ ప్రారంభంతో విశాఖవాసులకు విజయవాడ ప్రయాణం చాలా అనుకూలంగా మా రిందన్నారు. నగరవాసులు విజయవాడలో తమ పనులు చూసుకుని తిరిగి రాత్రికి నగరానికి చేరుకునే విధంగా ఈ టైంటేబుల్ ఉం దని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, పాకలపాటి రఘువర్మ, దువ్వారపు రామారావు, మాజీ ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుగుప్రయాణం ఫుల్ విశాఖ నుంచి గురువారం ప్రారంభమైన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి పూర్తి ఆక్యుపెన్సీతో వచ్చినట్లు తెలిసింది. విశాఖ నుంచి కూడా ప్రకటించిన అతి కొద్ది సమయంలోనే సీట్లు చాలావరకు నిండిపోయాయి. విజయవాడ నుంచి కూడా అన్ని కోచ్‌లు ఫుల్‌గా వచ్చాయి. డివిజన్ విషయంలో మాకు చేతనైనంత చేస్తాం విశాఖకు ప్రత్యేక జోన్ కేటాయింపు పెద్ద వరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. డివిజన్ విషయంలో చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశాఖ అందాలు అద్భుతం విశాఖ నగర సౌందర్యానికి ముగ్ధులైన ఆయన అనంతరం స్టేషన్ నిర్వహణ చూసి డీఆర్ఎం చేతన్‌కుమార్‌ను ప్రశంసించారు. విశాఖ రైల్వేస్టేషన్ ఎంతో అందంగా ఉందని, స్టేషన్‌ను ఇలా ఉంచడంలో డీఆర్ఎం, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విస్టాడోమ్ కోచ్‌ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. -
5.30 గంటల్లో విశాఖ నుంచి బెజవాడకు..
సాక్షి, విశాఖ: ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును.. రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా గురువారం ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపి ఆరంభించారు. గురువారం ఒక రోజు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుంది. శుక్రవారం నుంచి రెగ్యులర్ రైలుగా వారానికి ఐదురోజులు (ఆది, గురువారం తప్ప) పరుగులు తీయనుంది. ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన ఉదయ్ రైలుకు విశాఖ నుంచి విజయవాడకు టిక్కెట్ ధర 525 రూపాయిలగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో పచ్చజెండా ఊపి ఉదయ్‌ను ప్రారంభించిన రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి పూర్తిగా 9 ఏసీ బోగీలతో నడిచే ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ నుంచి అయిదున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటుంది. 22701/22702 ట్రైన్ నంబర్‌గా విశాఖ నుంచి విజయవాడకు వారానికి 5 రోజుల పాటు ఈ రైలు నడుస్తుంది. అన్ని కోచ్‌లలో డిస్క్ బ్రేక్‌లతో పాటు ఫెయిల్యూర్ ఇండికేషన్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో సీటింగ్ ఏర్పాటుతో పాటు ప్రయాణ వేగం, తదుపరి స్టేషన్ వివరాలు తెలిపేందుకు ప్రతి కోచ్‌లో ఆరు డిస్ ప్లే మానిటర్లు ఏర్పాటు సదుపాయం ఉంటుంది. కోచ్‌ల్లో ఆటోమేటిక్ టీ, కాఫీ వెండింగ్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతి మూడో కోచ్ తర్వాత పాంట్రీ, డైనింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఇక చిన్న పొగ వచ్చినా వెంటన సమాచారం అందేలా కోచ్‌లలో వెస్ డా యంత్రాల అమరిక ఉంటుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్ అంగడి మాట్లాడుతూ... ప్రయాణికుల భధ్రత, రైళ్ల సమయపాలనపై అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని...త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. వాల్తేరు డివిజన్ కొనసాగించాలని ఏపీఎంపిలు కేంద్రాన్ని కోరారని...పరిశీలనలో ఉందన్నారు. ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత రైల్వేశాఖ ద్వారా ప్రయాణికులకి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రైల్వేల ఆధునీకరణపై కూడా తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భారతదేశంలోనే విశాఖ స్వచ్చతకు మారుపేరుగా వుందని కొనియాడారు. ఇప్పటికే లక్షకోట్ల రూపాయలను అభివృద్ధికి వెచ్చించామని....నిధులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ...విశాఖ- విజయవాడ అత్యంత రద్దీ ఉన్న రూట్లో ఉదయ్ ఎక్స్ ప్రెస్ నూతన రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జోన్ ఏర్పాటైన తర్వాత హెడ్ క్వార్టర్‌గా విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభించడానికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ దేశంలోనే రెండోదని, కోయంబత్తూరు - బెంగళూరు మధ్య గత ఏడాది ప్రారంభమైందని అన్నారు. రాజకీయాలతో రైల్వేని ముడిపెట్టకూడదుని...విశాఖ రైల్వే జోన్‌పై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. వాల్తేరు డివిజన్ ఏర్పాటుపై తాము కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రారంభోత్సవం రోజు: విశాఖ–విజయవాడ (02701) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ విశాఖలో ఉదయం 11.30గంటలకు బయల్దేరి సాయంత్రం 4.50గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (02702) ఎక్స్‌ప్రెస్‌గా విజయవాడలో సాయంత్రం 5.30గంటలకు బయల్దేరి రాత్రి 11గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ హాల్టులు..: ఉదయ్ డబుల్ డెక్కర్ రానూ..పోనూ దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు 9 ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, 2–మోటార్ పవర్‌కార్‌లతో నడుస్తుంది. ఎంవీవీ తొలి విజయం కాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది. ఉదయ్ డబుల్ డెక్కర్ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ చెన్నబసప్పను కలిసి డబుల్ డెక్కర్ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్ డెక్కర్ రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉదయ్ ఇవాళ పట్టాలెక్కింది. -
'ఉదయ్'రాగం వినిపించబోతుంది
సాక్షి, విశాఖపట్నం : విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ శ్రమకు ఫలితం దక్కింది.ఉదయ్ డబుల్ డెక్కర్ విశాఖకు రప్పించి ఎంవీవీ తొలి విజయం సాధించారు. విశాఖ –విజయవాడ మధ్య నానాటికీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం ఉందని పట్టుబట్టి మరీ సాధించారు. గత నెల 18న రైల్వే శాఖ మంత్రి సురేష్ చెన్నబసప్పను కలిసి డబుల్ డెక్కర్ రైలు ఆవశ్యకతను వివరించారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి డబుల్ డెక్కర్ రైలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎంవీవీ ఇదే తరహాలో కీలక పాత్ర పోషించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ విషయం దేశంలో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మూడింటిని నడపనున్నట్టు గత కేంద్ర రైల్వే మంత్రి ప్రకటించారు. అందులో ఒక ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు విశాఖ–విజయవాడ మధ్య నడపనున్నట్లు వెల్ల డించారు. అప్పటి నుంచి ఉదయ్ రావడం కనపడలేదు కదా..కేంద్ర రైల్వే మంత్రులను కోరినవారే కరువయ్యారు. విశాఖ–విజయవాడ మధ్య మరింత రద్దీ పెరుగుతున్న కారణంగా ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు అవసరం పెరిగింది. అయినా గత టీడీపీ ఎంపీలు ఏనాడు విశాఖ–విజయవాడల మధ్య రద్దీపై స్పందించిన పాపనపోలేదు. చివరకి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రోద్బలంతో ఎట్టకేలకు విశాఖకు ఉదయ్ డబుల్‌డెక్కర్ వచ్చింది. ఇది విశాఖ– విజయవాడల మధ్య 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఉదయ్ రైలులో ప్రత్యేక ఆధునిక సాంకేతిక సదుపాయాలు ఉంటాయి. స్క్రీన్ల ద్వారా వచ్చే స్టేషన్లు ముందే తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఇది పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ట్రయల్ రన్ ఎప్పుడనేది త్వరలో వెల్లడిస్తామని వాల్తేర్ అధికారులు చెబుతున్నారు. -
ఉదయ్ లేదా!
