dream team
-
కోహ్లికి షాకిచ్చిన సచిన్.. !
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత టెస్ట్ సారధి విరాట్ కోహ్లితో పాటు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనిలకు స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ ఇద్దరితో పాటు చాలా మంది దిగ్గజ క్రికెటర్లను విస్మరించిన లిటిల్ మాస్టర్.. తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం విశేషం. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్లను ఎంచుకున్న అతను.. వన్‌డౌన్‌లో బ్రియాన్ లారా, టూ డౌన్లో వివ్ రిచర్డ్స్, ఐదో స్థానంలో దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కలిస్, ఆరో ప్లేస్‌లో సౌరవ్ గంగూలీ, వికెట్‌కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, స్పిన్నర్ల కోటాలో హర్భజన్ సింగ్, షేన్ వార్న్, పేసర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంచుకున్నాడు. సచిన్.. తన డ్రీమ్ జట్టులో ద్రవిడ్, పాంటింగ్, మురళీధరన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు కూడా చోటు కల్పించలేదు. సచిన్ ఆల్‌టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్: వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, వసీం అక్రమ్, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్! -
అక్తర్ వన్డే జట్టులో ఆ ఇద్దరు కెప్టెన్లకు నో ప్లేస్..
ఇస్లామాబాద్: ఇటీవలి కాలంలో దిగ్గజ ఆటగాళ్లు తమ తమ ఫేవరేట్ జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసుకునే దిగ్గజాలు తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ కూడా.. తన ఆల్‌టైం ఫేవరెట్ వన్డే జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో ఏకంగా నలుగురు భారత క్రికెటర్లకు(సచిన్, ధోనీ, యువరాజ్, కపిల్ దేవ్) స్థానం కల్పించిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. పరుగుల యంత్రాలుగా ప్రసిద్ధి చెందిన టీమిండియా, పాక్ కెప్టెన్లైన కోహ్లీ, బాబర్ ఆజమ్‌కు స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అక్తర్ తన జట్టులో ఓపెనర్లుగా టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు గ్రీనిడ్జ్‌లను ఎంపిక చేశాడు. కీలక వన్ డౌన్లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్కు అవకాశం ఇవ్వగా.. 4వ స్థానంలో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ సయీద్ అన్వర్ని ఎంచుకున్నాడు. 5వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని తీసుకున్నాడు. వికెట్ కీపర్ కోటాలో మాహీకి అవకాశం దక్కినా.. సారథిగా మాత్రం అక్తర్ అతడిని ఎంచుకోలేదు. 6వ స్థానంలో ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, 7వ స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌లకు స్థానం కల్పించాడు. 8వ స్థానంలో పాక్ లెజెండరీ ఆల్‌రౌండర్ వసీం అక్రమ్‌ను ఎంచుకున్న అక్తర్.. 9వ స్థానంలో వకార్ యూనిస్, 10వ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌లకు అవకాశం ఇచ్చాడు. 11వ స్థానంలో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను ఎంచుకున్న అతను.. కెప్టెన్‌గా కూడా అతనికే అవకాశం ఇచ్చాడు. అయితే ఈ జట్టులోని ఆటగాళ్ల కూర్పులో అక్తర్ వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. వారు రెగ్యులర్‌గా ఆడిన స్థానాల్లో కాకుండా వేరే స్థానాల్లో అవకాశం కల్పించి అందరిని ఆశ్చర్యపరిచాడు. మరోవైపు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి అగ్రశ్రేణి జట్లకు చెందిన ఒక్కరిని కూడా అక్తర్ తన జట్టులోకి తీసుకోకపోవడం విశేషం. అక్తర్ డ్రీమ్ టీమ్: గార్డన్ గ్రీనిడ్జ్, సచిన్ టెండూల్కర్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, ఎంఎస్ ధోనీ (కీపర్), ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, కపిల్ దేవ్, షేన్ వార్న్ (కెప్టెన్) -
సూర్యకుమార్ జట్టులో ఆ ఇద్దరు స్టార్లకు దక్కని చోటు..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్‌యాదవ్.. తన ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ను ఎన్నుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. సూర్యకుమార్‌ను తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించమని కోరాడు. అయితే హర్షా భోగ్లే సూర్యకుమార్‌కు రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురిని ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడే సూర్యకుమార్ తన ఐపీఎల్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే, సూర్య తన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు, ఆసీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం. ఓపెనర్ల కోటాలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్‌ను ఎనుకున్న సూర్య.. ఓపెనింగ్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనీని పక్కకు పెట్టేశాడు. ఈ ఒక్క దెబ్బతో ధోనీకి, ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్‌కు ఒకేసారి చెక్ పెట్టాడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఏంపిక చేసిన ఆయన.