with drayals
-
భేషుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కేలండర్ సజావుగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనబరిచారు. ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఫిక్కీ ట్వీట్ చేయగా, ఆర్థిక మంత్రి రీట్వీట్ చేశారు. 2021–22లో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకుంటామని బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పడం గమనార్హం. బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ, బీఈఎమ్ఎల్, పవన్‌హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌తోపాటు.. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులను 2021–22 సంవత్సరంలో ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. దీనికి తోడు ఎల్ఐసీ నుంచి అతిపెద్ద ఐపీవో రూపంలోనూ భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఏ వర్గంపైనా భారం వేయకుండానే.. భారత్‌లోని ఏ వర్గంపైనా భారం మోపలేదన్న విషయాన్ని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. ఆదాయం ఈ ఏడాది నుంచి మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలోనే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అందుకు ఆస్తుల విక్రయాన్ని ప్రస్తావించారు. భారీగా నిధులను వ్యయం వెచ్చించాల్సి ఉండడంతో పన్నేతర ఆదాయ మార్గాలపై బడ్జెట్లో దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రభుత్వం ఒక్కటే పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చినా కానీ పెరుగుతున్న దేశ ఆకాంక్షలను తీర్చలేదంటూ ప్రైవేటు రంగం కూడా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రదర్శించిన భిన్నమైన బడ్జెట్ ఇది. ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని ఇది పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు రావాలి. బడ్జెట్లో ప్రదర్శించిన స్ఫూర్తిని పరిశ్రమ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను. పరిశ్రమ రుణ భారాన్ని దించుకుంది. కనుక ఇప్పుడిక విస్తరణపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి దిశగా ప్రయాణించేందుకు సిద్ధం కావాలి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. 2021–22లో రూ.34.83 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయాల కోసం కేటాయించడం గమనార్హం. త్వరలో మలి జాబితా.. ► నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలమైన ప్రభుత్వరంగ సంస్థల మలి జాబితాను వచ్చే కొన్ని వారాల్లో సిద్ధం చేయనున్నట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రతిపాదిత అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీల ఏర్పాటు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూటీఐ మాదిరే ఇవి కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె ప్రకటన చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు వీలుగా తదుపరి జాబితాను నీతి ఆయోగ్ రూపొందిస్తుందని సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఈ ప్రక్రియ మొదలైందని, కొన్ని వారాల్లోనే జాబితాను సిద్ధం చేస్తామని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మోదీ సర్కారు ఎప్పటికప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ.. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ సంస్కరణలు అజెండాగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
పరిమితులు తొలగించినా.. తగ్గిన విత్‌డ్రాయల్స్!
⇒ వారానికి రూ. 53 వేల కోట్ల నుంచి రూ. 32 వేల కోట్లకు డౌన్ ⇒ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా ఎగిసిన నగదు విత్‌డ్రాయల్స్.. ఆ తర్వాత ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ గణనీయంగా తగ్గాయి. జనవరి 13తో ముగిసిన వారాంతంలో విత్‌డ్రాయల్స్ పరిమాణం ఏకంగా రూ. 52,800 కోట్లకు పెరగ్గా .. మార్చి 17–24 మధ్య కాలంలో రూ. 32,500 కోట్లకే పరిమితమైంది. ఎస్బీఐ రీసెర్చ్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అయితే, విత్‌డ్రాయల్స్ ఇలా తగ్గడానికి ప్రత్యేక కారణాలేమీ పేర్కొనలేదు. కానీ ఒకవేళ ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీకి కొరత ఉండబోదని తెలిపింది. డీమోనిటైజేషన్‌తో ఎకానమీలోకి శాశ్వత ప్రాతిపదికన ఏకంగా రూ. 1.7 లక్షల కోట్లు వచ్చి చేరినట్లు ఎస్బీఐ చీఫ్ ఎకానమిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ వివరించారు. జనవరి 17 దాకా రోజుకు ఏటీఎంల నుంచి ఒక కార్డుపై రోజుకు రూ. 4,500, వారానికి రూ. 24,000 విత్‌డ్రాయల్ పరిమితి కొనసాగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిమితి రోజుకు రూ. 10,000కు పెరిగింది. చివరికి మార్చి 13న విత్డ్రాయల్స్పై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు. అప్పట్నుంచీ విత్‌డ్రాయల్ ధోరణులు కాస్త హెచ్చుతగ్గులుగానే ఉంటోందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. మరోవైపు, బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు పెరగడమనేది.. ఆర్బీఐ లిక్విడిటీ నిర్వహణ తీరుతెన్నులను ప్రభావితం చేయొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ మరో నివేదికలో తెలిపింది. -
పాత నోట్లు ఎన్ని వచ్చాయ్..
