durgaiah
-
కాటేసిన కల్తీ కల్లు
అనంతగిరి: కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 29 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలివి. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలోని ఒక దుకాణంలో 19వ తేదీ సోమవారం సాయంత్రం కల్లు తాగిన వారిలో.. ఎనిమిది మంది మంగళవారం వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధి తులను వారి కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించగా అర్ధరాత్రి తర్వాత దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయాన్నే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరానికి వచ్చిన మరో 22 మంది పరిస్థితి బాగా లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ప్రస్తుతం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారు డిశ్చార్జి అయ్యారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి, పీహెచ్సీ వైద్యుడు సుధాకర్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు. బాధితుల ఇళ్లు, నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ లక్షణాల్లేవని ఆ శాఖ సీఐ రాగవీణ స్పష్టం చేశారు. -
15 ఏళ్ల నిరీక్షణకు తెర
కోనరావుపేట: దుబాయ్ వెళ్లిన ఓ వలసజీవి.. అక్కడి ఏజెంట్ మోసానికి 15 ఏళ్లు నరకయాతన అనుభవించాడు. వీసా లేకుండా పనిచేశాడంటూ దుబాయ్ ప్రభుత్వం రూ.5.15 లక్షల జరిమానా విధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం ఎగ్లాస్పూర్కు చెందిన దొబ్బల దుర్గయ్య రూ.80 వేలు అప్పు చేసి ఓ ఏజెంట్ ద్వారా 2005 లో దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ పాస్‌పోర్ట్ తీసుకుని వదిలేశా డు. 15 ఏళ్లు నరకం అనుభవించాడు. విషయం తెలుసుకున్న ఇండియన్ పీపుల్స్ ఫోరం ఉపాధ్యక్షుడు జనగామ శ్రీనివాస్ అక్కడి అధికారులతో మాట్లాడి.. వీసా, టికెట్, అవుట్ పాస్‌పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం దుర్గయ్య స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. -
స్వైన్ ఫ్లూతో వర్ధన్నపేట ఏసీపీ మృతి!
-
కలిసిరావడం లేదని.. కూతురినే కడతేర్చిన తండ్రి!
కాలితో తన్ని.. గొంతు నులిమి.. 13 నెలల చిన్నారిని చంపేసిన వైనం కోహీర్: కన్నతండ్రే కాలయముడయ్యాడు. చిన్నారిని గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లా కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన దుర్గయ్య, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. మొదట ఇద్దరు ఆడపిల్లలు. తరువాత కొడుకు పుట్టాడు. మళ్లీ కొడుకు పుడతాడని భావించిన దుర్గయ్యకు నాలుగో సంతానంగా కూతురు జన్మించడంతో జీర్ణించుకోలేక పోయాడు. చిన్న కూతురు సరోజ పుట్టిన తరువాత ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఆ పాపను ఎలాగైనా కడతేర్చాలని భావించి, సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఈ విషయాలేవీ తెలియని లక్ష్మి రోజూలాగే చిన్నారికి పాలిచ్చి బయటికి వెళ్లింది. అంతలోనే దుర్గయ్య వచ్చి ఆ చిన్నారిని చెంపలు వాయిం చాడు. కాలితో కసితీరా తన్నాడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తల్లి తిరిగి వచ్చి చూసేసరికే కూతురు చనిపోయి ఉంది. -
రాముడు నా పాలి దేవుడు..
పొట్ట ఓ చేత పట్టుకుని.. మరో చేత రాముడ్ని పట్టుకుని దుర్గయ్య పట్నం వచ్చాడు. కుటుంబాన్ని సొంతూరు మెదక్‌లోనే వదిలేసి రాముడి పై భారం వేసి ఇక్కడొచ్చిపడ్డాడు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు రాముడు రోజూ పెందరాలే ముస్తాబవుతాడు. దుర్గయ్య వెంట ఇంటింటికీ తిరుగుతాడు. అందరికీ దండాలు పెడతాడు. తన యజమానితో కలసి విన్యాసాలు చేస్తాడు. పంచెలతో తను సన్మానం పొంది.. దుర్గయ్యకు ఇన్ని పైసలు గిట్టుబాటు అయ్యేలా చూస్తాడు. అందుకే రాముడు నా పాలి దేవుడు అంటాడు దుర్గయ్య. తాతల నాటి నుంచి వచ్చిన వృత్తిని స్వీకరించిన దుర్గయ్య.. రాముడు తన పెద్దకొడుకని చెబుతాడు. రాముడు సంపాదనతోనే తన నలుగురు పిల్లలను చదివిస్తున్నానని చెబుతాడు. ‘రాముడు చెప్పిన మాట ఇంటడు. మా కడుపు నిండకపోయినా వీడ్ని మంచిగ జూస్కుంటం. పానం బాగోకపోయినా.. నా ఎంటొస్తడు. సంక్రాంతి అయిపోయినాంక మాకు అంత డిమాండ్ ఉండది. అయితే కొందరు వాళ్లింట్ల ఏ కార్యాలైనా పిలుస్తుంటరు. అట్ల ఏడాదంతా నడుస్తది. వారానికోపారి మెదక్ పోయి మా వోళ ్లకు పైసలిచ్చొస్తుంట. రాముడు ఉన్నంతకాలం బేఫికర్. ఆడు లేకపోతే ఎట్లనో’ అని చెమర్చిన కళ్లతో చెబుతాడు దుర్గయ్య. ..:: శిరీష చల్లపల్లి