drivers key role
-
సమస్యలకు టాటా సంతోషాల బాట
సాక్షి, మచిలీపట్నం: ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థే అయినా కార్మికులకు అడుగడుగునా అవస్థలు తప్పేవి కాదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా జీతభత్యాలు అన్న మాటే లేదు. సంస్థ నష్టాల్లో ఉన్నా, ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా సకాలంలో వేతనాలు అందేవి కావు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే జీతంలో కోతలు విధించేవారు. ఇదంతా గతం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. విలీనమై నాలుగేళ్లు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆచరణలోకి పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే కమిటీ వేశారు. ఆరు నెలల్లోనే ఆచరణలో పెట్టారు. 2020 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తేవడంతో కార్మికులంతా ప్రజా రవాణా శాఖ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉద్యోగుల కష్టాలు తొలగిపోయాయి. నాలుగేళ్లుగా వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, బెనిఫిట్స్, అలవెన్స్ అందుతున్నాయి. ఈ నిర్ణయంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,308 కుటుంబాల్లో సంతోషాలు నిండాయి. నాడు సమ్మెలు చేస్తే జీతాలు కట్ ఆర్టీసీ ఇస్తున్న వేతనాలు చాలక డ్రైవర్లు, కండ క్టర్లు, ఇతర కార్మికులు ఎన్నోసార్లు సమ్మెలు, పోరాటాలు చేశారు. అయినా తగిన ప్రతిఫలం దక్కలేదు. గత టీడీపీ ప్రభుత్వం కార్మికులను వేధించి, సమ్మె కాలానికి జీతాలు కోసి ఉక్కు పాదం మోపింది. ఉద్యోగ భద్రత కరువై కార్మికులు రోజులు లెక్కపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లోనూ ఠంచన్‌గా జీతాలు కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా రెండేళ్లలో సుమారు నాలుగు నెలలకు పైగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ పరిస్థితులు గతంలో ఎదురైతే కార్మికుల వేతనాల్లో కోతలు పడేవి. అప్పటికే ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఒకటో తేదీన ఠంచన్‌గా జీతాలు అందాయి. ఇలా జీతాలు చెల్లించడం చరిత్రలో మొదటి సారి అని ఉద్యోగులు పేర్కొన్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికుల సమస్యలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి చేసి మాట నిలుపుకొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు బ్రేక్ లేకుండా చూశారు. ఆర్టీసీ కార్మికుల మేలు కోరిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. – చల్లా చంద్రయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్నప్పుడు అనేక ఇబ్బందులను ఎదు ర్కొన్నాం. చాలీచాలని వేతనాలు, అల వెన్సులు. జీతాల పెంపు కోసం సంఘాలు ఆందోళన చేసినా మాకు సరైన న్యాయం జరిగేది కాదు. అయితే ఇప్పుడు ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, అలవెన్స్‌లు అందుతున్నాయి. – గొడవర్తి నరసింహాచార్యులు, కండక్టర్ భరోసా వచ్చింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగా ఉన్నప్పుడు మాకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఏదైనా పొరపాటు జరిగినా.. ఆర్టీసీ సంఘాలు చేపట్టే ఆందోళనలో పాల్గొన్నా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉండేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాలపై భరోసా వచ్చింది. ఉద్యోగ భద్రత లభించింది. – ఎ. వెంకటేశ్వరరావు, డ్రైవర్ -
మీరాబాయి గొప్ప మనసు, నెటిజన్లు ఫిదా, వైరల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు సహకరించిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24 క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసిన ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. 2022 ఆసియా గేమ్స్, 2024 ఒలింపిక్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం. ఉచితంగా లిప్ట్ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్లకు గిఫ్ట్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కాగా మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి శిక్షణా అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్‌కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. pic.twitter.com/mrYZRXHtlK — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 6, 2021 Olympiad @mirabai_chanu home was more than 25 km from the Sport Academy. No means of transport during those days, except trucks which carried river sands to the City. These truck drivers gave her lift everyday. Today she rewarded these truck drivers. pic.twitter.com/9WegUkwjkz — Naorem Mohen (@laimacha) August 5, 2021 -
