Duplicate voters
-
డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పక్క రాష్ట్రాల ఓటర్లకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటు ఉన్నవారికి చెక్ పెడుతూ.. డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. వేరే రాష్ట్రాల్లో ఓటు ఉన్న వారికి ఏపీలో ఓట్లు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండాలి. ఒక వ్యక్తి కి ఎక్కువ చోట్ల ఓటు ఉండటం నిబంధనలు కు విరుద్దం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు నమోదు మాత్రమే చేయాలి. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ తీసుకోవాలి. వేరే ఎక్కడ ఓటు లేదని డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలి’’ అని ఈసీ పేర్కొంది. తప్పుడు డిక్లరేషన్‌తో ఓటు నమోదు దరఖాస్తు చేస్తే జైలు శిక్ష. 20 ఏళ్లు పైబడ్డ వాళ్లు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలి. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఓటు హక్కు. ఇళ్లు మారే వాళ్లు ఓటుకి ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే కేసు నమోదు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. -
టీడీపీ వారి దొంగ ఓట్ల రాజకీయం!
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో ఘోర ఓటమి, వచ్చే ఎన్ని కల్లో గెలిచే అవకాశాల్లేవని అర్థమవడంతో టీడీపీ ‘నకిలీ ఓట్ల’ దందాకు తెరలేపింది. ఇప్పటివరకూ ఏపీలో నకిలీ ఓటర్లంటూ అనవరసర రాద్దాంతం చేస్తూ వస్తున్న టీడీపీ.. ఈసారి వేరే రాష్ట్రంలోని ఓట్లను ఏపీలో చేర్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఎన్నికలు ముగియగానే పాలిట్రిక్స్ మొదలుపెట్టేసింది టీడీపీ. అది కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్లను ఏపీ జాబితాలో చేర్చడానికి కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ కుట్ర పూరిత ఓట్ల రాజకీయాలకు పాల్పడుతోంది. ఇందుకు నిజాంపేట్ విజ్ణాన్ స్కూల్లో ఏకంగా కౌంటర్ తెరిచింది టీడీపీ. దాంతో పాటు పలు కాలనీల్లో టీడీపీ ఓటర్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నిజాంపేట్, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓటు నమోదు కేంద్రాలను షురూ చేసింది టీడీపీ ‘మీకు ఏపీలో ఓటు కావాలా? మీ ఓటు చెక్ చేసుకోవాలా? అంటూ నకిలీ ఓట్లను చేర్చేందుకు యత్నాలు చేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే వారందరిని ఏపీలో ఓటర్లుగా చేర్పించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఓటేసిన వారిని కూడా ఏపీలో ఓటర్లుగా చేర్పించే కుట్రలకు పాల్పడుతోంది. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 5వేల మందిని కొత్తగా చేర్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా చేసి ఎన్నికల రోజు వీరందర్నీతరలించి టీడీపీకి ఓటేయించే కుట్రలకు వ్యూహ రచన చేసింది టీడీపీ. -
ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..!
సాక్షి, హైదరాబాద్: ‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. అన్న డైలాగ్ ఏపీ, తెలంగాణల్లో చాలా ఫేమస్. తెలుగు ప్రజలు మాత్రం ఓటు నమోదు విషయంలో ఈ డైలాగ్‌ను ఎప్పుడో ఫాలో అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు నమోదు చేసుకొని, అక్కడా ఇక్కడా ఓటేస్తున్నారు. రెండు చోట్లా ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు. అయితే, ఇది స్వల్ప మొత్తంలో ఉంటే ఫరవాలేదు. కానీ, పార్టీల భవితవ్యాన్ని, ప్రభుత్వాల్ని మార్చగలిగే స్థాయిలో అంటే.. అక్షరాలా లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం. లక్షల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు.. 2018 నవంబర్ వరకు సుమారు 20 లక్షల మంది రెండు చోట్ల ఓటుకు నమోదు చేసుకున్నారు. వీరిలో ఉమ్మడి ఏపీ నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు ఈ ఓటర్లు రెండు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విభజనకు పూర్వం రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంటు స్థానాలు ఉండేవి. ఈ స్థానాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం కష్టతరం కావడంతో ఏపీలో ఒక దశలో, తెలంగాణలో మరో దశలో నిర్వహించేవారు. ఆ సమయంలో చాలామంది తెలంగాణ, ఏపీల్లో ఓటు నమోదు చేయించుకున్నారు.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఏప్రిల్ 30న, ఏపీలో మే 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ వీరిలో చాలామంది ఇక్కడా, అక్కడా ఓట్లేశారు. ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఏకంగా 52 లక్షల బోగస్ ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనికి అప్పటి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. ఇందులో ఒకే పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, వయసు తదితర వివరాలను పోల్చి చూసి, రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 18.2 లక్షల మందికిపైగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. వీరంతా రెండు చోట్లా ఓటుహక్కు కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు. ఒకేదశలో ఎన్నికలు రావడంతో.. గతంలో తెలంగాణ, ఏపీలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించేవారు. కానీ , ఈసారి రెండు రాష్ట్రాలకు మొదటిదశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఓటర్లు ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు వేయగలరు. వీరిలో అధికశాతం హైదరాబాద్ నగరంలోనే ఓటు హక్కు కలిగి ఉండటంతో.. అదే రోజు ఏపీకి వెళ్లి ఓటు వేయడం దాదాపుగా అసాధ్యం. -
డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకే..
