Dutch Open
-
టైటిల్ పోరుకు లక్ష్య సేన్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ డచ్ ఓపెన్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఆరంభం నుంచి టోర్నీలో నిలకడగా ఆడుతున్న అతను ఫైనల్ చేరాడు. శనివారం నెదర్లాండ్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–12, 21–9తో ఫెలిక్స్ బురెస్టెడ్ (స్వీడన్)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించాడు. 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో ఆడిన లక్ష్యసేన్ ప్రత్యరి్థపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21–9, 21–16తో భారత్‌కే చెందిన రాహుల్ భరద్వాజ్‌పై విజయం సాధించాడు. నేడు జరిగే ఫైనల్లో యుసుకె ఒనోడెర (జపాన్)తో లక్ష్యసేన్ తలపడతాడు. -
సెమీ ఫైనల్లో జయరామ్
అల్మెర(నెదర్లాండ్స్):డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్, భారత ఆటగాడు అజయ్ జయరామ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో జయరామ్ 21-15, 21-18 తేడాతో కోల్హో డీ ఒలివైరా(బ్రెజిల్)పై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ ఏకపక్ష గేమ్‌లను సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించిన జయరామ్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో వరుసగా రెండు సార్లు(2014, 15) డచ్ ఓపెన్‌ను గెలుచుకున్న జయరామ్.. హ్యాట్రిక్ టైటిల్ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. గత రాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి ప్రణవ్ చెర్రీ చోప్రా-సిక్కి రెడ్డి జంట సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. -
డచ్ ఓపెన్‌లో అజయ్ జయరామ్ సంచలనం
డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ అజయ్ జయరామ్ సంచలనం సృష్టించాడు. మూడో సీడ్‌గా బరిలోకి జయరామ్ ఫైనల్లో ఈస్టోనియా ఆటగాడు రౌల్ మస్ట్ను ఓడించాడు. 21-12, 21-18 వరుస సెట్లలో 12 సీడ్ ఆటగాడిని ఓడించి.. డచ్ ఓపెన్ టోర్నీని సొంతం చేసుకున్నాడు. -
డచ్ ఓపెన్‌లో అరవింద్ భట్ ముందంజ
అల్మెరె (నెదర్లాండ్స్): భారత షట్లర్ అరవింద్ భట్ డచ్ ఓపెన్‌లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో భట్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో భట్ 11-7, 11-9, 11-8 స్కోరుతో స్కాట్లాండ్ షట్లర్ కీరన్ మెరీలెస్పై విజయం సాధించాడు. భట్ 28 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. రెండో రౌండ్లో హాంకాంగ్ ఆటగాడు యన్ కిట్ చన్తో ఆడనున్నాడు.