-
పాత నోట్లు ఎన్ని వచ్చాయ్..
నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు ఎప్పుడు ఎత్తేస్తారు... • ఎప్పటికల్లా పరిస్థితి చక్కబడుతుంది... • పెద్ద నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం • సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయిన ఉర్జిత్ • మరో దఫా ప్రశ్నించనున్న కమిటీ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశంపై వివరణనిచ్చేందుకు పార్లమెంటు స్థాయీ సంఘం ముందు బుధవారం హాజరైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలెప్పుడు ఎత్తివేస్తారు? అసలు మళ్లీ పరిస్థితులు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తాయి? పెద్ద నోట్ల రద్దు తర్వాత అసలెంత మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది? కచ్చితమైన లెక్కలు చెప్పండి‘ అంటూ కమిటీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. అయితే, కమిటీ సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సంతృప్తికరమైన జవాబులు ఇవ్వలేకపోయారు. డీమోనిటైజేషన్ దరిమిలా 60 శాతం దాకా కొత్త కరెన్సీని వ్యవస్థలోకి తెచ్చామని తెలిపినా .. పరిస్థితులు మళ్లీ ఎప్పటికల్లా సాధారణ స్థితికి వస్తాయో చెప్పలేకపోయారు. డీమోనిటైజేషన్ అనంతరం ఎన్ని పాత రూ. 500, రూ. 1,000 నోట్లు తిరిగి వచ్చాయన్నది కూడా ఆయన కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో కమిటీ సభ్యులు ఆర్బీఐని, ఆర్థిక శాఖ అధికారులను మరో దఫా ప్రశ్నించాలని నిర్ణయించారు. ‘ఆయన (పటేల్) ప్రధాన ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయారు. కొంత వరకే చెప్పగలిగారు. వ్యవస్థలోకి ఎంత నగదు తిరిగివచ్చింది.. ఎప్పటికల్లా బ్యాంకుల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరతాయి వంటి ప్రశ్నలకు సమాధానం రాలేదు. చూడబోతే డీమోనిటైజేషన్‌పై ఆర్బీఐ అధికారులు రక్షణాత్మక వైఖరితో వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది‘ అని సమావేశం అనంతరం విపక్షానికి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. డీమోనిటైజేషన్‌పై గతేడాది నుంచే చర్చలు.. పెద్ద నోట్ల రద్దు, ప్రభావాల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థిక) ఆదేశించిన మీదట ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు ఆర్ గాంధీ, ఎస్ఎస్ ముంద్రాలతో కలిసి ఉర్జిత్ పటేల్ వచ్చారు. డీమోనిటైజేషన్ అంశంపై 2016 తొలి నాళ్ల నుంచి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని పటేల్ వివరించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక ప్రభుత్వ ప్రధానోద్దేశాన్ని ఆర్బీఐ కూడా ఆమోదయోగ్యంగానే పరిగణించిందని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం దాదాపు రూ. 9.2 లక్షల కోట్ల విలువ చేసే కొత్త కరెన్సీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టినట్లు కమిటీకి వివరించారు. అయితే, సంతృప్తికరమైన సమాధానాలు రానందువల్ల అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రశ్నల ప్రక్రియను మరో రోజున కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. పార్లమెంటు బడ్జెట్ సెషన్ విరామం సమయంలో ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులను మరోసారి ప్రశ్నించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఆర్బీఐ గవర్నర్‌తో పాటు ఆర్థిక శాఖ అధికారులను కమిటీ సభ్యులు పలు ప్రశ్నలు వేశారు. సమయాభావం వల్ల ఆర్థిక శాఖ అధికారులు ఇంకో రోజున వివరణ ఇవ్వనున్నారు. ఆర్బీఐ గవర్నర్ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నల ప్రక్రియ పూర్తి చేయడం కుదరలేదు. వారిని మరోసారి పిలిచే అవకాశం ఉంది‘ అని వివరించాయి. ఆర్బీఐకి మన్మోహన్ సింగ్ బాసట.. కమిటీ సభ్యులు ఉర్జిత్ పటేల్‌ను మరింత కటువుగా ప్రశ్నించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా కొందరు సీనియర్ ఎంపీలు జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఆర్బీఐని గౌరవించాల్సిన అవసరం ఉందని వారు మిగతా సభ్యులకు సూచించినట్లు