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో చేర్పులు, తప్పుల సవరణ, పేర్ల తొలగింపు తదితర ప్రక్రియల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, కేవలం డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు మాత్రమే సాఫ్ట్వేర్ సహాయపడుతుందని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ తనంతట తాను ఓట్లను తొలగించలేదని, కేవలం ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 22, ఓటరు నమోదు నిబంధనల్లోని 21ఎ నిబంధన ప్రకారం ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, ఓటర్ల తొలగింపు అధికారం కేవలం ఈఆర్వోలకు మాత్రమే ఉందని తెలిపింది. సాఫ్ట్వేర్ గుర్తించిన డూప్లికేట్ ఓటర్లను క్షేత్రస్థాయిలోని ఓటర్ల జాబితాలతో పోల్చుకుని, చట్ట ప్రకారం అన్ని విచారణలు చేసిన తరువాతనే తొలగింపు విషయంలో ఈఆర్వోలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేకుండా స్వచ్ఛంగా ఉండేందుకు ఆధార్‌తో ఓటర్ ఐడీని అనుసంధానించామంది. ఓటర్ల అంగీకారంతోనే ఈ అనుసంధానం జరిగిందని, ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ నెంబర్ల సేకరణను నిలిపేశామని వివరించింది. సాఫ్ట్వేర్ సాయంతో ఈఆర్వోలు ఓట్లను తొలగిస్తున్నారన్న పిటిషనర్ వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఎటువంటి ఆధారం లేకుండానే పిటిషనర్ ఈ ఆరోపణ చేస్తున్నారని తెలిపింది. ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ మియాపూర్‌కి చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.సత్యవాణి కౌంటర్ దాఖలు చేశారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లో స్వీయ నిర్ణయాలు తీసుకునే విధంగా ఎటువంటి ఆల్గారిథమ్గానీ, ఇంటెలిజెన్స్‌గానీ లేదని ఆమె తెలిపారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు సాయపడుతున్న ఓ ఉపకరణమే ఈ సాఫ్ట్వేర్ అని వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన అంతర్గత వివరాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని, దీని వల్ల సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. -
ఎన్నికల విధుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి
= క్షేత్రస్థాయి అధికారుల శిక్షణలో కలెక్టర్ కిషన్ = డూప్లికేట్ ఓటర్ల తొలగింపునకు ఇంటింటా తనిఖీకి ఆదేశం సుబేదారి, న్యూస్‌లైన్ : ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాల్లో క్షేత్రస్థాయి అధికారులు నైపుణ్యం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. ఎన్నికలు, ఓటర్ల జాబితా అంశాలపై క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య అధ్యక్షత వహించగా, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్.సురేంద్ర కరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచిం చారు. అలాగే, జిల్లాలో 3.91లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేలిందని, ఈ మేరకు ఓటరు జాబితాతో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయాలన్నారు. అలాగే, రెండు చోట్ల ఓటర్లుగా నమోదైన వారికి నోటీసులు ఇచ్చి ఎక్కడో ఒక చోటే ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు ఉండే అవకాశమున్నందున సిబ్బంది దీన్ని గుర్తించాలన్నారు. అలాగే, ఇంటింటా ఓటర్ల తనిఖీలో భాగంగా బూత్ లెవల్ అధికారితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ ఉండేలా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని సూచించారు. కాగా, నవంబర్ 4న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ కిషన్ వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా... మాస్టర్ ట్రైనర్స్ అయిన ములుగు ఆర్డీఓ మోతీలాల్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీఓ కె.శ్రీనివాస్‌లు ఎన్నికల అధికారులకు పలు అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960కు అనుగుణంగా ఓటర్ల నమోదుకు వయస్సు, నివాసం, రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా నోటీసు ఇచ్చి ఏ ఓటు తీసివేయదల్చుకున్నారో తెలుసుకోవాలన్నారు. అలాగే, ఓటర్ల జాబితాలో ఐదు రకాల సవరణలు ఉంటాయని చెబుతూ ఇంటెన్సివ్ రివిజన్, సమ్మరీ రివిజన్, పార్టీల సమ్మరీ రివిజన్,ప్రత్యేక సమ్మరీ, నిరంతర అప్డేట్స్ తీరుతెన్నులు, నామినేషన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిస్టమేటిక్ ఓటర్ల ఎడ్యుకే షన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్, పద్ధతి ప్రకారం ఓటర్ల అవగాహన, ఓటర్ల భాగస్వామ్యాన్ని వివరించారు. ఇంకా 18ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఓటు వేసేలా అవగాహన పెంచాలని సూచించారు. అలాగే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల్లో పోలీసు అధికారుల పాత్రను కూడా వివరించారు. కాగా, ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం ఓ శకటం తిరుగుతోందని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట ఆర్డీఓలు ఓ.జే.మధు, వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌నాయక్, అరుణకుమారితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆదాయ పన్ను, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.