సాక్షి, విశాఖపట్నం: ‘ఉదయ్’.. (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన డబుల్ డెక్కర్ రైలు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య దీనిని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించి రెండేళ్లయింది. ఈ ట్రైన్‌కు 22701 నంబరును కూడా ప్రకటించారు. ఏడాదిలోగా ‘ఉదయ్’ను పట్టాలెక్కిస్తామని అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ దీనిపై ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. ప్చ్.. కనీసం దాని ప్రస్తావనే తేవడం మానేశారు. దీంతో దీని రాక ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కితే విశాఖ–విజయవాడల మధ్య రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చార్జీలు తక్కువ.. ఈ ఏసీ రైలులో టిక్కెట్ చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీకంటే తక్కువ, స్లీపర్ చార్జీలుకంటే కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టిక్కెట్టు రూ.240, థర్డ్ ఏసీ టిక్కెట్టు రూ.560 ఉంది. అంటే ఈ లెక్కన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు టిక్కెట్ చార్జీ రూ.400 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకు ఆలస్యం? ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అవసరమైన బోగీల తయారీలో జాప్యం జరుగుతోందని, అందువల్లే దీనిని ప్రారంభించడానికి ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బోగీల నిర్మాణం పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ తయారీ కేంద్రంలో జరుగుతోంది. కోచ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక తొలుత ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ బోగీలను కూడా ఆ రైల్వేలోనే ప్రయోగాత్మకంగా నడిపి చూసి సంతృప్తి చెందాక తూర్పు కోస్తా రైల్వేకు అప్పగిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఈ రైలును ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖ–తిరుపతిల మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది. -
పట్టాలెక్కుతున్న డబుల్ డెక్కర్ రైళ్లు
కాచిగూడ-గుంటూరు మధ్య 13న ప్రారంభం కాచిగూడ-తిరుపతి సర్వీసు 14 నుంచి మొదలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే తొలిసారి దేశంలో ఏడుకు పెరగనున్న రెండంతస్తుల రైళ్లు ఇప్పటివరకు ఉన్నవాటికంటే ఇవి ఆధునికమైనవి సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా డబుల్ డెక్కర్‌రైళ్లు పరుగుపెట్టబోతున్నాయి. హైదరాబాద్ (కాచిగూడ స్టేషన్ నుంచి)-గుంటూరు మధ్య నడిచే తొలి సూపర్‌ఫాస్ట్ రైలు ఈనెల 13న మొదలుకానుండగా, హైదరాబాద్ (కాచిగూడ)- తిరుపతి మధ్య రెండో రైలు 14న ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ఐదు మార్గాల్లో మాత్రమే డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తుండగా ఈ రెండింటితో ఆ సంఖ్య ఏడుకు పెరగనుంది. ఈ రెండు మార్గాల్లో తిరిగే రైలు ఒక్కటే. ఒక్కో మార్గంలో వారానికి రెండు రోజులు చొప్పున ఈ రైలు రెండు మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. మిగతా డబుల్ డెక్కర్ రైళ్లతో పోలిస్తే ఇది మరింత ఆధునికమైనది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర రైల్వే బడ్జెట్లో వీటిని ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర క్రితమే డబుల్ డెక్కర్ రైలు నగరానికి చేరుకున్నా... రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి అనుమతి రాకపోవటంతో అది ప్రారంభం కాలేదు. రూట్ వాచ్ నిర్వహించిన రేల్వే సేఫ్టీ కమిషనర్ తాజాగా పచ్చజెండా ఊపటంతో అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. వారానికి రెండు రోజులు చొప్పున... కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ రైలు (నం.22118) ఈ మార్గంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ఆ రోజుల్లో ఉదయం 5.30కు నగరంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 12.45కు గుంటూరులో (నం.22117) బయలు దేరుతుంది. ఇది కాచిగూడ, మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ-తిరుపతి (నం.22120) రైలు ప్రతి బుధ, శనివారాల్లో నడుస్తుంది. ఆ రెండురోజుల్లో ఉదయం 6.45కు కాచిగూడలో బయలు దేరుతుంది. తిరుగుప్రయాణంలో ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 5.45కు తిరుపతిలో బయలుదేరుతుంది. ఇది కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతిలలో ఆగుతుంది. పొగ వస్తే అప్రమత్తం చేసే అలారం... దేశంలో ప్రస్తుతం చెన్నై-బెంగళూరు, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-జై పూర్, హౌరా-ధన్‌బాద్, హబీబ్‌గంజ్-ఇండోర్ల మధ్య డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పోలిస్తే కొత్తగా ప్రారంభమయ్యే రైలు మరింత ఆధునికమైంది. అగ్నిప్రమాదాలను గరిష్ట స్థాయికి తగ్గించేలా ఈ రైల్లో పొగ రాగానే గుర్తించి అలారమ్ మోగించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ఎయిర్కండిషన్డ్ బోగీలతో ఉంటుంది. ఇందులో కూడా సాధారణ ఏసీ రైలు చెయిర్ కార్ ధరలే ఉంటాయి. పది బోగీలతో ఉండే ఈ రైల్లో ఒక్కో బోగీలో 120 చొప్పున సీట్లుంటాయి. ఇందులో మెరుగైన కుషన్ వ్యవస్థ ఉన్నందున ప్రయాణంలో కుదుపులు ఉండవు. గరిష్టంగా ఇది 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.