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇక, నాలుగో స్థానం కోసం తన పేరును ప్రకటించుకున్న సూర్య.. ఐదో ప్లేస్ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎన్నుకున్నాడు. సూర్యకుమార్ తన జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 స్థానాల్లో అవకాశం ఇచ్చాడు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్‌ను ఎంచుకున్న సూర్యకుమార్.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకున్నాడు. కాగా, సూర్యకుమార్.. ప్రస్తుతం ధవన్ జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
కోహ్లీకి మరోసారి మొండిచెయ్యి.. మరో డబ్ల్యూటీసీ జట్టులోనూ దక్కని చోటు
న్యూఢిల్లీ: తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓటమిపాలయ్యాక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్లు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. తమ అత్యుత్తమ డబ్ల్యూటీసీ జట్టులో కనీసం చోటు కూడా కల్పించకుండా టీమిండియా రన్ మెషీన్‌ను అవమానిస్తున్నారు. తొలుత టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన డ్రీమ్ జట్టులో కోహ్లీకి స్థానాన్ని నిరాకరించగా, తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు, దిగ్గజ చైనామెన్ బౌలర్ బ్రాడ్ హాగ్ తన అత్యుత్తమ జట్టులో కోహ్లీకి స్థానం కల్పించలేనని కరాఖండిగా చెప్పేశాడు. తన జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు అవకాశం కల్పించిన ఆయన.. ఆశ్చర్యకరంగా కోహ్లీని పక్కనపెట్టేసాడు. అంతేకాకుండా డబ్ల్యూటీసీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీ చేసిన తమ దేశ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను కాదని శ్రీలంక ఓపెనర్ దిముత్ కరుణరత్నేను తీసుకున్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్నర్గా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేశాడు. ఫస్ట్ డౌన్లో కేన్ విలియమ్సన్కు అవకాశం కల్పించిన హగ్.. అతన్నే తన జట్టు కెప్టెన్‌గా ఎన్నుకున్నాడు. టెస్ట్‌ల్లో కోహ్లీ స్థానమైన నాలుగో స్థానాన్నిఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో భర్తీ చేశాడు. ఇక ఐదో స్థానం కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను ఎంపిక చేసిన ఆయన.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఆరో స్థానాన్ని కేటాయించాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కోటాలో రిషబ్ పంత్‌ను ఎంచుకున్న హాగ్.. ఏడో స్థానం కోసం అతనే పర్ఫెక్ట్ ఆటగాడని కితాబునిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై కూడా పంత్ అదరగొట్టాడని, ఫైనల్లోనూ కీలక సమయంలో 40 పరుగులతో రాణించాడని హాగ్ గుర్తు చేశాడు. ఏకైక స్పిన్నర్‌గా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకున్న ఆయన.. డబ్ల్యూటీసీ టోర్నీలో అతనే అత్యధిక వికెట్లు సాధించాడన్న విషయాన్ని ప్రస్తావించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కైల్ జెమీసన్‌ను తన ప్రధాన పేసర్‌గా, ఇంగ్లండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్, టీమిండియా పేస్ సుల్తాన్ మహమ్మద్ షమీలను అతని సహచర పేసర్లుగా ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరంగా కగిసో రబడా, టీమ్ సౌథీ, ప్యాట్ కమిన్స్‌లను పక్కనపెట్టేసాడు. హాగ్ డ్రీమ్ డబ్ల్యూటీసీ జట్టు: రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), స్టీవ్ స్మిత్, బాబర్ ఆజామ్, బెన్ స్టోక్స్, రిషబ్ పంత్, కైల్ జేమీసన్, రవిచంద్రన్ అశ్విన్, స్టువర్ట్ బ్రాడ్, మహమ్మద్ షమీ -
జడేజాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో 3 రోజుల్లో ప్రారంభంకానున్న మెగా పోరును దృష్టిలో ఉంచుకుని తన డ్రీమ్ జట్టును(ఇండియా) ప్రకటించాడు. ఈ జట్టులో దాదాపు అందరూ ఊహించినట్లుగానే ఆటగాళ్ల ఎంపిక జరిగినప్పటికీ.. ఆల్‌రౌండర్ల కోటాలో జడేజాకు బదులు హనుమ విహారిని ఎంపిక చేసి, జడేజాపై తన కోపాన్ని మరోసారి బహిర్గతం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్‌కు ఓటేసిన ఆయన.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా విహారిని పరిగణలోకి తీసుకున్నాడు. ఇందుకు ఆయన వివరణ కూడా ఇచ్చాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితుల దృష్ట్యా ఒకే స్పిన్నర్ అవసరం ఉంటుందని, అందుకే సీనియర్ అయిన అశ్విన్‌ను తీసుకుకున్నానని చెప్పాడు. మరోవైపు పేసర్ల కోటాలో సీనియర్ బౌలర్ ఇషాంత్‌ను కాదన్న ఆయన.. సిరాజ్ వైపు మొగ్గుచూపాడు. పేసర్ల కోటాలో షమీ, బుమ్రా, సిరాజ్‌లకు అవకాశమిచ్చాడు. ఆస్ట్రేలియాలో సిరాజ్ బంతిని బాగా స్వింగ్ చేశాడు కాబట్టే ఇషాంత్ స్థానంలో అతనికి అవకాశమిచ్చానని వివరణ ఇచ్చాడు. కాగా, ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఎన్నుకున్న మంజ్రేకర్.. పుజారా, విరాట్ కోహ్లీ, రహానేలకు వరుసగా అవకాశం ఇచ్చాడు. విహారి రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని జట్టులోకి తీసుకున్న ఆయన.. ఏడవ స్థానం కోసం రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో విహారి, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్‌ని పరిగణలోకి తీసుకున్న ఆయన.. చివరకు విహారికే ఓటేశాడు. మంజ్రేకర్ డ్రీమ్ ఎలెవెన్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, షమీ, బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు -
గెలిస్తేనే... సిరీస్‌లో నిలుస్తాం
లక్నో: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో వెనుకబడిన భారత మహిళల జట్టు కఠిన సవాల్ ముందు నిలబడింది. ఆదివారం జరిగే నాలుగో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో మిథాలీ సేన నిలిచింది. లేదంటే ఈ మ్యాచ్ ఓడితే ఐదు వన్డేల సిరీస్‌ను ఆఖరి వన్డేకు ముందే ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2–1తో ముందంజలో ఉన్న దక్షిణాఫ్రికా మహిళలు... సిరీసే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న మిథాలీ జట్టు సర్వశక్తులు ఒడ్డి అయినా సిరీస్‌లో సజీవంగా నిలవాలని ఆశిస్తోంది. గడిచిన మూడు మ్యాచ్‌ల్లో నిలకడలేని టాపార్డర్ ప్రదర్శన జట్టుకు సమస్యగా మారింది. యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా 1, 9, 0లతో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి వన్డేలో విఫలమైన స్మృతి మంధాన రెండో వన్డేలో అదరగొట్టింది. కానీ గత మ్యాచ్‌లో దాన్ని పునరావృతం చేయలేకపోయింది. పూనమ్ రౌత్ మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ టాప్–3 బ్యాటర్స్ పటిష్టమైన పునాది వేస్తే కెప్టెన్ మిథాలీ రాజ్, ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మిగతా ఇన్నింగ్స్‌ను నిలబెడతారు. ఇక దక్షిణాఫ్రికా మహిళల జట్టులో ఓపెనర్ లిజెల్ లీ టాప్ ఫామ్‌లో ఉంది. సఫారీ గెలిచిన తొలి, మూడో వన్డేల్లో ఆమె అర్ధసెంచరీ, అజేయ సెంచరీలతో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో మిథాలీ సేన లిజెల్ లీని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ పట్టుబిగించేందుకు ఆస్కారముంటుంది. అనుభవజ్ఞురాలైన వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిప్పులు చెరిగితే భారత మహిళల జట్టు 2–2తో సమం చేసే అవకాశాలు మెరుగవుతాయి. -
హవ్వ.. కోహ్లికి స్థానం లేదా?
హైదరాబాద్ : టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు, కోచ్ అనిల్ కుంబ్లే తన ఉత్తమ ఐపీఎల్-12 జట్టును ప్రకటించాడు. అన్ని జట్లలోంచి తనకు నచ్చిన ఆటగాళ్లతో కూడిన తన కలల జట్టును ప్రకటించాడు. 11 మందితో కూడిన ఆ జట్టులో పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి అవకాశం ఇవ్వలేదు. కోహ్లిని కాదని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. వికెట్ కీపర్ బాధ్యతలు కూడా కెప్టెన్ కూల్‌కే అందించాడు. యువ సంచలనం రిషబ్ పంత్‌కు కూడా తన జట్టులో చోటిచ్చిన కుంబ్లే.. అతడు మంచి ఫినిషర్‌గా ఎదుగుతున్నాడని ప్రశంసించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్‌లు విధ్వంసం సృష్టించారని, వీరిద్దరితో మిడిలార్డర్ బలోపేతంగా ఉంటుందన్నాడు. కెప్టెన్లుగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధోని తన దృష్టిలో ఉన్నారని, అయితే వీరిందరిలో ధోనీనే సూపర్ అని వ్యాఖ్యానించారు. ఇక కోహ్లిని తీసుకోకపోవడంపై కూడా కుంబ్లే క్లారిటీ ఇచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ కష్టతరమైన ఢిల్లీ పిచ్‌లపై అవలీలగా పరుగులు సాధించాడని, జట్టు ఇబ్బందుల్లో ఉన్న ప్రతీసారి బాధ్యతగా ఆడాడని గుర్తుచేశాడు. అందుకే కోహ్లి కన్నా అయ్యర్ బెటర్ ఆప్షన్ అనిపించిందని తెలిపాడు. అయితే దీనిపై కోహ్లి అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. హవ్వ.. కోహ్లి లేని ఐపీఎల్ జట్టా అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఐపీఎల్ సూపర్ 11 ఎవరో తెలుసా?
