dr ys rajasekhara reddy
-
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
వైయస్సార్...ద లెజెండ్
-
వైఎస్సార్‌ను మరిపించే పాలకులే లేరు
మహానేతను మరువని ప్రజలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌కు ఘన నివాళి మహబూబ్‌నగర్ అర్బన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆ మహానేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఘన నివాళి అర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పేదలకు అన్నదానం చేపట్టారు. రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. జిల్లాకేంద్రంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాజన్న వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహ సర్కిల్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏనుగొండలోని అనాథ పిల్లల ఆశ్రమంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భగవంతురెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ను మరిపించే పాలకులే లేరని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వినూత్న పథకాలను అమలు చేసి దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా పేరొందారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు మహానేతను మరవలేక పోతున్నారని, వైఎస్సార్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకు రావడానికి ఆయన ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, తాగునీరు, సాగునీరు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలను కల్పించారని గుర్తుచేశారు. జిల్లాను మరో కోనసీమగా చేయడానికి జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్లా, యువజన, మైనార్టీ మహిళా, ఎస్సీ విభాగాల జిల్లా అధ్యక్షులు జెట్టి రాజశేఖర్, మహ్మద్ హైదర్ అలీ, ఇందిర, మిట్టమీది నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహ్మద్ వాజిద్, లక్ష్మీ నారాయణ, కార్యదర్శి రాజశేఖర్, నేతలు సర్దార్, అశోక్, ప్రేమ్‌కుమార్, సర్వర్, యాదగిరి, రఘునాథ్ రెడ్డి, జహంగీర్, సమద్, అన్వర్ పటేల్, ప్రవీణ్ కుమార్, రాజ్‌కుమార్ రెడ్డి, అంజి, రాజారెడ్డి, ఆసిఫ్‌ఖాన్, విజయకుమార్, ఖతాల్, మారుతి, రామకృష్ణ, శివ, అమ్రీష్, మణి, సుభాష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరస్మరణీయుడు వైఎస్సార్
2004–09 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగాన్ని కళ్లెదుట ఆవిష్కరించింది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి పాలిట నిజంగా దేవుడిగా మారిపోయారు. ప్రజాసంక్షేమమే పరమధర్మంగా శ్రమించిన వైఎస్సార్ ఎప్పటికీ చిరస్మరణీయుడని ఆయన పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత చదువులు చదివించిందని, ఇందిరమ్మ పథకంతో సొంతింటి కల నెరవేరిందని ఆ మహనీయుడిని కొనియాడు. తాము బతికున్నంత వరకు ఆయన తమకు దేవుడని చెప్పారు. నేడు (శుక్రవారం) వైఎస్సార్ ఏడో వర్ధంతి సందర్భంగా కొంతమంది నాయకులను ‘సాక్షి’ పలుకరించగా ఆ మహానేతతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారిలో కొందరి అభిప్రాయాలు వారి మాటల్లో... – మహబూబ్‌నగర్ అర్బన్/జడ్చర్ల టౌన్ పేదల బతుకుల్లో నిజమైన దేవుడు –షేక్ అబ్దుల్ సలాం, కావేరమ్మపేట నేను స్వతహాగా టీడీపీ అభిమానిని. అయితే 2007లో గుండెనొప్పితో బాధపడి కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్నాను. మాలాంటి పేదల బతుకుల్లో నిజమైన దేవుడు వైఎస్సార్. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే నా పరిస్థితి ఏమిటో ఊహించలేను. అందుకే మాలాంటి ఎందరో పేదలకు ఆయన ఇప్పటికీ, ఎప్పటికీ దేవుడే. సొంతింటి కల నెరవేరింది –చిట్టమోని పద్మమ్మ, కావేరమ్మపేట సొంత పక్కాఇంటి కలను వైఎస్సార్ నిజం చేశారు. ఆయన వల్లే పక్కా ఇళ్లు కట్టుకోగలిగాను. ఆ మహానేత ద్వారా ఎంతో మంది పేదలు అనేక రకాలుగా లాభం పొందారు. అందుకే ఇప్పటికీ వైఎస్సార్ అంటే మేము మర్చిపోలేదు. వైఎస్ వల్లే బీటెక్ చేశాను – ఆకుల వరుణ్‌కుమార్, జడ్చర్ల వైఎస్సార్ అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే ఉన్నత చదువులు చదవగలిగాను. మాది నిరుపేద కుటుంబం. ఉన్నత చదువులు చదివించే స్థోమత ఇంట్లో లేదు. అదే సమయంలో ఆ మహానేత ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో బీటెక్ పూర్తిచేసి ఇప్పుడు ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తున్నాను. థ్యాంక్యూ వైఎస్సార్. మహానేతను 15సార్లు కలిశా... –టీఎస్ స్కూల్ కరాటే స్పోర్ట్స్ అధ్యక్షుడు ఎతినె చెన్నయ్య 2004 నుంచి 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని 15సార్లు కలిశాను. చివరిసారి కొంత ఆలస్యమైనందుకు ‘ఏం....మాస్టర్! కరాటేను బాగా నేర్పుతున్నావా, లేదా, అంటూ నా పై పంచ్ కొట్టి ఉత్సాహపరచిన తీరు నా జీవితంలో మరుపురాని మధుర స్మృతి. సీఎం స్థాయిలో ఉండి కూడా నన్ను గుర్తు పట్టి పలకరించాన్ని చూసి వెంట వచ్చిన 25 మంది షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సర్పంచులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనకు ఫిదా అయ్యారు. పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని తాను చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఆ ఏర్పాట్లు చేయాల్సింది ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఆయన ఆకస్మిక మృతితో..ఆ విషయం ముందుకుపోలేదు. తమ్ముడూ...అమ్మానాన్నా బాగున్నారా! –సీజే బెనహర్, మాజీ కౌన్సిలర్ 1998లో వైస్ సీఎల్పీ లీడర్ ఉన్న సమయంలో జిల్లాలో రైతు భరోసా యాత్రను మూడు రోజులపాటు చేశారు. ఆ సందర్భంగా రాత్రి పూట మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో బస చేసేవారు. డీసీసీ మీడియా సెల్ కన్వీనర్‌గా నన్ను అప్పటి అధ్యక్షుడు జగీదశ్వర్రెడ్డి పరిచయం చేయగా కీపిటప్ అంటూ వెన్నుతట్టిన సంఘటను అపురూపం...రెండో రోజు రాత్రి భోజనానికి అప్పటి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ ఇంట్లో ఏర్పాటు చేయగా, నేను Ðð ళితే బ్రదర్ బెనహర్ ఇక్కడకు రా అంటూ తన పక్కన కూర్చోపెట్టుకొని అమ్మా,నాన్న బాగున్నారు. ఏం చేస్తారు అంటూ మా కుటుంబ వివరాలు వాకబు చేశారు. నాలాంటి సామాన్య కార్యకర్తను ఆదరించిన తీరు..ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతుంటుంది. అక్కడున్న వారు వైఎస్..అంటే వైఎస్ అంటూ ప్రశంసించారు. కంగ్రాట్స్ చైర్మన్ సాబ్... –మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాశ్ 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అయిన సందర్భంగా సీఎల్పీ లీడర్‌గా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి బొకేను అందించి కృతజ్ఞతలు తెలపడానికి వెళ్లాను. ఆఫీస్‌లోకి వెళ్లగానే కంగ్రాట్స్ చైర్మన్ సాబ్ అంటూ పలకరించిన తీరు మరువలేనిది. 2004లో మనమే అధికారంలోకి వస్తాం...జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసుకుందామని భుజం తట్టి ప్రోత్సహించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో కూడా ప్రకాశ్ అంటూ పేరు పెట్టి పిలిచిన సంఘటనలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయి. అలాంటి గొప్ప నేతను ఎల్లప్పుడూ స్మరించుకుంటాం. -

రైతు నేస్తం
-
మరపురాని మహామనిషి
-
న్యూఢిల్లీలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి
-
48 గంటలు
-
శోకం నడిచి వెళ్లిన దారి..!