సమాచారం. నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలను పూర్తిగా ఎప్పుడు ఎత్తివేస్తారు మొద లైన ప్రశ్నలకు కచ్చితమైన జవాబు ఇవ్వాలంటూ దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. ఆర్బీఐ ప్రతిష్టను కాపాడండి.: ఉర్జిత్ రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని గవర్నర్ ఉర్జిత్ పటేల్ సహోద్యోగులకు సూచించారు. సంస్థ పేరు ప్రతిష్టలను కాపాడేందుకు కట్టుబడి ఉండాలని వారికి పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఎకానమీని స్థిరపర్చేందుకు ఆర్బీఐ తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ క్రమంలో తలెత్తుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమిష్టి కృషితోనే ఆర్బీఐ ప్రఖ్యాతి గాంచిందని పటేల్ వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 4న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన పటేల్.. ఉద్యోగులను ఉద్దేశించి లేఖ రాయడం ఇదే తొలిసారి. డీమోనిటైజేషన్ తర్వాత ఆర్బీఐపై విమర్శలు వెల్లువెత్తడం, అక్రమంగా పాత నోట్ల మార్పిడి చేస్తూ కొందరు అధికారులు పట్టుబడటం తెలిసిందే. -
ఈపీఎఫ్ పై పన్ను.. కొందరికే భారం!
♦ పన్ను ప్రతిపాదనలపై కేంద్రం వివరణ ♦ తీవ్ర విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు ♦ నిర్ణయంపై పునరాలోచిస్తామన్న రెవెన్యూ కార్యదర్శి ♦ పీపీఎఫ్ విత్డ్రాయల్స్పై పన్నుండదని స్పష్టీకరణ ♦ 2016 ఏప్రిల్ 1 నుంచీ... అదికూడా ఈపీఎఫ్ వడ్డీపైనే పన్ను! న్యూఢిల్లీ: అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై పన్ను విధించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధి నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయించి మిగిలిన 60 శాతంపై పన్ను విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘‘ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై విధించనున్న పన్నుపై ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదు’’ అని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతంపై పన్ను భారం ఉండదని, మిగిలిన 60 శాతం మొత్తాన్ని పెన్షన్ అందించే యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ‘‘ఒకవేళ ఈ 60% కూడా వెనక్కి తీసుకుంటే... దీన్లో చందాదారులు తమ వాటాగా చెల్లించిన మొత్తంపై పన్ను ఉండదు. వడ్డీగా వచ్చిన రాబడిపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరో విషయమేంటంటే 2016, ఏప్రిల్ 1 తరవాత ఈ ఖాతాకు జమ అయిన వడ్డీపైనే పన్ను భారం లెక్కిస్తారు’’ అని వివరించారు. అలాగే 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విత్డ్రాయల్స్పై ఎలాంటి పన్ను భారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై విధించిన ఈ నిబంధనలు రూ.15,000 లోపు జీతం ఉన్న వారికి వర్తించవని, ఇందువల్ల చిన్న ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని వివరించారు. ఈపీఎఫ్‌లో మొత్తం 3.7 కోట్ల మంది సభ్యులుంటే అందులో 3 కోట్ల మందికి ఈ నిబంధన పరిధిలోకి రారని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధిక జీతం ఉన్న 70 లక్షల మంది నగదు వెనక్కి తీసుకుంటే మాత్రమే ఈ పన్ను భారం ఏర్పడుతుందన్నారు. పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడమనేది ఈఎఫ్ఎఫ్ స్కీం ప్రధానోద్దేశమని, అందులో భాగంగా పెన్షన్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెం ట్ను ప్రోత్సహించేలా ఈ నిబంధనను ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. చిన్న ఫండ్ ఏజెంట్లకు సేవా పన్ను ఊరట న్యూఢిల్లీ: చిన్న మ్యూచువల్ ఫండ్ల పంపిణీదారులకు ఊరటనిచ్చేలా ఏటా రూ.10 లక్షల కన్నా తక్కువ కమీషన్లు అందుకునే ఏజెంట్లకు సేవా పన్ను నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది. అయితే, నిర్దిష్ట పరిమితికి మించి ఆర్జన ఉండే వారు మాత్రం 14 శాతం మేర సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌ను ఆకర్షణీయంగా మార్చి, వాటి వైపు మరింత మందిని మళ్లించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.