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ప్లేయర్ల దగ్గర్నుంచి అప్పటివరకు ఊరు, పేరు కూడా తెలియని ఎమర్జింగ్ ప్లేయర్లు కూడా ఆడేందుకు బ్రహ్మాండమైన వేదిక ఐపీఎల్. శరవేగంగా బ్యాట్ ఝళిపించడానికి, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లను తిప్పితిప్పి పడేయడానికి.. తద్వారా తమ టాలెంట్‌ను తమ తమ క్రికెట్ బోర్డులకు పరిచయం చేసేందుకు ఉన్న ఓ అద్బుత అవకాశం. ఈసారి ఐపీఎల్ 9 సీజన్లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది ప్లేయర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ సీజన్ మొత్తమ్మీద ఆడిన అన్ని జట్లలోని ప్లేయర్లందరినీ కలగలిపి, వారినుంచి ఒక జట్టును తయారుచేస్తే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 9 సీజన్లో టాప్ 11 ప్లేయర్లు ఎవరు? ఆ డ్రీమ్ టీమ్ ఏంటి? ఒకసారి చూద్దామా.. నెంబర్ 1: విరాట్ కోహ్లీ (కెప్టెన్) మ్యాచ్‌లు: 16 పరుగులు: 973 అత్యధికం: 113 సగటు: 81.08 స్ట్రైక్ రేట్: 152.03 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 7 నెంబర్ 2: డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్) మ్యాచ్‌లు: 17 పరుగులు: 848 అత్యధికం: 93 నాటౌట్ సగటు: 60.57 స్ట్రైక్ రేట్: 151.42 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 9 నెంబర్ 3: క్వింటన్ డికాక్ మ్యాచ్‌లు: 13 పరుగులు: 445 అత్యధికం: 108 సగటు: 37.08 స్ట్రైక్ రేట్: 136.08 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 3 నెంబర్ 4: ఏబీ డివీలియర్స్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 987 అత్యధికం: 129 నాటౌట్ సగటు: 52.84 స్ట్రైక్ రేట్: 168.79 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 5: అజింక్య రహానే మ్యాచ్‌లు: 14 పరుగులు: 480 అత్యధికం: 74 నాటౌట్ సగటు: 43.63 స్ట్రైక్ రేట్: 126.84 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 6: షేన్ వాట్సన్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 179 అత్యధికం: 36 సగటు: 13.76 స్ట్రైక్ రేట్: 133.58 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 20 ఉత్తమ బౌలింగ్: 29/4 నెంబర్ 7: ఆండ్రీ రసెల్ మ్యాచ్‌లు: 12 (8 ఇన్నింగ్స్) పరుగులు: 188 అత్యధికం: 39 నాటౌట్ సగటు: 26.85 స్ట్రైక్ రేట్: 164.91 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 15 ఉత్తమ బౌలింగ్: 20/4 నెంబర్ 8: కృనాల్ పాండ్యా మ్యాచ్‌లు: 12 పరుగులు: 237 అత్యధికం: 86 సగటు: 39.50 స్ట్రైక్ రేట్: 191.12 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 1 వికెట్లు: 6 ఉత్తమ బౌలింగ్: 15/2 నెంబర్ 9: భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌లు: 17 వికెట్లు: 23 ఉత్తమ బౌలింగ్: 29/4 ఎకానమీ రేట్: 7.42 స్ట్రైక్ రేట్: 17.21 సగటు: 21.30 నెంబర్ 10: యజువేంద్ర చహల్ మ్యాచ్‌లు: 13 వికెట్లు: 21 ఉత్తమ బౌలింగ్: 25/4 ఎకానమీ రేట్: 8.15 స్ట్రైక్ రేట్: 14.04 సగటు: 19.09 నెంబర్ 11: ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచ్‌లు: 16 వికెట్లు: 27 ఉత్తమ బౌలింగ్: 16/3 ఎకానమీ రేట్: 6.90 స్ట్రైక్ రేట్: 21.52 సగటు: 24.76