-
మనసున్న మారాజు
-
నేడు వైఎస్ జయంతి
-
ఆరోగ్య ప్రదాత వైఎస్
ప్రతి పెద్దాసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించిన అన్ని వ్యాధులనూ మళ్లీ చేరుస్తాం. డాక్టర్ల కొరత లేకుండా జిల్లాకొక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తాం. కొత్త రాజధానిలో కార్డియాలజీ, క్యాన్సర్, కిడ్నీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ వంటి 20 ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్‌సిటీ నిర్మిస్తాం. ఈ హెల్త్సిటీని జిల్లాలకు అనుసంధానం చేసి రొటేషన్ పద్ధతిలో ఎక్కడా డాక్టర్ల కొరత లేకుండా చేస్తాం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను మరింత బలోపేతం చేస్తాం. 108, 104 సేవలను ఇంకా మెరుగుపరుస్తాం. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు కోలుకునే సమయంలో ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3000 సహాయం చేస్తాం. నా కుటుంబం ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతుందో అదే హాస్పిటల్లో మీకూ వైద్య సేవలు అందిస్తాం. - వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో హామీ - రోషయ్య, కిరణ్ హయాంలో పథకంపై నిర్లక్ష్యం - జగన్మోహన్రెడ్డితోనే కొనసాగింపు సాధ్యం కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్ : డబ్బులేదనే కారణంతో ఏ ఒక్క పేదవాడూ ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆగిపోతున్న గుండెలకు కొత్త ఊపిరి పోసి వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల మెట్లు ఎక్కేందుకు సైతం వెనుకాడే పేదలు ఆరోగ్యశ్రీ కార్డుతో వెళ్లి లక్షల రూపాయల విలువైన వైద్యసేవలను ఉచితంగా పొందేలా చేశారు. జిల్లాలో ఈ పథకం 2008లో ప్రారంభమైంది. 2008-09లో 6,511 మంది, 2009-10లో 10,976, 2010-11లో 14,899, 2011-12లో 15,205, 2012-13లో 17,192, 2013-14లో 19,559 మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చికిత్స చేయించుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా ఆసుపత్రులు 85,516 సర్జరీలకుగాను రూ.206 కోట్లను క్లెయిమ్ చేసుకున్నాయి. కర్నూలులోని ఆసుపత్రుల్లోనే గాకుండా జిల్లావాసులు ఎంతో మంది హైదరాబాద్ నగరానికి వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని అందుకున్నారు.. ఇప్పటికీ అందుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా సూపర్‌స్పెషాలిటీ సేవలైన గుండె, మెదడు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కాలేయం, కిడ్నీలు వంటి అవయవాలకు వచ్చే జబ్బులకు చికిత్స చేయించుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం సాఫీగా అమలైన ఈ పథకం తర్వాత వచ్చిన నేతల తీరుతో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. రోషయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనాకాలంలో ఆంక్షలు విధిస్తుండడంతో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంకా కొన్నికాలం ఉండి ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా రద్దు చేసేదనే వాదనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దివంగత వైఎస్సార్ కుమారుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పథకం సక్రమంగా కొనసాగుతుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఆయనను గెలిపించుకుంటామని ముక్తఖంఠంతో పేర్కొంటున్నారు. రెండుసార్లు గుండె ఆపరేషన్ నేను బార్బర్ వృత్తి చేస్తున్నాను. 2012లో గుండెనొప్పి రావడంతో కర్నూలులోని విజయహాస్పిటల్లో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలూ చేసి గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి ఓపన్హార్ట్ సర్జరీ చేయించుకోవాలని సూచించారు. దీంతో నేను ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న అపోలో హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత యేడాదికే నాకు మళ్లీ సమస్య రావడంతో అదే ఆసుపత్రికి వెళ్లాను. వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు ఎడమ వాల్వ్ బ్లాక్ అయ్యిందని, యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని చెప్పారు. వైద్యపరీక్షలకు ఖర్చు నేనే పెట్టుకోగా ఆపరేషన్ మాత్రం ఉచితంగా చేశారు. ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పినా ఇప్పటిదాకా ఇవ్వలేదు. అయితే లక్షల రూపాయల వైద్యాన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకోవడం మా లాంటి వారికి కలలో కూడా సాధ్యం కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అని నేను కార్పొరేట్ ఆసుపత్రి గడప తొక్కగలిగాను. ఇప్పుడు నేను సజీవంగా ఉన్నానంటే రాజశేఖరరెడ్డి చలవే. ఆయన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగించేది ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డి మాత్రమే. ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటాం. - శ్రీరాములు, కర్నూలు నా జీవితం వైఎస్ చలువే నగరంలోని బుధవారపేటలో 30 ఏళ్ల నుంచి బార్బర్ వృత్తిని చేస్తున్నాను. వచ్చే ఆ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. అలాంటి 2012లో నాకు గుండెపోటు వచ్చింది. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. పేదవారమైన మేము అంత డబ్బు తేలేమని చెప్పాను. తర్వాత ఆయన సలహా మేరకు ఆరోగ్యశ్రీ కార్డు చేతబట్టుకుని హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లాను. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఒక్క రూపాయి కూడా వైద్యం కోసం ఖర్చు చేయలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల నాలాంటి వారు ఎందరో ప్రాణాలు కాపాడుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నా జీవితం వైఎస్ పెట్టిన భిక్ష. ఆయన కుమారుడు గాకుండా వేరొకరు వస్తే ఈ పథకం ఉంటుందన్న నమ్మకం లేదు. - జె.ఆదినారాయణ, శరీన్‌నగర్, కర్నూలు నాకు, నాకూతురికి ప్రాణం పోశారు రెండేళ్ల క్రితం వరకు నేను కడుపునొప్పితో బాధపడేదాన్ని. ఒకసారి నొప్పి తీవ్రం కావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాను. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేగుల్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ వెళ్లి ప్రైవేటులో ఆపరేషన్ చేయించుకోవాలని, రూ.2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు. మరోసారి డాక్టర్‌ను సంప్రదించగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కర్నూలులోని విజయ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేశారు. మూడు నెలలకే నా కూతురుకు సైతం ఆరోగ్య సమస్య రావడంతో ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచితంగా ఆపరేషన్ చేయించాం. నా భర్త గౌస్‌బాషా టూ వీలర్స్‌కు పెయింటింగ్ వేస్తాడు. ఆ వచ్చే నాలుగు రాళ్లతో కడుపునింపుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేకపోతే నాతోపాటు నాకూతురు పరిస్థితి ఎలా ఉండేదో. వైఎస్ రాజశేఖరరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన కుమారుడిని గెలిపించుకుంటాం. - ఎస్.షంషున్నీసా, ఖల్లావీధి, కర్నూలు వైఎస్ కుటుంబం మేలు మరచిపోలేం నేను డిగ్రీ వరకు చదివాను. చిన్న బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సాయి లక్ష్మికి పుట్టుకతోనే గుండెజబ్బు వచ్చింది. ఈ విషయం తెలసి చాలా రోజులు నిద్రహారాలు మాని భాధ పడ్డాం. ఆపరేషన్‌కు లక్షలాది రూపాయలవుతాయని ఆ స్థోమత లేక చిన్నారిని ఎలా బతికుంచుకోవాలని భాధపడుతుండగా వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాకు వరంగా మారింది. ఆ దేవుడు దయవల్ల పాపకు హైదరాబాద్‌లో అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు. అయితే అక్కడి వైద్యులు రెండోసారి కూడా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో డబ్బులేక అల్లాడిపోయాం. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 9 -11-12 తేదీన మావూరి మీదుగా పాదయాత్ర చేస్తున్నారని తెలిసి, మా గోడు ఆమెకు చెప్పాం. అందుకు ఆమె స్పందించి డాక్టర్లతో మాట్లాడారు. దీంతో మా పాపకు రెండో ఆపరేషన్ చేశారు. ఇందుకు రూ. 4 లక్షలు ఖర్చయింది. ఇపుడు మా పాప ఆరోగ్యంగా ఉంది. ఎన్ని జన్మలెత్తినా వైఎస్ కుటుంబం మేలు మరిచిపోలేం. - రఘువర్ధన్ రెడ్డి, అగ్రహారం, మద్దికెర మండలం