TSRTC Driver: ముషీరాబాద్-1 డిపో.. ఆక్సిజన్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో నగరంలో ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం భారత వైమానిక దళానికి చెందిన సీ–17 విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపింది. అక్కడి ప్లాంట్లలో రాష్ట్రానికి కేటాయించిన లిక్విడ్ ఆక్సిజన్ తీసుకుని ఆ ట్యాంకర్లు రోడ్డు మార్గంలో నగరానికి చేరుకున్నాయి. అవన్నీ ప్రైవేట్ ట్యాంకర్లే అయినప్పటికీ వాటిని డ్రైవ్ చేయడానికి మాత్రం టీఎస్ఆర్టీసీకి చెందిన సమర్థులైన డ్రైవర్లను ఎంపిక చేశారు. అలా వాయుసేన విమానంలో ట్యాంకర్‌ను తీసుకువెళ్లి.. రోడ్డు మార్గంలో ప్రాణవాయువును తీసుకువచ్చినన డ్రైవర్లలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య ఒకరు. అనునిత్యం కోఠి–పటాన్చెరు మధ్య ‘218 రూట్’లో బస్సును నడిపే ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఇవి... ► లిక్విడ్ ఆక్సిజన్‌ను అత్యవసరంగా నగరానికి తెప్పించాలని ప్రభుత్వం భావించింది. ఆ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానాల్లో ఒడిశాకు పంపినా... ఆక్సిజన్ నింపిన తర్వాత మాత్రం రోడ్డు మార్గంలో రావాల్సిందే అని ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ► నిండుగా ఉన్న ట్యాంకర్లను విమానంలో తీసుకురావాలని ప్రయత్నిస్తే టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. దీంతో ఆ ట్యాంకర్లను రోడ్డు మార్గంలో తీసుకువచ్చే బాధ్యతల్ని టీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు అప్పగించారు. ► గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ డిపోల్లో పని చేస్తున్న డ్రైవర్ల వివరాలు క్రోడీకరించిన అధికారులు బెస్ట్ డ్రైవర్లను ఎంపిక చేశారు. ► ముషీరాబాద్–1 డిపో నుంచి ముగ్గురు, మిథానీ డిపో నుంచి ఒకరు, హయత్‌నగర్–2 డిపో నుంచి ఇద్దరు, ముషీరాబాద్–2 డిపో నుంచి ఒకరు ఆక్సిజన్ రవాణాకు ఎంపికయ్యారు. ► అలాంటి వారిలో ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఎం.బాబయ్య కూడా ఒకరు. ఈ పది మంది డ్రైవర్లు గత నెల 22న బేగంపేటలోని విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులు వీరికి వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇద్దరు వెనక్కు వెళ్లగా.. బాబయ్య సహా ఎనిమిది మంది ఒడిశా వెళ్లడానికి ఎంపికయ్యారు. ► ప్రతి ట్యాంకర్తోనూ దాని డ్రైవర్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్‌ను పంపారు. ► ట్యాంకర్ డ్రైవింగ్ బాధ్యత మాత్రం ఆర్టీసీ డ్రైవర్‌దే. గత నెల 23న సాయంత్రం 7 గంటలకు సీ–19 విమానంలో బేగంపేట నుంచి బాబయ్య డ్రైవర్‌గా ఉన్న ట్యాంకర్ బయలుదేరింది. దీంతో పాటు మరో రెండు ట్యాంకర్లు కూడా ఈ విమానంలో భువనేశ్వర్ వరకు వెళ్లాయి. ► అదే రోజు రాత్రి 8.10 గంటలకు ఈ విమానం భువనేశ్వర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అక్కడ నుంచి బాబయ్య తనకు కేటాయించిన ట్యాంకర్‌ను నడుపుకుంటూ 150 కి.మీ. దూరంలో ఉన్న అంగుల్ చేరుకునే సరికి అర్థరాత్రి ఒంటి గంట అయింది. ► ట్యాంకర్‌ను శుభ్రం చేసి, అందులో ఆక్సిజన్ నింపుకుని, బయలుదేరే సరికి 24వ తేదీ రాత్రి ఒంటి గంట అయింది. లోడ్‌తో ఉన్న ట్యాంకర్లను నడపడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తూ 1150 కిమీ ప్రయాణించి హైదరాబాద్ చేరుకునే సరికి సోమవారం రాత్రి అయింది. ► బాబయ్య నడిపిన ట్యాంకర్‌లోని లిక్విడ్ ఆక్సిజన్‌ను కింగ్ కోఠి ఆసుపత్రితో పాటు ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిల్లోని ట్యాంకుల్లో నింపారు. గత నెల 26 రాత్రి (సోమవారం) రాత్రి 2 గంటలకు బేగంపేట విమానశ్రయంలో ట్యాంకర్లు అప్పగించారు బాబయ్య. బాధ్యతగా భావించా మాది యాదాద్రి జిల్లా రామన్నపేట. ఇంటర్మీడియట్ వరకు చదివా. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే డ్రైవింగ్ చేస్తున్నా. హెవీ వాహనాలు, ట్యాంకర్లు నడిపిన అనుభవం కూడా ఉంది. 2006 నుంచి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నా. కోవిడ్ పేషెంట్లకు సహకరించే అవకాశం దక్కడం ఓ బాధ్యతగా భావించా. అందుకే ఒడిశా వెళ్లి ఆక్సిజన్ తీసుకువచ్చా. ఈ రకంగా నాకు యుద్ధవిమానం ఎక్కే అవకాశం దక్కింది. – ఎం.బాబయ్య, ఆర్టీసీ డ్రైవర్ ( చదవండి: '1జీబీ ఆగ పట్టుకొని పెళ్లి చూడండి.. ఎవరింట్ల వాళ్లు బువ్వు తినుర్రి' ) -
ప్రమాదాల నివారణలో డ్రైవర్లదే కీలకపాత్ర
అనంతపురం రూరల్ : రోడ్డు ప్రమాదాలు నివారించడంలో డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎకాలజీ సెంటర్లో డ్రైవింగ్ శిక్షణను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డ్రైవర్లు మెలకువలు తెలుసుకుని వాహనాలు నడపాలన్నారు. నైపుణ్యాన్ని ప్రదర్శించి డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ 2008 నుంచి ఇప్పటిదాక గ్రామీణ ప్రాంతాల్లోని 15వందల మందికి పైగా నిరుద్యోగులకు డ్రైవింగ్‌పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ద్విచక్రవాహనాల మెకానిక్‌పై శిక్షణ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.